breaking news
Green Chili
-
పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎందుకంటే..?
పచ్చిమిర్చి అంటే అబ్బా!.. ఘాటు అని తేలిగ్గా తీసిపారేయొద్దు. ఎందుకంటే మిగతా కాయగూరల్లానే దీనిలోనూ ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేగాదు రోజు ఓ పచ్చిమిరపకాయను పచ్చిగా తింటే ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మనం పచ్చిమిర్చిని ఘాటు కోసం వాడతాం. ఇది మన ఆహారానికి మంచి స్పైసీని కాదు కావల్సినన్ని పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీలో తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇది జీక్రియలను పెంచి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేగాదు ఇందులో ఉండే క్యాప్సైన్ మెటబాలిజం పెంచెందుకు దోహదపడుతుంది. అందువల్ల దీన్ని ఆహారంలో చేర్చడం వల్ల బరువు నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తుంది. తత్ఫలితంగా క్యాలరీలు ఈజీగా బర్న్ అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఈ పచ్చి మిర్చి కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధనలో తేలింది. అదే సమయంలో శరీరానికి వేడి చేసేలా కాకుండా తగిన మోతాదులో తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. ముక్కలు చేసిన పచ్చి మిరపకాయల నీటిని సేవించడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. అలాగే మీరు తీసుకునే సలాడ్స్‌లో గ్రీన్ చిల్లీ స్మూతి రుచిని పెంచడమే గాక ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సహాయపడుతుంది. కొలస్ట్రాల్ స్థాయిలను, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా. ఈ స్పైసీ పదార్థాలను ఎప్పుడూ సరైన పద్ధతిలో వినియోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది గుర్తించుకోవాలి. (చదవండి: రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!) -
పచ్చి మిరప పరమ శ్రేష్ఠం
ఆహారపు వర్గీకరణలో ఆయుర్వేదం షడ్రసాలకు (మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త కషాయ రుచులు) ప్రాధాన్యతనిచ్చింది. ‘కటు’ అంటే ‘కారం/ఘాటు’ అని అర్థం. భారతీయ వైద్యమైన ఆయుర్వేద కాలంలో కారానికి వాడుకునే ఏకైక ప్రధాన ద్రవ్యం ‘మిరియాలు’(మరిచ). పచ్చిమిరప చరిత్ర: 16 వ శతాబ్దంలో పచ్చి మిరపను పోర్చుగీసువారు ఆసియా ఖండానికి అందించారు. అనంతరం వాస్కోడగామా మన దేశానికి తెలియచెప్పారు. కనుక ఆ కాలంలో వెలసిన ఆయుర్వేద గ్రంథమైన ‘యోగరత్నాకరం’ లో ‘క్షుపజమరిచ’ అనే పేరులో దీనిని పేర్కొన్నారు. అటుపిమ్మట దీనికే ‘కటుబీర’ అనే పేరు కూడా వచ్చింది. పచ్చి మిరప ఆకారంలోనూ, పరిమాణంలోనూ, ఘాటు తీవ్రతలోనూ రకరకాల తేడాలుంటాయి. ఆధునిక శాస్త్ర విశ్లేషణ: పోషక విలువలు: వంద గ్రాముల పచ్చిమిరపలో 40 కేలరీలు, 3 శాతం పిండి పదార్థాలు, 3 శాతం ప్రొటీన్లు, అత్యధికంగా నీటి శాతం, 6 శాతం ఆహారపు పీచు ఉంటాయి. కొలెస్టరాల్ వంటి కొవ్వులు శూన్యం. ‘విటమిన్ – ఎ’ 19 శాతం, ‘సి’ 239 శాతం ఉంటాయి. ‘ఇ’, ‘కె’ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ‘బి – 6’ 25 శాతం ఉంటుంది. డి విటమిన్ ఉండదు. సోడియం 9 మిల్లీ గ్రాములు, పొటాషియం 322 మి.గ్రా. ఉంటాయి. కాల్షియం ఒక శాతం, ఐరన్, మెగ్నీషియాలు ఐదేసి శాతం ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు: యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు, బీటాకెరోటిన్, ఎండార్ఫిన్లు, కెప్సైసిస్ వంటి జీవరసాయనాలు పుష్కలంగా ఉండటం వలన, అనేక వ్యాధులను పోగొట్టడానికి, వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడానికి ఉపకరిస్తుంది. ►ప్రధానంగా రక్తప్రసరణని ధారళం చేస్తుంది, వయాగ్రాల కంటె మిన్నగా కామోత్తేజకంగా పనిచేస్తుంది. కంటిచూపును, చర్మకాంతిని వృద్ధి పరుస్తుంది. పొడి చర్మానికి విరుగుడైన జిడ్డు కలిగిస్తుంది, కనుక మొటిమల (పింపుల్స్) సమస్య ఉన్న వారికిది మంచిది కాదు. ►మెటబాలిజాన్ని అధికం చేసి, కొవ్వుని కరిగించి, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది ►హైబీపీ, డయాబెటిస్, కేన్సరు వ్యాధులను అదుపు చేస్తుంది ►గుండె జబ్బుల నివారణకు మంచిది ►పురుషులలోని ప్రోస్టేటు సమస్యలో ప్రయోజనకారి ►జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది ►జలుబు, సైనసైటిస్‌లకు మంచిది. గమనిక: పచ్చిమిరప పండు మిర్చిగా మారుతుంది. ఎండబెడితే ద్రవాంశ ఇగిరిపోయి, ఎండుమిర్చిగా మారుతుంది. నీరు లేకపోవడం వలన ఎండు మిర్చి లేదా దాని పొడి శరీరంలోని మ్యూకస్ పొరలను దహించివేసి అల్సర్స్ కలుగచేసే ప్రమాదం ఉంది. అందువలన పచ్చి మిర్చిని వాడటమే శ్రేష్ఠం. సాధారణంగా దీనిని అధికంగా సేవించేవారు ఉప్పు సంపర్కంతోటే తింటుంటారు. అది మంచిది కాదు. సాధ్యమైనంతవరకు ఉప్పును తగ్గించి పచ్చిమిర్చిని వాడటం శ్రేష్ఠం. నిమ్మరసాన్ని జోడిస్తే ఉప్పు అవసరం ఉండదు. వాడుకునే ప్రక్రియలు నిమ్మరసంలో నామమాత్రంగా ఉప్పు, కొంచెం వాము, ఇంగువ కలిపి అందులో కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసి గంటసేపు ఉంచితే చక్కటి రుచి పుడుతుంది. అన్నంలోకి, రొట్టెలలోకి నంజుకుందుకు వాడుకోవచ్చు. రెండు రోజుల వరకు పాడవదు. మిరపకాయలను ముక్కలు చేయకుండానే ‘నరుకు’ పెట్టి, గింజలు తీసేసి, అందులో నువ్వుల పొడిని (పల్లీల పొడి లేక పుట్నాల పప్పు పొడి కూడా వాడుకోవచ్చు) నింపి, ఆవిరి మీద ఉడికించి, దానిపై ఉల్లిపాయ తరుగు, నిమ్మరసం కలిపి, నంజుకుందుకు వాడితే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు రుచి అద్భుతంగా ఉంటుంది. పండుమిర్చి పచ్చడి తినాలంటే నెయ్యి లేక నువ్వుల నూనెను తగినంత అనుసంధానంగా వాడితే అనర్థం తగ్గుతుంది. పెరుగు లేక మజ్జిగను సమృద్ధిగా సేవిస్తే మంచిది. లేకపోతే కడుపులో పుండ్లు, పైల్స్, హైబీపీలకు దారి తీస్తుంది. జాగ్రత్తలు: మిరపకాయలను వాడుకునే ముందు, ఉప్పు కలిపిన నీళ్లలో అరగంట నానబెడితే క్రిమిసంహారక మందుల దుష్ప్రభావం తగ్గుతుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
మైమిర్చి తినండి
వంటలో ఈ మంట లేకపోతే రుచి ఉండదు. ఘాటు నషాళానికి అంటితే తప్ప తృప్తి కలగదు. కారం భోజనానికి అలంకారం. పచ్చి మిర్చిది అందులో ప్రథమ భాగం. సాధారణంగా మిరపకాయను ఒక కాయగూరగా చూడరు. చూస్తే ఇన్ని వండచ్చు. మైమిరిచి తినొచ్చు. షాహీ హరీ మిర్చి కావలసినవి: పచ్చి మిర్చి – 8 (పెద్దవి); వేయించిన పల్లీలు – అర కప్పు; వేయించిన నువ్వులు – పావు కప్పు; వేయించిన కొబ్బరి ముక్కలు – అర కప్పు; నూనె – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిర్చి – 4; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి మిర్చి – 3; కరివేపాకు – రెండు రెమ్మలు; అల్లం ముద్ద – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; పెరుగు – ఒక కప్పు; చింత పండు గుజ్జు – ఒక టీ స్పూను; బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – చిన్న కట్ట. తయారీ: ►పచ్చి మిర్చిని మధ్యకు చీల్చి పక్కన ఉంచాలి ►వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, వేయించిన కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక మిరప కాయలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద మరొక బాణలిలో పావు కప్పు నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముద్ద ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాక, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి, తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని జత చేసి కలియబెట్టాలి ►ఉప్పు, మూడు కప్పుల నీళ్లు జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి ఉడికించాలి ►కొద్దిగా చిక్కబడిన తరవాత, కప్పు పెరుగు జత చేసి రెండు నిమిషాల పాటు మూత ఉంచి ఉడికించాలి ►చింతపండు గుజ్జు, బెల్లం పొడి, కొత్తిమీర తరుగు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►మిశ్రమం చిక్కబడుతుండగా, వేయించి పెట్టుకున్న మిర్చి జత చేసి, కలియబెట్టి మరోమారు మూత ఉంచాలి ►సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాక, ఒక ప్లేటులోకి తీసుకోవాలి. గ్రీన్ చిల్లీ వెజిటబుల్ రెసిపీ కావలసినవి: పచ్చి మిర్చి – 200 గ్రా.; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – అర టేబుల్ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; సోంపు పొడి – అర టేబుల్ స్పూను; ధనియాల పొడి – అర టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; పంచదార – అర టీ స్పూను తయారీ: ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ►పచ్చి మిర్చి తరుగు జత చేసి వేయించాలి ►పసుపు, ఉప్పు, మిరప కారం, సోంపు పొడి, ధనియాల పొడి జత చేసి బాగా కలిపి, ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిందనిపించాక నిమ్మ రసం, పంచదార జత చేసి, మరో రెండు నిమిషాల పాటు ఉడికించి, దింపేయాలి ►వేడి వేడి చపాతీలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. పచ్చి మిర్చి – సెనగ పిండి కూర కావలసినవి: లేత పసుపు రంగులో ఉండే పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; సెనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు; ముదురు ఆకు పచ్చ రంగు పచ్చి మిర్చి తరుగు – పావు కప్పు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; సన్నగా పొడవుగా తరిగిన అల్లం ముక్కలు – అలంకరించడానికి తగినన్ని. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి తరుగులు జత చేసి బాగా వేయించాలి ►లేత రంగు పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలియబెట్టాక, ముదురు రంగు పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు కలపాలి ►సోయా గ్రాన్యూల్స్, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ►మిగిలిన నూనె, సెనగ పిండి వేసి బాగా కలిపాక, ఆమ్చూర్ పొడి వేసి కలిపి, మూత ఉంచాలి ►సెనగ పిండి గోధుమరంగులోకి వచ్చిన తరువాత దింపేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని, అల్లం ముక్కలతో అలంకరించాలి ►అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. స్టఫ్డ్ పచ్చిమిర్చి కూర కావలసినవి: పచ్చిమిర్చి – 7 (పెద్దవి); జీలకర్ర – 4 టీ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – రెండు టీ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి ►మిరప కారం, ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు జత చేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేసి ప్లేటులోకి తీసుకోవాలి ►పచ్చిమిర్చికి ఒక వైపు గాట్లు పెట్టాలి ∙గింజలు వేరు చేయాలి ►తయారుచేసి ఉంచుకున్న పొడిని అందులో స్టఫ్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారు చేసి ఉంచుకున్న పచ్చి మిర్చిని అందులో వేసి వేయించి, మూత ఉంచాలి ►కాయలు బాగా మెత్తగా వడలినట్లు అయ్యేవరకు నూనెలో వేయించాలి ►నిమ్మ రసం జ చేసి దింపేయాలి ►రోటీలలోకి, అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది. రాజస్థానీ మలై మిర్చి కావలసినవి: పచ్చి మిర్చి – పావు కేజీ; నూనె – 2 టేబుల్ స్పూన్లు; తాజా క్రీమ్ – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను. తయారీ: ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, తడి ఆరాక, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక జీలకర్ర, ధనియాల పొడి, ఆమ్ చూర్ పొడి, ఉప్పు, పసుపు, వేసి దోరగా వేయించాలి ►తరిగిన పచ్చి మిర్చి ముక్కలు జత చేసి బాగా వేయించి, మూత పెట్టాలి ►క్రీమ్ వేసి బాగా కలియబెట్టి, బాగా ఉడికిన తరవాత దింపేయాలి ►అన్నం, రోటీలలోకి రుచిగా ఉంటుంది. గ్రీన్ చిల్లీ సాస్ కావలసినవి: పచ్చి మిర్చి – 100 గ్రా.; అల్లం తరుగు – రెండు టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – చిటికెడు; అజినమోటో – 2 టీ స్పూన్లు; వైట్ వెనిగర్ – 4 టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ – 2 టీ స్పూన్లు. తయారీ: ►పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►మిక్సీలో... వెల్లుల్లి తరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినన్ని నీరు పోసి మెత్తగా చేసి, ఒక కుకర్లోకి తీసుకుని, స్టౌ మీద ఉంచి, ఈ మిశ్రమానికి చిటికెడు ఉప్పు జతచేసి మూత పెట్టి, మీడియం మంట మీద ఉంచి, రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►విజిల్ తీసి పచ్చిమిర్చిని చల్లారబెట్టాలి ∙రెండు చిటికెల అజినమోటో జత చేయాలి ►4 టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్ జత చేయాలి ►మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►రెండు టీ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ తీసుకుని, నీళ్లలో కలిపి, ఉడుకుతున్న సాస్‌లో వేయాలి ∙బాగా ఉడికిన తరవాత, స్టౌ మీద నుంచి దింపేసి చల్లారనివ్వాలి ►బాగా చల్లారాక ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. పచ్చి మిర్చి ఊరగాయ కావలసినవి: పచ్చి మిర్చి – అర కేజీ; మెంతులు – 2 టీ స్పూన్లు; ఆవాలు – 100 గ్రా.; ఇంగువ – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – ఒక టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి ►తొడిమలు వేరు చేసి, పచ్చి మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక, ఆవాలు, మెంతులు వేసి సన్నని మంట మీద దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకుని చల్లారబెట్టాక, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో మిరప కారం, మెత్తగా చేసిన ఆవపొడి, మెంతి పొడి, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి ►తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసి కలియబెట్టాలి ►కాచి చల్లారబెట్టిన నూనె, నిమ్మరసం రెండూ ఒకదాని తరవాత ఒకటి ఇందులో పోస్తూ, కలుపుతుండాలి ►ఒక గంట తరవాత ఈ మిశ్రమాన్ని గాలిచొరని జాడీలోకి తీసుకోవాలి ►ఈ ఊరగాయ సుమారు పదిరోజుల వరకు నిల్వ ఉంటుంది. (నూనె పైకి తేలుతూంటే, ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది). -
పచ్చిమిర్చి కొనుగోళ్ల నిలిపివేత.. రైతులకు భారీ నష్టం
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఖమ్మం కూరగాయల మార్కెట్లో పచ్చిమిర్చి రైతు పచ్చి దగాకు గురవుతున్నాడు. ధరల విషయంలో వ్యాపారులు చేస్తున్న నిలవుదోపిడీపై పలుమార్లు రైతులు గొడవలకు దిగారు. ఇదే అదనుగా భావించి మార్కెటింగ్‌శాఖ పచ్చిమిర్చి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక వ్యాపారుల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. మార్కెట్‌ను బంద్ చేసినప్పటికీ కొందరు రైతులు సరుకు తెస్తూనే ఉన్నారు. కొందరు వ్యాపారులు దాన్ని కొంటూనే ఉన్నారు. సంబంధిత రైతులు, వ్యాపారుల మధ్య ఓ ఒప్పందం ప్రకారం ఈ కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ మార్కెట్‌ను మూసివేశారు కాబట్టి రైతులు ఎక్కడా అమ్ముకునేందుకు వీలుకాదు అని భావించిన వ్యాపారులు ఎంచక్కా వారి ఇష్టానుసార మైన ధరకు కొనుగోలు చేస్తున్నారు. సుదూరంలో ఉన్న వరంగల్ కూరగాయల మార్కెట్‌కు తీసుకెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని కాబట్టి రైతులు తెగనమ్ముకుంటున్నారు. కోతకూళ్లు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొందరు చెట్లపైనే వదిలేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులకు మేలు ప్రభుత్వ శాఖలు తీసుకున్న నిర్ణయం వ్యాపారులకు మరింత మేలు చేసేలా ఉంది. ధర నిర్ణయంలో ప్రభుత్వ పెత్తనం లేకపోవటంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. ముంబయి, కోల్‌కతా వ్యాపారులు చెప్పిన ధరల ఆధారంగా సరుకు రేటు పెడుతున్నామని రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సరుకు అధికంగా అమ్మకానికి వచ్చినప్పుడు వారి దగాకు అంతేలేకుండా పోతుంది. వ్యాపారులు సిండికేటై ధర విషయంలో రైతులను దోపిడీ చేయటంతో గత నెలలో రెండుసార్లు రైతులు తిరగబడ్డారు. ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. ఈ వ్యవహారంపై శాసన సభ ఉపసభాపతి భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ, మార్కెటింగ్ శాఖ జేడీఎం, మార్కెట్ కమిటీ చైర్మన్లు రంగంలోకి దిగి మార్కెట్‌ను సందర్శించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు.