breaking news
first country
-
ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో మనమే టాప్!
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల (అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్) వృద్ధి స్పీడ్‌లో భారత తొలి దేశంగా ఉంటుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఉద్ఘాటించారు. భారత్ పురోగతిలో ప్రవాస భారతీయులను ఒక ఉ్రత్పేరకం వలె పని చేయాలని, భారతదేశాన్ని అతిపెద్ద అవకాశంగా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా ఉండాలని కోరారు. రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ నివేదిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్ల 2031 నాటికి రెట్టింపై 6.7 ట్రిలియన్ల డాలర్లకు రెట్టింపు అవుతుందని పేర్కొన్న ఇటీవలి నివేదికను సోమనాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జనాభా ప్రకారం ఇది అతిపెద్ద దేశం. ఏ ప్రాతిపదికన చూసినా, భారతదేశ వృద్ధి రేటు మొదటి నాలుగు దేశాల కంటే చాలా వేగంగా ఉంది. ఈ నాలుగు దేశాలూ భారతదేశం కంటే తక్కువ వృద్ధి రేటునే కలిగి ఉంటాయని మనం బల్లగుద్దిమరీ చెప్పగలం’’ అని ఆయన ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. అవకాశాల పరిమాణం పరంగా చూస్తే, భారతదేశం భవిష్యత్తులో అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా నిస్సందేహంగా కొనసాగుతుందని చెప్పవచ్చని ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో సోమనాథన్ అన్నారు. 2022–23లో 7.2 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు 2023–24 మధ్య 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉందని వివిధ సంస్థలు అంచనావేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో దాతృత్వం కంటే పెట్టుబడి చాలా ముఖ్యమైనది కావచ్చు. పెట్టుబడి కంటే సాంకేతికత బదిలీ కీలకం కావచ్చు. డబ్బు కంటే మీ జ్ఞానం ముఖ్యమైనది కావచ్చు. – ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ -
ఫ్రాన్స్ విప్లవాత్మక నిర్ణయం
పారిస్ :పర్యావరణ పరిరక్షణ కోసం ఫ్రాన్స్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ తరహా నిషేధం విధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అవతరించింది.అలాగే ఒక కొత్త చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురానుంది. 2020 సం.రానికి డిస్పోజబుల్ వస్తులన్నింటీనీ 50శాతం జీవశాస్త్ర మూలం పదార్థాల నుంచి తయారు చేయాలనే చట్టాన్ని తీసుకురానుంది. వినియోగం తర్వాత వీటిని ఇంటిదగ్గరే కంపోస్ట్ చేసేలా తయారు చేయాలని ఆదేశించనుంది. ఈ పరిమితిని 2025 జనవరి నాటికి ఈ శాతాన్ని 60కి పెంచనుంది. మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వ నిర్ణయం మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. దీనిపై పలువురు సంతోసం వ్యక్తం చేసినప్పటికీ, ముఖ్యంగా పరిశ్రమ వర్గాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నిర్ణయం ఈయూ దేశాల చట్టాల ఉల్లంఘన అని వాదిస్తున్నాయి. దీనిపై ఈయు కమిషన్ ను ఆశ్రయించాయి. బయో ప్లాస్టిక్ వస్తువులకు తాము వ్యతిరేకులం కాదనీ, కానీ శాస్త్రీయ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని కోరారు. గత ఏడాది డిశెంబర్ లో వాతావరణ మార్పు పై ప్యారిస్ సీఓపీ 21 శిఖరాగ్ర సమావేశం సదస్సు విజయవంతం తర్వాత ఎన్విరాన్మెంటల్ అండ్ ఎనర్జీ సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ గా ఎదగాలని యోచిస్తోంది. మరోవైపు ప్రతి సెకనుకు దాదాపు 150 ప్లాస్టిక్ కప్పుల చొప్పున, సంవత్సరానికి 4.37 బిలియన్ కప్పులను వాడి పారేస్తున్నట్టు ఫ్రెంచ్ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ నివేదికలు చెబుతున్నాయి. కాగా ప్లాస్టిక్ బ్యాగుల నిషేధంలో బంగ్లాదేశ్ ముందుంది. భారీ వరదల్లో డ్రైనేజీలను ప్లాస్టిక్ బ్యాగులు మంచెత్తేయడంతో...2002లోనే దేశంలో వీటిని నిషేధించింది. అనంతరం దక్షిణ ఆఫ్రికా, కెన్యా, చైనా, మెక్సికో,రువాండా ఇదే బాటలో నడిచాయి. మరికొన్ని దేశాల్లో ఈ ప్లాస్టిక్ వాడకంపై కొన్ని ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలోనే గత జూలైలో తేలికపాటి ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించింది.