breaking news
murthal rapes
-
అత్యాచారాలు జరిగాయి.. నిందితులను పట్టుకోండి!
జాట్లను ఓబీసీలలో చేర్చాలంటూ 2016 ఫిబ్రవరిలో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా ముర్తాల్ సమీపంలో అత్యాచారాలు జరిగినట్లు పంజాబ్ హర్యానా హైకోర్టు నిర్ధారించింది. కొంతమంది సాక్షుల వాంగ్మూలాలను బట్టి, ఆ ప్రాంతంలో లభించిన మహిళల లోదుస్తులను బట్టి అక్కడ అత్యాచారాలు జరిగినట్లు ఖరారైందని తెలిపింది. పోలీసులు ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకోవాలని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచి తన ఆదేశాలు జారీచేసింది. తమ వాహనాల్లోంచి కొందరు మహిళలను నిరసనకారులు లాక్కెళ్లిపోయారని ఒక టాక్సీ డ్రైవర్ కూడా చెప్పినట్లు న్యాయమూర్తి తెలిపారు. దాన్నిబట్టి అత్యాచారం జరిగిందని తెలుస్తోందన్నారు. ఈ విసయమై వార్తాపత్రికలలో కథనాలు రావడంతో హైకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన తర్వాత హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తొలుత ఐదుగురిని ఈ అత్యాచారాల కేసుల్లో నిందితులుగా చూపించినా, వాళ్ల రక్తనమూనాలు.. ఘటనా స్థలంలో లభించిన లోదుస్తుల మీద ఉన్న వీర్య నమూనాలతో సరిపోలలేదు. దాంతో వారిపై ఆరోపణలు ఉపసంహరించుకున్నారు. ఈ కేసు విచారణకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తగిన విశ్వాసంతో పని చేయడం లేదని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది అనుపమ్ గుప్తా ఆరోపించారు. కావాలనే ఈ కేసును నీరుగార్చేందుకు సిట్ ప్రయత్నిస్తోందన్నారు. దాంతో, ఆరోపణలు ఉపసంహరించుకోవడం లేదని.. విచారణ కొనసాగుతోందంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉందో లేదో తెలియజేయాలని సీబీఐ తరఫు న్యాయవాదిని కూడా ధర్మాసనం కోరింది. సీబీఐ మీద ఇప్పటికే భారం ఎక్కువగా ఉన్నా, కోర్టు సూచనలను తప్పక పాటిస్తుందని సీబీఐ న్యాయవాది చెప్పారు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 28న జరగనుంది. -
ముర్తాల్ గ్యాంగ్ రేప్: విస్మయకర విషయాలు
చండీగఢ్: హర్యానాలో జాట్ల ఆందోళన సందర్భంగా ముర్తాల్ లో మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు సాగుతోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న ప్రకాశ్ కమిటీ తన నివేదికలో కీలక అంశాలు పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇందులోని అంశాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఈ నివేదికను సోమవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు సమర్పించింది. గ్యాంగ్ రేప్ లు జరగలేదన్న ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఇందులో అంశాలున్నట్టు వెల్లడైంది. 'ఫిబ్రవరి 22న జాట్ల ఆందోళన ముర్తాల్ లో నగ్నంగా మహిళలు రోడ్డుపక్కన దాబా హోటలో తలదాచుకున్నారు. దాబా యాజమాని స్టేట్ మెంట్ ను ముగ్గురు సభ్యుల ప్రకాశ్ కమిటీ రికార్డ్ చేసింది. తన హోటల్ లో తలదాచుకున్న మహిళలకు దుప్పట్లు, బట్టలు ఇచ్చానని దాబా యజమాని చెప్పాడు. తర్వాత వారిని సురక్షితంగా ఇంటికి పంపించాడని రిపోర్ట్ లో పేర్కొంద'ని అమికస్ క్యూరీ అనుమప్ గుప్తా వెల్లడించారు. అయితే అత్యాచారాలు జరగలేదని దాబా యజమాని తమ ఇంటరాగేషన్ లో చెప్పాడని కోర్టుకు 'సిట్' చీఫ్ మమతా సింగ్ తెలిపారు. కోర్టులో విచారణ సందర్భంగా గుప్తా, హర్యానా ప్రభుత్వ తరపు న్యాయవాది లోకేశ్ సిన్హాల్ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.