indian education
-
భారతీయ విద్య భేష్
సాక్షి, న్యూఢిల్లీ: మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో విద్యా వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యంగా గత పదేళ్ల ఎన్డీఏ హయాంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంవల్ల గ్రామస్థాయి నుంచి దేశ రాజధాని వరకు ఈ పురోగతి సాధ్యమైనట్లు తెలిపింది.స్వాతంత్య్రం వచ్చే సమయానికి 0.4 శాతంగా ఉన్న ‘గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో’ (జీఈఆర్).. 2021–22 నాటికి ఏకంగా 71 రెట్ల పెరుగుదలతో 28.4 శాతానికి చేరినట్లు తెలిపింది. ఇక క్యూఎస్ (క్వాక్వారెల్లి సైమండ్స్) వరల్డ్ ర్యాంకింగ్స్‌తో దీనిని పోల్చుకుంటే భారత విద్యా వ్యవస్థ 318 శాతం పెరుగుదలను నమోదు చేసిందని, ఇది జీ–20 దేశాల్లోనే అత్యధిక వృద్ధి, పురోగతి అని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.ఎస్‌పీయూల ద్వారా 3.25 కోట్ల మందికి విద్య..దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యను విస్తరించడం, అందించడంపై ‘నీతి ఆయోగ్’ ఫిబ్రవరి 10న ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో.. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలు (ఎస్పీయూ) 3.25 కోట్ల మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వివరించింది. నిజానికి.. 1857లో కలకత్తా, ముంబై, మద్రాసులలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించినప్పటి నుంచి దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థ గణనీయంగా విస్తరించింది.1947లో స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అప్పట్లో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల హాజరు నమోదు కేవలం 14 శాతం ఉండడంతో ఆ రోజుల్లో విద్యా వ్యవస్థ ఆందోâýæనకరంగా ఉండేది. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వాల చర్యల కారణంగా విద్యా రంగం చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి సాధించింది. దీంతో ప్రస్తుతం విద్యార్థుల హాజరు నమోదు 81 శాతానికి పెరిగినట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.ఎస్‌పీయూల ద్వారా పురోగతి..ఎస్‌పీయూల ద్వారా దేశంలో విద్య అత్యధిక పురోగతి సాధించిందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2011–12లో వీటిల్లో 2.34 కోట్ల మంది విద్యార్థులుండగా.. 2021–22 నాటికి అది 3.24 కోట్లకు చేరుకుందని తెలిపింది. వీరిలో ఓబీసీలు 80.9 శాతం మంది, ఎస్సీలు 76.3% మంది ఉన్నారు. అలాగే, ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 16 లక్షల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 68% మంది లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.రీడర్లు/అసోసియేట్ ప్రొఫెసర్లు 10 శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు.. ప్రపంచస్థాయి పరిశోధనలకు ప్రభుత్వాల సహకారం కూడా గణనీయంగా పెరిగింది. 2017లో 3.5%ఉండగా.. 2024లో 5.2 శాతానికి పెరిగింది. ఇక 2035 నాటికి 50 శాతం ‘గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో’ (జీఈఆర్) లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం’ అని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. -
అందరికీ సమాన విద్యనందించాలి
అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ నల్లగొండలో అట్టహాసంగా డీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు ప్రారంభం తరలివచ్చిన 31 జిల్లాల ఉపాధ్యాయులు నల్లగొండ టూటౌన్ : ప్రభుత్వాలు కుల, మత, వర్గాలకు అతీతంగా అసమానతలు లేని విద్యనందించాలని అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ అధ్యక్షుడు, ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ కోరారు. శనివారం నల్లగొండలోని శివాంజనేయ గార్డెన్లో జరిగిన డీటీఎఫ్ (డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్) 4వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహా సభలకు ముఖ్య అతిథిగా హాజ రైన ఆయన డీటీఎఫ్ జెండాను, సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరి గిన సభలో ఆయన ప్రసంగిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలన్నారు. విద్యలో మార్పు లు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, కాషారుుకరణను, ప్రైవేటీకరణను, కార్పొరేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. అన్ని వర్గాలకు సమానమైన, నాణ్యమైన విద్య అందించాలంటే కామన్ స్కూల్ ద్వారానే సాధ్యమన్నారు. ఉపాధ్యాయులు హక్కుల కోసం పోరాడుతూనే విద్యా వ్యవస్థపై కూడా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. బాధ్యతగా వ్యవహరించాలి : ఎంపీ ఉపాధ్యాయులు హక్కులు అడగడంతో పాటు బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. డిండి, చందంపేట లాంటి ప్రాంతాల్లో 50 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం కొత్త విద్యా పాలసీకి సలహాలు అడగగా పం పించామన్నారు. సీపీఎస్ రద్దు నెరవేరని కోరికని, ఇది కేంద్రం పరిధిలోనిదన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సహకారాలు అందిస్తామని తెలిపారు. సామాజిక ప్రగతికి విద్య అవసరం సామాజిక ప్రగతికి విద్య ఎంతో అవసరమని, మూడు దశాబ్దాలుగా డీటీఎఫ్ అనేక పోరాటాలు నిర్వహించిందని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రఘుశంకర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం విద్యారంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కామన్ స్కూల్ విధానం ఏర్పాటు చేయడంలేదన్నారు. సమానవిద్య, నాణ్యమైన విద్య అందించాల్సి ఉందన్నారు. విద్య కాషాయీకరణ, వ్యాపారీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రేషనలైజేషన్ ద్వారా పాఠశాలల మూసివేత సరైంది కాదన్నారు. 11 అంశాలపై ఈ మహా సభలలో చర్చ జరుగుతుందని తెలిపారు. సీపీఎస్ విదానం వల్ల రాష్ట్రంలో 1 లక్షా 16 వేల మంది ఉపాధ్యాయులు తీవ్రమైన క్షోభకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధం గా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు నోముల సత్యనారాయణ, డీటీఎఫ్ నేతలు రాఘవాచారితో పాటు పలువురు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.క్రిష్టప్ప, అధ్యాపక జ్వాల సంపాదకులు ఎం. గంగాధర్, డీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సోమయ్య, వెంకట్రాములు, శంతన్, పద్మలత, కార్యదర్శులు సామ్యూల్, రాజిరెడ్డి, లింగారెడ్డి, ఎస్. భాస్కర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల అధ్యక్షులు ఎస్. విద్యాసాగర్‌రెడ్డి, ఎం. దశరథరామారావు, భాస్కర్, ప్రధాన కార్యదర్శులు వెంకులు, లింగయ్య, సత్త య్య, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్ నారాయణగౌడ్ పాల్గొన్నారు. -
దేశంలో విద్యా విధానాన్ని సంస్కరించాలి: వెంకయ్య
నెల్లూరు : దేశంలో విద్యావిధానాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేలా విద్యా విధానం ఉండాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కలసి పాల్గొన్నారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ... దేశంలో గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. ఏపీ విద్యుత్ రంగంలో వినూత్న మార్పులు తీసుకోస్తామని గోయల్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.