'చంద్రబాబుకు శిక్ష తప్పదు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చట్టప్రకారం శిక్ష తప్పదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. చంద్రబాబును నిజాయతీపరుడంటే ఎవరూ నమ్మరని చెప్పారు. చంద్రబాబు తప్పు చేశారవని, ఇప్పటికైనా నిజం ఒప్పుకోవాలని పోచారం సూచించారు. చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాము ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు నచ్చినవారే తమ దగ్గరకు వస్తున్నారని పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు.