breaking news
manikonda in hyderabad
-
మణికొండలో టెక్కీ ఆత్మహత్యాయత్నం
-
మణికొండలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యాయత్నం
మణికొండలో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేహా ఆదివారం తెల్లవారుజామున నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దాంతో పక్కంటివారు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, నేహాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నేహా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. అందులోభాగంగా నేహా ఇరుగుపొరుగు వారిని విచారిస్తున్నారు. అయితే నేహా భర్త లక్ష్మీకాంత్ రెడ్డి పరారిలో ఉన్నాడు. అతడిని అదుపులోకి తీసుకుంటే కానీ అసలు విషయాలు వెల్లడవుతాయని పోలీసులు వెల్లడించారు.