breaking news
	
		
	
  Macro-economic factors
- 
      
                   
                               
                   
            ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులే!

 • 2016 టోకు ద్రవ్యోల్బణం సగటు 1.5%: నొమురా
 • క్యాడ్ జీడీపీలో 1 శాతం లోపేనని డీబీఎస్ అంచనా
 న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు సంబంధించి దేశ స్థూల ఆర్థిక అంశాలు ఈ ఏడాది పటిష్టంగానే ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. 2016లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ సగటున 1.5 శాతంగా ఉంటుందని జపాన్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- నొమురా అంచనావేసింది. ఇక 2016లో కరెంట్ అకౌంట్లోటు (క్యాడ్- ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే, 1.5 శాతంగా గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- డీబీఎస్ అంచనావేసింది. ఆయా సంస్థల అంచనాలు ఇలా...
 ఆహారోత్పత్తుల ధరలు తగ్గుతాయి: నొమురా
 ఆహారోత్పత్తుల ధరలు తక్కువగా ఉండడమే టోకు ద్రవ్యోల్బణం 1.5 శాతం వార్షిక సగటుకు కారణం. దీనితోపాటు సంస్థల బలహీన ‘ప్రైసింగ్ పవర్’ కూడా దీనికి ఒక కారణమే. తగిన వర్షపాతంతో పంటలు బాగుండడం, ప్రభుత్వ చక్కటి సరఫరా నిర్వహణ కూడా కనిష్ట ద్రవ్యోల్బణానికి దోహదపడుతుంది. 
 డీబీఎస్ అంచనాలు ఇవీ...
 ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు తగ్గడం మొత్తం కరెంట్ అకౌంట్లోటుపై సానుకూల ప్రభావం చూపుతుంది. 2015-16లో ఇది - 1.1 శాతం. ఎగుమతులతో పాటు దేశ దిగుమతులు కూడా మందగమనం కొనసాగుతుండడం గమనార్హం. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలకు ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణం ధోరణే ప్రాతిపదికగా ఉంటుంది. రేటు కోతకు తగిన విధంగానే వచ్చే కొద్ది నెలల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఉండే వీలుంది. అయితే దీనితోపాటు రేటు కోతకు విధాన నిర్ణేతలు డిమాండ్ పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేటు పరిస్థితులు, పెట్టుబడుల వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకునే వీలుంది. - 
      
                   
                               
                   
            జైట్లీతో రాజన్ భేటీ

 న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక అంశాలు చర్చించేందుకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సాధారణంగానే జరిగే సమావేశాల్లో ఇది కూడా ఒకటని, ప్రత్యేకత ఏమీ లేదని భేటీ అనంతరం విలేఖరులకు రాజన్ తెలిపారు. ఆర్బీఐ వైఖరిని ఈ నెల 2న ప్రకటించిన పరపతి విధానంలోనే వివరించడం జరిగిందని ఆయన చెప్పారు. మరోవైపు, బ్యాంకుల వార్షిక పనితీరు, మొండి బకాయిల అంశాల గురించి చర్చించేందుకు జైట్లీ శుక్రవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు.
 
 ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినందున ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించి.. వృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించనున్నట్లు సమాచారం. అలాగే, జన ధన యోజన పథకం, సామాజిక భద్రత పథకాల పురోగతి గురించి చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ తీసుకునే వడ్డీ రేటు) ఇటీవలి పాలసీ సమీక్షలో 7.5 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 


