breaking news
Dr.B.R.Ambedkar
-
తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్ శకం..
అంబేడ్కర్ కోట్లాది భారతీయ దళితుల దాస్య విమోచకుడు మాత్రమే కాదు; భారతీయ దళిత సాహిత్యానికి ఆద్యుడు, ఆఢ్యడు కూడా. అంబేడ్కర్ తన గురుత్రయంగా ప్రకటించుకున్న గౌతమబుద్ధుడు, సంత్ కబీర్, మహాత్మాజ్యోతిబా పూలేల తాత్త్విక ఆలోచనా విధానమే అటు అంబేడ్కరిజానికీ, ఇటు భారతీయ దళిత సాహిత్యానికీ సిద్ధాంత భూమిక అయింది. తెలుగు దళిత సాహిత్యానికి అంబేడ్కర్ ఆంధ్రదేశ్ పర్యటన ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ గొప్ప ప్రేరణ ఇచ్చింది. నందనార్ హరిశ్చంద్రుడి పట్టువదలని పూనికతో అంబేడ్కర్ 1942 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో అడుగుపెట్టారు. అప్పటికి దళిత నాయకులుగా ఉన్న ఈలివాడపల్లి, పాము రామ్మూర్తి, కుసుమ ధర్మన్న, బొజ్జా అప్పలస్వామి వంటి వారు ఆ పర్యటనలో పాల్గొన్నారు. అంబేడ్కర్ మరణించిన దశాబ్దాలకు గానీ ఆయన జీవితం, రచనలు చదివే అవకాశం తెలుగు దళితులకు దక్కలేదు. 1968లో మొదటిసారి యెండ్లూరి చిన్నయ్య రాసిన డా.అంబేడ్కర్ జీవిత చరిత్ర గ్రంథ రూపంలో వచ్చింది. ఆ కాలంలోనే అంబేడ్కర్ రచించిన ‘ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ గ్రంథానికి యెండ్లూరి చిన్నయ్య, బోయి భీమన్నల అనువాదాలు వచ్చాయి. ఆ తర్వాత అంబేడ్కర్ జీవితచరిత్రను గ్రంథస్థం చేసినవారిలో బి. విజయభారతి, అమూల్యశ్రీ, బోయ జంగయ్య, పి.అబ్బాయి, ఉదయకీర్తి, బొనిగెల రామారావు, బూతం స్వామి వంటి వారున్నారు. తెలుగునాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది. 1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘కలడంబేడ్కరుండు నా సహోదరుడు’ పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్ దీవెనలు తీసుకోమంటారు, పద్యకావ్యాలు, శతకాలు, గేయాలు, వచన కవితలు, నాటకాలు, బుర్రకథలు, హరికథలు ఒకటేమిటి అన్ని ప్రక్రియల్లోనూ అంబేడ్కర్ ఆవిష్కరించబడ్డారు. బోయి భీమన్న ‘నమస్సుల్, డాక్టరంబేడ్కరా?’ మకుటంతో సుప్రభాతం, రాపాక ఏకాంబరం ‘అంబేడ్కరో! సమరసింహా!’, చోడగిరి చంద్రరావు ‘భీమరాయ శతకం’ వెలువరించారు. దళిత ఉపాధ్యాయ కవులు మల్లవరపు జాను, జల్లి రాజగోపాలరావు, మల్లవరపు వెంకటరావు, బుంగా ఆడమ్బాబు, రాచమల్లు దేవయ్య, తోటకూర జార్జి, పలివెల సుదర్శనరావు, గుర్రం ధర్మోజి, నక్కాఅమ్మయ్య, మద్దా సత్యనారాయణ వంటి వారు అంబేడ్కర్‌కు పద్యనీరాజనాలు పలికారు. భీమన్న ‘జయ జయ జయ అంబేడ్కర! జయ దళిత జనస్వర!’ గేయం దళితుల జాతీయగీతంగా ప్రసిద్ధికెక్కింది. నీల్ సలామ్ కావ్యంలో ‘వ్రాయుటబ్బిన నీ పేరె వ్రాయవలయు’ అన్నారు కందిపాటి గోపాలరావు. మాష్టార్జీ గేయం ‘అందుకో దండాలు బాబా అంబేడ్కరా! / అంబరాన ఉన్నట్టి సుక్కలు పాడవంగో’ ఆల్‌టైమ్ రికార్డు. గోరటి వెంకన్న ‘వైతాళికా! ఈ యుగము నీదిరా! బొద్ధాళికా! ఈ జగము నీదిరా!’ అని ఆలాపిస్తే, జయరాజు ‘జాగోరే జాగో అంబేడ్కర్/ జగజ్జన నేత అంబేడ్కర్’ అని తమ బతుకు ఆశగా వర్ణిస్తారు. పావన ప్రసాద్ ‘దేశానికి రక్షణ కవచం / అంబేడ్కర్ తత్త్వం కాదా’ అని ప్రశ్నిస్తే, బోయి భీమన్న ‘పాటలలో అంబేడ్కరు’ పేరుతో ప్రత్యేకంగా ఒక గ్రంథాన్నే ప్రచురించారు. దళిత సామాజిక సాహిత్యోద్యమాలలో భాగంగా ఎందరో కవులు వేలాది గేయాలను ఆలపించారు. సవేరా, శ్రమశ్రీ, భీమసేన, రాంచందర్, శుక్తి, భీమసేన, లెల్లె సురేశ్, ఉదయ భాస్కర్, నాగబత్తుల గోపాలకృష్ణ వంటి కవులు పదుల సంఖ్యలో అంబేడ్కర్‌కు గేయ హారతిపట్టారు. నగేష్ బాబు, ఖాజా సంపాదకత్వంలో వెలువడిన ‘విడి ఆకాశం’ కవితా సంకలనానికి ‘అంబేడ్కరిస్టు ప్రేమ కవిత్వం’ అని ఉపశీర్షిక పెట్టారు, ‘అతడు జాతిబువ్వ, అతడు వెలుగుతోవ్వ, అతడు పాలబువ్వ, అతడు నిప్పురవ్వ' అని అంబేడ్కర్ ఏమిటో తెలియజేస్తాడు ఎండ్లూరి సుధాకర్. శిఖామణి అంబేడ్కర్ విగ్రహాన్ని ‘శతాబ్దాలుగా ఘనీభవించిన దళితాగ్రహం’గా భావిస్తాడు. అంటే డ్కర్‌ను దళితుల అన్నంగిన్నెతో పోలుస్తారు నేతల ప్రతాప్ కుమార్. ‘నీ పురుటి నొప్పులతో రాజ్యాంగాన్ని కాదు / తరాల స్వప్నాల్ని ప్రసవించావు / నువ్వు మాకు తండ్రివా! తల్లివా’ అని అంబేడ్కర్లో అమ్మతనాన్ని దర్శిస్తారు కలేకూరి ప్రసాద్. చల్లపల్లి స్వరూప రాణి ‘ఇప్పుడు మనువు / అగ్రహారం వీడి / అంబేడ్కర్ కాలనీకొచ్చాడు / బాబా! నాకు పాలను నీళ్ళను వేరు చేసే జ్ఞానాన్నివ్వ’మని వేడుకొంటారు. సతీష్ చందర్, తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్, బన్న అయిలయ్య, జి.వి.రత్నాకర్, పైడి తెరేష్‌బాబు, విరియాల లక్ష్మీపతి, కొలకలూరి ఇనాక్... అంబేడ్కర్‌ను కవిత్వంలో ఆవిష్కరించారు. అంబేడ్కర్ భావజాలంపై అనేక గ్రంథాలు వెలువడ్డాయి. కత్తి పద్మారావు అంబేడ్కర్ జీవిత చరిత్ర పేరుతో బహత్ గ్రంథాన్ని వెలువరించారు. కె.జి. సత్య మూర్తి ‘అంబేడ్కర్ సూర్యుడు’ రాశారు. అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్టు మూడు దశాబ్దాలకు పైగా అంబేడ్కర్ వర్ధంతి అయిన డిసెంబరు 6న స్మారకోపన్యాసాలు ఏర్పాటుచేసి, వాటిని గ్రంథరూపంలో తెస్తోంది. హైద రాబాద్ బుక్ ట్రస్టు వంటి సంస్థలు అంబేడ్కర్ భావజాలాన్ని అనువాదాల రూపంలో తెలుగులో అందించడం అభినందనీయం. అంబేడ్కర్ జీవిత చరిత్రను తెలుగులో చలనచిత్రంగా రూపొందించిన డాక్టర్ పద్మావతి దళితులకు గొప్ప ఉపకారం చేశారు. ఆ సినిమాకు సి. నారాయణరెడ్డి అంబేడ్కర్ జీవితాన్ని ప్రతిఫలించే భావస్పోరకమైన గీతాల్ని అందించారు. సౌదా అరుణల ‘జాతిపిత అంబేడ్కర్’, పాటిబండ్ల ఆనందరావు ‘రాజగృహ ప్రవేశం’ నాటకాలు రంగస్థలం మీద అటు ప్రయోగానికీ, ఇటు ప్రయోజనానికీ పెద్దపీట వేశాయి. జయభేరి, ప్రజాబంధు, రిపబ్లికన్ జ్యోతి, గబ్బిలం, ఏకలవ్య, నీలిజెండా, బహుజన కెరటాలు, దళిత కిరణాలు, సమాంతర వంటి దళిత పత్రికలు అవి బతికినంతకాలం అంబేడ్కర్ భావజాలాన్ని ప్రచారం చేశాయి. ఈ వ్యాసకర్త 15 సంవత్సరాల క్రితమే ‘అంబేడ్కర్ శకం’ పేరుతో సేకరించి సంకలించిన దాదాపు 500 పుటల అంబేడ్కర్ పద్య, గేయ, వచన కవితా సంపుటి అముద్రితంగా ఉండి పోయింది. ఒక్కో ప్రక్రియలో ఇలాంటి ఒక్కో బృహత్తర సంపుటి రావలసిన అవసరం ఉంది. విశ్లేషణ: డాక్టర్ శిఖామణి తేది: 14/4/2023 -
