breaking news
Macquarie University
-
కాలుష్య కణాలగుట్టువిప్పిన గణితవేత్త
పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడుతూ భూతాపోన్నతికి కారణమవుతున్న పొగ, కాలుష్యకారక కణాల గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. వీటి కారణంగా ఏ స్థాయిలో కాలుష్యం సంభవిస్తోందో, వాతావరణ మార్పులో వీటి ప్రభావ స్థాయిలను పర్యావరణ వేత్తలు ఇప్పటికే అంచనావేయగల్గుతున్నారు. అయినాసరే ఆకస్మిక వర్షాలు, వరదలు వంటి వాటిని ఇప్పటికీ సరిగా అంచనావేయలేని పరిస్థితి. వీటికి కారణంగా గోళాకృతిలో లేని ఇతర రకాల కణాలు కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారుగానీ వీటి పరిమాణాన్ని, ప్రభావాన్ని గణించే విధానాన్ని అభివృద్దిచేయలేకపోయారు. గత 15 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని మాక్వరైటన్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్రవేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ స్టార్ట్ హాకిన్స్ పరిష్కారం కనుగొన్నారు. దీంతో మరింత ఖచి్చతత్వంతో వాతావరణ అంచనా సుసాధ్యంకానుంది. 2008లో వాతావరణ భౌతికశాస్త్రవేత్త మైఖేల్ బాక్స్ చేసిన ఒక ప్రసంగాన్ని హాకిన్స్ విన్నారు. వాతావరణమార్పులకు కారణమవుతున్న అన్ని ఆకృతుల కాలుష్యకణాలను లెక్కించకుండా మనం చేసే వాతావరణ అంచనాలు భవిష్యత్తులో అంత నిరుపయోగంగా మారే ప్రమాదంఉంది’’అని మైఖేల్ బాక్స్ చేసిన ప్రసంగం హాకిన్స్‌ను ఆలోచనల్లో పడేసింది. ఈ గజిబిజి ఆకృతుల కణాలను లెక్కగట్టే విధానాన్ని అభివృద్ధిచేసి ఈ పొల్యూషన్ పొడుపు ప్రశ్నకు సమాధానం వెతకాలని నిశ్చయించుకుని ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఆ పనిలో సఫలీకృతులయ్యారు. ఏమిటీ కణాలు? వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే ధూళి కణాలు గోళాకృతిలో ఉంటాయి. కానీ రాజస్థాన్‌లోని థార్ఎడారిసహా పలు గనుల తవ్వవం వంటి చోట్ల శిలలు క్రమంగా ఒరుసుకుపోయి, కోతకు గురై అత్యంత సూక్ష్మ శిలా కణాలు ఉద్భవించి గాల్లో కలుస్తున్నాయి. జీవఇంథనాలు మండించినపుపడు వెలువడే కొన్ని రకాల నుసి సైతం భిన్నాకృతిలో ఉంటోంది. ఢిల్లీలో చలికాలంలో నిర్మాణ పనుల వేళ గాల్లో కలిసే పరిశ్రమల వ్యర్థ్యాల నుంచి సైతం వేర్వేరు ఆకృతుల్లో ధూళి కణాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రస్తుతమున్న వాతావరణ సిద్ధాంతాలతో గణించడం కష్టం. ఈ కణాలు గాల్లో అధికమై సూర్యరశ్మి భూమిపై పడకుండా అడ్డుకుని భూమిని చల్లబరచవచ్చు లేదంటే భూమి నుంచి వేడి బయటకు పోకుండా అడ్డుకుని భూతాపోన్నతికి కారణం కావచ్చు. ఈ రెండు దృగి్వషియాలను సైతం గోళాకృతియేతర కణాల కోణంలో లెక్కించాల్సి ఉంది. ప్రసరణ దిశలో ఏదైనా వస్తువు అడ్డుగా ఉంటే కాంతి దిశను మార్చుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని ఈ అసాధారణ ఆకృతి కణాలకు అన్వయిస్తూ కంప్యూటేషన్ మెథడ్‌ను హాకిన్స్ రూపొందించారు. ఇప్పుడీ గణిత సూత్రాలు భవిష్యత్తులో వైద్య ఇమేజింగ్ సాంకేతికతల ఆధునీకరణకూ ఉపయోగపడనున్నాయి. అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ వంటి సాంకేతికతలు తరంగాలు మన శరీరంలో ఎలా ప్రయాణిస్తాయనే సూత్రాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. కొత్త గణిత సూత్రాలతో అత్యాధునిక అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ తీయొచ్చు. పలు రకాల కోటింగ్లలోనూ విరివిగా వాడొచ్చు. ఈ సూత్రాలను కాంతి విక్షేపణకు సంబంధించిన ప్రతి రంగంలోనూ ఉపయోగించవచ్చు. వడగాల్పులు, రుతుపవన అంచనాలు, కాలుష్య ప్రభావాలు వంటిలోనూ ఈ సూత్రాలను వాడొచ్చు. దీంతో వాతావరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయొచ్చు. ఈ పరిశోధనా వివరాలు ‘క్వాంటేటివ్ స్పెక్ట్రోస్కోపీ, రేడియేటివ్ ట్రాన్స్ఫర్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారతీయ బాలల మేధస్సుకు లెడ్ ముప్పు
