breaking news
groups candidates
-
రివిజన్తో విన్!
పట్టుదలతో చదివితే లక్ష్యాన్ని చేరవచ్చు. ఆశయసాధనలో అలుపెరగక ముందుకు సాగితే విజయం సాగిలపడుతుంది. నిరంతర శ్రమతో.. అకుంఠిత దీక్షతో అహరహం తపిస్తే గెలుపు బాట తథ్యం అంటున్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్. సర్కారీ కొలువుల నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో గ్రూప్స్ అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ముందు సిలబస్‌పై అభ్యర్థులకు అవగాహన అవసరమన్నారు. దానికి అనుగుణంగా మెటీరియల్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాలని, జనరల్ నాలెడ్జి పెంచుకోవాలన్నారు. పరీక్షల్లో తొలి మెట్టుకు ఈ రెండు అంశాలు దోహదపడతాయని శర్మన్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం సూచించారంటే.. – సాక్షి, హైదరాబాద్ ఎంత అర్థమైందన్నదే పాయింట్ చదవడంతో పాటు నిరంతరం సమీక్షించు కోవాలి. గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు.. ఎంత వరకు అర్థమైందనేది ప్రధానం. ఇష్టంగా అర్థం చేసుకుంటూ చదవాలి. పరీక్షకు హాజరయ్యే లోపు కనీసం రెండుసార్లయినా రివిజన్ చేస్తేనే çపట్టు వస్తుంది. ఒకేసారి సిద్ధం కావాలి గ్రూప్స్ అభ్యర్థులకు ప్రిలిమ్స్ తర్వాత మెయి న్స్ పరీక్షకు లభించే కాల వ్యవధి సరిపోదు. దీంతో ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్‌కు ఒకేసారి సిద్ధం కావడం ప్రారంభించాలి. లాంగ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్ష విధానం అర్థమవుతుంది. జవాబు ఎంత వరకు రాయాలో తెలుస్తుంది. ప్రతి దానిని సూక్ష్మంగా గమనించి దానికి అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ప్రయత్నించాలి. ఆప్షనల్ సబ్జెక్టులు కీలకం గ్రూప్ మెయిన్స్ కోసం ఆప్షన్లు నిర్ణయించు కోవడం కీలకం. ఆసక్తిని బట్టి ఆప్షన్లు నిర్ణయిం చుకోవాలి. సంబంధిత సబ్జెక్టుల్లో గట్టి పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే పరీక్ష సునాయాసంగా రాసేందుకు వీలుంటుంది. మెయిన్స్ ఇంటర్వ్యూలో సైతం ఆప్షన్స్‌పై అధిక ప్రశ్నలు అడుగుతారు.. అవసరం లేని సమాచారం వద్దు రెండు దశాబ్దాల క్రితం వరకు పోటీ పరీక్షలకు సమాచారం సేకరణ కష్టంగా ఉండేది. ప్రస్తుతం గూగుల్ సమాచార గనిగా మారింది. అనవసరమైన సమాచారం సేకరించకుండా సిలబస్‌కు అనుగుణంగా సమాచారం మాత్రమే సేకరించి వాటిపై దృష్టి సారించాలి. సమాధానాలతో సంతృప్తి పర్చాలి ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో సంతృప్తి పర్చగలగాలి. బోర్డు సభ్యుల దగ్గర అభ్యర్థి పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తారు. అందులో వ్యక్తిగత, నేటివిటీ, రాష్ట్రీయ, జాతీయ, సున్నితమైన, ఉద్యోగం సంబంధించి తదితర ప్రశ్నాలు సంధిస్తారు. వాటికి ఎలాంటి టెన్షన్ లేకుండా సునా యసంగా జవాబు ఇవ్వాలి. తెలియకుంటే తెలియదని స్పష్టంగా చెప్పాలి. తెలియకున్నా.. చెప్పడానికి ప్రయత్నించవద్దు. సమయపాలన ప్రధానం పోటీ పరీక్షల్లో సమయ పాలన కూడా ప్రధానం. సమయం వృథా చేయకుండా సంబంధిత సబ్టెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి. పరీక్ష రాసేటప్పుడు కూడా ముందుగానే ప్రశ్నలకు సమయం కేటాయించుకొని పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలి. -
