breaking news
Katrinakaiph
-
అమ్మ వాళ్ల ఊరేదంటే..!
వీళ్లందరూ మనకు బాగా తెలిసిన వాళ్లు, మనోళ్లు. అయితే వీళ్ల నేపథ్యం మాత్రం ఆసక్తికరమైనది. ఎల్లలు లేని, మతాలు, జాతుల అంతరాలు లేని వివాహబంధాలకు ప్రతిరూపాలు వీళ్లంతా. భారతీయతతో పాటు మరో దేశం మూలాలను కూడా కలిగిన వారు వీళ్లు... వైవిధ్యమైన నేపథ్యంతో పుట్టి పెరిగారు. భిన్న రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీ లియోన్ కురెన్జిత్ కౌర్ వొహ్రా.. ఈ పేరుతో గుర్తు పట్టడం కష్టం. ‘సన్నీ లియోన్’ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేయవచ్చు. మూలాలను బట్టి చూస్తే సన్నీ సగం భారతీయురాలు. సన్నీ తల్లి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మహిళ. తండ్రి టిబెట్ వ్యక్తి. వాళ్లిద్దరి ప్రేమకు ప్రతీక సన్నీ. వాళ్లు కెనడాలో సెటిలయ్యారు. పుట్టుకతోనే సన్నీకి ఆ దేశ పౌరసత్వం లభించింది. ఈ విధంగా సన్నీకి మూడు దేశాలతో అనుబంధం ఉంది. కత్రినాకైఫ్ ఈ బ్యూటీ పుట్టి పెరిగింది హాంకాంగ్‌లో. అప్పట్లో హాంకాంగ్ బ్రిటీష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది. కత్రినా తండ్రి మహ్మద్ కైఫ్ కాశ్మీర్‌కు చెందిన వ్యక్తి. దశాబ్దాలకు పూర్వమే ఆయన బ్రిటన్ వెళ్లాడు. అక్కడ సుసన అనే బ్రిటీష్ మహిళను వివాహం చేసుకున్నాడు. వాళ్ల ఏడుగురి సంతానంలో కత్రినా ఒకరు. ఆ మధ్య ఒకసారి తనను ‘హాఫ్ ఇండియన్’గా చెప్పుకుంది కత్రినా. అంజలి టెండూల్కర్ అంజలి టెండూల్కర్.. పెళ్లికి ముందు అంజలి మెహతా. వృత్తిరీత్యా డాక్టర్ అయిన అంజలి గుజరాతీ కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి గుజరాతీ వ్యాపారవేత్త. అంజలి తల్లి మాత్రం బ్రిటిషర్. వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. ఈ విధంగా అంజలిలో బ్రిటిష్ మూలాలున్నాయి. గుత్తాజ్వాలా బ్యాడ్మింటన్ గేమ్‌లో చైనా ఆధిపత్య స్థాయిలో ఉంటుంది. ఇప్పుడి ప్పుడే భారత్ నుంచి వస్తున్న బ్యాడ్మింటన్ ప్లేయర్లు చైనా ప్లేయర్లకు సవాలు విసరుతున్నారు. ఇలాంటి పోటీ ఉన్న రెండు దేశాల మూలాలను కలిగి బ్యాడ్మింటన్‌లోనే ప్రతిభను కనబరుస్తున్న షట్లర్ గుత్తాజ్వాలా. తండ్రి తెలుగు వ్యక్తి... తల్లి చైనా మహిళ. ఇలా భిన్నమైన మూలాలున్నాయి ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కి. లీసారే నటిగా, మోడల్‌గా, సామాజిక ఉద్యమకారిణిగా గుర్తింపు ఉన్న వ్యక్తి లీసారే. ప్రస్తుతానికి కొంత ప్రభ తగ్గినా గ్లామర్ ఫీల్డ్‌లో లీసారే గుర్తుండి పోతుంది. ఈమె కూడా రెండు దేశాల మూలాలున్న, మూడు దేశాలతో అనుబంధం ఉన్న వ్యక్తి. తండ్రి బెంగాలీ హిందూ, తల్లి ఒక పోలిష్ మహిళ. కెనడాలో స్థిరపడిన ఆ ఇద్దరి గారాల పట్టి లీసారే. -
దీపికపై ఓ కన్నేసిన కత్రినా
ప్రియుుడు రణబీర్‌కపూర్ తన చేతులు దాటి పోకుండా అష్టకష్టాలూ పడుతోంది సోగకళ్ల సుందరి కత్రినాకైఫ్. బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు ‘అప్డేట్’ చేసే స్టార్ హీరోరుున్ దీపికా పడుకొనేపై ఓ కన్నేసి ఉంచింది. కారణం... ప్రస్తుతం దీపిక... రణబీర్‌తో కలిసి ‘తవూషా’ చిత్రంలో నటిస్తుండటమే. బిజీ షెడ్యూల్స్ ఉన్నా వాటన్నింటినీ వారుుదా వేసుకొని మరీ షూటింగ్ స్పాట్‌లోని బాయ్‌ఫ్రెండ్ కోసం పరుగెత్తుతోంది కత్రినా. భారత్‌లో జరిగే ఈ షెడ్యూల్ ముగిసే వరకూ రణబీర్తోనే ఉంటానంటోంది.