health card scheme
-
మరో 2 నెలలు మెడికల్ రీయింబర్స్మెంట్
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పథకం ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రానందున మరో 2 నెలల (ఫిబ్రవరి ఆఖరు వరకు) మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం జీవో జారీ చేసింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తోపాటు హెల్త్ కార్డుల పథకమూ అమల్లో ఉంటుందని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ జీవోలోని ఇతర ముఖ్యాంశాలు.. * ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖలతో చర్చించి అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి. * కార్పొరేట్ ఆసుపత్రులు, ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులపై ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్యం అందేలా ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖలు, ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్యలు తీసుకోవాలి. మెడికల్ డెరైక్టర్‌తో కలసి ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాలతో ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్చించాలి. * ఉద్యోగ సంఘాల నుంచి మరిన్ని వివరాలు, ఫిర్యాదులు స్వీకరించడానికి త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలి. * హెల్త్‌కార్డులు రూపొందించేందుకు ఆర్థిక శాఖ వద్ద ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆధార్ నంబర్లు వంటి సకల వివరాలూ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఇవ్వాలి. సీఎఫ్ఎంఎస్ ద్వారా ఉద్యోగుల వివరాలు ఆర్థిక శాఖకు అందడంలో జాప్యం జరిగే పక్షంలో.. ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ స్కీం (ఈహెచ్ఎస్) పోర్టల్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా డేటా నమోదుకు అవకాశమివ్వాలి. -
ఈ నెల నుంచే ‘హెల్త్’ ప్రీమియం
రూ. 90, రూ. 120.. రెండు శ్లాబుల్లో వసూలు దంపతులిద్దరూ ఉద్యోగులైతే.. ప్రీమియం ఒక్కరు చెల్లిస్తే చాలు సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులూ హెల్త్‌కార్డుకు అర్హులే సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకం ప్రీమియాన్ని(చందాను) ఈ నెల జీతం, పెన్షన్ నుంచే వసూలు చేయనున్నారు. డిసెంబర్ 1న చెల్లించనున్న నవంబర్ జీతం నుంచి ప్రీమియం వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల జీతపు శ్రేణిని బట్టి రెండు శ్లాబుల్లో ప్రీమియం వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి వీలుగా హెల్త్‌కార్డుల పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. డిసెంబర్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ రద్దు కానుంది. జీవోలోని ముఖ్యాంశాలు ఇవీ.. హాడిసెంబర్ 1న ఉద్యోగులకు/పెన్షనర్లకు అందనున్న నవంబర్ జీతం/పెన్షన్ నుంచి ప్రీమియం వసూలు చేయడం ప్రారంభమవుతుంది. 1 నుంచి 4 వరకు ఉన్న జీతపు శ్రేణిలో ఉన్న ఉద్యోగులను శ్లాబ్-ఎ, 5 నుంచి 17 వరకు జీతపు శ్రేణిలో ఉన్న ఉద్యోగులను శ్లాబ్-బి కింద విభజించారు. శ్లాబ్-ఎ, బి కింద చేర్చిన ఉద్యోగుల నుంచి నెలకు రూ. 90, శ్లాబ్-సి కింద ఉన్న ఉద్యోగుల నుంచి రూ. 120 వసూలు చేయనున్నారు. పెన్షనర్లు పదవీ విరమణ చేసిన నెల్లో పొందిన జీతపు శ్రేణి ఆధారంగా శ్లాబ్ నిర్ణయిస్తారు. ఆ మేరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. శ్లాబ్ ఎ, శ్లాబ్ బి కింద రూ.6,700 నుంచి రూ.15,280 వరకు జీతపు శ్రేణి ఉన్న ఉద్యోగులున్నారు. శ్లాబ్ సి కింద రూ.16,150 నుంచి రూ.44,740 వరకు జీతపు శ్రేణి ఉన్న ఉద్యోగులుంటారు. హాహెల్త్కార్డుల పథకానికి ఏటా రూ. 220 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో ఉద్యోగులు ప్రీమియం ద్వారా 40 శాతం సమకూర్చుకోనున్నారు. మిగతా 60 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చనుంది. శ్లాబ్-ఎ, బి కింద చేర్చిన ఉద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ. 135, శ్లాబ్-సి ఉద్యోగులకు రూ. 180 చెల్లించనుంది. - దంపతులు ఇద్దరూ ఉద్యోగులు/పెన్షనర్లు అయితే.. ఎవరైనా ఒకరు ప్రీమియం చెల్లిస్తే చాలు. అయితే ఈమేరకు ఒకరు ప్రీమియం చెల్లిస్తున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. - దీర్ఘకాలపు సెలవులో ఉన్న ఉద్యోగుల ‘లీవ్ శాలరీ’ నుంచి ప్రీమియం వసూలు చేస్తారు. జీతం లేని సెలవులో ఉన్న ఉద్యోగులు ప్రతినెలా తొలివారంలో ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం నిధి’కి చలాన్ ద్వారా ప్రీమియం చెల్లించాలి. - సెస్పెన్షన్‌లో ఉండి జీతం లేని ఉద్యోగులు కూడా చలాన్ ద్వారా ప్రతినెలా తొలివారంలో ప్రీమియం చెల్లించాలి. - డిసెంబర్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను తీసుకోవద్దని డ్రాయింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వం సూచించింది. -
