breaking news
frind
-
ఈ నేతల స్నేహం ఎందుకు గట్టిపడింది? ఇందిర చనిపోయాక అమితాబ్ ఏం చేశారు?
రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉండరని అంటుంటారు. రాజకీయాల్లో అధికారం అందుకోవడమే లక్ష్యంగా స్నేహాలు కొనసాగుతుంటాయి. స్నేహానికి రాజకీయాలకు దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో స్నేహానికి సంబంధించిన అనేక కథలు వినిపిస్తుంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా మధ్య ఉన్న స్నేహం, దేశ మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ-అమితాబ్ బచ్చన్, నితీష్ కుమార్- లాలూ యాదవ్‌ల మధ్య స్నేహం మనకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. అటల్- అద్వానీ అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీల మధ్య ఉన్న స్నేహం నాటి రోజుల్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఇద్దరూ దాదాపు కలిసే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించినప్పుడు, రథయాత్రతో పేరు తెచ్చుకున్న అద్వానీ తన రాజకీయ ఆశయాలను పక్కనబెట్టి, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేశారు. నరేంద్ర మోదీ- అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షాపై నమ్మక అధికం అని చెబుతుంటారు. వీరిద్దరి మధ్య దాదాపు 40 ఏళ్ల స్నేహం ఉంది. వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే అమిత్ షా హోం శాఖ సహాయ మంత్రి అయ్యారు. నేడు మోదీ ప్రధానిగా ఉండగా, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత భారత రాజకీయాల్లో అమిత్ షా, మోదీల స్నేహానికి తులతూగేలా మరెవరూ కనిపించరు. మోదీ, షాల స్నేహం వారి రాజకీయ ఆశయాలను నెరవేర్చుకోవడానికి దోహదపడింది. లాలూ-నితీష్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ మధ్య గాఢమైన స్నేహం ఉంది. అయితే రాజకీయాల్లో ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా వ్యతిరేకించుకున్నట్లు కనిపిస్తారు. వీరి స్నేహంలో ఎన్నో విబేధాలు వచ్చాయి. చాలాసార్లు నితీష్ కుమార్ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుని, లాలూ స్నేహాన్ని పక్కన పెట్టి, బీజేపీ పక్షాన నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. రాజీవ్ గాంధీ- అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్- రాజీవ్ గాంధీ బాల్య స్నేహితులు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అమితాబ్ పుట్టినరోజు వేడుకలో వారు కలుసుకున్నారు. అమితాబ్ తల్లి తేజీ బచ్చన్, రాజీవ్ గాంధీ తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అమితాబ్‌ను ఇందిర తన మూడో కొడుకుగా భావించారు. ఇందిరా గాంధీ మరణం తరువాత అమితాబ్ ఆమె మృతదేహం దగ్గరే చాలసేపు కూర్చున్నారు. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? -
స్నేహితురాలికి కిట్స్ విద్యార్థుల అండ
భీమారం : భీమారంలోని కిట్స్ కళాశాల విద్యార్థులు తమ స్నేహితురాలికి అండగా నిలబడడం ద్వారా స్నేహబంధాన్ని చాటిచెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో బీటెక్ చదువుతున్న దివ్య సోదరుడు రమేష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. శస్త్రచికిత్స కోసం పెద్ద మొత్తంలో నగదు అవసరమని వైద్యులు చెప్పగా.. నిరుపేదలైన రమేష్ కుటుంబానికి ఆ మొత్తం భరించే స్థోమత లేకపోయింది. ఈ మేరకు విషయాన్ని దివ్య తన సోదరుడి పరిస్థితి, తమ కుటుంబ ఇబ్బందులను స్నేహితులకు వివరించింది. దీంతో కళాశాల స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్-హ్యుమానిటీ క్లబ్ ఆధ్వర్యాన విద్యార్థులు వివిధ వర్గాల నుంచి సుమారు రూ.లక్ష విరాళాలు సేకరించారు. ఈ నగదును రమేష్ శస్త్రచికిత్స కోసం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మనోహర్ చేతుల మీదుగా దివ్యకు శుక్రవారం అందజేశారు. దీంతో దివ్య స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ప్రొఫెసర్ నారాయణరెడ్డి, హ్యుమానిటీస్ క్లబ్ ఇన్చార్జీ రమేష్, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.