breaking news
Godavari Floods 2022
-
వేగంగా.. ఉదారంగా..
సాక్షి, అమరావతి: ఇటీవల గోదావరిని వరదలు రెండుసార్లు ముంచెత్తినా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద బాధితులకు ఆపన్న హస్తం అందించి అందరి మన్ననలు అందుకుంది. వరద హెచ్చరికలు జారీ అయిన మరుక్షణం నుంచే అప్రమత్తమై పక్కాగా సహాయక చర్యలు ప్రారంభించింది. ముంపు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించడం నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు బాధ్యతగా అన్ని సౌకర్యాలు కల్పించింది. ఈ సంవత్సరం జులై, ఆగస్టు నెలల్లో రెండుసార్లు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. సీఎం జగన్ సూచనలతో అధికార యంత్రాంగం లక్షలాది మందిని ఆదుకుంది. గతంలో విపత్తులు వచ్చినా వెంటనే ఆర్థికసాయం అందిన దాఖలాల్లేవు. పరిహారం కోసం నెలలు, సంవత్సరాలు ఎదురుచూసేవారు. చంద్రబాబు హయాంలో తిత్లీ తుపాను పరిహారం కోసం ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు జగన్ సర్కారు వెంటనే ఉదారంగా పరిహారాన్ని అందించి బాధితులకు భరోసా కల్పించింది. గోదావరి వరదల సమయంలో సహాయం అందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది(ఫైల్) శరవేగంగా సాయం పంపిణీ బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు శరవేగంగా చేపట్టినా వరద ప్రభావం, ఇళ్లు కూలిపోవడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున రూ.28 లక్షల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించింది. ఇక 45 మండలాల్లో 467 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 389 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 205 గ్రామాలు ముంపు బారినపడ్డాయి. ఈ గ్రామాల నుంచి 1.50 లక్షల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముంపు గ్రామాల నుంచి బోట్ల ద్వారా తరలించడానికి రూ.5.17 కోట్లు ఖర్చుచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు వేల బోట్లను అద్దెకు తీసుకుంది. 195 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతిరోజు సగటున 1.07 వేల మందికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. అక్కడ వారికి భోజనం, దుస్తులివ్వడంతోపాటు వైద్యసేవలు అందించింది. నిత్యావసరాలూ పంపిణీ చేసింది. ఇందుకోసం రూ.12.22 కోట్లు ఖర్చుచేసింది. వేగంగా పంట నష్టం అంచనా ఇక పంట నష్టం అంచనానూ శరవేగంగా నిర్వహిస్తోంది. గతంలో ఎప్పుడూలేని విధంగా ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్లోనే ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వచ్చే సీజన్ ఆరంభమయ్యేలోగానే ఇన్పుట్ సబ్సిడీని అందించాలన్న దృఢసంకల్పంతో సర్కారు ఉంది. అక్టోబర్‌లోగా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పుడూలేని విధంగా తక్షణ సాయం ఇక వరద తగ్గాక శిబిరాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు బాధిత కుటుంబాలకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద నగదు అందించింది. ► 94,715 కుటుంబాలకు వెయ్యి నుంచి రూ.2 వేల చొప్పున పంపిణీ చేసింది. ► ఒక లక్షా 966 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ ఆయిల్‌ను పంపిణీ చేసింది. ► 2,429 టన్నుల బియ్యాన్ని రూ.3.84 కోట్ల ఖర్చుతో పంపిణీ చేసింది. ► వరద ధాటికి గుడిసెలు దెబ్బతిన్న 14,731 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.14.73 కోట్ల సాయం అందించింది. ► ఇళ్లు దెబ్బతిన్న 4,509 కుటుంబాలకు రూ.15.16 కోట్ల పరిహారాన్ని ఇచ్చింది. ► పశువుల పాకలు కూలిపోయిన రైతులకు రూ.2,100 చొప్పున 10 మందికి రూ.21 వేలు అందించింది. ► 543 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు చేయించింది. ► ముంపు ప్రాంతాల్లో ముందస్తుగా పారిశుధ్య చర్యలు చేపట్టి జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంది. దోమలు పెరగకుండా ఫాగింగ్, బ్లీచింగ్ చల్లారు. ఇందుకోసం రూ.41 లక్షలు వినియోగించింది. ► ఇక రోడ్లు, డ్రెయిన్లు, ఇళ్లలో పేరుకుపోయిన బురద, చెత్త, ఇతర వ్యర్థాలను కార్మికులు తొలగించారు. ► ముంపు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతినడంతో యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసింది. రూ.12.4 కోట్లతో ట్యాంకర్లు, అద్దె బోట్ల ద్వారా నీటిని అందించింది. ► దెబ్బతిన్న తాగునీటి సరఫరా వ్యవస్థలు, పారిశుధ్య వ్యవస్థలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థల పునరుద్ధరణ కోసం రూ.18 కోట్లు ఖర్చుచేసింది. సహాయక చర్యల్లో 40 వేల మంది.. మరోవైపు.. వరద సహాయక చర్యల్లో గతంలో ఎన్నడూలేని విధంగా 40 వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది పాలుపంచుకున్నారు. వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు పక్కా ప్రణాళికతో విపత్తును ఎదుర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి 1,235 మంది.. గ్రామ సచివాలయ సిబ్బంది 8,960 మంది, గ్రామ వలంటీర్లు 13,241 మంది, పారిశుధ్య సిబ్బంది 2,650 మంది, వైద్య సిబ్బంది 1,294 మంది, బోటు డ్రైవర్లు, సహాయకులు 631 మంది ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీరంతా కలిపి మొత్తం 28,029 మంది పనిచేశారు. వీరుకాక.. పోలీసులు, ఫైర్ సర్వీసెస్, పశు సంవర్థక, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది మరో 10 వేల మందికిపైగా సహాయక చర్యల్లో నిరంతరాయంగా సేవలందించారు. ఇలా వరద బాధితులను ఎక్కడికక్కడ శరవేగంగా ఆదుకున్న తీరుపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమైంది. -