మెల్బోర్న్: లెడ్.. దీనినే మనం సీసం అంటాం. ఇది ఒక రసాయన మూలకమని మనందరికీ తెలుసు. లెడ్ మానవ శరీరంలోకి వెళ్తే అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన రసాయనం భారతీయ విద్యార్థులపై చెడు ప్రభావం చూపుతోందని తాజా అధ్యాయనల్లో వెల్లడైంది. రక్తంలో అధికంగా ఉన్న లెడ్ పరిమాణం భారతీయ చిన్నారుల మేధోసంపత్తిని, వారి ఐక్యూ స్థాయిలను హరిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. భారతీయ చిన్నారుల రక్తంలోని లెడ్ స్థాయిలను తొలిసారి విశ్లేషించారు. అధ్యయన వివరాలు ప్రకారం... గత అధ్యయనాల్లో తేలిన దాని కంటే తాజా పరిశోధనలో లెడ్ పరిమాణం గణనీయంగా పెరిగింది. అది పిల్లల్లో మేధో వైకల్యానికి కారణమవుతోంది. ఈ విషయమై మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బ్రెట్ ఎరిక్సన్ మాట్లాడుతూ... ‘చిన్నారుల 100 మిల్లీ లీటర్ల రక్తంలో 7 మైక్రోగ్రామ్‌ల పరిమాణంలో లెడ్ ఉంటే వారి ఐక్యూపై ప్రతికూల ప్రభావం పడుతోందని మా పరిశోధనలో తేలింది. బ్యాటరీలను కరిగించడం (బ్యాటరీ స్మెల్టింగ్) వల్ల భారత్‌లో అధిక స్థాయిలో లెడ్ విడుదలవుతోంది. దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. వాహనాలు వాడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం, వాటిలో ఉపయోగించే బ్యాటరీల జీవిత కాలం రెండేళ్లే కావడంతో... బ్యాటరీలను అధికంగా రీసైక్లింగ్ చేస్తున్నారు. దీని కారణంగా ముఖ్యంగా పట్టణ ప్రాంత్లాలో వాయుకాలుష్యం బాగా పెరుగుతోంది. దీంతో లెడ్ వాతావరణంలోకి అధిక స్థాయిలో చేరుతోంది. ఇది పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంద’న్నారు. కేవలం లెడ్ మాత్రమే కాకుండా కొన్ని అయుర్వేద ఔషధాలతోపాటు, నూడుల్స్, సుగంధద్రవ్యాల వల్ల కూడా రక్తంలో లెడ్ పరిమాణం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టి లెడ్ తాలూకు దుష్ఫలితాలను నియంత్రించాలని సూచిస్తున్నారు. -
సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్
మక్వారీ యూనివర్సిటీ ప్రదానం సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాకు చెందిన మక్వారీ యూనివర్సిటీ గురువారం అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ కోసం చేపడుతున్న అనేక మార్పులకు, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సమాచార సాంకేతికతలో చేస్తున్న కృషికి, నిబద్ధతకు గుర్తింపుగా ఆమెకు ఈ డాక్టరేట్ దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాక్క్యూరీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎస్ బ్రూస్ డౌటన్ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. రెండు సంస్థల మధ్య ఒప్పందం...: మక్వారీ వర్సిటీ, అపోలో హాస్పిటల్స్... పరస్పర ప్రయోజనాలు కలిగించే దీర్ఘకాలిక విద్యా మార్పిడిని చేపట్టాయి. ఈ ఒప్పందంలో భాగంగా... మక్వారీ పరిధిలోని నాలుగేళ్ల డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులు.. ఇకపై హైదరాబాద్‌లోని అపోలోలో 5 నెలలపాటు నిర్వహించే క్లినికల్ లెర్నింగ్‌ను పూర్తి చేస్తారు. కాగా, మక్వారీ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఎండీ ప్రోగ్రామ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్.సి.రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
‘సూపర్‌లేజర్’ త్వరలో సాకారం!
మెల్బోర్న్: సైన్స్‌ఫిక్షన్, కామిక్స్ చిత్రాల్లో లేజర్ కిరణాల శక్తి ఎలా ఉంటుందో చూసే ఉంటాం. గోడలను చీల్చుకొని, కొండలను ఛేదించుకొని లేజర్ కిరణాలు ప్రత్యర్థిని మట్టుబెడుతుంటాయి. అయితే అదంతా కాల్పనికత మాత్రమే అనుకోవడానికి ఎంతమాత్రం వీల్లేదు. ఎందుకంటే సూపర్లేజర్ను సృష్టించే పనిలో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. వజ్రం గుండా లేజర్ కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా లేజర్ కిరణాల శక్తిని మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘తక్కువ ఎత్తులో ఎగురుతూ భద్రతకు సవాళ్లు విసురుతున్న డ్రోన్లను, క్షిపణులను ఎదుర్కొనేందుకు ఈ సూపర్‌లేజర్ వంటి ఆవిష్కరణల అవసరం ఎంతో ఉంది.’ అని ఆస్ట్రేలియాలోని మాక్వెయిరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిచ్ మిల్డ్రెన్ అన్నారు.