breaking news
lalithabai
-
చంద్రబాబు పెద్దకొడుకు.. తలసాని చిన్నకొడుకు!
-
చంద్రబాబు పెద్దకొడుకు...తలసాని చిన్నకొడుకు
హైదరాబాద్ : మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. తన కుమారుడికి మంత్రి పదవి రావటం సంతోషంగా ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లి లలితాబాయి అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో విడిపోయినందుకు బాధగా ఉందని ఆమె మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు పెద్ద కొడుకు లాంటివాడు అయితే తలసాని తనకు చిన్నకొడుకు అని లలితాబాయి అన్నారు. ఇన్నాళ్లు తన బిడ్డ పడ్డ శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కిందని ఆమె అంటున్నారు. కాగా తలసాని శ్రీనివాస్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు తలసాని ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.