breaking news
jc prashanth jeevan patil
-
వైటీసీ భవనాన్ని పరిశీలించిన జేసీ
మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని వైటీసీ భవనాన్ని సోమవారం జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పరిశీలించారు. భవనం పరిసరాలను తిరుగుతూ చూశారు. ఈ భవనంలో ఏర్పాటు చేసే కలెక్టర్ కార్యాలయాన్ని సూచించేలా ప్రధాన రహదారిలో బోర్డు ఏర్పాటు చేయాలని, మార్గ మధ్యలో కూడా బాణం గుర్తుతో చిన్న చిన్న బోర్డులు పెట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే దారిలో ఉన్న బావులపై జాలి ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యాలయం ఆవరణ స్థలంలో ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయాలని, భవనానికి రంగులు వేయించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత వైటీసీ భవనంలోని అన్ని గదులను తిరిగి పరిశీలించారు. భవనంలో కలెక్టర్ చాంబర్, జేసీ చాంబర్, డీఆర్ఓ, ఏఓ కార్యాలయాల పనులు జరుగుతుండగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జి.భాస్కర్‌రావు, తహసీల్దార్ కె.విజయ్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ పుల్లాదాస్ ఉన్నారు. -
జిల్లాలో 2.76 కోట్ల మెుక్కలు నాటాం
హన్మకొండ అర్బన్ : జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.76 కోట్లు నాటినట్లు జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా నుంచి జేసీ మాట్లాడుతూ జిల్లాలో 95 శాతం మొక్కలు సరై్వవల్ అయినట్లు తెలిపారు. జియో టాగింగ్ విధానం కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుత జిల్లాకు రూ.11.66 కోట్లు నిధులు అవసరమని తెలిపారు. మండల ప్రత్యేక అధికారుల ద్వారా నివేదికలు తీసుకొని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పీసీ సుధార్‌బాబు, కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, అటవీశాఖ అధికారులు రాజారావు, అధికారులు పాల్గొన్నారు.