breaking news
highest run
-
టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా?
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐదో టెస్టులో భారత్ తమ విజయానికి తొమ్మిది వికెట్ల దూరంలో నిలవగా.. ఇంగ్లండ్ గెలుపునకు ఇంకా 324 పరుగులు కావాలి. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది.దాదాపు నాలుగో రోజు ఆటలో ఫలితం తేలే అవకాశముంది. ఎలాగైనా ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి సిరీస్‌ను సమంతో ముగించాలని భారత పట్టుదలతో ఉంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం స్కోర్ ఛేజ్ చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో విజయవంతమైన రన్ఛేజ్లపై ఓ లుక్కేద్దాం. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో 1880లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. 145 సంవత్సరాల ఈ మైదానం చరిత్రలో 300 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఒక్కసారి కూడా ఛేదించలేదు.ఇంగ్లండ్ చరిత్రను తిరగరాస్తుందా?ఈ మైదానంలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1902లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 263 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 141 ఆధిక్యం లభిస్తోంది.అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో పర్యాటక ఆసీస్ జట్టు కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపునకుని ఇంగ్లండ్ ముందు కంగారులు 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. ఈ టార్గెట్‌ను ఇంగ్లండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి చేధించింది.ఆ తర్వాత ఓవల్‌లో రెండవ అత్యధిక రన్ చేజ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. విండీస్‌లో 1963లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 252 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.అనంతరం 1972లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 242 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇది ఓవల్ మైదానంలో మూడో అత్యంత విజయవంతమైన రన్ చేజ్‌గా నిలిచింది.ఈ మైదానంలో చివరగా 2024లో శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌పై 219 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసింది. ఇది ఓవల్‌లో ఐదో అత్యంత విజయవంతమైన రన్ చేజ్‌గా నిలిచింది. ఇప్పుడు భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తే 123 ఏళ్ల చరిత్రను తిరగరాస్తుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జడేజా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
‘రికార్డు’ ఊరిస్తోంది!
సాక్షి క్రీడావిభాగం: ఆధునిక క్రికెట్లో ఆస్ట్రేలియాలా హవా కొనసాగించిన జట్టు మరొకటి లేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు రికార్డులన్నింటినీ అధిగమించిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత సాధారణ జట్టుగా మారిపోయింది. ప్రతి జట్టుకూ ఓ సీజన్ ఉంటుంది. ప్రస్తుతం భారత వన్డే జట్టుకు కూడా అలాంటి సీజనే నడుస్తోంది. వరుసగా ఆరు సిరీస్‌లు గెలచుకున్న ధోనిసేన... గతంలో ఏ భారత జట్టూ సాధించని ఘనతపై కన్నేసింది. ప్రపంచ క్రికెట్లో వరుసగా ఆరు సిరీస్‌లు గెలిచిన జట్లు అనేకం ఉన్నాయి. 