breaking news
gubbala tammaiah
-
డబ్బుకు ‘దేశం’ దాసోహం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తెలుగుదేశం పార్టీలో డబ్బులున్న వారికే సీట్లు ఇస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా ధనిక నేతలకు లొంగిపోయారు. పనిచేసే నాయకులు, కార్యకర్తలకు విలువ లేకుండాపోయింది’ ఈ మాటలు అంటున్నది టీడీపీ ప్రత్యర్థులు కాదు. ఆ పార్టీ నేతలే. నిన్నటివరకూ ఆచంట టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిం చిన గుబ్బల తమ్మయ్య ఈ విషయూన్ని కుండబద్దలుకొట్టి మరీ చెప్పారు. డబ్బులిస్తేనే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొల్లులో టీడీపీ సీనియర్ నేత డాక్టర్ బాబ్జి నేరుగా ఈ మాటలు అనకపోయినా ఆయన అనుయాయులంతా అదే చెబుతున్నారు. పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు టీడీపీ ధనరాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన డబ్బులు కుమ్మరించి టీడీపీని జేబు సంస్థగా మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు తెగిపోయేదాకా రావడానికి ఆయనే ప్రధాన కారణమని తెలుగుదేశం నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. రఘురామకృష్ణంరాజు చెప్పినట్టల్లా చంద్రబాబు తలాడించడానికి ఆయన భారీ మొత్తం లో సొమ్ము ఇవ్వటమే కారణమనే ప్రచా రం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. మొన్నటివరకూ బీజేపీ నేతగా చెలామ ణీ అయ్యి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని రఘు కొద్దిరోజులుగా చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం బీజేపీకి ఇస్తారని తెలిసి.. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావించి ముందే ఆ పార్టీలో చేరిన ఆయన అందుకోసం బాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు సమాచారం. నరసాపురం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చంతా తానే భరిస్తానని అవసరమైతే, జిల్లాలోని మిగిలిన స్థానాల ఖర్చు కూడా చూసుకుంటానని ఆయన ముందుకొచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీంతోపాటు పార్టీ ఫండ్ కూడా భారీగా ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ కారణంగానే రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం వరకూ ఏలూరులో బస చేసిన చంద్రబాబు 11 గంటల వరకూ బయటకు రాలేదు. ఈ సమయంలో ఉదయం నుంచి ఫోన్లు మాట్లాడిన ఆయన ఇక్కడినుంచి వెళ్లిపోయే ముందు రఘురామకృష్ణంరాజును మాత్రమే పిలిపించుకుని మాట్లాడారు. టీడీపీ నేతలెవరితోనూ మాట్లాడలేదు. దీనినిబట్టి బీజేపీలో ఉన్న రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే.. ఆచంట సీటును మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ఇవ్వడం వెనుకా పార్టీ ఫండ్ లోగుట్టు ఉన్నట్లు తెలిసింది. ఈ సీటును రెండు నెలల క్రితమే తమ్మయ్యకు ఇస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు చివరకు పితాని సత్యనారాయణకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. పితాని ఆర్థికంగా బలవంతుడు కావడంతో తమ్మయ్యను పక్కనపెట్టేశారు. కనీసం ఆయనకు మాటమాత్రమైనా చెప్పకుండా పితానికి సీటిస్తున్నట్లు ప్రకటించారు. పాలకొల్లు అసెంబ్లీ సీటు సీనియర్ నాయకుడైన డాక్టర్ బాబ్జికి వస్తుందని అంతా భావించారు. అనూహ్యంగా నిమ్మల రామానాయుడికి కట్టబెట్టారు. ఉంగుటూరు సీటు ఇస్తానని పలువురిని పార్టీలో చేర్చుకున్నా.. చివరకు గన్ని వీరాంజనేయుల్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు కూడా చివరకు భారీగా పార్టీ ఫండ్ ముట్టజెప్పుకోవాల్సి వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురువారం