breaking news
Miss South India 2016
-
నటి మీరామిథున్ కన్నీరు మున్నీరు
చెన్నై : అందాల పోటీలు రద్దు కావడంతో కార్యక్రమ నిర్వాహకురాలు నటి మిరామిథున్ మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...‘ 8 తోటాగళ్’ చిత్ర నాయకి మీరామిథున్ 2016 ఏడాది మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని గెలుచుకోవడంతో....తనే అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అయ్యారు. దీంతో తనకు మిస్ సౌత్ ఇండియా పట్టాన్ని అందించిన నిర్వాహకులు ఆమెను పోటీలు నిర్వహించరాదని హెచ్చరించారు. అంతే కాకుండా తాము ఆమెకి అందించిన మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని తిరిగి తీసేసుకుని, ఆ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన నటి సనంశెట్టికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పట్టాని నటి మీరామిథున్ ఉపయోగించుకోరాదని హెచ్చరించారు. దీంతో వారిపై ఇటీవల నటి మీరా మిథున్ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాను నిర్వహించనున్న అందాల పోటీల కార్యక్రమానికి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. పోలీసులు రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చినట్లు మీడియాతో పేర్కొన్న నటి మీరామిథున్ సోమవారం తాను నిర్ణయించినట్లుగా స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటళ్లో అందాల పోటీల ఏర్పాటుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. అలాంటిది అందాల పోటీలు జరగలేదు. ఈ విషయమై నటి మీరామిథున్ స్థానిక మైలాపూర్‌లో మీడియాతో తన గోడును వెల్లబోసుకున్నారు. తాను రెండు రోజులుగా రేయింబవళ్లు కష్టపడి అందాల పోటీలకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నానని.. పోటీల్లో పాల్గొనడానికి 11 మంది మోడల్స్ సిద్ధం అయ్యారని చెప్పారు. సోమవారం ఉదయం ఆర్గనైజర్లకు ఫోన్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. దీంతో తానే స్వయంగా వెళ్లి వారిని కలవగా అందాల పోటీలను నిర్వహించరాదని చెప్పారన్నారు. అంతేగాకుండా ఇద్దరు పోలీసులతో హోటల్‌కు వచ్చి తనను బెదిరించారని కంటతడి పెట్టారు. త్వరలో మళ్లీ అందాల పోటీలు నిర్వహించి తీరుతానని అన్నారు. -
ఆమె అంటే పిచ్చి అభిమానం
అతిలోక సుందరి శ్రీదేవి అంటే పిచ్చి అభిమానం అంటోంది నటి సనమ్ శెట్టి. 2016 మిస్ సౌత్ ఇండియా పోటీల్లో రెండో స్థానంలో నిలిచి ఈ బ్యూటీ హీరోయిన్‌గానూ తన సత్తా చాటుతానంటోంది. ఈ అమ్మడు నాయకిగా నటించిన సవారి చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఎంటర్టైన్మెంట్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల హక్కులను పొందిన సవారి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న సనమ్‌శెట్టి ఏమంటుందో చూద్దాం. సవారి చిత్రం నాకు చాలా స్పెషల్. ఇది హాలీవుడ్ బాణీలో రూపొందిన చిత్రం అని చెప్పవచ్చు. దర్శకుడు గుహన్ సెన్నియప్పన్, చాయాగ్రహకుడు చెంజియన్ చిత్రాన్ని పరిమిత సమయంలో, మీడియం బడ్జెట్లో బ్రహ్మాండంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించారు. ఇంది డిఫరెంట్‌గా రూపొందిన చిత్రం. బెనిటో హీరోగా నటించగా ఆయనకు ప్రేయసిగా నేను నటించాను. సాధారణంగా ప్రేమ పెళ్లికి దారి తీస్తుంది.అయితే ఈ చిత్రంలో సరిగ్గా పెళ్లి సమయంలో కథ మరో మలుపు తిరుగుతుంది. ఇలాంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కూడిన సవారి చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది .వారు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పగలను. ఇందులో మరబోటులో సముద్రంలో పయనించే సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు తాను చాలా భయపడ్డాను. కారణం అంతకు ముందెప్పుడూ తాను అసలు మరబోటునే చూసి ఎరుగను. ఇక అది ఎక్కి నటించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. నేను పడవ ఎక్కి పడిపోవవడం హీరో బెనిటో కాపాడడం ఇలా పలుమార్లు జరిగింది. ఏదేమైనా చిత్రం జనరంజకంగా వచ్చింది. ఇక నా గురించి చెప్పాలంటే నటిగా రోల్ మోడల్ శ్రీదేవి. ఆమె అంటే పిచ్చి అభిమానం. శ్రీదేవిని ఎన్ని సార్లు చూసానో, ఇంకా చెప్పాలంటే ఆమెలా నటించడానికి ప్రయత్నిస్తుంటాను.ఇక ఫేవరేట్ నటుడు గురించి చెప్పాలంటే నటుడు మాధవన్ తన దృష్టిలో ఇప్పటికీ చాక్లెట్ బాయ్నే. ఇరుదు చుట్రు చిత్రంలో మాధవన్ నటన ఆయన స్థాయిని 10 రెట్లు పెంచిందనే చెప్పాలి. నాలోని నటనను వెలికి తీసే మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అదే విధంగా సవారి చిత్ర టీజర్‌ను ఆవిష్కరించిన ఆర్యకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ చిత్రాన్ని శ్రీ తెనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల చేయడంతో మా శక్తి మరింత పెరిగింది. సవారి చిత్రం ఈ నెలలో తెరపైకి రానుంది. చిత్రం విడుదల అనంతరం తన మార్కెట్ పెరుగుతుందనే నమ్మకం ఉంది.