breaking news
jawaharlal nehru national urban mission
-
కేంద్ర బస్సుల్లో ఢిల్లీకి మొండి చేయి
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) ఆధ్వర్యంలో దేశంలోని అన్ని నగరాలకు కేటాయించిన వెయ్యి బస్సులు కేటాయించినా, రాజధాని నగరానికి మాత్రం మొండిచెయ్యి చూపారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదికలు పంపని కారణంగానే ఢిల్లీకి అదనపు బస్సుల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు కేటాయించగా మిగిలిన 468 బస్సుల్లోనూ 407 బస్సును ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించారు. మిగిలిన 61 బస్సులకోసం ఇతర పట్టణాల నుంచి ఇప్పటికే కేంద్రానికి నివేదికలు అందాయి. దీంతో ఈ మారు కేటాయింపుల్లో ఢిల్లీ నగరానికి కొత్త బస్సులు వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వ పట్టణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్న ప్రకారం..ప్రభుత్వం అదనపు నిధులు కేటాయిస్తే వాటిలోంచి కొత్త బస్సులు కొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అంది నా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు అందని కారణంగానే బస్సుల కేటాయింపులో కోత పడినట్టు తెలి పారు. కొత్తగా కొనుగోలుచేసిన బస్సుల్లో లోఫ్లోర్వి గాక స్టాండర్డ్ఫ్లోర్ బస్సులే ఉన్నందునే ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదని వారు పేర్కొన్నా రు. వాస్తవానికి షీలా సర్కార్ ఆధ్వర్యంలో నగరంలోని మరికొన్ని కొత్త బస్సులు తేవాలని నిర్ణయిం చారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి రావడంతో అది సాధ్యపడలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆదిశగా ఇంకా పనులు ప్రారం భం కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. -
కమిషనర్లకు పన్ను పోటు!
ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు రెండు నెలలే గడువుంది. విశాఖ రీజియన్ మునిసిపాలిటీల్లో పన్నుల వసూలు పరిస్థితి దయనీయంగా ఉంది. ఈమేరకు వసూళ్లను వేగవంతం చేస్తూ ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. తాగునీటి పన్నులు సకాలంలో వసూలు చేయని అధికారులకు షోకాజ్‌నోటీసులు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో ఎవరి మెడకు ఉచ్చు చుట్టుకుంటుందోనని కమిషనర్లు ఆందోళన చెందుతున్నారు. నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ నగరపాలక సంస్థతో పాటు 13 మున్సిపాలిటీలున్నాయి. వీటిలో నర్సీపట్నం, యలమంచిలి, నెల్లిమర్ల, పాలకొండలు కొత్తవి. మిగి లిన సాలూరు, బొబ్బిలి, పార్వతీ పురం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాస, ఆముదాలవలస, రాజాం మున్సిపాలిటీల్లో కేంద్రం అభివృద్ధి పనులకు జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ మిషన్ (జెఎన్ఎన్యూఆర్ఎం)కింద రూ. కోట్లు మంజూరు చేసేది. వీటితో పట్టణాల్లో మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పనకు వీలుపడేది. ప్రస్తుతం కేంద్రం నిబంధనలతో సగానికి పైగా ఈ నిధుల్లో కోత పడింది. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే రాష్ట్రం ప్రత్యేక నిధులు కేటాయించడం లేదా పట్టణాల్లో నివశించే ప్రజల నుంచి పూర్తిస్థాయిలో పన్నులను వసూలు చేయడం తప్పనిసరయింది. ఈ నేపథ్యంలో పట్టణ వాసుల నుంచి ప్రధానంగా ఆస్తి, తాగునీటి పన్ను వసూలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గతంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి హెచ్చరికలు జారీచేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. అయినా మార్పు రాలేదు. రాష్ట్రంలోని మిగిలిన వాటితో పోలిస్తే విశాఖ రీజియన్‌లో ఈ వసూళ్లు 15 శాతానికి మించలేదు. మొత్తం డిమాండ్ రూ. 7 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 1.09 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ప్రధానంగా కొత్త మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో తాగునీరు అందించలేకపోవడంతో పాటు మరికొన్నింటిలో చార్జీలు పెంచడంతో వసూళ్లు మందగించడానికి ప్రధాన కారణం. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తిగా పన్నులు వసూలు చేయకుంటే సంబంధిత కమిషనర్లకు షోకాజ్ నోటీసు జారీచేసి, వారిపై తగు చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో కమిషనర్లు తలలు పట్టుకుంటున్నారు. పన్ను వసూలు కాకపోతే తామేం చేస్తామంటూ ఆవేదన చెందుతున్నారు.