2008-09 సీజన్లో కూడా భారత్ ఆరు సిరీస్‌లు గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు ధోనిసేనకు మంచి అవకాశం దొరికింది. గెలవగలమా? నిజానికి దక్షిణాఫ్రికాను అభేద్యమైన జట్టని చెప్పలేం. ముఖ్యంగా వన్డేల్లో ఇటీవల స్వదేశంలో ఆ జట్టు పాకిస్థాన్ చేతిలో సిరీస్ కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌ను మిస్బాసేన 2-1తో గెలిచింది. సఫారీలు గెలిచిన చివరి వన్డేలోనూ కష్టపడ్డారు. కాబట్టి దక్షిణాఫ్రికా ఫామ్ లేమి ధోనిసేనలో ఆత్మవిశ్వాసం పెంచే అవకాశం ఉంది. పైగా గత కొంత కాలంగా భారత వన్డే జట్టు తిరుగు లేకుండా కనిపిస్తోంది. స్వదేశంలో విజయాల సంగతి పక్కన పెట్టినా...ఇంగ్లండ్‌లో చాంపియన్స్ ట్రోఫీలో సాధించిన విజయం భారత్ సత్తా ఏపాటిదో చూపిస్తోంది. ఆ టోర్నీలో ప్రతీ జట్టు ఏదో ఒక దశలో కొంత ఇబ్బంది పడ్డట్లు కనిపించినా...మన టీమ్ మాత్రం అజేయంగా దూసుకుపోయింది. ప్రస్తుత ఆటగాళ్లు కూడా ఫామ్‌లో ఉండటంతో ఏ సవాల్‌కైనా సిద్ధమే అనే పట్టుదల అందరిలోనూ కనిపిస్తోంది. బౌలింగ్ ఓకేనా! ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత బౌలర్ల ప్రదర్శన చూస్తే ఒక రకమైన జాలి కలిగింది. పిచ్‌లు, నిబంధనల కారణంగా అంతా బ్యాట్స్మెన్మయంగా మారిపోయిన ఆటలో తమ సహజ ప్రతిభను కూడా ప్రదర్శించే అవకాశం వారికి దక్కలేదు. అయితే దక్షిణాఫ్రికాలో అలా ఉండే అవకాశం లేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వికెట్లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మన పేసర్లు కూడా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేయగల సమర్థులు. చాంపియన్స్ ట్రోఫీలో భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన ఈ సిరీస్‌లో ఆశలు పెంచుతోంది. ఇటీవలి ప్రదర్శనను కాస్త పక్కన పెడితే...వికెట్‌పై బౌన్స్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో ఇషాంత్, ఉమేశ్ సమర్థులు. ప్రత్యామ్నాయంగా షమీ కూడా స్వింగ్ బౌలర్‌గా రాణించగలడు. ‘మేం పూర్తిగా బౌన్సీ, బౌలింగ్‌కు అనుకూలమైన వికెట్లు తయారు చేస్తే అది మాకూ వ్యతిరేకంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితులను భారత బౌలర్లు కూడా బాగా ఉపయోగించుకోగలరు’ అని దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన చేసిన హెచ్చరిక మన జట్టు బౌలింగ్ బలం గురించి కూడా అన్యాపదేశంగా చెబుతోంది. 2002-04 సీజన్లలో కలిపి ఆస్ట్రేలియా వరుసగా పది సిరీస్ విజయాలు సాధించింది. అలాగే 2009-10లో కూడా వరుసగా 9 సిరీస్‌లలో గెలిచింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా వరుసగా ఆరు సిరీస్‌లు గెలిచాయి. ఉపఖండంలా స్కోర్లు ఉండవు! వన్డేల్లో నిబంధనల మార్పుతో సొంతగడ్డపై బౌలర్లను చితక్కొట్టి ఇటీవల భారత్ పరుగుల ప్రవాహం పారించింది. మన బ్యాట్స్‌మెన్ కారణంగానే వరుసగా సిరీస్‌లు గెలిచాం. అయితే ఇక్కడి తరహాలో దక్షిణాఫ్రికాలో భారీ స్కోర్లకు పెద్దగా అవకాశం లేదు. గత రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో భారత్ అత్యధిక స్కోరు 50 ఓవర్లలో 279/5 (2001లో) మాత్రమే. ఇటీవల సఫారీలతో జరిగిన పాక్ సిరీస్‌లో కూడా ఇదే కనిపించింది. కాబట్టి 260-275 పరుగులు సాధిస్తే దానిని మెరుగైన స్కోరుగానే చెప్పవచ్చు. ఇక్కడి తరహాలో ఆటగాళ్లు ఏకధాటిగా దూకుడుకు పోకుండా నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. మన మిడిలార్డర్ సత్తా బయట పడేది ఇక్కడే. సెంచరీల హోరుకు అవకాశం తక్కువగా ఉండే చోట...జట్టులో కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.