రాత్రి ఆగమేఘాల మీద ఆయన డబ్బును సమకూర్చినట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం సీటు ఆశిస్తున్న కొట్టు సత్యనారాయణ కూడా ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు సమాచారం. తొలి విడతలో ప్రకటించిన ఏలూరు, దెందులూరు, నిడదవోలు, తణుకుతోపాటు మిగిలిన జనరల్ నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి కూడా పార్టీ ఫండ్ సమీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అభ్యర్థి ఎవరైనా సరే పార్టీ ఫండ్ సమర్పించుకోవాల్సిందేనని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. టీడీపీ జిల్లా పరిశీలకునిగా ఉన్న గరికపాటి రామ్మోహనరావు ఈ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కొందరి విషయంలో మాత్రం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జోక్యం చేసుకుని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. వాస్తవ పరిస్థితులు తెలియడంతో తెలుగుదేశం పార్టీలో జరిగేదంతా ధన రాజకీయమేనని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వాపోతున్నారు. -
ధనబలం ముందు ఓడిపోయూను
తణుకు, న్యూస్‌లైన్ : ప్రముఖ విద్యావేత్త.. టీడీపీలో చేరి భంగపడిన గుబ్బల తమ్మయ్య చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యూరు. ఎంతో సౌమ్యుడిగా.. నీతి, నిజారుుతీలు గల వ్యక్తిగా.. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోను పేరు సంపాదించుకున్న తమ్మయ్యను టీడీపీ అధినేత నమ్మించి మోసం చేయడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యూరు. శుక్రవారం ఆయన తణుకులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ్మయ్య ఏమన్నారంటే... ‘బీసీ వర్గానికి చెందిన మీలాంటి విద్యావేత్తలు.. నీతి, నిజాయితీ ఉన్న వ్యక్తులు టీడీపీకి అవసరం. మీరు మా పార్టీలో చేరండని చంద్రబాబు పదేపదే అడిగారు. నన్ను టీడీపీలో చేరమని ఎన్నోసార్లు ఆహ్వానం పంపడంతో ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్న నేను ఆ పార్టీలో చేరాను. ఆ తర్వాత ఇంటింటికీ తిరిగాను. పార్టీకి సేవ చేశాను. ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో నేను అడగకుండానే ఆచంట సీటును విద్యావేత్త, వివాదరహితుడైన డాక్టర్ తమ్మయ్యకు ఇస్తున్నాను.. అతనిని గెలిపిం చాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. జిల్లాలో ప్రప్రథమంగా నాకు సీటిస్తున్నట్టు ప్రకటించారు. నా దగ్గర డబ్బులు లేవని అప్పుడే చంద్రబాబుకు చెప్పాను. ఆ మాటలు విన్నారు. చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని విజయావకాశాలను మెరుగుపర్చుకోండని చెప్పారు. ఆ విధంగానే నేను నియోజకవర్గంలో తిరిగాను. అందరినీ కలుసుకున్నాను. ఈ మధ్యనే నన్ను తప్పిస్తున్నారని తెలిసి చంద్రబాబును కలిశాను. వివాదాలకు అతీతంగా నడుచుకునే నేను అన్నివర్గాల్లో మంచి వ్యక్తి అనే పేరు సంపాదించుకున్నాను. ఇప్పుడు ఆచంట సీటు నుంచి నన్ను తప్పిస్తే తమ్మయ్య ఏదో తప్పుచేశాడు కాబోలు.. అందుకే ఖరారైన ఆచంట సీటు నుంచి తప్పిస్తున్నారనే మచ్చ నాపై పడుతుంది. ఇంతకాలం నేను నిజాయితీగా కష్టపడి సంపాదించుకున్న పేరుప్రఖ్యాతలు బూడిదైపోతాయని మొత్తుకున్నాను. అరుునా వినలేదు. నాకు సీటు ఇవ్వటం లేదనే విషయూన్ని చంద్రబాబు గౌరవప్రదంగా చెప్పివుంటే బాగుండేది’ అని తమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఆచంట సీటు ఖరారైన సమయంలో ‘‘ఏంటి మాస్టారు.. చం ద్రబాబును నమ్మి ప్రచారం చేసుకుం టున్నారా.. ఆయనను చివరి వరకూ నమ్మకూడదని’’ నాయకులు చెప్పా రు. నా శిష్యులు సైతం ఇదే మాట చెప్పారు. అయినా ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసి ఇంటివ ద్ద కూర్చు న్న నన్ను పిలిచి మరీ పార్టీకి సేవ చేయాలని కోరి పార్టీ టికెట్ ప్రకటిం చారు కదా అని వెళ్లాను. చంద్రబాబు ఇలా నమ్మించి మోసం చేస్తారనుకోలేదు’ అని వాపోయూరు. ‘విద్యారంగానికి సేవ చేయూలనుకున్నా’ ‘రాజకీయాల్లో చేరి మంచి పదవిని అందుకోవటం ద్వారా నాకు ఎంతో ఇష్టమైన విద్యారంగానికి నా వంతుగా ఎంతో సేవ చేయాలనుకున్నాను. కానీ.. చివరకు ధనబలం ముందు ఓడిపోయూను. ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదు’ అని తమ్మయ్య పేర్కొన్నారు. తాను స్వార్థ ప్రయోజ నాల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. విద్యార్థులకు, సమాజానికి ఎంతోకొంతమేలు చేయూలనే ఉద్దేశంతోనే వచ్చానని తమ్మయ్య చెప్పారు. వైఎస్సార్ సీపీలోకి సాదర స్వాగతం డాక్టర్ గుబ్బల తమ్మయ్య శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెం టరీ నియోజకవర్గ అభ్యర్థి వంక రవీం ద్రనాథ్, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు, పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు, తణుకు అభ్యర్థి చీర్ల రాధయ్య, ఆచంట అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు తదితరులు తమ్మయ్యను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే సందర్భంలో ఆచంట ఏఎంసీ చైర్మన్ చెల్లెం ఆనందప్రకాష్, పట్టణానికి చెందిన న్యాయవాది చామన వెంకట రమణమూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘తమ్మయ్యకు సముచిత స్థానం కల్పిస్తాం’ తమ్మయ్య వంటి విద్యావేత్తలు, మేధావుల అవసరం సమాజానికి ఎంతో ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సముచితమైన, గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పీవీ కృష్ణబాబు మాట్లాడుతూ విద్యావేత్త అయిన డాక్టర్ తమ్మయ్యను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలిచి మరీ సీటిచ్చి చివరకు వేరొకరికి కేటాయించటం జిల్లాకే అవమానకరమని అన్నారు. చంద్రబాబు నమ్మినోళ్లకు అన్యాయం చేస్తారని.. తమ్మయ్య విషయంలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు. తమ్మయ్య లాంటి మేధావులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరటం జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటరీ సీట్లలో తమ అభ్యర్థుల విజయూనికి దోహదం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నరసాపురం ఎంపీ అభ్యర్థి వంక రవీం ద్రనాథ్ మాట్లాడుతూ ఎంతో మేధావిగా చెప్పుకునే చంద్రబాబు విద్యావేత్తగా మంచిపేరు గడించిన డాక్టర్ తమ్మయ్యను పక్కన పెట్టడం దురదృష్టకరమన్నారు. తమ్మయ్య మాస్టారుకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. వైఎస్ జగన్మోహనరెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ పెద్దలను గౌరవించే వ్యక్తి అని, అతనిపై కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లేనిపోని నిందారోపణలు చేయటం తగదని అన్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లాలోని అన్నిస్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజ యం తథ్యమన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు వంక సత్యనారాయణ, కూనపురెడ్డి నానాజీ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విజయూనికి కృషి చేస్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం తనకు ఆనందంగా ఉందని గుబ్బల తమ్మయ్య చెప్పారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోపాటు నిడదవోలు అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని, ఆయూ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని వివరించారు.