కసితో నాస్తి దుర్భిక్షం
మార్కులకు, తెలివికి సంబంధం లేదు నిరంతర సాధనతో లక్ష్యం చేరుకోవచ్చు ‘సాక్షి’ ‘ఆర్కే’ స్టడీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్స్ అవగాహన సదస్సులో వక్తలు ఉద్బోధ వందలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు సాక్షి, రాజమహేంద్రవరం : కృషితో నాస్తి దుర్భిక్షం కాదు .. కసితో నాస్తి దుర్భిక్షం, ఒక పోస్టుకు వేల మంది పోటీ పడుతున్న నేపథ్యంలో ఒక్క కృషి ఉంటే సరిపోదని, కసితో చదవాలని వక్తలు ఉద్బోధించారు. ప్రణాళిక, నిరంతర సాధనతోనే విజయం సాధ్యమవుతుందని సూచించారు. బుధవారం ‘సాక్షి’ ‘ఆర్కే’ స్టడీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగిన గ్రూప్స్ అభ్యర్థుల అవగాహన సదస్సుకు హాజరైన నన్నయ్య యూనివర్సిటీ అకడమిక్ డీ¯ŒS ఎస్టేకీ, ఇంటర్ బోర్డు ఆర్ఐవో ఎ.వెంకటేష్, ఆర్కే స్టడీ సెంటర్ ఫౌండర్ రామకృష్ణ, గండేపల్లి ఈవోపీ ఆర్డీ బి.మహేశ్వర ప్రతాప్, బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి, స్టడీ సెంటర్ ఫ్యాకల్టీ అధ్యాపకులు పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో సోదాహరణంగా వివరించారు. మంచి స్టడీ మెటీరియల్‌తోపాటు, ‘సాక్షి’ భవిత, ఇతర పుస్తకాలు చదివినప్పుడే అన్ని అంశాలపై పట్టు సాధించగలమని పేర్కొన్నారు. అపజయం చెందామని నిరుత్సాహ పడకూడదని, దాని వెంటే విజయం ఉంటుందన్న విషయం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు దానిపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరని, లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగా ఉండాలని, అప్పడే విజయం సాధించగలమని వివరించారు. ఉద్యోగం సాధించేందుకు డబ్బుతో పనిలేదని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారిలో ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. గ్రూప్స్‌తోపాటు ఇతర పోటీ పరీక్షలూ రాయాలని సూచించారు. ఇంటర్ బోర్డు ఆర్ఐవో ఎ.వెంకటేష్ మాట్లాడుతూ అకడమిక్‌లో 95 శాతం వచ్చిన విద్యార్థి, పోటీ పరీక్షల్లో విజయం సాధించలేడన్నారు. తెలివితేటలకు మార్కులకు సంబంధంలేదన్నారు. ఒక అంశాన్ని చదివేటప్పుడు అవగాహన చేసుకుంటూ చదివితే దానిపై పట్టు సాధించగలమని వివరించారు. చదివిన విషయాన్ని నోట్స్ రాసుకోవాలని గండేపల్లి ఈవోపీఆర్డీ బి.మహేశ్వర ప్రతాప్ సూచించారు. అభ్యర్థులు బృందంగా ఏర్పడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని ఆర్కే స్టడీ సెంటర్ వ్యవస్థాపకులు రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థుల సందేహాలకు విద్యా నిపుణులు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్కే స్టడీ సెంటర్ ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘గ్రూప్స్’ అభ్యర్థులకు నేడు అవగాహన సదస్సు
