breaking news
marriage certificates
-
సచివాలయాల్లో మ్యారేజి సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మ్యారేజి సర్టిఫికెట్లు జారీచేయనున్నారు. ఆయా సచివాలయాల్లో ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకనుంచి ఎవరైనా మ్యారేజి సర్టిఫికేట్ కోసం గ్రామ, వార్డు సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పెళ్లయిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆ గడువు తర్వాత మ్యారేజి సర్టిఫికెట్ అవసరమైన వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మ్యారేజి సర్టిఫికెట్ జారీకి సంబంధించి యూజర్ మాన్యువల్‌ను గ్రామ, వార్డు సచివాలయశాఖ అధికారులు అన్ని సచివాలయాలకు పంపారు. పెళ్లి జరిగిన ప్రాంతానికి సంబంధించిన సచివాలయంలోనే సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దంపతుల ఆధార్ నంబరు, ఇతర వివరాలతో ఈ కార్డులు జారీచేస్తారు. ఈ సర్టిఫికెట్ తీసుకోవడం ద్వారా కొత్త దంపతుల పేరుతో రేషన్‌కార్డు విభజన ప్రక్రియ సులువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో రేషన్‌కార్డు విభజన ప్రక్రియలో ఆయా వ్యక్తుల ఆధార్ నంబరు ఆధారంగా ఏపీసేవ పోర్టల్‌లో గ్రామ, వార్డు సచివాలయశాఖ మ్యారేజి సర్టిఫికెట్‌ను ధ్రువీకరించుకునే వీలును కూడా కల్పించినట్టు చెప్పారు. -
మున్సిపల్‌కు ‘పెళ్లి’ కళ
► ఇక బల్దియాల్లోనూ వివాహ నమోదు ► ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ► అమలుకు సిద్ధమవుతున్న యంత్రాంగం ► కల్యాణలక్ష్మి, షాదీముబారక్తోనే ఈ నిర్ణయం ► రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై తగ్గనున్న భారం ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలు 1. ఆదిలాబాద్ 2. నిర్మల్ 3. భైంసా 4. మంచిర్యాల 5. బెల్లంపల్లి 6. మందమర్రి 7. కాగజ్‌నగర్ నిర్మల్‌రూరల్: ఎప్పుడూ పన్నులు, పారిశుధ్యం, ప్రజా సమస్యలంటూ బిజీగా ఉండే మున్సిపల్‌కు ‘పెళ్లి’ కళ రానుంది. మున్సిపల్‌కు పెళ్లి కళ.. ఏంటీ అంటారా..! వివాహం తర్వాత అధికారికంగా దంపతులమన్నట్లు చెప్పుకోవడానికి ప్రతీ ఒక్కరు తమ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. ఈ ప్రక్రియను పూర్తిచేసి ఇచ్చేందుకు ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ కార్యాలయమే వేదికగా ఉండేది. ఇప్పుడు కల్యాణం తదుపరి ఘట్టమైన ఈ బాధ్యతను మున్సిపల్ సైతం పంచుకోనుంది. అంటే.. ఇక నుంచి వివా హ రిజిస్ట్రేషన్లను మున్సిపాలిటీల్లోనూ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిన్‌స్ట్రేషన్(డీఎంఏ) నుంచి బల్దియాలకు ఉత్తర్వులు వచ్చాయి. త్వరలోనే వివాహ నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు మున్సిపాలిటీలు సిద్ధమవుతున్నాయి. కల్యాణలక్ష్మి అమలుతోనే.. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం ఆర్థికంగా అండగా నిలుస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రూ.75,116లను అందజేస్తోంది. ఈ పథకాలు అమలు కావాలంటే అర్హులైన లబ్ధిదా రులు వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. షాదీముబారక్ అమలయ్యే ముస్లిం లతో పాటు క్రైస్తవులు తమ మత పద్ధతుల ప్రకారం వివాహాన్ని నమోదు చేసుకుంటారు. ఇక ప్రధానంగా హిందువులు మాత్రం అధికారికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. కల్యాణలక్ష్మి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బోసిపోయిన ఈ కార్యాలయాలు వివాహ రిజిస్ట్రేషన్లతో నిండిపోతున్నాయి. గతంలో నెల మొత్తంలో పది కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఒక్క