విజయనగరం వెళుతున్న జవాన్లకు గాయాలు
నల్గొండ: కేంద్ర బలగాలతో వెళుతున్న మినీవ్యాన్ నల్లగొండ జిల్లా ఇనుపాముల స్టేజీ వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వ్యాన్లో మొత్తం 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా వ్యాన్ ప్రమాదానికి గురయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
విజయనగరంలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అక్కడికి అదనపు బలగాలు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళుతున్న మినీ వ్యాన్ నల్లగొండ జిల్లాలో ప్రమాదానికి గురయింది. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం మహోధృతంగా సాగుతుండడంతో విజయనగంలో కర్ఫ్యూ విధించారు.