హాజరుకానున్న ప్రముఖ విద్యావేత్తలు అర్హులందరికీ ఆహ్వానం ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆ««దl్వర్యంలో.. గ్రూప్ 2, 3 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బుధవారం ఉదయం పది గంటలకు ఉచిత అవగాహన సదస్సు జరగనుంది. స్థలం : రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ రౌండ్ పార్క్ సమీపంలోనున్న ఆర్కే.స్టడీ సెంటర్లో ఉదయం పది గంటలకు ప్రారంభం. వక్తలు : ఆర్.కే.స్టడీ సెంటర్ వారి సౌజన్యంతో జరగనున్న ఈ సదస్సుకు ప్రముఖ వక్తలుగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎమ్.ముత్యాలనాయుడు, ఆర్.కె.స్టడీ సెంటర్ నిర్వాహకులు రామకృష్ణ, ఇంటర్ బోర్డు ఆర్ఐవో ఎ.వెంకటేష్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కర్రి రామారెడ్డి హాజరై అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. గతంలో గ్రూప్ 2,3 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా తమ అనుభవాలను పంచుకుంటారు. -
‘కీ’లకం కరెంట్ అఫైర్సే
* ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి * ‘డిస్క్రిప్టివ్ నుంచి ఆబ్జెక్టివ్’కు ప్రిపేరవ్వాలి * దేన్నయినా ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి * గ్రూప్స్ అభ్యర్థుల ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలంటే... * ‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సాక్షి, హైదరాబాద్: ‘‘కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) ప్రత్యేక సబె ్జక్టు కాదు. పలు సబ్జెక్టులకు సంబంధించిన తాజా అంశాలు, వాటిలోని మార్పులనే కరెంట్ అఫైర్స్‌గా పేర్కొంటాం. మరోలా చెప్పాలంటే అన్ని రకాల సబ్జెక్టుల అంశాల కొనసాగింపేనన్నమాట. ఏ పోటీ పరీక్షకైనా కరెంట్ అఫైర్స్‌ది ప్రత్యేక స్థానం. వాటిపై సంపూర్ణ అవగాహన ఉన్న అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో విజయం నల్లేరుపై నడకే’’ అని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్‌గా, బిట్స్ పిలానీ ఎకనామిక్స్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ సంస్థల్లో ఫ్యాకల్టీగా కరెంట్ అఫైర్స్ బోధనలో ప్రత్యేక స్థానమున్న ఆయన... గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేష న్పై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విశేషాలు... కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో అభ్యర్థులు ప్రధానంగా ఆరు రకాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సబ్జెక్టేమిటి, సమకాలీన అంశమేమిటన్న తేడాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థలో జీఎస్డీపీ అని చదువుకున్నాం. దాన్ని కరెంట్ అఫైర్స్ కింద అడిగేప్పుడు వ్రస్తుతం జీఎస్డీపీ ఎంత? అందులో ధోరణులేమిటి? జీఎస్డీపీలో ఏ రంగం వాటా ఎంత? ఆయా రంగాల్లో తేడాలెలా వస్తున్నాయి? ఏ రంగం పురోగతిలో ఉంది? ఏది తగ్గుతోంది? ఇలాంటివన్నీ వస్తాయి. ఇక జీఎస్డీపీ అంటే ఏమిటనేది ఎకానమీ అవుతుంది. భారత రాజ్యాంగమంటే పాలిటీ అవుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక రాష్ట్రం ఏర్పాటు, సంబంధిత పరిణామాలన్నీ కరెంట్ అఫైర్సే అవుతాయి. 