breaking news
IAS son
-
ఆరో అంతస్తునుంచి దూకి ఐఏఎస్ కుమారుడు ఆత్మహత్య
IAS Officer son committed suicide న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువకుడు తల్లిదండ్రులులేని సమయంలో 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగువారు హుటాహుటీనా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన యువకుడు చికిత్స సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి 8 గంటల 30 నిముషాలకు చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు. మృతి చెందిన బాలుడు (15) మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, గత సెప్టెంబర్ నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో తల్లిదండ్రులు ఎవ్వరూ ఇంట్లో లేరని, ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉందని, ఈ రోజుల్లో ప్రతి చిన్న కారణానికి యువత ప్రాణాలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా పోలీసధికారి ఒకరు తెలిపారు. చదవండి: New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది! -
మెడికల్కలం
అనంతపురం మెడికల్ : అనంతపురం వైద్య కళాశాలలో ర్యాగింగ్ వికృత చర్యలు పరాకాష్టకు చేరాయి. 15 రోజుల క్రితం ఒక ఏఎస్ఐ కుమారుడు తాగిన మత్తులో జూనియర్లపై వికృత చర్యలకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం జరిగిన మరో ఘటనలో జూనియర్ల దుస్తులు విప్పించి నృత్యం చేయించిన వ్యవహారం కలకలం రేపింది. ఈ రెండు సంఘటనలతో వైద్య కళాశాల పరువు బజారునపడింది. సీనియర్ల చర్యలతో జూనియర్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమను ఏ విధంగా ర్యాగింగ్ చేసిందీ బాధితులు శనివారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సభ్యులకు వివరించారు. 15 రోజుల క్రితం... వైద్య కళాశాలలో ఒక సీనియర్ విద్యార్థి (ఏఎస్ఐ కుమారుడు) తప్పతాగి జూనియర్ విద్యార్థులను ఒక గదిలోకి పిలిపించి వారి ప్యాంట్లు విప్పించాడు. అందరినీ వరుసగా నిల్చోబెట్టి వారి పిరుదులపై ఈత దబ్బలతో కొట్టి, అలాగే నృత్యం చేయించాడు. అరికాలిలో ఆనె ఆపరేషన్ చేయించుకున్న విద్యార్థిని కూడా వదల్లేదు. ఈత దబ్బ దెబ్బలు తట్టుకోలేక అరికాలులో ఆపరేషన్ జరిగిన ప్రదేశం నుంచి రక్తం కారుతున్నా బాధను అనుభవిస్తూ నృత్యం చేశాడు. ఈ విషయం బయటికి చెబితే మీరే ఇబ్బంది పడతారని, మా నాన్న డీఎస్పీ అని, సెల్‌ఫోన్ దొంగతనం చేశారని కేసులు పెట్టిస్తానని సీనియర్ విద్యార్థి భయపెట్టాడు. అంతే కాకుండా హాస్టల్ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇదే తరహాలో బెదిరించాడు. ఈ విషయాన్ని అప్పట్లోనే సర్వజనాస్పత్రి అధికారుల దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అయితే విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తపడిన అధికారులు ర్యాగింగ్ చేసిన విద్యార్థిని పిలిపించి మందలించి పంపించే సినట్లు తెలిసింది. మరో అకృత్యం.. నలుగురు సీనియర్ విద్యార్థులు చిత్తుగా తాగేసి బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో జూనియర్ విద్యార్థుల గదులకు వెళ్లి వారి బట్టలు విప్పించి నృతం చేయించారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు ఎలా వేదించినదీ గురువారం ఉదయం అధికారుల దృష్టికి బాధిత విద్యార్థులు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. అయితే ర్యాగింగ్ చేసిన విద్యార్థుల వివరాలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులకు కమిటీ ఫిర్యాదు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నీరజ శనివారం తన చాంబర్లో ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సభ్యులైన ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, చిట్టినరసమ్మ, మహేశ్, మధు, నాగరాజు, రాధిక, వరలక్ష్మిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్ ఘటనపై సమావేశంలో టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన బాధిత విద్యార్థులను విచారించారు. ఆ సందర్భంలోనే 15 రోజుల క్రితం జరిగిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. రెండు సార్లు జరిగిన ఘటనల గురించి సీఐకి బాధిత విద్యార్థులు వివరించారు. దీంతో వారి స్టేట్మెంట్ని ఆయన రికార్డు చేశారు. బుధవారం రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులను విచారించి వేర్వేరుగా వారి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఆ తరువాత ప్రిన్సిపాల్ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఘటనకు బాధ్యులైన నలుగురు సీనియర్ విద్యార్థులను ప్రిన్సిపాల్ చాంబర్‌కు పిలిపించి విచారించారు. ఆ రోజు వారు ఏమి చేశారో లిఖితపూర్వకంగా తీసుకున్నారు. అందరి స్టేట్మెంట్లు రికార్డు చేశామని, వాటి ఆధారంగా సమగ్ర విచారణ చేస్తామని ఆయన తెలిపారు. ప్రిన్సిపాల్‌ని అడ్డగించిన విద్యార్థులు సమావేశం ముగించుకుని తన చాంబర్ నుంచి బయటకు వస్తున్న ప్రిన్సిపాల్ నీరజను సీనియర్ విద్యార్థులు అడ్డగించారు. అందరూ అనుకుంటున్నట్లు ర్యాగింగ్ చేయలేదని చెప్పారు. ఈ అంశాన్ని ఇంత సీరియస్‌గా తీసుకోవడం ఏమిటిని ప్రశ్నించారు. దీనిపై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పోలీసులు విచారణ చే సి వాస్తవాలు నిర్ధారిస్తారని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ హౌస్సర్జన్ల అరెస్టు వైద్య కళాశాలలో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడ్డ హౌస్‌సర్జన్లను శనివారం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. హౌస్సర్జన్లు వెంకటరాముడు, నరేంద్ర, లక్ష్మణ్, మల్లికార్జున్‌పై ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి వెల్లడించారు.