Legal Advisor
-
ఆ వివాహం ఇక్కడా చెల్లుతుంది..
నేను పోలాండ్ లో నివసిస్తున్న భారతీయుడిని. ఇటలీలో ఉంటున్న మరొక భారతీయ మహిళను అక్కడే పెళ్లి చేసుకున్నాను. మా మతాలు వేరు. తనకోసం ఇక్కడ వీసా దరఖాస్తు చేస్తుండగా ఇటలీలో పొందిన మ్యారేజ్ సర్టిఫికెట్ భారతదేశంలో కూడా చెల్లుతుంది అని భారతదేశ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా కోర్టు ఆర్డరు ఏవైనా ఉంటే తేవాలి అని సూచించారు. మేము ఇంకా భారతదేశ పౌరులమే కాబట్టి ఈ ధ్రువీకరణ తప్పనిసరి అని చె΄్పారు. మా పెళ్లి భారత దేశంలో చెల్లుతుందా? లేక అక్కడికి వచ్చి ఇంకొకసారి పెళ్లి చేసుకోవాలా? సరైన సలహా ఇవ్వగలరు.– భరద్వాజ్, పోలాండ్ విదేశాలలో ఉంటున్న భారతీయులు పెళ్లి చేసుకుంటే (లేదా పెళ్లి చేసుకోబోతున్న వారిలో కనీసం ఒకరు భారతీయులు అయి ఉంటే) ఆ వివాహం భారతదేశంలో కూడా ‘ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్, 1969 ప్రకారం చట్టబద్ధమే. అయితే మీరు అదే విధమైన పెళ్లి భారతదేశంలో చేసుకుని ఉంటే ఆ పెళ్లికి ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. ఉదాహరణకు (1) మీకు ఇదివరకే పెళ్లి అయ్యి మీ భార్య/భర్త జీవిస్తూ (విడాకులు లేకుండా) ఉండకూడదు.(2) మీరు ఉంటున్న దేశంలో కూడా మీ పెళ్లి చట్టబద్ధమైనది అయి ఉండాలి (3) మీరు పెళ్లి చేసుకున్న దేశంలోని అధికారులు మీ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని అపాస్టిల్ చేయాలి. ఇటలీ దేశం కూడా భారతదేశంతోపాటు హేగ్ కన్వెన్షన్ ఒప్పందం లో సంతకం చేసింది కాబట్టి, మీ వీసా దరఖాస్తుకు – భారత దేశంలో ఎవిడెన్స్ ఇవ్వడానికి కూడా అపాస్టిల్ చేసిన ఆ దేశ వివాహ ధ్రువీకరణ పత్రం చట్టబద్ధమైనదే!అలాంటి వివాహాలను రిజిస్టర్ చేయడానికి మీరు పెళ్లి చేసుకున్న దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రతి ఇండియన్ ఎంబసీ లో కూడా వివాహాలను రిజిస్టర్ చేయడానికి ఒక ఆఫీసర్ ఉంటారు. ఇటలీలో మీరు పొందిన సర్టిఫికెట్ తీసుకొని ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అవసరమైన అప్లికేషన్ నింపి దరఖాస్తు చేసుకోండి. మీ దంపతులు – సాక్షులు కూడా వ్యక్తిగతంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇండియన్ ఎంబసీ వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం మీకు సరిపోతుంది. (శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయండి) (చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!) -
వైఎస్సార్సీపీలో చేరిన జేసీ బ్రదర్స్ లీగల్ అడ్వైజర్..!