రోజులోనే 40–50 అవుతున్నాయి. ఈ లెక్కన నెలకు వందకు పైగా వివాహ రిజిస్ట్రేషన్లు ఒక్కో కార్యాలయంలో నమోదవుతున్నాయి. భారం తగ్గించేందుకే.. భూముల రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు.. తదితర పనులతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బిజీగా ఉంటున్నాయి. గతంలో వివాహ రిజిస్ట్రేషన్లపై అవగాహన లేకపోవడం.. ఉన్నా ఆసక్తి చూపకపోవడంతో పెద్దగా జంటలు వచ్చేవి కావు. విదేశాలకు వెళ్లేవారు, ఇతరత్రా పనులు ఉన్నవారే తమ పెళ్లిళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. కానీ కల్యాణలక్ష్మి అమలులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో ఒక్కసారిగా కార్యాలయాలకు కొత్తజంటల తాకిడి పెరిగిపోయింది. రాష్ట్రంలోని చాలా కార్యాలయాలకు ఇబ్బందికరంగా మారింది. ఓవైపు భూముల రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల బిజీలో ఉండే అధికారులకు పెళ్లిళ్ల నమోదు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహ నమోదు భారాన్ని తగ్గించుకునేందుకు మున్సిపాలిటీలకు ఈ బాధ్యతను పంచినట్లు సమాచారం. సులువుగా వివాహ నమోదు పెళ్లయిన ప్రతీ జంటకు ప్రభుత్వం రూ.75,116 ఇస్తోంది. ఈ మేరకు ప్రతీ జంట తమ పెళ్లిని అధికారికంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుం ది. రూ.220 చెల్లించి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెళ్లిళ్లను నమోదు చేయించుకుంటున్నారు. డబ్బులు చెల్లించడంలో ఇబ్బంది లేదు కానీ.. కార్యాలయాల్లో పెరిగిన పనిభారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. కానీ మున్సిపల్లోనూ వివాహ నమోదు ప్రక్రియ ప్రారంభమైతే సులభంగా, వేగంగా పూర్తవుతాయి. ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీలు ఇప్పటికే డిజిటలైజేషన్ వైపు అడుగులు వే స్తున్నాయి. ప్రజలకు వేగవంతంగా సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల నమోదు ప్రక్రియ కూడా బల్దియాల్లో వెనువెంటనే పూర్తయ్యే ఆస్కారం ఉండనుంది. త్వరలోనే ప్రారంభం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను బల్దియాల్లోనూ చేపట్టాలంటూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిన్‌స్ట్రేషన్(డీఎంఏ) నుంచి ఇటీవలే ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు అందాయి. సబ్ రిజిస్ట్రార్లకూ సమాచారాన్ని అందించారు. మున్సిపాలిటీల్లో చేపట్టే నమోదు ప్రక్రియకు మున్సిపల్ కమిషనర్ మ్యారేజ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మున్సిపాలిటీ ఆ డివిజన్ మేరకు వివాహాల నమోదును చేపట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రస్తుతం రూ.220 చెల్లించాల్సి ఉండగా, మున్సిపల్లో ఎంతమేర చెల్లించాలనేది తేలలేదు. తమ బల్దియాల్లో త్వరలోనే వివాహ నమోదు ప్రక్రియను ప్రారంభించేందు కు కమిషనర్లు సిద్ధమవుతున్నారు. భారం తగ్గుతుంది.. వివాహ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు నాలుగైదు వచ్చే దరఖాస్తులు ప్రస్తుతం 40–50 వరకు వస్తున్నాయి. దీంతో పని భారం పెరుగుతోంది. మున్సిపాలిటీలు ఈ బాధ్యతను పంచుకుంటే మాపై భారం తగ్గుతుంది. – ఫణీందర్, సబ్‌రిజిస్ట్రార్, నిర్మల్ అమలుకు ఏర్పాట్లు.. మున్సిపల్లో పెళ్లిళ్ల నమోదు ప్రక్రియ చేపట్టాలంటూ డీఎంఏ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు త్వరలో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వివాహ నమోదు ప్రక్రియను చేపడతాం. – ఆర్.త్రియంబకేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్, నిర్మల్