ఉద్యోగులకు సొమ్ముల్లేని చికిత్స
* హెల్త్‌కార్డుల పథకంలో ఉద్యోగులకు స్వేచ్ఛ.. ముసాయిదా మార్గదర్శకాలు సిద్ధం * దంపతులిద్దరూ ఉద్యోగులైతే ఇద్దరి తల్లిదండ్రులకూ వర్తింపు * కుటుంబ పెన్షనర్ మీద ఆధారపడిన వారికీ పథకం వర్తించదు * పథకం అమలు బాధ్యత ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు నగ దు ప్రమేయం లేని చికిత్స అందించే హెల్త్‌కార్డు ల పథకం కింద ఉద్యోగి భార్య/భర్త, పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా అత్తమామలకు ఉచి తంగా వైద్యం అందనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాలు, అధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అధికారులు ముసాయిదా మార్గదర్శకాలను రూపొందిం చారు. వీటిని వారంలోగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి సమర్పించే అవకాశముంది. ఆయన ఆమోదించిన తర్వాత ముసాయిదా మార్గదర్శకాలను ఉద్యోగ సంఘాల నేతలకు కూడా ఇవ్వనున్నారు. వారు సంతృప్తి చెందితే ముఖ్యమంత్రి ఆమోదానికి పంపుతారని అధికారవర్గాల సమాచారం. మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. * హెల్త్ కార్డుల పథకం పరిధిలోకి రావాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా తన కుటుంబం, తల్లిదండ్రులు లేదా అత్తమామల పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సమర్పించాలి. గ్రేడుల ఆధారంగా చందా కట్టాలి. * తల్లిదండ్రులు లేదా అత్తమామలను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉద్యోగులకు ఉంటుంది. * దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే.. ఇద్దరూ చందా చెల్లించాల్సిందే. ఇద్దరి తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుంది. * ఎంపిక చేసిన జబ్బులకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తారు. * ఒక్కో కుటుంబ సభ్యుడికి ఏటా గరిష్టంగా రూ. 3 లక్షల పరిమితి విధించారు. పరిమితి దాటి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. స్టీరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. * ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 10 రోజుల వరకు అయ్యే వ్యయాన్ని కూడా ప్యాకేజీలో భాగంగా పరిగణిస్తారు. * కుటుంబం అంటే ఎవరనే విషయాన్ని నిర్వచించారు. ఉద్యోగి తల్లిదండ్రులు లేదా అత్తమామలు (భార్య/భర్త తల్లిదండ్రులు), 25 సంవత్సరాల వయసు దాటని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. 25 సంవత్సరాల వయస్సు దాటిన వికలాంగులైన కుమారులు, తల్లిదండ్రుల మీద ఆధారపడిన కుమార్తెలకు కూడా పథకం వర్తిస్తుంది. * పెన్షనర్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. కుటుంబ పెన్షనర్ మీద ఆధాపడిన కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదు. * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఇతర ఆరోగ్య పథకాల సౌకర్యాలను అనుభవిస్తున్న ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. * అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వంలో పనిచేస్తున్న క్యాజువల్, డైలీ పెయిడ్ వర్కర్లను ఈ పథకంలో చేర్చలేదు. * ఆరోగ్య శ్రీ ట్రస్టు ఈ పథకానికి తొలి రెండేళ్లు అమలు ఏజెన్సీగా, సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుంది. * ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది.ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ-సర్వీసెస్) కార్యదర్శి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్య విద్య డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ట్రెజరీ శాఖ డెరైక్టర్, సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాల ప్రతినిధులతో పాటు జీఏడీ ఎంపిక చేసిన సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. -
తల్లిదండ్రులు లేదా అత్తమామలకు వైద్యం
హెల్త్‌కార్డుల పథకంలో ఉద్యోగులకు స్వేచ్ఛ.. ముసాయిదా మార్గదర్శకాలు సిద్ధం దంపతులిద్దరూ ఉద్యోగులైతే ఇద్దరి తల్లిదండ్రులకూ వర్తింపు ఒక్కో కుటుంబ సభ్యుడికి వైద్య ఖర్చు ఏటా రూ. 3 లక్షలు కుటుంబ పెన్షనర్ మీద ఆధారపడిన వారికి పథకం వర్తించదు పథకం అమలు బాధ్యత ఆరోగ్యశ్రీ ట్రస్టుకు హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని చికిత్స అందించే హెల్త్‌కార్డుల పథకం కింద ఉద్యోగి భార్య/భర్త, పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా అత్తమామలకు ఉచితంగా వైద్యం అందనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాలు, అధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అధికారులు ముసాయిదా మార్గదర్శకాలను రూపొందిం చారు. వీటిని వారంలోగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి సమర్పించే అవకాశముంది. ఆయన ఆమోదించిన తర్వాత ముసాయిదా మార్గదర్శకాలను ఉద్యోగ సంఘాల నేతలకు కూడా ఇవ్వనున్నారు. వారు సంతృప్తి చెందితే ముఖ్యమంత్రి ఆమోదానికి పంపుతారని అధికారవర్గాల సమాచారం. మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. ► హెల్త్ కార్డుల పథకం పరిధిలోకి రావాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా తన కుటుంబం, తల్లిదండ్రులు లేదా అత్తమామల పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సమర్పించాలి. గ్రేడుల ఆధారంగా చందా కట్టాలి. ► తల్లిదండ్రులు లేదా అత్తమామలకు వైద్యంతల్లిదండ్రులు లేదా అత్తమామలను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉద్యోగులకు ఉంటుంది. తల్లిదండ్రులు లేదా అత్తమామలకు వైద్యందంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే.. ఇద్దరూ చందా చెల్లించాల్సిందే. ఇద్దరి తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుంది. ► ఈ పథకం కింద ఎంపిక చేసిన జబ్బులకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తారు. ►ఒక్కో కుటుంబ సభ్యుడికి ఏటా గరిష్టంగా రూ. 3 లక్షల పరిమితి విధించారు. పరిమితి దాటి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. స్టీరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ►ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 10 రోజుల వరకు అయ్యే వ్యయాన్ని కూడా ప్యాకేజీలో భాగంగా పరిగణిస్తారు. ►కుటుంబం అంటే ఎవరనే విషయాన్ని నిర్వచించారు. ఉద్యోగి తల్లిదండ్రులు లేదా అత్తమామలు (భార్య/భర్త తల్లిదండ్రులు), 25 సంవత్సరాల వయసు దాటని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. 25 సంవత్సరాల వయసు దాటిన వికలాంగులైన కుమారులు, తల్లిదండ్రుల మీద ఆధారపడిన కుమార్తెలకు కూడా పథకం వర్తిస్తుంది. ►పెన్షనర్లకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అయితే కుటుంబ పెన్షనర్ మీద ఆధార పడిన కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదు. ►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఇతర ఆరోగ్య పథకాల సౌకర్యాలను అనుభవిస్తున్న ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. ►అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వంలో పనిచేస్తున్న క్యాజువల్, డైలీ పెయిడ్ వర్కర్లను ఈ పథకంలో చేర్చలేదు. ►ఆరోగ్య శ్రీ ట్రస్టు ఈ పథకానికి తొలి రెండేళ్లు అమలు ఏజెన్సీగా, సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుంది. ►ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ-సర్వీసెస్) కార్యదర్శి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్య విద్య డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ట్రెజరీ శాఖ డెరైక్టర్, సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాల ప్రతినిధులతో పాటు జీఏడీ ఎంపిక చేసిన సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. -
నవంబర్ నుంచి హెల్త్‌కార్డులు
-
నవంబర్ నుంచి హెల్త్‌కార్డులు
వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభం ఉద్యోగ సంఘాలకు ఏపీ సీఎం వెల్లడి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకాన్ని నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నామని ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అక్టోబర్ రెండో వారంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం మంగళవారం ఉద్యోగ సంఘా ల నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా హెల్త్‌కార్డుల పథకాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చారు. వైద్య చికిత్సకు రూ. 2.5 లక్షలుగా నిర్ణయించిన గరిష్ట పరిమితిని తొలగించి.. అపరి మిత చికిత్స అందించాలనే ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు సీఎం సానుకూలంగా స్పందిస్తూనే.. ఆస్పత్రిలో చేరిన ఒక్కో విడతకు (ఎపిసోడ్‌కు) చికిత్స గరిష్ట వ్యయం రూ. 2 లక్షలు దాటకూడదనే షరతు పెట్టారు. అలా ఏడాదిలో ఎన్నిసార్లయినా ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అయి తే చికిత్స వ్యయం రూ. 2 లక్షలు దాటిన తర్వాతా చికిత్స కొనసాగించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పథకంలో ముఖ్యాంశాలు ఇవీ... 3.91 లక్షల మంది ఉద్యోగులు, 3.58 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాలకు హెల్త్‌కార్డుల పథకం వర్తించనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిసి 22 లక్షల మంది ఉంటారని అంచనా. ఠిపథకాన్ని అమలు చేయడానికి ఏడాదికి రూ. 230 కోట్లు వ్యయమవుతుందని అధికారుల అంచనా. అందులో 40 శాతం (రూ. 