breaking news
Load Dispatch Center
-
ముంబై పవర్‌కట్: డ్రాగన్ పనే!
న్యూఢిల్లీ: గతేడాది దేశ ఆర్థిక రాజధాని ముంబై వ్యాప్తంగా భారీ పవర్ కట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారి అజాగ్రత్త వల్లనో.. లేక మరే ఇతర కారణాల వల్లనో ఈ పవర్ కట్ సంభవించి ఉంటుందని భావించారు జనాలు. కానీ వాస్తవం ఇది కాదట. నాటి ముంబై పవర్ కట్ వెనక చైనా హ్యాకర్లు ఉన్నారట. ఈ విషయాన్ని ఓ అమెరికన్ సంస్థ వెల్లడించింది. డ్రాగన్ దేశం సరిహద్దుల్లోనే కాక మన దేశంలోకి కూడా తొంగి చూస్తోందనే వార్త ప్రస్తుతం ఆందోళనలు రేకెత్తిస్తోంది. కాగా గతేడాది సరిహద్దు ఉద్రిక్తత సమయంలోనే చైనా ఈ కుతంత్రానికి పాల్పడినట్లు తెలుస్తోంది.. ఆ సమయంలో డ్రాగన్.. మన దేశ విద్యుత్తు రంగంపై గురిపెట్టిందని.. మన ప్రభుత్వానికి చెందిన విద్యుత్తు సంస్థల కంప్యూటర్ నెట్‌వర్క్‌లు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు తదితర వాటిని చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూప్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికాకు చెందిన సదరు సంస్థ వెల్లడించింది. గతేడాది అక్టోబరు 12న ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా స్తంభించి అనేక రైళ్లు, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, స్టాక్ మార్కెట్ లావాదేవీలు వంటి తదితర కార్యక్రమాలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ కరెంట్ కట్కు.. సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాలోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌గ్రిడ్‌పై చైనా సైబర్ నేరగాళ్లు గురిపెట్టారని, సరిహద్దులో భారత్ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని చైనా ‘ముంబయి పవర్‌కట్’తో హెచ్చరించిందని సదరు సంస్థ తెలిపింది. చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్ఎకో గ్రూప్ అనే సంస్థ భారత్‌లోని ఎన్టీపీసీ సహా ఐదు ప్రైమరీ లోడ్ డిస్ప్యాచ్ సెంటర్లు, విద్యుత్ సంస్థల కంప్యూటర్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థల్లోని 21 ఐపీ అడ్రస్‌లపై హ్యాకర్లు దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఐపీ అడ్రస్‌ల ద్వారా విద్యుత్ సరఫరాను నిర్వహించే కంట్రోల్ సిస్టమ్స్‌లోకి సైబర్ నేరగాళ్లు మాల్వేర్ను ప్రవేశపెట్టినట్లు రికార్డెడ్ ఫ్యూచర్ నివేదిక పేర్కొంది. మహారాష్ట్రలోని పద్గాలో గల లోడ్ డిస్పాచ్ సెంటర్లో ఈ మాల్వేర్ కారణంగానే సాంకేతిక లోపం తలెత్తిందని, ఇది ముంబయిలో భారీ పవర్‌కట్‌కు దారితీసిందని అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ.. చైనాలో తయారయ్యే విద్యుత్ పరికరాల్లో మాల్వేర్ ఉందేమో అన్న అంశంపై తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఆయన ఈ విషయం చెప్పిన కొన్ని నెలలకే ముంబయిలో గ్రిడ్ విఫలం కావడం గమనార్హం. కాగా.. సరిహద్దు వివాదానికి తెరదించేలా ఇటీవల భారత్, చైనా కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పాంగాంగ్ సరస్సు వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. ఇలాంటి సమయంలో ఈ అధ్యయనం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: ఢిల్లీ ఓటమి.. అందుకే ముంబైలో పవర్ కట్! ఆ వ్యూహం మా దగ్గర పని చేయదు: నరవాణే -
కో టాలేదు..తలే
నీలగిరి : జిల్లా విద్యుత్‌శాఖ పీకల్లోతు కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు విద్యుత్ కోతల కారణంగా తలెత్తుతున్న సమస్యలు అధికార యంత్రాంగాన్ని హడలెత్తిస్తుంటే...మరోవైపు కొద్ది రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా ఎక్కడి సేవలు అక్కడే స్తంభించిపోయాయి. ఇక ఓవర్‌లోడ్ పుణ్యమాని వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు తరచు కాలిపోతున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. అప్రకటిత కోతలు.. విద్యుత్‌శాఖ అమలు చేస్తున్న అప్రకటిత విద్యుత్ కోతల వల్ల అన్ని రంగాలపై కోలుకోలేని దెబ్బపడింది. రాష్ట్రంలో విద్యుత్ లోటు కారణంగా జిల్లా కోటా అనేది లేకుండా చేశారు. కోతలు లేని కాలంలో జిల్లాకు నెలవారీ విద్యుత్ కోటాను కేటాయిస్తూ ఆ మేరకు అన్ని అవసరాలకు విద్యుత్ సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం అప్రకటిత కోతల వల్ల జిల్లా కోటాను పూర్తిగా బంద్ చేశారు. లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచే నేరుగా విద్యుత్ సరఫరా చేస్తూ కోతలు విధిస్తున్నారు. వ్యవసాయ రంగానికి 6 గంటలు కరెంట్ ఇచ్చేందుకుగాను పరిశ్రమలు, గృహావసరాలకు సరఫరా అయ్యే విద్యుత్‌లో కోత విధించారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. భువనగిరి డివిజన్ పరిధిలో మాత్రం శని, ఆదివారాలు పవర్ హాలిడే అమలుచేస్తున్నారు. ఇక జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామాల్లో 9 గంటల పాటు కోత విధిస్తున్నారు. వ్యవసాయరంగానికి రా త్రి 3 గంటలు, పగలు 3 గంటలు సరఫరా చేస్తున్నా రు. వాస్తవానికి వ్యవసాయానికి 7 గంటలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక గంట కత్తిరిస్తున్నారు. ఈ విధంగా అ న్ని రంగాలకు కోతలు విధిండచడం వల్ల ఇక జిల్లాకు ప్రత్యేకంగా కోటా అనేది లేకుండా పోయింది. కాలిపోతున్న ట్రాన్స్పార్మర్లు... అప్రకటిత విద్యుత్ కోతలు, ఓవర్ లోడ్ సమస్యతో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు తరచు కాలిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, బావుల కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ వల్ల ఎక్కువ కాలిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని కేటగిరీల్లో కలుపుకుని మొత్తం 56,762 ఉన్నాయి. దీనికిగాను కనీసం 4 శాతం ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్‌శాఖ స్టోర్‌లో ఉండాలి. కానీ 16 కేవీ నుంచి 100 కేవీ వరకు 780 ట్రాన్స్ఫార్మర్లు కొరత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్ రిపేరు కేంద్రాలు 20 వరకు ఉన్నాయి. ఈ కేంద్రాలకు రోజుకు రెండు చొప్పున కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు 40 వరకు వస్తున్నాయి. కరెంట్ వ చ్చిరావడంతోనే రైతులందరూ ఒకేసారి విద్యుత్ మోటర్లు ఆన్చేస్తున్నారు. దీని వల్ల ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడ్ పడుతోంది. తరచు కరెంట్ ట్రిప్ అవుతుండడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ట్రా న్స్ఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో మరో ట్రాన్స్‌ఫార్మరు బిగిం చాలి. కానీ ఎక్కడా దీనిని అమలు చేయడంలేదు. స్తంభించిన సేవలు... విద్యుత్ పంపిణీ సంస్థ, ట్రాన్స్‌కో కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు కొద్ది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో సేవలు స్తంభించిపోయాయి. వీరి స్థానాల్లో లైన్మన్లు, ఏఈలు, డీఈలు, టెక్నికల్ డీఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో పనిభారం పెరిగి సబ్‌స్టేష న్లలో విధులు నిర్వర్తించడం కష్టసాధ్యమవుతోందని అధికారులు అంటున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ, దాని పరిధిలోని సబ్స్టేషన్లలో కలిపి కాంట్రాక్టు ఉద్యోగులు సుమారు 1500మంది ఉన్నారు. వీరంతా సమ్మెలోకి దిగడంతో జిల్లా కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి సబ్‌స్టేషన్‌లో కరెంట్ కటర్స్ వరకు అన్ని విధులు లైన్‌మన్, ఏఈలు మొదలుకొని డీఈల వరకు పనిచేయాల్సి వస్తోంది. ఇక ట్రాన్స్‌కో పరిధిలో 132 కేవీ సబ్స్టేషన్లు 27,220 కేవీ సబ్స్టేషన్లు 5 మొత్తం కలిపి 32 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో సబ్‌స్టేషన్‌కు 11మంది చొప్పున కాంట్రాక్టు ఉద్యోగులు 352మంది ఉన్నారు. ఆయా సబ్స్టేషన్లలో ప్రతి 8 గంటల కోసారి కాంట్రాక్టు ఉద్యోగులు డ్యూటీలు మారి పనిచేయా ల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వారంతా ఒకేసారి సమ్మెలోకి దిగడంతో ఆ బాధ్యతలను జూనియర్ లైన్‌మన్ నుంచి డీఈ వరకు చేయాల్సి వస్తోంది. లైన్స్ బ్రేక్‌డౌన్ సరిచూసుకోవడం, సబ్‌స్టేషన్ మెయింటెన్స్ వంటివన్నీ కూడా ప్రస్తుతం లైన్మన్లు, డీఈలు దగ్గర ఉండి చూసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడా లేకపోవడంతో వంతుల వారీ విధులు నిర్వర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో రోజువారీ విధులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయి నాంపల్లి మండలంలో కరెం టు కోత తీవ్రంగా ఉంది. రోజుకు ఐదారు గంటలు కూడా రావట్లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నరు. పగలు రెండు గంటలు,రాత్రి మూడు గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందులోనూ లోఓల్టేజీతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. ఓవర్‌లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు తగులబడుతున్నాయి. కాలిన ట్రాన్స్ఫార్మర్లను వారంరోజులైనా బాగుచేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. - దండిగ సత్తయ్య, రైతు, పసునూరు, నాంపల్లి