breaking news
Hindustan Aeronautical
-
తేజస్ యుద్ధ విమానంలో హైదరాబాద్ ‘మార్క్’1ఏ
శంషాబాద్: భారతదేశం అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానంలో ప్రధాన భాగాన్ని (సెంట్రల్ ఫ్యూస్లేజ్) పూర్తి దేశీయ పరిజ్ఞానంతో వెమ్ టెక్నాలజీ సంస్థ తయారు చేసింది. దీనికి ‘మార్క్1ఏ’గా నామకరణం చేసింది. రక్షణ రంగంలోని వివిధ పరికరాల తయారీలో పేరుగాంచిన ఈ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో తొలుత అభివృద్ధి భాగస్వామిగా సెంట్రల్ ఫ్యూస్లేజ్ (సీఎఫ్)ను తయారుచేసి సక్సెస్ కావడంతో ఉత్పత్తి భాగస్వామిగా మారింది. 3 నెలల్లో తొలి సీఎఫ్ విజయవంతంగా పూర్తి చేసి హెచ్ఏఎల్కు అందించేందుకు సిద్ధమైంది. యుద్ధవిమానంలోని సీఎఫ్‌ను తయారుచేసిన దేశీయ మొదటి ప్రైవేటు సంస్థగా ఇది నిలిచింది.ఏమిటి సీఎఫ్? డెల్టావింగ్ కలిగి ఒకే ఇంజిన్‌తో పనిచేసే తేజస్ మల్టిరోల్ లైట్ కాంబాట్ యుద్ధవిమానాన్ని హెచ్ఏఎల్ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్ ఫ్యూస్లేజ్ అంటే పైలట్ కూర్చునే భాగం, రియర్ ఫ్యూస్లేజ్ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్ ఫ్యూస్లేజ్ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్ కూడా ఉంటుంది. ఏమిటి సీఎఫ్? డెల్టావింగ్ కలిగి ఒకే ఇంజిన్‌తో పనిచేసే తేజస్ మల్టిరోల్ లైట్ కాంబాట్ యుద్ధవిమానాన్ని హెచ్ఏఎల్ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్ ఫ్యూస్లేజ్ అంటే పైలట్ కూర్చునే భాగం, రియర్ ఫ్యూస్లేజ్ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్ ఫ్యూస్లేజ్ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్ కూడా ఉంటుంది. నెలకు ఒకటి తయారీ హెచ్ఏఎల్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన బృందంతో 3 నెలల్లో తొలి సీఎఫ్ తయారు చేశాం. వివిధ దశల్లో హెచ్ఏఎల్ క్లియరెన్స్‌తో దీనిని పూర్తి చేశాం. ఇకపై నెలకొకటి చొప్పున అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. హెచ్ఏఎల్ పర్యవేక్షణతో వారి క్లియరెన్స్‌తో వీటి తయారీ జరుగుతుంది. ప్రస్తుతం 20 సీఎఫ్‌ల తయారీకి హెచ్ఏఎల్ అనుమతినిచ్చింది. – సీహెచ్‌వీ రామారావు, జీఎం, వెమ్ టెక్నాలజీహైదరాబాద్లో... హైదరాబాద్‌లోని వెమ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ సీఎఫ్ తయారీలో 25 మంది ఇంజనీర్లు, 35 మంది టెక్నీషియన్ల బృందం పాల్గొంది. దీనికోసం మొత్తం 1,595 కాంపోనెంట్స్ వాడారు. వివిధ భాగాలను అనుసంధానించేందుకు సంస్థలో జిగ్ (పరికరాలను బిగించే ప్రాంతం) ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సంస్థలో రెండు జిగ్లున్నాయి. వెమ్ టెక్నాలజీ సంస్థ తన తొలి సీఎఫ్ మార్క్1ఏ ను శుక్రవారం హెచ్ఏఎల్కు అప్పగించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి సంజీవ్‌కుమార్, హెచ్ఏఎల్ సీఎండీ డాక్టర్ డీకే సునీల్, హెచ్ఏఎల్ డైరెక్టర్ కె.రవి హాజరు కానున్నారు. -
ఎస్సెల్ ప్రొప్యాక్ జూమ్- హెచ్ఏఎల్ స్కిడ్
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇటీవల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించిన నేపథ్యంలో నేలచూపులతో కదులుతున్న ఇంజినీరింగ్ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎస్సెల్ ప్రొప్యాక్ లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్ఏఎల్ షేరు నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఎస్సెల్ ప్రొప్యాక్ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించాక మరింత జోరందుకున్న ఎస్పెల్ ప్రొప్యాక్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 306ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం లాభంతో రూ. 285 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి తొలి రెండు గంటల ట్రేడింగ్‌లోనే 4 లక్షల షేర్లు ఈ కౌంటర్లో చేతులు మారాయి. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం విశేషం! క్యూ1లో ఎస్సెల్ ప్రొ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 46 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 18 శాతం పుంజుకుని రూ. 741 కోట్లను తాకింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ వరుసగా నాలుగో రోజు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 898 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం పతనమై రూ. 871 వరకూ నీరసించింది. గత నాలుగు రోజుల్లోనే ఈ షేరు 26 శాతం నష్టపోయింది. గత గురువారం(27న) కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ ద్వారా 14.82 శాతం వాటాకు సమానమైన 49.56 మిలియన్ ఈక్విటీ షేర్లను విక్రయించిన విషయం విదితమే. ఇందుకు ఫ్లోర్ ప్రైస్‌ను రూ. 1001గా అమలు చేసింది. తద్వారా కంపెనీలో వాటాను 89.97 శాతం నుంచి 75.15 శాతానికి తగ్గించుకుంది. అయితే ఫ్లోర్ ప్రైస్ కంటే దిగువకు తాజాగా షేరు క్షీణించినప్పటికీ గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 60 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
దేశీయ క్షిపణుల ఎగుమతి
బెంగళూరులో హెచ్టీటీని పరీక్షించిన మంత్రి పరీకర్ సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ నిబంధనలను అనుసరించి.. దేశీయంగా తయారయ్యే క్షిపణుల్లో 10 శాతం మిత్రదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వెల్లడించారు. ఇందుకోసం ఉత్పత్తి సంస్థలకు అనుమతిచ్చినట్లు ఆయన తెలిపారు. పెలైట్లకు ప్రాథమిక స్థాయి శిక్షణ అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘హిందుస్థాన్ టర్బోప్రోప్ ట్రైనర్ (హెచ్‌టీటీ-40)’ సామర్థ్యాన్ని శుక్రవారం మంత్రి పరిశీలించారు. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా క్షిపణుల ఉత్పత్తి జరుగుతోందన్నారు. పెండింగ్‌లో ఉన్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై రెండున్నర నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశీయ నిఘా వ్యవస్థను బలోపేతం చేయటం వల్ల చొరబాట్లు తగ్గటంతోపాటు ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారన్న దానిపై స్పష్టమైన సమాచారం అందుతోందన్నారు. అందువల్లే ఉగ్రవాదుల ఎన్కౌంటర్లు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.