breaking news
midiaters
-
లైంగిక దాడి కేసుల్లో మధ్యవర్తిత్వాలు చెల్లవు
లైంగికదాడికి పాల్పడిన నిందితుడు శిక్షను అనుభవించాల్సిందే. ‘స్త్రీ దేహం ఆమెకు దేవాలయం. ఆమె శరీరం మీద పూర్తి హక్కు ఆమెదే. స్త్రీ ఆత్మగౌరవాన్ని కించపరచే ఒప్పందాలతో ఆమె సమాధానపడాల్సిన అవసరం లేదు. లైంగికదాడి బాధితురాలి తల్లిదండ్రులతో నిందితుడు ఎలాంటి మధ్యవర్తిత్వం నెరపడానికి వీల్లేదు. పెళ్లి చేసుకుంటానని, నష్టపరిహారం చెల్లిస్తానని ప్రలోభాలకు గురిచేసి కేసును ఉపసంహరించే ప్రసక్తే లేదు. నేరస్తుడు శిక్ష అనుభవించాల్సిందే’ అంటూ సుప్రీంకోర్టు 2015లో సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పుకి కారణమైన కేస్? మధ్యప్రదేశ్‌లో ఏడేళ్ల బాలికపై 2008లో లైంగికదాడి జరిగింది. నిందితుడు దోషిగా తేలడంతో సెషన్స్కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. పాప తల్లిదండ్రులకు నష్టపరిహారం పేరుతో కొంత డబ్బిచ్చి రాజీ కుదుర్చుకున్న నేరస్థుడు శిక్షరద్దు చేయించుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్ట్‌కి అప్పీలు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని 2009లో హైకోర్ట్ నేరస్థుడి శిక్షను తగ్గించి ఏడాదికి కుదించింది. ఈ తీర్పు వెలువడే నాటికే ఏడాది కాలం పట్టింది కాబట్టి శిక్ష పూర్తయినట్లేనంటూ కేసు కొట్టేసింది. అయితే హైకోర్టు తీర్పు మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. అదే సమయంలో తమిళనాడులో ఒక లైంగికదాడి కేసు నమోదై మద్రాస్ హైకోర్టుకు వచ్చింది. అందులో కూడా బాధితురాలు మైనర్ బాలికే. లైంగిక దాడి కారణంగా ఆమె గర్భవతి కూడా అయింది. మద్రాస్ హైకోర్ట్ జడ్జి.. ఆ అమ్మాయితో ‘నీకు పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోసం నిందితుడిని పెళ్లిచేసుకో’ అంటూ రాజీ కుదిర్చాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఆ తీర్పుతోపాటు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునూ తూర్పార బడుతూ ‘స్త్రీ శరీరం ఆమె దేవాలయం. ఆ దేవాలయం మీద ఎలాంటి దాడి అయినా నేరమే. ఈ నేరానికి శిక్ష అనుభవించకుండా రాజీ, సెటిల్మెంట్ వంటివాటివి ఆమె ఆత్మగౌరవాన్ని భంగపరిచే ప్రయత్నాలే’ అనే రూలింగ్ ఇచ్చింది. అసలు ఈ మధ్యవర్తిత్వం అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ (ఏడీఆర్)... సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) 89 సెక్షన్ కింద 2002 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఒక కేసుకు సంబంధించిన పరిష్కారమార్గాల్లో మధ్యవర్తిత్వం కూడా ఒక పద్ధతి అన్నమాట. సులభంగా పరిష్కారమయ్యే కేసులను కోర్టులో విచారణ ప్రారంభానికి ముందు ఈ మీడియేషన్ సెంటర్‌కి జడ్జి రిఫర్ చేస్తారు.డబ్బు, సమయం వృథా కాకుండా, బాధితులకు మానసిక ఒత్తిడి సత్వర పరిష్కారమార్గాలను అందించేందుకు ఇవి తోడ్పడుతాయి. మధ్యవర్తిత్వానికి వేటిలో వీలుంటుంది.. వేటిలో కుదరదు? సివిల్ తగాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులనే ఈ మీడియేషన్ సెంటర్‌కి రిఫర్ చేస్తారు. లైంగికదాడులు, యాసిడ్ దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, వరకట్న హత్యలు, డెకాయిటీ.. అంటే ఐపీసీ 354, ఐపీసీ376, ఐపీసీ302, ఐపీసీ 304బి, ఐపీసీ306, ఐపీసీ 307 సెక్షన్ల కిందకు వచ్చే కేసులను మీడియేషన్ సెంటర్‌కి రిఫర్ చేయరు. చేయకూడదు కూడా! -
దళారులకు చెక్..స్వయంగా పంట అమ్మకాలు
ఆదర్శంగా రైతు రాంరెడ్డి జగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల మండలం లక్ష్మిపూర్‌కు చెందిన ఆదర్శ రైతు సంగెపు రాంరెడ్డి వరి, మెుక్కజొన్న సాగుచేసేవాడు. ఏళ్లతరబడి ఈ పంటలు సాగుచేసినా పెద్దగా గిట్టుబాటు కాలేదు. దీంతో మార్కెట్ డిమాండ్‌ను పసిVý.ట్టి.. తొటి రైతుల కంటే మూడు నెలల ముందుగానే మొక్కజొన్నను సాగు చేశాడు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పచ్చి కంకులను దళారులకు కట్టబెట్టకుండా స్వయంగా విక్రయిస్తూ లాభాలు పొందుతున్నాడు. కొద్దిపాటి నీటితో.. సంగెపు రాంరెడ్డి తన వ్యవసాయ బావిలో ఉన్న కొద్దిపాటి నీటితో మే నెలలో ఎకరం భూమిలో మెుక్కజొన్న సాగును ప్రారంభించాడు. భూమిని మూడు సార్లు ట్రాక్టర్‌తో దున్నించి, స్వయంగా తయారు చేసిన వర్మి కంపోస్టుతో పాటు, డీఏపీని భూమిలో వేశాడు. బావిలో నీటిని జాగ్రత్తగా పంటకు అందిస్తూ కాపాడుకున్నాడు. జూన్‌లో వర్షాలు కురియడంతో పంట జల్లు దశకు చేరుకుంది. ఈ దశలో పంటకు మరోసారి యూరియాను చల్లాడు. దీంతో, పంట ఏపుగా పెరిగి, గింజ దశకు చేరింది. కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు 20 రోజులు అక్కడే కాపలా ఉన్నాడు. ఫలితంగా మెుక్కజొన్న పంట మంచి దిగుబడినిచ్చింది. స్వయంగా అమ్మకం.. పంట చేతికి రాగానే రాంరెడ్డి జగిత్యాలలో దళారులను సంప్రదించాడు. రూపాయికి రెండు కంకులు ఇవ్వాలని వారు అన్నారు. పంట సాగుకు రూ.15 వేలు పెట్టబడి కాగా దళారులకు అమ్మితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని స్వయంగా తానే పచ్చి కంకులను విక్రయించడానికి సిద్ధపడ్డాడు. ట్రాక్టర్లో కంకులను జగిత్యాలకు తీసుకువచ్చి పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఈ సీజన్లో కంకులకు మంచి డిమాండ్ ఉండటంతో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రూ.10కి మూడు నుంచి నాలుగు రూ. 20కి ఆరు నుంచి ఏడు కంకులను రాంరెడ్డి విక్రయిస్తున్నాడు. రైతులు స్వయంగా అమ్మాలి... రాంరెడ్డి. రైతు రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్మితే నష్టపోవాల్సి వస్తుంది. రైతులు స్వయంగా పంటలను విక్రయిస్తే లాభాలు పొందవచ్చు. తాజాగా ఉన్నవాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడుతారు. ధరలు కూడా చెల్లిస్తారు. రైతులందరూ ఈ దశగా ప్రయత్నాలు చేయాలి.