బీఈడీ అడ్మిషన్లు ఫుల్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: సిక్కోలు జిల్లాలో బీఈడీ కోర్సుకు ఆదరణ తగ్గలేదు. ఉన్నత విద్యామండలి రెండో విడత నిర్వహించిన కౌన్సెలింగ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనుబంధ పైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు శతశాతం భర్తీ అయ్యూయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో 83.45 శాతం మాత్రమే నిండాయి. జిల్లాలో 14 కళాశాలలు ఉండగా 1460 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ సీట్లు 1088 కాగా 908 సీట్లు మొదటి కౌన్సెలింగ్‌లో నిండాయి. రెండో కౌన్సెలింగ్‌కు కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న సెయింట్మాక్సు(మందస)లో కూడా 75 కన్వీనర్ సీట్లు నిండి పోయాయి. 25 శాతం మేనేజ్ మెంట్సీట్లు నేరుగా యూజ మాన్యాలు భ ర్తీ చేసుకుంటాయి. గత ఏడాది మొదటి విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో 1110 సీట్లకు 924 (83.24శాతం) సీట్లు నిండాయి. అనంతరం రెండో కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్లు నిండటంతో పాటు, మేనేజ్ మెంట్ కోటా సీట్లు కూడా శతశాతం భర్తీ అయ్యూయి. ఈ ఏడాది కూడా జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. కొన్ని జిల్లాలో 70 శాతానికి మాత్రమే ఈ ఏడాది పరిమితమయ్యాయి. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారిని అనుమతించక పోవడం, కళాశాలు ఒక్కసారిగా పెరిగిపోవడం, ఎడ్‌సెట్ రాస్తున్న వారి సంఖ్య తగ్గడం వంటివి ప్రవేశాలకు ప్రతిబంధకంగా మారారుు. ఈ ఏడాది సీట్లు నిండవని ప్రైవేటు యాజమాన్యాలు ఆందోళన చెందాయి. పూర్తిస్థాయిలో అడ్మిషన్లు జరగడంతో ఊపిరి పీల్చుకున్నాయి. ఒక్క కళాశాలకే అనుమతి లేదు గతంలో వర్సిటీ పరిధిలో జిల్లాలో 16 బీఎడ్ కళాశాలలు ఉండేవి. కొన్ని కారణాలు వల్ల నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ 120 సీట్లు ఉన్న పలాస కాశీబుగ్గలోని సాయశిరీష కు అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఈ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు నిర్వహించలేదు. ఈ ఏడాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోని స్సెషల్ బీఈడీ మెంటల్లీ రిటార్డ్ కోర్సులో అడ్మిషన్లు ఎడ్‌సెట్ ర్యాంకులు ద్వారానే ప్రవేశాలు కల్పించారు. 