breaking news
Duplicate fertilizer
-
అవినీతి పురుగు
సాక్షి, కడప/ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఆయన వ్యవసాయ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఓ అధికారి. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాలపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతాడు. నకిలీ ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను విక్రయించకుండా నియంత్రించేందుకు అనుకుంటే పొరబాటే. మామూళ్ల వసూలు కోసం. ప్రతి షాపునుంచి తనకు అందాల్సిన మామూళ్లు పూర్తి మొత్తంలో అందితే ‘వరప్రసాదం’లా స్వీకరిస్తాడు. అడిగినంత మొత్తం ఇచ్చుకోలేమని దుకాణదారులు విన్నవించుకుంటే వారికి చుక్కలు చూపిస్తాడు. ఏదో ఒక కారణం చూపి వారికి భారీ జరిమానాలు విధిస్తాడు. ఈ తంతు కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అతని అవినీతి చర్యలకు అడ్డులేకుండా పోయింది. దుకాణదారులకు వ్యవసాయశాఖలో ఏ పని జరగాలన్నా ముడుపులు చెల్లించుకోవాల్సింది. లేదంటే వారి ఫైలు ముందుకు కదలదు. ముడుపులు ఇవ్వకుంటే ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది. షాపుల తనిఖీ పేరుతో ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణదారులను అష్టకష్టాలు పెడుతున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా ఏదో ఒక వంక చూపి కేసులు, జరిమానాలు విధిస్తుండటంతో వ్యాపారులు హడలిపోతున్నారు. చేసేదేమీలేక బాధను దిగమింగుతూ ముడుపులిచ్చుకోవాల్సి వస్తోంది. ప్రతి ఏడాది మామూళ్ల సొమ్ము పెంచుతుండటంతో దిక్కుతోచక నరక యాతన అనుభవిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని దుకాణదారులు మౌనం వహిస్తున్నారు. దీంతో వ్యవసాయ శాఖకు చెందిన ఆ అధికారి ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయించిన రేటు ప్రకారం ముడుపులు సమర్పించుకోక తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు 324, పురుగు మందుల దుకాణాలు 350, విత్తన షాపులు 248 కలిపి మొత్తం 922 దుకాణాలున్నాయి. అయితే వీటి ను ంచి గతంలో వ్యవసాయ శాఖ వారు మామూళ్ల రూపంలో ఖర్చుల కోసం కాస్తోకూస్తో ఏటా వసూలు చేసేవారు. అయితే రెండేళ్లుగా జేడీ కార్యాలయంలోని ఓ అధికారి రేటు అమాంతం పెంచేశారు. ఒక దుకాణానికి మామూళ్ల క్రింద గత ఏడాది రూ.10వేల నుంచి 15వేలకు పెంచగా ఈ ఏడాది రూ.20వేలు ఇవ్వాల్సిందేనని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే ఆయన మామూళ్లు వసూలు చేశారు. మరికొందరు వ్యాపారుల నుంచి మామూళ్ల వసూలు కోసం ఒత్తిడి పెంచినట్లు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు ఇదే అధికారిని ప్రశ్నిస్తే మీ షాపులో లొసుగులు ఉన్నాయని, కేసులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. అసలే ఎరువుల ధరలు పెరిగాయని, దీనికితోడు ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అప్పుగా ఇచ్చామని, వాటి వసూలే కష్టంగా ఉంటే మళ్లీ మామూళ్ల రూపంలో రూ.20వేలు ఎలా చెల్లించాలని దుకాణదారులు తలలు బాదుకుంటున్నారు. ఎటూ పాలుపోని కొంతమంది వ్యాపారులు డివిజన్ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఈ విషయం తెలిసినా ఉన్నతాధికారులు తెలిసీ తెలియనట్లు ఆ అధికారి పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తప్పవు: దుకాణదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు. లెసైన్సులను నిబంధనల ప్రకారం రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. దుకాణాలపై ఏవైనా కేసులుంటే ఆ షాపుల లెసైన్స్ రద్దు చేసే అవకాశముంది. దుకాణదారులనుంచి మామూళ్లు రాబడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు. దీనిపై విచారణ చేపడతాం. - జయచంద్ర, సంయుక్త సంచాలకులు, జిల్లా వ్యవసాయ శాఖ. -
కలవరపెడుతున్న నకిలీ ఎరువు
బిచ్కుంద న్యూస్‌లైన్: రబీ సాగుకు సిద్ధమవుతున్న త రుణంలో రైతన్నను కల్తీ ఎరువులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారుల్లో నిం డా నిర్లక్ష్యం పేరుకుపోయింది. కల్తీ ఎరువులను గుర్తించేందుకు లక్ష్యం మేరకు దుకాణాల నుం చి కనీసం శాంపిళ్లను సేకరించలేకపోతున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రతి మండల వ ్యవసాయ అధికారి తన పరిధిలో ఉన్న దుకాణాల నుంచి ఎరువుల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. ఎరువుల్లో నాణ్యత లోపిస్తే అధికారులు వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. అయితే ఎక్కడా ఈ మేరకు అధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది జిల్లాకు సుమారు 560 శాంపిళ్ల సేకరణను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని 36 మండలాల నుంచి లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. కాగా అధికారుల ఇప్పటి వరకు కేవలం 280 శాంపిళ్లను సేకరించి చేతులు దులుపుకున్నారు. ఎక్కువగా ఎరువుల వినియోగం ఖరీఫ్‌లోనే ఉన్నా..ఎప్పటికప్పుడు అనుమానం కలి గి నా... రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు ఆయా దుకాణాల నుంచి శాంపిళ్లను సేకరించి జాగ్రత్త పర్చాలి. అయితే ఇవేమీ అమలు కావడం లేదు. కల్తీ ఎరువులపై కొరడా ఝళిపించాల్సిన విజిలెన్స్ అధికారులు పత్తాలేకుండా పోయారు. అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహించామనిపించి అధికారులు తర్వాత కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సరిహద్దులో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న జిల్లాలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుం ద, బోధన్ మండలాల్లో జోరుగా నకిలీ ఎరువులు, స్ప్రే మందుల విక్రయాలు సాగుతున్నాయి. నాణ్యతను గుర్తించలేకపోతున్న రైతులు వాటిని కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో నిజామాబాద్ ఏడీఏ ప్లాంట్ ప్రొటక్షన్ అధికారి చంద్రశేఖర్‌ను సంప్రదించగా జిల్లాలో ఇప్పటి వరకు 280 ఎరువుల శాంపిళ్లు సేకరించామని తెలిపారు. అందులో నిజామాబాద్ నగరంలోని దుకాణాల్లో లభించిన 10.26.26, 17.17.17, 14.35.14 ఎరువులలో నాణ్యత తక్కువగా ఉందని తెలి పారు. బిచ్కుంద ఏడీఏ వేణుగోపాల్ మాట్లాడుతూ జుక్కల్‌లో 20.20.0.13 రకాల ఎరువులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలిందని చెప్పారు. ఎవరైనా ఇలాంటి ఎరువులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.