breaking news
increase in seats
-
జోసాలో సీట్ల జోష్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) సంస్థల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటితోపాటు 2025–26 విద్యా సంవత్సరానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో నడిచే గ్రాడ్యుయేట్ ఫీల్డ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్‌టీఐ)లలో 62,853 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు కొత్త కోర్సులను పరిచయం చేస్తూ అవకాశాలను మరింత మెరుగుపరుస్తోంది. దీంతో గత ఏడాదితో పోలిస్తే 2916 సీట్లు పెరిగాయి.జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీలు ట్రిపుల్‌ఐటీలు, జీఎఫ్‌టీఐ లకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్‌ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య గత సంవత్సరం కంటే 4.86 శాతం పెరుగుదలను ప్రతిబింబించింది. ఐఐటీల్లో నిరుడు 17,760 సీట్లు ఉండగా తాజాగా 400 పెరిగాయి. ఎన్ఐటీల్లో 296 కొత్త సీట్లను చేర్చారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీల్లో అత్యధికంగా 1,394 సీట్లు అందుబాటులోకి రావడం విశేషం.జీఎఫ్టీఐలలో 826 సీట్లు పెరిగాయి. ఈ నెల 3 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు చేపట్టింది. 11 వరకు ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం రెండుసార్లు మాక్ సీట్ ప్రక్రియ నిర్వహిస్తారు. మాక్ సీట్ అలాట్మెంట్ ఆధారంగా ర్యాంకు ప్రకారం ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. మాక్ సీట్–1 కేటాయింపు జాబితాను జూన్ 9న, మాక్ సీట్–2 కేటాయింపు జాబితాను జూన్ 11న ప్రకటిస్తారు. జోసా–2025లో భాగంగా అకడమిక్ ప్రోగ్రామ్స్ కోసం అభ్యర్థుల నమోదు, ఆప్షన్ల ప్రక్రియ జూన్ 12తో ముగుస్తుంది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో 127 విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి. జూన్ 14 నుంచి జూలై 16 వరకు ఆరు విడతల్లో సీట్లు కేటాయింపు జరుగనుంది.62 శాతం సీట్లు పెరుగుదలదేశంలో 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలతో పాటు 47 జీఎఫ్‌టీఐలు, ఇతర సంస్థలు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కొన్నేళ్లుగా ఐఐ టీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. 2019కి ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండేది. ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య కోసం విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చుచేసి చదువుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సాంకేతిక విద్యను మెరుగుపరిచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా ఏటా సీట్ల సంఖ్యను పెంచుతున్నారు. దీంతో 2019లో 38,704 సీట్లు ఉండగా.. ఇప్పుడు 62,853కు చేరాయి. అంటే ఆరేళ్లలో 24,149 సీట్లు (62 శాతం) పెరిగాయి. గతంలో డీపీ సింగ్ నివేదిక మేరకు 2024 నాటికి 50 శాతం సీట్ల పెంపు లక్ష్యాన్ని నెరవేర్చింది.ఐఐటీల్లో మరింత..ఐఐటీల్లో దశలవారీగా వచ్చే ఐదేళ్లలో మరో 6,500 సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం 18,160 సీట్లు ఉండగా.. అవి 24 వేలు కానున్నాయి. కొత్త తరం ఐఐటీలైన తిరుపతి, ధార్వాడ్, పాలక్కాడ్, జమ్ము, భిలాయ్‌లో ఏటా 200కు పైగా కొత్త యూజీ సీట్లను పెంచుకునేలా చర్యలు చేపట్టింది. ఇలా ఏడాదికి దాదాపు 1,500 సీట్లు పెరగనున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో 3,424ఏపీ, తెలంగాణలో జోసా ద్వారా 3,424 సీట్లను భర్తీ చేయనుంది. నిరుడు 3,384 ఉండగా 40 సీట్లు పెరిగాయి. హైదరాబాద్ ఐఐటీలో 630, తిరుపతి ఐఐటీలో 254, వరంగల్ నిట్‌లో 1049, తాడేపల్లిగూడెం నిట్‌లో480, స్పా విజయవాడలో 132, హైద్రాబాద్ సెంట్రల్ వర్సిటీలో 110, శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీలో 438, కర్నూలు ట్రిపుల్ ఐటీలో 331 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లో 35 సీట్లు పెరిగాయి. నిరుడు నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సును 10 సీట్లతో అందుబాటులోకి తేగా ఇప్పుడు 35కి పెంచారు. -