25 సీట్లకు మొత్తం నిండి పోయాయి. బీఈడీ కన్వీనర్ సీట్లు భర్తీలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సోషల్ స్టడీస్ 30, గణితం 25, బయోలాజికల్ సైన్సు 25, ఫిజకల్ సైన్సు 15, ఇంగ్లిష్ 5 శాతం కోటాలో భర్తీచేశారు. రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించడంతో మొదటి విడతలో బయోలాజికల్ సైన్సు, ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్ సబ్జెక్టులలో ర్యాంకర్లు తగినంతగా లేకపోవడంతో కన్వీనర్ కోటా సీట్లు మిగిలిపోయూయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో సబ్జెక్టు కన్వర్షన్‌కు వీలుండటంతో అడ్మిషన్లు మెరుగు పడ్డాయి. గత ఏడాది వెబ్ కౌన్సెలింగ్‌కు 1691 మంది హాజరు కాగా, ఈ ఏడాది ఎడ్‌సెట్ 4532 మంది రాయగా 1569 మంది హాజరయ్యారు. రెండో కౌన్సెలింగ్‌కు 32 మంది హాజరయ్యారు. 90 మంది వరకు సీట్లురాక వారి ధ్రువపత్రాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సహాయ కేంద్రానికి వచ్చి తీసుకెళ్లారు. మారిన ఫీజు స్ట్రక్చర్... ఈ ఏడాది నుంచి బీఈడీ కళాశాలల ఫీజు స్ట్రక్చర్ కూడా ఇంజినీరింగ్ కళాశాలలు మాదిరిగా మారాయి. ఫీజుల నియంత్రన మండలి నిర్ణయిస్తుంది. గతంలో ప్రైవేటు కళాశాలలన్నింటి ఫీజు ఒకేలా ఉండేది. ప్రస్తుతం కళాశాలల వసతి బట్టి 17 వేలు నుంచి 22 వేల వరకు నిర్ణయించారు. కామన్ ఫీజు, స్పెషల్ ఫీజులతో కలిపి రూ.15వేల వరకు ప్రభుత్వం అర్హత గల వారికి ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తుంది. కళాశాలలు తమ భవనాలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఫీజుల నియంత్రణ కమిటీకి అందజేయూల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ సీట్లకు తగ్గిన డిమాండు బీఈడీ కళాశాలల్లో 25 శాతం మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు నింపుతారు. ప్రస్తుతం మేనేజ్ మెంట్ కోటా సీట్లకు గతంతో పోల్చితే డిమాండు తగ్గింది. గతంలో రూ.లక్ష నుంచి రూ.50 వేల మధ్య సబ్జెక్టు బట్టి సీట్లకు డిమాండు ఉండేది. సోషల్ స్టడీస్‌కు డిమాండు ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం గిరాకీ తగ్గింది. కళాశాల బట్టి రూ. 30వేల నుంచి 40వేల మధ్య మేనేజ్ మెంట్లు వసూలు చేస్తున్నారుు. వాస్తవంగా కన్వీనర్ ఫీజులకు సమానంగా మాత్రమే వసూలు చేయాలి. ఈ నిబంధన ఎక్కడా అమలుకావడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో శతశాతం మేజేజ్ మెంట్ సీట్లు నిండే అవకాశం ఉంది. అయితే, అధిక మొత్తంలో డబ్బులు చెల్లించేందుకు విద్యార్థులు సిద్ధంగాలేనట్టు కనిపిస్తోంది. అనధికార వసూళ్లు! ఉన్నత విద్యామండలి హెచ్చరికలు జారీ చేస్తు న్నా ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో అనధికార వసూ ళ్లు తగ్గడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా అన్ని ప్రైవేటు కళాశాలలు కూడా బిల్డింగ్, కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో అనధికార వసూళ్లకు పాల్పడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు అనధికార భారం వేస్తున్నారని వాపోతున్నారు. ఉన్నత విద్యామండలి మాత్రం ఈ వసూళ్లపై ఎప్పటి నుంచే నిఘా పెట్టింది. అయినా కళాశాలలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.