1. సబ్జెక్టు చదువుతూ ముందుకు: సంబంధిత సబ్జెక్టు చదువుతూ, అందులో భాగంగా సమకాలీన అంశాలను చదువుకోవాలి. సబ్జెక్టు చదవకుండా కేవలం సమకాలీన అంశాలే చదివితే ప్రయోజనకరం కాదు. 2. సాధికారిక వనరుల నుంచే చదువుకోవాలి. చాలామంది పత్రికలపై ఆధారపడతారు. వాటిల్లోనూ తప్పులు రావచ్చు. కాబట్టి ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. విమర్శనాత్మకంగా, తులనాత్మకంగా చదువుకోవాలి. 3. సమకాలీన అంశాలను కాన్సెప్ట్‌తో కలిపి చదవాలి. దాంతోపాటు ఆ అంశానికి సంబంధించిన నేపథ్యాన్నీ కలిపి చదివితే ఎక్కువగా గుర్తుంటుంది. సమగ్ర అవగాహనకూ ఉపయోగపడుతుంది. కేవలం ఆబ్జెక్టివ్ టైపే చదివి ఊరుకుంటే విషయంలో స్పష్టత లేక పరీక్షలో నష్టపోతారు. ఉదాహరణకు జీఎస్ఎల్వీ ప్రయోగం తీసుకుంటే సైన్స్ టెక్నాలజీలో సమకాలీన అంశం. అది గుర్తుండాలన్నా, దాని ప్రత్యేకత అర్థం కావాలన్నా భారత రోదసీ రంగ ం మొత్తం చదవాలి. అందులో విజయాలేమిటన్నది చదవాలి. అప్పుడే దాని బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు అన్నీ తెలుస్తాయి. అప్పుడు ప్రశ్న ఎలా అడిగినా సమాధానం రాయడం సులభమవుతుంది. 4. సమకాలీన అంశాలను నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు ప్రస్తుతమెంత అని అడిగితే ఈ రోజు ఉన్న వృద్ధి రేటు రాస్తాం. కానీ పరీక్ష ఆరు నెలలు వాయిదా పడితే సమాధానం మారిపోతుంది. కాబట్టి అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. 5. సమకాలీన అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి. ద్రవ్యోల్బణం రేటు ఎంత అనేది సమాచారం. కాని విశ్లేషణాత్మకంగా చదవాలంటే అందులో ఉండే ధోరణులేమిటి? లక్షణాలేమిటి? ఎందుకు తగ్గుతోంది? ఇలాంటివన్నీ విశ్లేషించాలి.ఉదాహరణకు టోకు ధరల సూచీ తగ్గుతోంది. కాని వినిమయ ధరల సూచీ పెరుగుతోంది. అందులోనూ ముఖ్యంగా పప్పుదినుసుల సూచీ పెరుగుతోంది. వస్తు తయారీ రంగ ధరల సూచీ తగ్గుతోంది. ఇలా అనేకముంటాయి. కాబట్టి ప్రిపరేషన్లో విశ్లేషణాత్మకంగా ఉండాలి. ఇదివరకట్లా ఆహార ద్రవ్యోల్బణం రేటెంత తరహాలో ఇప్పుడు ప్రశ్నలడగటం లేదు. ఆహార ద్రవోల్బణానికి కారణాలేమిటంటూ లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణంపై సంపూర్ణంగా చదివితే తప్ప లాభముండదు. అందుకే సమకాలీన అంశాలను ఫ్యాక్ట్ బేస్డ్‌గానే కాకుండా అనాలసిస్ బేస్డ్గా చదవాలి. ప్రిపరేషన్లో విషయమే గాక విశ్లేషణా ఉండాలి. 