breaking news
national cricket tournament
-
భారత క్రికెట్‌కు ‘బ్యాడ్ సండే’
క్రికెట్ మైదానంలో ఆదివారం భారత్‌కు ఏదీ కలిసిరాలేదు! ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని పురుషుల జట్టు ఆ్రస్టేలియా చేతిలో పరాజయం చవిచూడగా... ఆస్ట్రేలియాలోని మరో వేదిక బ్రిస్బేన్‌లో భారత మహిళల జట్టుకూ భారీ ఓటమి ఎదురైంది. అడిలైడ్ ‘పింక్ బాల్’ టెస్టులో పురుషుల జట్టు ప్రభావం చూపలేకపోగా... రెండో వన్డేలో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళల జట్టు కంగారూలకు సిరీస్ కోల్పోయింది. ఇక దుబాయ్‌లో జరిగిన ఆసియా జూనియర్ కప్ అండర్–19 టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ భారత జట్టు తుదిపోరులో బంగ్లాదేశ్ చేతిలో ఓడి టైటిల్‌కు దూరమైంది. మొత్తానికి ఒకే రోజు మూడు వేర్వేరు విభాగాల్లో భారత క్రికెట్ జట్లను పరాజయం పలకరించడంతో ‘హ్యాపీ సండే’ కావాల్సిన చోట ‘బ్యాడ్ సండే’గా మారింది.అడిలైడ్‌లో అదే వ్యథఅడిలైడ్: గులాబీ బంతి పరీక్షలో భారత జట్టు గట్టెక్కలేదు. నాలుగేళ్ల క్రితం అడిలైడ్‌లో జరిగిన ‘పింక్ బాల్’ టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియా... ఇప్పుడు మరోసారి అడిలైడ్ వేదికగా ఓటమి వైపు నిలిచింది. ఆదివారం ముగిసిన ‘డే అండ్ నైట్’ టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన ఆ్రస్టేలియా... తమకు అచ్చొచి్చన ‘పింక్ బాల్’ టెస్టులో ఘనవిజయంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ‘ని 1–1తో సమం చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 128/5తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా... 36.5 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (47 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి భారత టాప్ స్కోరర్‌గా నిలవగా... మిగతా వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కెపె్టన్ కమిన్స్ 5 వికెట్లు పడగొట్టగా... బోలండ్ 3 వికెట్లు, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం 19 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మెక్‌స్వీనీ (10 నాటౌట్), ఖ్వాజా (9 నాటౌట్) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు జరుగుతుంది. మరో 47 పరగులే జోడించి... ప్రధాన ఆటగాళ్లు రెండో రోజే అవుటైనా... రిషబ్ పంత్ (28), నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉండటంతో... భారత అభిమానులు అడిలైడ్‌లో అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తే... అది అడియాశే అయింది. క్రితం రోజు స్కోరు వద్దే పంత్.. స్టార్క్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడే పరాజయం ఖాయమైపోగా... నితీశ్ రెడ్డి దూకుడు పెంచి జట్టుకు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించాడు. ఈ ఆంధ్ర కుర్రాడు జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లిన తర్వాత 9వ వికెట్ రూపంలో అవుటయ్యాడు. తాజా సిరీస్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు భారత్ తరఫున నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. అశి్వన్ (7), హర్షిత్ రాణా (0), సిరాజ్ (7) ఇలా ఒకరివెంట ఒకరు పెవిలియన్ చేరిపోవడంతో టీమిండియా ఆలౌటైంది. చేతిలో ఐదు వికెట్లతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్ బృందం క్రితం రోజు స్కోరుకు మరో 47 పరుగులు మాత్రమే జోడించగలిగింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత జట్టు కేవలం 81 ఓవర్లు మాత్రమే ఆడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 180; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 337; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కేరీ (బి) బోలండ్ 24; రాహుల్ (సి) కేరీ (బి) కమిన్స్ 7; గిల్ (బి) స్టార్క్ 28; కోహ్లి (సి) కేరీ (బి) బోలండ్ 11; పంత్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 28; రోహిత్ (బి) కమిన్స్ 6; నితీశ్ రెడ్డి (సి) మెక్‌స్వీనీ (బి) కమిన్స్ 42; అశి్వన్ (సి) కేరీ (బి) కమిన్స్ 7; హర్షిత్ (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; బుమ్రా (నాటౌట్) 2; సిరాజ్ (సి) హెడ్ (బి) బోలండ్ 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్) 175. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–66, 4–86, 5–105, 6–128, 7–148, 8–153, 9–166, 10–175. బౌలింగ్: స్టార్క్ 14–1–60–2; కమిన్స్ 14–0–57–5; బోలండ్ 8.5–0–51–3. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్‌స్వీనీ (నాటౌట్) 10; ఖ్వాజా (నాటౌట్) 9; మొత్తం (3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 19. బౌలింగ్: బుమ్రా 1–0–2–0; సిరాజ్ 1.2–0–9–0; నితీశ్ కుమార్ రెడ్డి 1–0–8–0.12 ఇప్పటి వరకు 13 డే అండ్ నైట్ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 12 టెస్టుల్లో నెగ్గడం విశేషం. అడిలైడ్‌లో ఆడిన 8 డే నైట్ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియా గెలిచి అజేయంగా ఉంది. మరోవైపు ఇప్పటి వరకు ఐదు డే అండ్ నైట్ టెస్టులు ఆడిన భారత జట్టు రెండింటిలో ఓడిపోయింది. ఈ రెండూ అడిలైడ్‌లోనే కావడం గమనార్హం. -
