breaking news
lack of awareness
-
ఆపదలో రేపటి అమ్మలు
సాక్షి, కర్నూలు : కాబోయే అమ్మలు ఆపదలో ఉన్నారు. మాతృమూర్తిగా మారే తరుణంలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకు కారణాలు పేదరికం, అవగాహన లేమి, వైద్య సిబ్బంది పర్యవేక్షణ లోపం. జిల్లా వ్యాప్తంగా పరిశీలనతో వెలుగు చూసిన అంకెలు చెబుతున్న విస్తుపోయే నిజాలివి. మాతశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల అవగాహన లోపం వెరసి కాబోయే అమ్మలకు ముప్పు వాటిల్లుతోంది. గర్భిణులు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. మరికొందరు రోగాలతో బాధపడుతూ దయనీయ స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ఆయా పేద కుటుంబాల్లో ఆందోళన తప్పడం లేదు. ఇటీవల నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సందర్భంగా వైద్య బృందాలు గ్రామాల్లో 1,161 శిబిరాలను నిర్వహించాయి. జిల్లా వ్యాప్తంగా 1,11,345 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. ఇందులో 6,500 మంది గర్భిణులను వైద్య సిబ్బంది పరీక్షించారు. ఇందులో 2,585 మంది షోషకాహార, హైరిస్క్(ప్రమాద లక్షణాలు)తో బాధపడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇవి అధికారుల ప్రాథమిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని ఓ అంచనా. ఈ స్థితిని గమనిస్తే జిల్లాలో గర్భిణుల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది. ఎందుకు ఇలా? జిల్లా వ్యాప్తంగా సుమారు 3,462 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మరో విభాగం ద్వారా 100 వరకు పౌష్టికాహార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, కేంద్రాలుఆపదలో రేపటి అమ్మలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి కారణాలతో పౌష్టికాహార పంపిణీ మొక్కుబడిగా మారుతోందని అవగతం అవుతోంది. ఇలా చేయాలి? ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలి. వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారంతోపాటు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. వీరంతా ఆసుపత్రులకు వచ్చే విధంగా చైతన్యం చేయాలి. లోపాలను గుర్తించి అవసరమైన మందులను అందించాలి. గర్భిణులకు నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకూ మూడు విడతలుగా 100 ఐరన్ మాత్రలు అందజేయాలి. వారిలో రక్తహీనతను నివారించాలి. రక్తహీనత ఉన్నవారికి 200 మాత్రలు ఇవ్వాలి. ప్రతి గర్భిణి ప్రసవం సమయానికి కనీసం 10 కిలోల బరువు పెరిగే విధంగా చూడాలి. గర్భం దాల్చిన నాలుగు నెలల తర్వాత ఆరు నెలల వరకు ప్రతి నెలా పరిశీలన చేయాలి. ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు 15 రోజులకు ఒకసారి పరిశీలన చేసి ఆరోగ్య పరిస్థితిని గమనించాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉంది. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులు, వేల సంఖ్యలో ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నా పూర్తిస్థాయిలో ప్రయోజనాలు కనిపించడం లేదు. ఫలితంగా అనేక మంది వివిధ రోగాలకు గురై చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అవగాహన లోపం.. అనేక మంది గర్భిణిలు అవగాహన లేక పౌష్టికాహార లోపంతోపాటు ఇతర రోగాల బారిన పడుతున్నారు. దీంతో బిడ్డలో ఎదుగుదల ఉండదు. ప్రసవం తర్వాత తల్లి పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇటువంటి వారు ప్రసవ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొంత మంది వైద్యులు చెబుతున్నారు. గర్భిణిలు ఆకుకూరలు, ఖర్జూరం, ఎండుపండ్లతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఐరన్, మినరల్స్ ఉన్న బెల్లం కూడా వినియోగిస్తే రక్తహీనత బారిన పడే అవకాశం ఉండదని వారు వివరిస్తున్నారు. ఇవి తక్కువ ధరకు లభ్యమయ్యే పరిస్థితి ఉన్నా అవగాహన లోపంతో తీసుకోవడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధాన సమస్య ఇదే! జిల్లా వ్యాప్తంగా సాగిన శిబిరాాల్లో గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తే.. అధిక శాతం మంది పౌష్టికాహారం లోపంతో ఉన్నట్లు గుర్తించారు. రక్తహీనత, చిన్న వయస్సు (18 ఏళ్లలోపు)లో గర్భం దాల్చడం, వయసు దాటిన(35 ఏళ్లుపైబడి) తర్వాత దాల్చడం, శిశువు ఎదగక పోవడం, మధుమేహం, రక్తపోటు, సిజేరియన్ తర్వాత గర్భం దాల్చడం, ఎక్కువ కాన్పులు వంటి కారణాలతో ఉన్న 2.585 మందిని గుర్తించారు. వీరిని ‘హైరిస్క్’ గర్భిణులుగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు బాధ్యత ఉండాలి జిల్లాలో చాలా మంది గర్భిణి స్త్రీలు వివిధ జబ్బులతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం తీసుకుంటున్నప్పటికీ వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ప్రసవ సమయంలో తల్లి మరణించడమో, లేదా తక్కువ బరువున్న పిల్లలు పుట్టడమో జరుగుతోంది. ఈ సమస్య ఆదోని, ఆలూరు, పత్తికొండ తదితర మండలాల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించాం. ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలన్న విషయంపై తాము ఎప్పటికప్పుడు గర్భిణులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వివరిస్తున్నాం. గర్భిణుల ఆహార నియమాల విషయంలో కుటుంబ సభ్యులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఐసీడీఎస్ సిబ్బంది అందిస్తున్నది కేవలం అనుబంధ ఆహారం మాత్రమే. పూర్తిస్థాయి పౌష్టికాహారం, ఇతరత్రా ఆహారం కుటుంబ సభ్యులు అందించాలి. - ముత్యాలమ్మ, పీడీ, ఐసీడీఎస్. -
అవగాహన లోపం.. రైతులకు శాపం..!