6. డిస్క్రిప్టివ్ టు ఆబ్జెక్టివ్: డిస్క్రిప్టివ్‌గా ప్రిపేరై ఆబ్జెక్టివ్‌గా సమాధానాలు రాయాలి. కానీ ఇప్పుడంతా ఆబెక్టివ్గా చదువుతున్నారు. అది సరికాదు. డిస్క్రిప్టివ్‌లో లాజికల్ పద్ధతిలో ప్రిపరేషన్ ఉంటుంది. అలాగాక ఆబ్జెక్టివ్‌గా ప్రిపేరైతే దేని గురించి చదువుతున్నదీ అర్థం కాదు. అందుకే పరీక్ష ఆబ్జెక్టివ్‌గా రాసినా ప్రిపరేషన్ మాత్రం డిస్క్రిప్టివ్‌గా చదవాలి. వివాదాస్పద అంశాలపై ఎలా రాయాలంటే... వివాదాస్పద అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు జాగ్రత్తగా రాయాలి. సాధారణంగా ఒక అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా రాయాలా, వ్యతిరేకంగానా అనే ప్రశ్న సహజంగా గ్రూప్-1లో డిస్క్రిప్టివ్‌లో వస్తుంది. ఇది ఆలోచనకు సంబంధించినది. కార్మిక సంస్కరణలను తీసుకుంటే వీటిపై ఏం రాయాలన్న అనుమానాలుంటాయి. అలాంటప్పుడు వాటిపై ఇలా రాయాలి... 1. భారతదేశంలో కార్మిక సంస్కరణలు మంచివనే అభిప్రాయముంది, చెడ్డవనీ ఉంది. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం ఇది మంచి అని, విమర్శకుల దృష్టిలో చెడు అని ఉంది. పరీక్ష రాసేప్పుడు దీన్ని సిద్ధాంతాలకు, ఆకాంక్షలకు అతీతంగా చూడాలి. భిన్న వాదనలు రాయాలి. అవి రాస్తూ, అభ్యర్థి తనపరంగా కూడా హేతుబద్ధమైన అభిప్రాయానికి రావచ్చు. కానీ అది హేతుబద్ధంగా, విశ్లేషణాత్మకంగా, మేధోపరమైన అభిప్రాయంగా ఉండాలి. అంతేతప్ప సిద్ధాంతపరమైన అభిప్రాయంగా ఉండొద్దు. కార్మిక సంస్కరణలు ప్రయోజనకరం కాదని, దోపిడీకి కారణాలని... ఇలా ఏకపక్షంగా రాయొద్దు. అదే సమయంలో సంస్కరణలు మాత్రమే శరణ్యమనీ రాయొద్దు. అభ్యర్థులకు సమాజాన్ని నిశితంగా పరిశీలించే సామర్థ్యం ఉందా, లేదా అని మాత్రమే గ్రూప్-1 వంటి పరీక్షల్లో చూస్తారు. అంతేతప్ప ప్రభుత్వానికి వందిమాగధులుగానో, వైరిపక్షులుగానో ఉండాలని ఆశించరు. ఎందుకంటే ఈ రెండూ కరెక్టు కాదు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో రాయాల్సిన అవసరం లేదు. భిన్న వాదనలు రాయాలి. హేతుబద్ధమైన అభిప్రాయానికి రావచ్చు. కాకపోతే ప్రభుత్వోద్యోగానికి పోతూ ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయం రాయడం సరికాదు. 2. ‘మేకిన్ ఇండియా’ను తీసుకుంటే... ఈ కార్యక్రమమే బోగసని రాస్తే అది తప్పు. అమలులో ఇబ్బందులుంటే వాటిని రాయడంలో అభ్యంతరం లేదు. లేదా విమర్శకులు అభిప్రాయాలిలా ఉన్నాయని రాయొచ్చు. అంతే తప్ప సొంత అభిప్రాయంగా రాయొద్దు. భిన్నాభిప్రాయాలను, విమర్శలను రాయాల్సి వచ్చినపుడు విమర్శకుల అభిప్రాయంగానే రాయాలి. ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. 3. న్యాయమూర్తుల నియామకాలు జరిపే కొలీజియం వ్యవస్థను రద్దు చేసి న్యాయ నియామకాల కమిషన్ వేసిన విషయం తీసుకుంటే.. దాని ప్రయోజనాలేమిటని ప్రభుత్వం చెబుతోందో రాయాలి. అలాగే సుప్రీంకోర్టు ఏం చెబుతోంది, దాని అభిప్రాయమేమిటన్నదీ రాయా లి. రెండిటినీ విశ్లేషించి, మీకో అభిప్రాయం ఏర్పడితే అది కూడా రాయాలి. కానీ ప్రభుత్వ అభిప్రాయాన్నో, సుప్రీంకోర్టు అభిప్రాయాన్నో ఖండించేలా ఉండొద్దు. మేధోపరమైన విశ్లేషణలతో కూడిన అభిప్రాయంగా రాయొచ్చు. రెండు రకాలుగా అంశాల విశ్లేషణ కొన్ని సాధారణాంశాలూ ఉంటాయి. కొన్ని నిర్దిష్టమైన అంశాలుంటాయి, ఒక అంశంపై ప్రశ్నను సాధారణంగా అడిగినపుడు, ఒక పాయింట్ తీసుకొని దాన్ని బలపరిచే అంశాలను, విశ్లేషణను రాయాలి. ఉదాహరణకు భారత ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందా అనడిగితే.. ముందుగా ఆర్థిక సంక్షోభమంటే ఏమిటో నిర్వచించాలి. ఆర్థిక వ్యవస్థకు కొలబద్ధ ఏమిటో విశ్లేషించాలి. ఆర్థిక వ్యవస్థకు కొలబద్ధలు 1. వృద్ధిరేటు, 2. ఎగుమతులు, దిగుమతులు, 3. విదేశీ మారకద్రవ్య నిల్వలు, 4.