-
ఈడీ నుంచి కవితకు మళ్లీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. నేడు(మంగళవారం) ఢిల్లీ కార్యాలయానికి రావాలని లేఖ ద్వారా కోరింది. ఈడీ పిలుపుపై స్పందించిన కవిత.. ప్రతిగా తన లీగల్ అడ్వైజర్‌ను పంపించారు. కాగా మార్చి 11న ఎమ్మెల్సీ కవితకు చెందిన ఫోన్‌ను ఈడీ అధికారులు సీజ్ చేయగా.. ఈనెల 21న ఎమ్మెల్సీ తన 9ఫోన్లను ఈడీకి అందజేశారు. అయితే సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేసేందుకు సాక్షిగా కవిత గానీ, ఆమె ప్రతినిధి గానీ రావాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు లీగల్ అడ్వైజర్ సోమా భారత్‌కు ఆథరైజేషన్ ఇచ్చి తన ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి విచారణకు పంపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇప్పటి వరకు మూడుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈనెల 11,20,21 తేదీల్లో ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. చదవండి: ఉప్పల్ తిప్పల్.. మోదీ పోస్టర్ల కలకలం -
Sopen Shah: అటార్నీగా భారత సంతతి మహిళ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం తన జట్టులో ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన బి. సోపెన్ బి షాను వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విస్కాన్సిన్‌కి యూఎస్ స్టేట్స్ అటార్నీగా బైడెన్ నామినేట్ చేశారు. జూన్ 6వ తేదీన వైట్‌హౌస్ ప్రకటించిన ఆరుగురు యూఎస్ అటార్నీ జాబితాలో సోపెన్ షా కూడా వున్నారు. ట్రంప్ హయాంలో నియమితుడైన స్కాట్ బ్లేడర్ స్థానంలో సోపెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం.. అసిస్టెంట్ యూఎస్ అటార్నీ టిమ్ ఓషీయా ప్రస్తుతం తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సోపెన్ నియామకం ఆమోదించబడితే.. మాడిసన్లోని యూఎస్ అటార్నీ కార్యాలయానికి నాయకత్వం వహించే రెండవ మహిళగా ఘనత దక్కించుకుంటారు. సోపెన్ షా 2017 నుంచి 2019 వరకు విస్కాన్సిన్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా హైప్రొఫైల్ సివిల్, క్రిమినల్ అప్పీల్స్‌లో వాదనలు వినిపించారు. సెకండ్ సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో న్యాయమూర్తి డెబ్రా ఆన్ లివింగ్‌స్టన్‌కు, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోసం యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి అముల్ ఆర్.థాపర్‌కు లా క్లర్క్‌గా పనిచేశారు. కెంటుకీలో స్థిరపడిన సోపెన్ షా.. 2015లో యేల్ లా స్కూల్ నుంచి జేడీ, 2008లో హార్వర్డ్ కాలేజీ నుంచి ఏబీ మాగ్నా కమ్ లాడ్‌ను అందుకున్నారు. 2019 నుంచి పెర్కిన్స్ కోయి ఎల్ఎల్పీ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్నారు. -
సహారా సొమ్ము కోసం సెబీ ఎత్తుగడ
అన్నానగర్, న్యూస్‌లైన్: సహారా ఇండియా కంపెనీలు మూడుకోట్లపైచిలుకు మదుపరులు దాచుకున్న 5120 సొమ్మును సెబీ అక్రమంగా వాడుకోవడానికి కొత్త ఎత్తుగడలు పన్నిందని ఆ కంపెనీ న్యాయ సలహాదారు కేశవమోహన్ ఆరోపించారు. ఎత్తుగడల్లో భాగంగా సహారాలో పెట్టుబడులు పెట్టినవారంతా బినామీ పేర్లతో ఉన్నట్లుగా తాము కనుగొన్నామని సెబీ శుక్రవారం నాడు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోర్టు ఈ నేపథ్యంలో సహారాలో పెట్టుబడులు పెట్టిన మదుపరుల వివరాల డాక్యుమెంట్లను గతంలోనే కోరివుందని, ఇందులో భాగంగా సహారా తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన 3.03 కోట్ల మంది ఇన్వెస్టర్ల తాలూకు వివరాలను డిజిటల్ రూపంలో కోర్టుకు 60 అందించిందన్నారు. వీటిని పరిశీలించిన కోర్టు సంతృప్తిని వ్యక్తం చేయగా సెబీ మాత్రం డిజిటల్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన వ్యక్తుల వివరాలను కనిపెట్టేందుకే సహారా 60 కోట్లపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందనడం వింతగా ఉందన్నారు. సహారా వ్యాఖ్యలకు స్పందించిన సెబీ తాము మార్చి 2014న సహారా సమర్పించిన పత్రాల్లోని 20 వేల మంది మదుపరులకు ధ్రువీకరణ కోరుతూ లేఖలు పంపామని అయితే వీటిలో ఒక్కరూ సమాధానం పంపక పోవడంతో ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశోధించగా బినామీ ఇన్వెస్టర్లు ఎక్కువగా కన్పించారని అంటోంది. సెబీ సమాధానం విన్న సహారా, సెబీ పంపిన లేఖలన్నీ తాము ఇది వరకే సొమ్మును సెటిల్ చేసిన మదుపరులకేనని అంటోంది. 15 నెలల వ్యవధిలో సహారా తన మదుపరులకు కోటికిపైగా సెటిల్మెంట్ చేశామంది. సెబీ వద్ద నున్న 5120 కోట్లల్లో 5119 కోట్లు మిగిలివుందని ఈ సొమ్మును బినామీ మదుపరుదారులున్నారంటూస్వాహా చేసేందుకు సెబీ చూస్తోందని కేశవ్మోహన్ ధ్వజమెత్తారు.