పరిగి, న్యూస్‌లైన్: ఎరువుల వాడకంలో రైతుల్లో అవగాహన లోపించింది. నేలల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులను వినియోగించాల్సి ఉండగా రైతులు ఆ విషయూన్ని పట్టించుకోవడం లేదు. రైతుల కోసం చైతన్య యాత్రలు, అవగాహన సదస్సులు, పొలంబడి తదితర అనేక కార్యక్రమాలు వ్యవసాయ శాఖ చేపడుతున్నప్పటికీ అన్నదాతలకు ఈ విషయుమై ప్రాథమిక సమాచారం కూడా అందిన దాఖలాలు కనిపించడం లేదు. జిల్లాకు చెందిన నేలల భూసారం, నేల స్వభావాన్ని బట్టి ఈ ప్రాంతంలో డీఏపీని(అడుగు మందు) దుక్కిలోనే వేయాలని శాస్త్రవేత్తలు చెబుతుండగా ఐదుశాతం రైతులు కూడా ఈ విధానాన్ని పాటించడం లేదు. కేవలం పసుపు, మొక్కజొన్న పంటలకు మాత్రమే డీఏపీనీ రైతులు దుక్కి మందుగా వాడుతున్నారు. డీఏపీని కూడా యూరియా వూదిరి పైపాటి ఎరువుగా వాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యవసాయు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖరీఫ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.. మోతాదుకు మించి డీఏపీ వాడకం నేల స్వభావం, భూసారంపై రైతులకు అవగాహన లేకపోవడంతో డీఏపీని రైతులు మోతాదుకు మించి వాడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చివు జిల్లాలోని నేలల్లో భాస్వరం మధ్యస్తంగా, పొటాషియం ఎక్కువగా, నత్రజని తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంత నేలలను బట్టి ఎకరానికి పంటకాలంలో 50 కేజీల డీఏపీ మాత్రమే వాడాలని శాస్త్రవేత్తలు చెబుతుండగా రైతులు ఎకరానికి 100 నుంచి 150 కేజీల వరకు డీఏపీని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ మందును పైపాటుగానే వేస్తున్నందునా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నియోజక వర్గంలో ఇలా వాడుతున్నారు రెండు మూడు సంవత్సరాలుగా పరిగి నియోజక వర్గానికి ఖరీఫ్ ఆరంభంలోనే 4 వేల నుంచి 5 వేల టన్నుల ఎరువులను వ్యవసాయ శాఖ అధికారులు సరఫరా చేస్తూ వస్తున్నారు. ఇందులో మెజార్టీ భాగం డీఏపీనే ఉంటోంది. కాగా సరఫరా అవుతున్న ఎరువుల్లో 20 శాతం కూడా జూలై మాసంలో వాడటంలేదు. అంటే విత్తుకునే సమయంలో దుక్కి ఎరువుగా రైతులు డీఏపీని వాడటంలేదని అర్థవువుతోంది. జిల్లా భూముల సారాన్ని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎరువుల మోతాదు ఈ విధంగా ఉండాలని పేర్కొంటున్నారు. డీఏపీ ఎరువు ప్రతి ఎకరానికి 50 కిలోలు వాడాలి. దీన్ని తప్పని సరిగా దుక్కి ఎరువుగానే వాడాలి. డీఏపీలో భాస్వరం ఎక్కువగా ఉన్నందునా ఈ ఎరువును పైపాటుగా వేస్తే ఉపయోగం ఉండదు. పత్తి పంటకు విత్తే కంటే ముందు మూడు నుంచి నాలుగు అంగులాల లోతులో డీఏపీ వేయాలి. మిగత అన్ని ఖరీప్పంటలకు కూడా ఎకరానికి 50 కేజీలే వాడాలి. యూరియా ప్రతి ఎకరానికి వందకిలోలు వాడాలి. ఈ ప్రాంతంలో నత్రజని శాతం తక్కువగా ఉన్నందునా యూరియా మోతాదు ఎక్కువగా వాడాలి. యూరియాను పైపాటు ఎరువుగా వాడవచ్చు. పత్తికి యూరియా విత్తిన 20 రోజుల నుంచి ఐదుసార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల వరకు వేయవచ్చు. వరికి యూరియా నాలుగు సార్లు వాడాలి. కలుపుతీసే సమయంలో తరువాత 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకు యూరియాను వరి పైరుకు వాడాల్సి ఉంటుంది.