అంధుల క్రికెట్ కాంతిరేఖ
తెనాలి: బెంగళూరులో ఈనెల 28 నుంచి జరగనున్న జాతీయ అంధ మహిళల క్రికెట్ టోర్నమెంటులో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలిసారిగా ప్రాతినిథ్యం వహించనుంది. గుంటూరు జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్ దీనికి మార్గం సుగమం చేసింది. తొలి విమెన్స్ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ బ్లైండ్–2019 ఢిల్లీలో జరిగింది. టీ–20 ఫార్మట్‌లో జరిగిన ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి క్రీడాకారుల ప్రాతినిథ్యం ఉన్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి జట్టు పాల్గొనలేదు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవడమే దీనికి కారణం. ఇప్పటికే మెన్ బ్లైండ్ క్రికెట్లో ఏపీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టు వరల్డ్ కప్‌నూ సాధించింది. ముందుకొచ్చిన జహరాబేగంఅంధ మహిళల విభాగంలో క్రికెట్ పోటీల ఆరంభంతో గత రెండేళ్లుగా సాధన చేసేవారి సంఖ్య పెరిగింది. అయినా మహిళల జట్టు ఎంపిక లేక నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ఎన్నారై జహరాబేగంకు క్రీడాకారులు సమాచారం పంపారు. గతంలో బ్లైండ్ మెన్ వరల్డ్ కప్ టోర్నమెంటులో హైదరాబాద్, మూలపాడుల్లో జరిగిన రెండు మ్యాచ్‌లకు తాహెరా ట్రస్ట్ స్పాన్సర్ చేసింది. గతేడాది జాతీయ పోటీల్లో పాల్గొన్న ఏపీ మెన్ బ్లైండ్ టీమ్‌కు స్పాన్సర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలో ఏపీ నుంచి అంధ మహిళల జట్టును జాతీయ పోటీలకు పంపేందుకు తోడ్పడాలని క్రీడాకారుల నుంచి వచ్చిన వినతులను జహరాబేగం పరిగణనలోకి తీసుకున్నారు. ఏపీ జట్టుకు స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నారు. సీఏబీఏపీ చురుగ్గా ఏర్పాట్లు తాహెరా ట్రస్ట్ గ్రీన్ సిగ్నల్‌తో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ) చురుగ్గా ఏర్పాట్లు చేసింది. అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్లో క్రీడాకారులకు సన్నాహక శిబిరం చేపట్టింది. ఈనెల 15 నుంచి ఇది ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 35 మంది క్రీడాకారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. జహరా బేగం సన్నాహక శిబిరానికి హాజరై, క్రీడాకారిణులకు వసతి, భోజనం, యూనిఫాం, కిట్‌ను సమకూర్చారు. వీరి నుంచి 14 మంది జట్టును ఈనెల 17న ఎంపిక చేశారు. మళ్లీ వీరికి పూర్తిస్థాయి శిక్షణ నడుస్తోంది. క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా కార్యదర్శి, ఏపీ అధ్యక్షుడు జాన్ డేవిడ్ నేతృత్వంలో జాతీయ క్రీడాకారుడు జి.వెంకటేష్ వీరికి శిక్షణనిస్తున్నారు. రాయలసీమ కో–ఆర్డినేటర్ ఫర్ బ్లైండ్ వెంకటనారాయణ పర్యవేక్షిస్తున్నారు. త్వరలో సీఎం వద్దకు.. అంధ క్రీడాకారుల్లో క్రీడాపరంగా అపూర్వమైన సామర్థ్యం ఉందని జహరాబేగం చెప్పారు. క్రికెట్ సాధనకు క్రీడాకారులకు తగిన ఆటస్థలం, వసతిగృహం అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని త్వరలోనే కలవనున్నట్టు చెప్పారు. క్రీడాకారుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. -
జాతీయ క్రికెట్ టోర్నీకి శ్రీనివాస్ ఎంపిక
నెక్కొండ: నెక్కొం డ మండల కేం ద్రానికి చెందిన గోపగాని శ్రీనివా స్ నవంబర్‌లో ఢి ల్లీలో జరిగే జాతీ య క్రికెట్ క్రీడల కు ఎంపికయ్యాడు. స్థానిక శ్రీ వికాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన అండర్–19 క్రికెట్ పో టీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. జాతీయ స్థాయికి ఎంపికైన శ్రీనివాస్‌ను కళాశాల యాజమాన్యం శాలువతో సన్మానించి మె మెంటో అందజేసింది. కళాశాలల డైరెక్టర్లు తిప్పని వెంకన్న, చల్లా క్రిష్ణారెడ్డి, కూతురు మహేందర్‌రెడ్డి, తాటిపర్తి అంజన్‌రెడ్డి, కొత్త మధూకర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నాగరాజు, రవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రెం టల ఆనందరావు పాల్గొన్నారు.