breaking news
GV Sanjay Reddy
-
పార్లమెంటు ప్రతిష్టంభనపై కదిలిన కార్పొరేట్లు
కార్యకలాపాలు సజావుగా సాగాలని కోరుతూ ఆన్లైన్ పిటీషన్ న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొనడంపై కార్పొరేట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని కోరుతూ భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఆన్లైన్ పిటీషన్ రూపొందించింది. రాహుల్ బజాజ్, ఆది గోద్రెజ్, కిరణ్ మజుందార్-షా తదితర పారిశ్రామిక దిగ్గజాలు సహా 17,000 మంది దీనిపై సంతకాలు చేశారు. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా వైస్ చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, హీరో గ్రూప్‌నకు చెందిన సునీల్ కాంత్ ముంజల్ .. పవన్ ముంజల్, పుంజ్ లాయిడ్ చైర్మన్ అతుల్ పుంజ్ మొదలైన వారు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. పార్లమెంటు సక్రమంగా నడవకపోతే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుందని సీఐఐ పేర్కొంది. ఇటీవలి పరిణామాలు ఆవేదన కలిగించేవిగా ఉన్నాయని, పార్లమెంటుపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అటు అధికార పక్షం, ఇటు విపక్షం రెండూ కూడా కీలకమైనవేనని, రాజకీయాంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రెండింటిపైనా ఉందని తెలిపింది. -
ఎయిర్పోర్ట్ వ్యాపారానికి నిధుల సమీకరణలో జీవీకే
న్యూఢిల్లీ : ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం రుణభారాన్ని తగ్గించుకునే దిశగా నిధులు సమీకరించాలని యోచిస్తున్నట్లు మౌలిక రంగ సంస్థ జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి తెలిపారు. అయితే, సంస్థను లిస్టింగ్ చేసే ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. లిస్టింగ్ ద్వారా జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించనున్న వార్తలపై స్పందిస్తూ సంజయ్ రెడ్డి ఈ వివరాలు తెలిపారు. సుమారు రూ. 20,000 కోట్ల రుణభారం గల జీవీకే గ్రూప్ ప్రస్తుతం దేశీయంగా ముంబై, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. మరోవైపు విదేశాల్లో విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇండొనేషియా, ఆఫ్రికాలో అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సంజయ్ రెడ్డి పేర్కొన్నారు. ఇండొనేషియాలో జీవీకే ఇప్పటికే రెండు ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తోంది.