సీట్లొచ్చినా.. చేరేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీట్ల పెంపును ప్రభుత్వం అడ్డుకుంటే, కాలేజీలే సీట్లు భర్తీ చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. క్లాసులు కూడా మొదలయ్యాయి. విద్యార్థులంతా ఇంజనీరింగ్, డిగ్రీ, లేదా ఇతర రాష్ట్రాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు.ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో పెరిగే దాదాపు 3 వేల సీట్లు ఎలా భర్తీ అవుతాయనేది అర్థం కావడం లేదు. కోర్టు తీర్పు రాగానే ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాయి. ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుంటున్నాయి. విద్యాజ్యోతి కాలేజీలో 120 సీట్లు పెరిగితే 15 మంది స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరారు. మిగతా మూడు కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత మేర జరిగాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీట్ల పెంపును అడ్డుకునేందుకు ప్రభుత్వం.. ఎలాగైనా సీట్లు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలు న్యాయపోరాటానికీ వెనుకాడటం లేదు.వచ్చే ఏడాదిపైనే ఆశడిమాండ్ లేని ఇతర కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ప్రైవేటు కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. అనుమతులూ తెచ్చుకున్నాయి. దీనికి ప్రభుత్వం ససేమిరా అనడం, వివాదం కోర్టు మెట్లెక్కడం తెలిసిందే. ఆలస్యంగా తీర్పు వచ్చినా ప్రైవేటు కాలేజీలు సీట్లపై ఎందుకు ఆసక్తి చూపుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయి. కాలేజీలు ఈ సంవత్సరాన్నే దృష్టిలో పెట్టుకోలేదు.ఇప్పుడు సీట్లు పెరిగితే, వచ్చే ఏడాదీ ఇది కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రవేశాలు కాకున్నా, కంప్యూటర్ సీట్లు కావడం వల్ల వచ్చే ఏడాది అన్నీ భర్తీ అయ్యే వీలుంది. ఒక్కో బ్రాంచీలో 120 సీట్లు ఉంటే, మేనేజ్మెంట్ కోటా కింద దాదాపు 33 సీట్లు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక్కో సీటు రూ.16 లక్షలపైనే పలుకుతుంది. డిప్లొమా కోర్సుల ద్వారా రెండో ఏడాదిలోనూ ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారు. ఇందులోనూ మేనేజ్మెంట్ కోటా సీట్లు పెంచుకునే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి కాలేజీలు సిద్ధపడుతున్నాయి.ప్రభుత్వం పట్టుదల ఎందుకు?హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే స్పాట్ ద్వారా చేరిన విద్యార్థులకు ఇబ్బంది తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. సీట్ల పెంపును అడ్డుకోవడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేటు కాలేజీలపై నియంత్రణ దిశగా వెళ్లాలనుకుంటున్న ప్రభుత్వానికి ఈ విషయం కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సీట్ల పెంపును అనుమతిస్తే, భవిష్యత్‌లో ప్రతీ కాలేజీ సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకునే ప్రమాదం ఉందని, సీఎస్ఈ దాని అనుబంధ కోర్సులే ఉండే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకూ పోరాడుతోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.ఇది ప్రభుత్వం కక్షేమౌలిక వసతులన్నీ ఉండటం వల్లే సీట్ల పెంపును కోరాం. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ అనుమతించింది. కోర్టు కూడా పెంచుకోవచ్చని తెలిపింది. అయినా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. విద్యారంగంలోకి రాజకీయాలను తీసుకురావడం మంచిది కాదు. సీఎస్ఈ సీట్ల కోసం విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సీట్లు లేకుండా చేయడం సమంజసం కాదు. - సూర్యదేవర నీలిమ (ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకురాలు) -
అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే!
-
అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే!
అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ అందింది గానీ.. ఇప్పట్లో సీట్లు పెంచే అవకాశం ఏ రాష్ట్రంలోనూ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణం ప్రకారం, 2026 జనాభా లెక్కలు వచ్చేంత వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ సీట్లు పెంచడం సాధ్యం కాదని తెలిపింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ వివరాలు తెలిపింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై పెట్టుకున్న ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది.