breaking news
Environmental improvement
-
పర్యావరణహితంగా సిమెంట్ పరిశ్రమ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్గారాలను తగ్గిస్తూ, పర్యావరణహితంగా కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకునే దిశగా సిమెంటు పరిశ్రమ కృషి చేస్తోందని అంబుజా సిమెంట్స్ ఎండీ, గ్రీన్ సిమెంటెక్ 2025 చైర్మన్ అజయ్ కపూర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఇంధనాలు, పునరుత్పాదక విద్యుత్, సాంకేతికత మొదలైన వాటిని వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. బొగ్గు స్థానంలో ఘన వ్యర్ధాలు, ప్లాస్టిక్‌లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ప్రస్తుతం సగటున సుమారు ఆరు–ఏడు శాతం స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. సిమెంట్ తయారీ సంస్థల అసోసియేషన్‌తో (సీఎంఏ) కలిసి పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహిస్తున్న సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 21వ ఎడిషన్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వినూత్న వ్యూహాలు, కార్యక్రమాలపై ప్రధానంగా ఫోకస్‌తో ఇది రెండు రోజుల పాటు సాగుతుంది. గత కొన్నేళ్లుగా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్లు సాగర్ సిమెంట్స్ జాయింట్ ఎండీ ఎస్. శ్రీకాంత రెడ్డి తెలిపారు. తటస్థ ఉద్గారాల స్థాయికి ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు పదేళ్లు ముందుగానే లక్ష్యాన్ని సాధించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. సరి్టఫై చేసిన హరిత ఉత్పత్తులు, ప్రోత్సాహకాల కారణంగా పర్యావరణహిత భవంతుల నిర్మాణం పుంజుకుంటోందని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ జాతీయ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి తెలిపారు. -
ఇక పల్లెకుపచ్చకోక
మోర్తాడ్: తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా పర్యావరణ అభివృద్ధి కోసం పటిష్ట చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లావ్యాప్తంగా మూడేళ్లలో 3.60 కోట్ల మొక్కలను నాటించాలని భావిస్తోంది. తగిన ప్రచారం లేకపోయినా అధికారులు మాత్రం మొక్కలను విస్తారంగా నాటడానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయ డంలో నిమగ్నమయ్యారు. ప్రతి ని యోజకవర్గానికి 40లక్షల చొప్పున మొక్కలను మూడేళ్లపాటు నాటించి వాటిని పరిరక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడాదికి 13.33 లక్షల చొప్పున మొక్కలను ప్రతి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలు, పట్టణాలలో నాటించడానికి ప్రణాళికను సి ద్ధం చేస్తోంది. ఇంటింటికీ మొక్కలు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ల క్ష మొక్కలను నాటాలని తొలుత భా వించారు. గ్రామాల విస్తీర్ణం, భౌగోళి క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికి లక్ష మొక్కలు సాధ్యం కాదని భావించి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న గ్రామంలో ఎక్కువ మొక్కలు, త క్కువ నేల ఉన్న గ్రామంలో తక్కువ మొక్కలు నాటించి, వాటిని పరిరక్షించడానికి పకడ్బందీగా చర్యలు తీ సుకోనున్నారు. ప్రతి ఇంటికి రెండు, మూడు పండ్లమొక్కలు, ఉమ్మడి భూములలో పెద్ద మొత్తంలో రకరకాల మొక్కలను నాటించనున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు, చెరువు శిఖం భూములు, కట్టపై, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ రహదాలకు ఇరువైపులా మొక్కల ను నాటించనున్నారు. రైతులకూ పంపిణీ రైతులు తమ భూములలో పంటల ను సాగు చేయకుండా మొక్కలు నా టాలనుకుంటే వారికి పెద్ద మొత్తంలో మొక్కలను సరఫరా చేస్తారు. పొలం గట్ల వెంబడి కూడా మొక్కలను నా టించనున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నం దున స్థలాల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మన ఊరు మన ప్రణాళికలోనే తెలంగాణ హరిత హారం కార్యక్రమం భాగంగా ఉంది. ప్రజా ప్రతినిధుల నుంచి పెద్దగా స్పందన లేకపోయినా అధికారులు మాత్రం ఈ కార్యక్రమాన్ని పక డ్బందీగా చేపట్టాలని భావిస్తున్నారు. స్థలాలను ఎంపిక చేసిన తరువాత మొక్కల సరఫరాకు ప్రత్యేకంగా నర్సరీలను ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని పరిశీలించనున్నా రు. ప్రతి గ్రామంలో ఏడాదికి 10 వేల నుంచి 30 వేల మొక్కలను నాటించా ల్సి ఉంది. అందు కోసం ఇప్పుడు ఉన్న నర్సరీలకు తోడుగా మరిన్ని నర్సరీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. తెలంగాణ హరిత హారం కార్యక్రమం పకడ్బందీగా అమలు అయితే పర్యావరణానికి ముప్పు తప్పుతుందని పర్యావరణ అభిమానులు చెబుతున్నారు. అయితే ఈ పథకం గురించి క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు.