breaking news
JUPALLY Minister Krishna
-
మాది రైతు ప్రభుత్వం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ : రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టులు చేపడుతూ.. రైతుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషిచేస్తున్న తమది రైతు ప్రభుత్వమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొల్లాపూర్‌లోని మార్కెట్ యార్డులో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డితోపాటు వైస్‌చైర్మన్, డెరైక్టర్లు మంత్రి సమక్షంలో లాంఛనంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రామచంద్రారెడ్డికి శాలువా క ప్పి మంత్రి అభినందించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు స్వయంసమృద్ధి సాధించాలని కోరారు. గ్రామాల్లో నాయకులు వాణిజ్య పంటలను సాగుచేసి, రైతులకు వాటిని పరిచయం చేయాలని సూచించారు. తెలంగాణ వచ్చాక ఒక్కో నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. గ్రామాల వారీగా చేపట్టిన పనులపై త్వరలోనే పుస్తకాలు రూపొందించి అందరికీ తెలియజేస్తామన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల తోపాటు పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసి 20 ల క్షల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కష్టపడుతుంటే.. సిగ్గులేకుండా కొందరు పనికి మాలిన వాళ్లు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ డెరైక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
అన్నికులాల పేదలకు ‘కల్యాణలక్ష్మి’
మంత్రి జూపల్లి కృష్ణారావు అయిజ : బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అన్నికులాల పేదలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తామని, వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు ఇస్తామని మంత్రి జూ పల్లి హామీఇచ్చారు.బుధవారం అయిజ నగరపంచాయతీలోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ఉత్తనూరు తిరుమలరెడ్డి ఆధ్వర్యం లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు సీ మాంధ్ర నాయకులతో జతకట్టి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అప్పట్లో కేసీఆర్ పాదయాత్ర చేస్తుంటే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 59ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆర్డీఎస్ గురించి పట్టించుకోలేదని, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటీవల మహాదీక్ష చేయడం నాటకమన్నారు. తుమ్మిల్ల లిఫ్ట్ సర్వేకు రూ.600కోట్లు మంజూరుకానున్నాయని వెల్లడించారు. ఇదితెలిసి ఆ క్రెడిట్ తాను సొంతం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ దీక్షను చేపట్టాడని, దానికి కాంగ్రెస్ పెద్దలందరూ హాజరయ్యారని, నాగం జనార్దన్‌రెడ్డి, టీడీపీ నాయకులు రేవంత్‌రెడ్డి హాజరుకావడం అనైతికమన్నారు. అంతకుముందు జెడ్పీచైర్మన్ బండారుభాస్కర్, టీఆర్ఎస్ పార్టీ గద్వాల ఇన్చార్జ్ కృష్ణమోహన్‌రెడ్డి, ఉత్తనూరు తిరుమల్‌రెడ్డి జూపల్లిని టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. నాలుగు గురుకుల పాఠశాలలు మంజూరు అలంపూర్ నియోజకవర్గానికి నాలుగు గురుకుల పాఠశాలలు మంజూరుచేస్తామన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం నూతన భవనం, జూనియర్ కళాశాల అదనపు గదుల నిర్మాణం కోసం శంకుస్థాపనచేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు రాముడు, నగరపంచాయతీ చైర్పర్సన్ రాజేశ్వరి, ఎంపీపీ సుందర్రాజు, జెడ్పీటీసీ చంద్రావతి, మాజీఎంపీ మందా జగన్నాథం, మందా శ్రీనాథ్, ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ తన గల సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.