ఉదారంగా సాయం అందించండి.. కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారుల వినతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో వచ్చిన గోదావరి వరదలు మునుపెన్నడూ లేని రీతిలో ప్రభావం చూపాయని, సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కేంద్ర బృందాన్ని కోరారు. హోంమంత్రిత్వ శాఖ ఆరి్థక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలోని బృందం రెండు రోజులపాటు గోదావరి వరదలకు ముంపునకు గురైన అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, ఏలూరు జిల్లా, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించింది. అనంతరం గురువారం రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. రవినేష్ కుమార్‌తోపాటు బృందం సభ్యులు డాక్టర్.కె.మనోహరన్, శ్రావణ్ కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాధన్, అరవింద్ కుమార్ సోని ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వరదల ప్రభావం, క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని సాయిప్రసాద్, విపత్తుల సంస్థ ఎండీ బి.ఆర్.అంబేడ్కర్ కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్లకు సూచనలిచి్చనట్లు తెలిపారు. ముందుస్తుగానే జిల్లాల్లోకి సహాయక బృందాలను పంపించా మని వివరించారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలతో ముంపులో చిక్కుకున్న 183 మందిని రక్షించి, మరో 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సహాయక బృందాలు కూడా చేరుకోలేని ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజుల పాటు ఆహారం, నిత్యావసరాలను అందించినట్లు తెలిపారు. గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు. ప్రభుత్వ స్పందన భేష్ రవినేష్‌కుమార్ మాట్లాడుతూ మూడు జిల్లాల్లో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామన్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఎక్కువగా నష్టం వాటిల్లిందని చెప్పారు. వరద సమయంలో ప్రభుత్వ చర్యలు, యంత్రాంగం సత్వర స్పందనను అభినందించారు. ముఖ్యం గా వలంటీర్ వ్యవస్థ సేవలు బాధితులకు అండగా నిలిచాయని ప్రశంసించారు. అత్యవసర సరీ్వసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు సమయస్ఫూర్తితో పనిచేశారని కొని యాడారు. కలెక్టర్లకు వెంటనే నిధులు మంజూ రు చేయడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టినట్టు గుర్తించామన్నారు. తమ నివేదికను త్వ రగా కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని, వీలైనంత మేర సహాయం అందించడానికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ రమేష్ ప్రసాద్, ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ నయిమ్ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ సీఈ హరేరాము, ఫిషరీస్ జేడీ హీరానాయక్, విపత్తుల సంస్థ ఈడీ సి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన సాక్షి అమలాపురం: గోదావరి వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించింది. రావులపాలెం మండలం గోపాలపురం, పి.గన్నవరం మండలం నాగుల్లంక, రాజోలు మండలం నున్నవారిబాడవలో నష్టాన్ని పరిశీలించింది. పంట నష్టం, రైతులు, మత్స్యకారుల అభిప్రాయాలు, సాంకేతిక అంచనాలను సేకరించింది. వివిధ వర్గాలవారికి, రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాన్ని పరిశీలించింది. ఫొటో ఎగ్జిబిషన్ తిలకించింది. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వరదల వల్ల జరిగిన నష్టాన్ని, బాధితులకు అందించిన సాయాన్ని, దెబ్బతిన్న పంటల వివరాలను, రోడ్లు, విద్యుత్ లైన్లకు జరిగిన నష్టాన్ని ఛాయాచిత్రాలు చూపిస్తూ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంది ఆపదలో ఉన్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద బాధిత రైతులు, మత్స్యకారులు, ప్రజలు కేంద్ర బృందానికి తెలిపారు. పునరావాసం కలి్పంచిందని, ఆహారం, తాగు నీరు అందించిందని వివరించారు. నిత్యావసర వస్తువులు, నగదు సాయం అందజేసిందన్నారు. కేంద్రంతో మాట్లాడి పంటలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని పెంచేలా చూడాలని రైతులు ఈ బృందాన్ని కోరడం విశేషం. కేంద్ర బృందంలో రవినేష్ కుమార్‌తోపాటు వ్యవసాయ సహకార రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.మనోహరం, రోడ్డు రవాణా జాతీయ రహదారుల విభాగం ఎస్ఈ శరవన్ కుమార్ సింగ్, కేంద్ర జలశక్తి, జల వనరుల శాఖ సంచాలకులు పి.దేవేందర్ రావు, కేంద్ర ఆరి్థక శాఖ సహాయ కార్యదర్శి మురుగన్ నాదమ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ ఉన్నారు.