90 కోట్లు) ఉద్యోగులు, 60 శాతం (రూ. 140 కోట్లు) ప్రభుత్వం భరించనుంది. ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా చందాను వసూలు చేయనున్నారు. అక్టోబర్ జీతం నుంచి చందా వసూలును ప్రారంభించనున్నారు. ►పథకం అమలు కోసం ప్రత్యేకంగా ఉద్యోగుల ట్రస్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు సీఎం సానుకూలంగా స్పందించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఉద్యోగుల ట్రస్టు ఒప్పందం కుదుర్చుకొని పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఈ విషయాన్ని జీవోలోనూ పేర్కొంటామని చెప్పారు. అప్పటి వరకు పథకం అమలు బాధ్యతను ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అప్పగించనున్నారు. ►ఉద్యోగుల ట్రస్టు ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని శాశ్వత సభ్య సంఘాలతో పాటు గెజిటెడ్ అధికారుల సంఘం, పెన్షనర్ల సంఘానికి చోటు కల్పించనున్నారు. కమిటీలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి, కుటుంబ సంక్షేమ కమిషనర్, వైద్య విద్య డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ట్రెజరీ శాఖ డెరైక్టర్ సభ్యులుగా ఉంటారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఉద్యోగుల ప్రత్యేక ట్రస్టు ఏర్పాటయ్యే వరకు పథకం అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ►కాన్పు సహా 347 రకాల చికిత్సలను ప్రభుత్వాస్పత్రుల్లోనే చేయించుకోవాలనే నిబంధన తొలగించారు. 32 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందులు ఇవ్వనున్నారు. దీర్ఘ కాలిక మందులను కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పంపిణీ చేస్తారు. అయితే దీర్ఘకాలిక వ్యాధి చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్‌గా చేయడానికి అవకాశం కల్పించారు. ఠిదాదాపు 2,000 రోగాలకు ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందించనున్నారు. ►ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగులకే పథకాన్ని అమలు చేయనున్నారు. ఆరు నెలల తర్వాత మిగతా అనుబంధ రంగాలకు పథకాన్ని విస్తరించనున్నారు. ►హృద్రోగ చికిత్సలో నాశిరకం స్టంట్లు వేయకుండా నిరోధించడానికి నిబంధనలు పెట్టనున్నారు. ►ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ ఉన్న ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులపై ఉద్యోగులకు చికిత్స అందించడానికి అంగీకరించాయి. ►ఉద్యోగులు, పెన్షనర్లు వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. -
హెల్త్‌కార్డుల స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వానికే ఆధిపత్యం!
సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కార్డుల పథకం అమలును పర్యవేక్షించడానికి వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేయనున్న స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వానికే ఆధిపత్యం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు కమిటీ కూర్పు ప్రతిపాదన రూపొందించి శుక్రవారం ఉద్యోగ సంఘాల ముందు పెట్టింది. ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జీఏడీ కార్యదర్శి ఎస్.కె.సిన్హా శుక్రవారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. 18 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నామని, అందులో 11 మంది అధికారులు, ఏడుగురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించనున్నామని సిన్హా తెలిపారు. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 12 శాశ్వత సభ్య సంఘాలు, ఇద్దరు పెన్షనర్ల ప్రతినిధులు, ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులకు చోటు కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశాయి. హెల్త్‌కార్డుల పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, తర్వాతే స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఉద్యోగుల డిమాండ్‌ను పరిశీలిస్తానని సిన్హా హామీ ఇచ్చారు. ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, డ్రైవర్ల సంఘం, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత పెంపు శంషాబాద్, న్యూస్‌లైన్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం అధికారులు బందోబస్తును పటిష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ఓ విమానాన్ని పేల్చివేస్తామంటూ విమానాశ్రయానికి ఓ అగంతకుడి నుంచి లేఖ వచ్చినట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే ఎయిర్‌పోర్టు అధికార వర్గాలు, పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. దిల్సుఖ్నగర్ పేలుళ్లు జరిగి ఏడాదైన సందర్భంగా ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే బందోబస్తును పటిష్టం చేసినట్లు సమాచారం.