breaking news
labour law
-
త్వరలో కొత్త కార్మిక చట్టాలు: ఉద్యోగుల జీతాల్లో వచ్చే మార్పులు ఇవే?
ఉద్యోగులకు శుభవార్త. పని-జీవిత సమతుల్యతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో పలు మార్పులు చేస్తూ.. వాటిని అమల్లోకి తెచ్చేలా పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే లీవ్‌ల విషయంలో ఉద్యోగులు మరింత లబ్ధి పొందనున్నారు. 30 రోజులకు మించి సెలవుల్ని (leave) క్లయిమ్ చేయకపోతే ఉద్యోగులకు కంపెనీలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని మార్పులు చేసిన కార్మిక చట్టంలో ఉంది. కేంద్రం గత ఏడాది వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, భద్రత-ఆరోగ్యం- పని పరిస్థితులకు సంబంధించిన కోడ్ పేరుతో రూపొందించింది. నాలుగు కోడ్లకు పార్లమెంట్లో సైతం ఆమోదం పొందింది. అయితే, అవి ఇంకా అమల్లోకి రాలేదు. చట్టాల అమలు తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ తరుణంలో ఉద్యోగుల సెలవుల్ని ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. అయితే లేబర్ కోడ్లలో మార్పులకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. ఉద్యోగులకు ఉపయోగమే ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్ 2020 ప్రకారం.. లీవ్ బ్యాలెన్స్ 30 దాటితే అదనపు సెలవులను కార్మికులు ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. ఈ ఎన్‌క్యాష్ అనేది ప్రతి ఏడాది క్యాలెండర్ ఇయర్ చివరిలో జరుగుతుంది. లేబర్ కోడ్ ప్రకారం.. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే లీవ్‌లు వినియోగించుకోకపోతే నిర్విర్యం కావు. వాటిని మరుసటి ఏడాదికి పొడిగించుకోవచ్చు. లేదంటే ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. కానీ సంస్థలు వార్షిక (ఏడాది annual) ప్రాతిపదికన లీవ్ ఎన్‌క్యాష్ చేసుకునేందుకు అనుమతించడం లేదు. ఈ క్రమంలో కేంద్రం మార్పులు చేసిన కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగులు లబ్ధి చేకూరనుంది. లీవ్ ఎన్ క్యాష్మెంట్ అంటే? కార్మిక చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం నిర్దిష్ట సంఖ్యలో సంస్థలు ఉద్యోగులకు లీవ్‌లు ఇస్తుంటాయి. సంస్థలు అందించే మొత్తం లీవ్‌లను ఉద్యోగులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు మరుసటి ఏడాది లీవ్‌లను వినియోగించేలా పొడిగించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. తన చట్టబద్ధమైన సెలవులను ఉపయోగించుకోని (ప్రైవేట్) ఉద్యోగులు.. ఆ సెలవులకు బదులుగా ఆ మేరకు నగదును పొందడాన్నే లీవ్ ఎన్ క్యాష్ మెంట్ (leave encashment) అంటారు. న్యాయ వాద నిపుణులు ఏమంటున్నారు? అయితే, కార్మిక చట్టాల్లోని మార్పులపై న్యాయవాద నిపుణులు స్పందిస్తున్నారు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 32 (ఓఎస్‌హెచ్ కోడ్) సెక్షన్ 2020లో వార్షిక సెలవులు పొందడం, క్యారీ ఫార్వర్డ్, ఎన్‌క్యాష్ ఇలా సంబంధించి అనేక షరతులు ఉన్నాయి. సెక్షన్ 32(30) ప్రకారం ఒక ఉద్యోగి గరిష్టంగా 30 రోజుల వరకు వార్షిక సెలవులను మరుసటి ఏడాదికి ట్రాన్స్ఫర్ (క్యారీ ఫార్వర్డ్) చేసుకోవచ్చు. క్యాలెండర్ ఇయర్ చివరిలో వార్షిక సెలవుల బ్యాలెన్స్ 30 దాటితే, ఉద్యోగి అదనపు సెలవులను ఎన్ క్యాష్ చేసుకోవడానికి లేదంటే మరో ఏడాదికి పొడిగించుకోవడానికి అర్హత ఉందని ప్రముఖ న్యాయ సంస్థ ఇండస్‌లా ప్రతినిధి సౌమ్య కుమార్ తెలిపారు. కొత్త కార్మిక చట్టాల్ని రూపొందించింది.. కానీ గత ఏడాది, కేంద్ర ప్రభుత్వం 4 కొత్తగా కార్మిక చట్టాల్ని రూపొందించింది. వాటిల్లో కార్మికుల కోసం కేటాయించిన మొత్తం 29 చట్టాలను కలిపి నాలుగు కోడ్లుగా మార్చింది. ఇందులో నాలుగు చట్టాలను వేతన కోడ్, 9 చట్టాలను సోషల్ సెక్యూరిటీ కోడ్, 13 చట్టాలను ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్, మరో 3 చట్టాలను ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లుగా రూపొందించింది. వాటిని జులై 01, 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని భావించింది. ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, అనేక రాష్ట్రాలు ఇంకా కొత్త కోడ్లను ఆమోదించలేదు. రాజ్యాంగం పరిధిలో కార్మిక అంశం ఉన్నందున అమలులో జాప్యం జరిగింది. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తాయి. ఈ కోడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. -
విరామమెరుగని మెక్సికన్లు..
పని చేస్తూనే ఉంటుంది. అలసట అసలే ఉండదు.. ఇది ఒక బైక్ యాడ్‌లో మాట. కానీ మనిషికి అలసట సహజం. అయితే కొందరు త్వరగా అలసిపోతారు. మరికొందరు అధిక శ్రమ తర్వాత అలసిపోతారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కో ఆపరేషన్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. మెక్సికన్లు అలసట ఎరగక నిర్విరామంగా ఎక్కువ గంటలపాటు పని చేస్తూనే ఉంటారు. యజమాని శ్రామికులనుంచి ఎక్కువ పనిని ఆశించడం సహజం. అయితే సామజిక, సాంస్కృతిక, ఆర్థిక పరమైన అంశాలు శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తాయని ఓఈసీడీ తెలిపింది. ఉద్యోగ భద్రత సరిగా లేకపోవడం, కార్మికుల శ్రేయస్సు గాలికొదిలేసిన శ్రామిక చట్టాలు మెక్సికన్లు ఎక్కువ గంటలపాటు పని చేసేలా మార్చాయంది. ఇతర ఓఈసీడీ సభ్య దేశాల కార్మికులతో పోల్చినప్పుడు సరాసరి ఒక మెక్సికన్ శ్రామికుడు ఏడాదికి (అన్ని సెలవులు మినహాయించి) 2,255 గంటల పాటు పని చేస్తాడని వెల్లడించింది. కోస్టారికా 2,212 గంటలతో రెండో స్థానంలో, దక్షిణ కొరియా 2,069 గంటలతో మూడో స్థానంలో ఉన్నాయని పేర్కొంది. యూరప్‌లో గ్రీకులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని వివరించింది. ఏడాదిలో వారు సరాసరి 2,035 గంటలు పని చేస్తున్నారు. పొరుగునే ఉన్న జర్మనీ ఇందుకు భిన్నం. ఏడాదిలో కేవలం 1,363 గంటలు మాత్రమే జర్మన్లు పని చేస్తున్నారు. మెక్సికన్ల కంటే పనిలో 892 గంటలు వెనక ఉన్నారని విరించింది. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో 1,783 గంటల పనితో మధ్యస్థంగా ఉందని తన రిపోర్టులో ఓఈసీడీ పేర్కొంది. ‘విశ్రాంతి హక్కు ’..మెక్సికో మూడవ స్థానంలో కొనసాగుత్ను దక్షిణ కొరియా శ్రామికులతో అధికంగా పని చేయించుకుని ఆర్థికంగా పటిష్టంగా మారింది. జననాల రేటు తక్కువగా ఉండడం, తక్కువ ఉత్పాదకత మూలంగా మెక్సికన్లు ఎక్కువ గంటల పాటు పని చేయాల్సి వస్తోందని ఓఈసీడీ తన నివేదికలో తెలిపింది. వారి పని గంటల్ని తగ్గించే చర్యల్లో భాగంగా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ‘విశ్రాంతి హక్కు ’ అనే చట్టాన్ని తీసుకొచ్చారంది. అధిక పనితో మరణాలు.. ఓఈసీడీ సరాసరి పనిగంటల (1763) కన్నా జపాన్ వెనకబడి ఉంది. జపనీయులు ఏడాదికి 1,713 గంటలు పని చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ అధిక పని వల్ల కార్మికులు చనిపోవడం (కరోషి) గమనార్హం. పని పట్ల మక్కువ కల్గిన దేశంగా పేరున్న జపాన్‌లో ఈ పరిస్థితి తలెత్తడంతో ప్రభుత్వం పని గంటల్ని తగ్గించిందని ఓఈసీడీ వెల్లడించింది. తక్కువ పని.. ఎక్కువ ఫలితం ఓఈసీడీ సభ్య దేశాల కంటే తక్కువ గంటలపాటు పనిచేసినా జర్మనీ ఉత్పాదకతలో మాత్రం మెరుగ్గా ఉంది. జర్మనీ దేశస్తులు ఇతర బ్రిటీష్ కార్మికుల కంటే 27 శాతం అధిక ఉత్పత్తిని సాధిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇక డచ్, ఫ్రెంచ్, డానిష్ ప్రజలు ఓఈసీడీ సరాసరి కంటే తక్కువ గంటలు పని చేస్తున్నారు. మొత్తం ఓఈసీడీ సభ్య దేశాల కార్మికుల్లో 2శాతమే ఉన్న డానిష్ శ్రామికులు మిగిలిన అన్ని దేశాలతో పోల్చినప్పుడు నాణ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఓఈసీడీ నివేదించింది. -
మినహాయింపును పరిమితం చేయాలి
* లోక్‌సభలో కరీంనగర్ ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపును 40 మంది ఉద్యోగుల వరకూ ఉన్న సంస్థలకు వర్తింపజేయడం తగదని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కార్మిక చట్టం (రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. 19 నుంచి ఈ సంఖ్యను 40కి పెంచకుండా 25 వరకు ఉద్యోగులు ఉన్న సంస్థలకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. చిన్న సంస్థలకు సంక్లిష్టమైన నిబంధనలు అడ్డుగోడలా ఉండకుండా తెస్తున్న ఈ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.