ద్రవ్యోల్బణం, 5.ద్రవ్యలోటు, 6. ప్రస్తుత ఖాతాల లోటు 7. రుణభారం. ఇలాంటి అంశాలను తీసుకోవాలి. ప్రతి అంశంలో వాస్తవాలేమిటో విశ్లేషించాలి. వాట న్నింటినీ కలిపి తే వచ్చే సమగ్ర రూపాన్ని సమాధానంగా రాయాలి. అంతేతప్ప ఏదో ఒక పాయింట్ పట్టుకుని, దాని ఆధారంగా సూత్రీకరణకు రాకూడదు. సూత్రీకరణ ఎప్పుడు సమగ్రంగా, ప్రామాణిక సమాచారం ఆధారంగా ఉండాలి. మరీ అన్ని కోణాలనూ విశ్లేషించేలా ఉండొద్దు. అలాగని మరీ పరిమితమైన కోణంలోనూ ఉండొద్దు. నిర్దిష్టమైన అంశాలు నిర్దిషమైన ప్రశ్న అడిగితే జవాబూ నిర్దిష్టంగానే రాయాలి. ద్రవ్యోల్బణంపై ప్రశ్న అడిగితే దాని పైనే జవాబు రాయాలి. అంతే తప్ప జనరల్‌గా అన్నీ కలిపి జవాబు కింద రాయొద్దు. అందు కే అడిగిన ప్రశ్నను ముందు అర్థం చేసుకోవాలి. ఏమడిగారు, జవాబెలా రాయాలన్నది అర్థం చేసుకోవాలి. అదే సమయంలో సాధారణ అంశంపై ప్రశ్న అడిగితే ఏదో ఒక అంశంపై నిర్దిష్టమైన జవాబు రాసినా మార్కులు రావు. నిర్దిష్టమైన ప్రశ్నకు తెలిసిన సమాచారమంతా రాసినా అంతే. సమపాళ్లలో సమకాలీన అంశాలు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయాంశాలన్నీ దాదాపు సమపాళ్లలో ఉంటాయి. ఇప్పుడు ప్రాంతీయమంటే ఒక్క తెలంగాణవే. గతంలో ఉమ్మడి ఏపీ అంతా ప్రాంతీయ. అలాగని ఇప్పుడు ఏపీ గురించి అడగరా అంటే అడుగుతారు. అయితే అవి జాతీయాంశాల్లోకి వెళ్లవచ్చు. ఈ ఏడాదిలో తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక, సాంస్కృతిక పరిణామాలు. నియామకాలు. ప్రభుత్వ విధానాలు. పథకాల వంటివాటిపై కరెంట్ అఫైర్స్‌లో ప్రశ్నలడగొచ్చు. అన్నీ కచ్చితంగా సమపాళ్లలో ఉండకపోయినా మొత్తంమీద సమతుల్యత పాటిస్తారు. సబ్జెక్టుల్లోనూ అంతే. రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతికాంశాలు, ప్రదేశాలు, సంఘటనలను దాదాపు సమపాళ్లలోనే అడుగుతారు. ఫ్యాక్ట్స్‌ను తెలుసుకోవాలంటే.. ఏ పరీక్షలోనైనా జవాబులు రాసేప్పుడు ఫ్యాక్ట్స్‌ను (వాస్తవాంశాలను) జాగ్రత్తగా పరిశీలించాలి. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. 1. అబ్సల్యూట్, 2. ఎనలిటికల్, 3. లింక్డ్ ఫ్యాక్ట్స్ ఉదాహరణకు ద్రవ్యోల్బణరేటనేది అబ్సల్యూట్ ఫ్యాక్ట్. దానికి సంబంధించిన ఇతర అనేకాంశాలు లింక్డ్ ఫ్యాక్ట్స్. ఇక పలు అంశాల మధ్య సంబంధం గురించి చర్చిందేది విశ్లేషణాత్మక ఫ్యాక్ట్స్. కృష్ణా గోదావరి అనుసంధానం తీసుకుంటే, నదుల అనుసంధానం ఫ్యాక్ట్. తత్సంబంధిత ఇతర అంశాలు లింక్డ్ ఫ్యాక్ట్స్. నదుల అనుసంధానానికి సంబంధించిన ఇతర ప్రతిపాదనలు తదితరాలన్నమాట. ఇక అనుసంధానంపై భిన్నాభిప్రాయాలు, అనుభవాలు, పరిణామాలు విశ్లేషణాత్మక ఫ్యాక్ట్స్.