breaking news
draft list
-
కదలిన అస్సాం తేనెతుట్టె
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాల పర్యవసానంగా తమ భవితవ్యం ఏమవుతుందోనని అక్కడ స్థిరపడిన మన వృత్తి నిపుణులు ఆందోళన పడుతున్న తరుణంలో ఈశాన్య భారతంలోని అస్సాం జనాభాలో ఈ దేశ పౌరులెందరు, ‘ఇతరులు’ ఎందరని ఆరా తీసే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం విడుదల చేసిన జాతీయ పౌర గుర్తింపు(ఎన్ఆర్సీ) తుది ముసాయిదా ప్రకారం ఆ రాష్ట్రంలోని 2 కోట్ల 89 లక్షల83 వేల 677మంది ఈ దేశ పౌరులని, మిగిలిన 40.07 లక్షలమంది విదేశీయులని నిర్ధారణ చేశారు. ఇది తుది ముసాయిదాయే తప్ప తుది జాబితా కాదని భారత రిజిస్ట్రార్ జనరల్ శైలేష్తోపాటు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ కూడా ప్రక టించారు. అయితే ఇలాంటి ప్రకటనలు ‘దేనికీ చెందని’ లక్షలాదిమందిని కుదుటపరచలేవు. వారు ఈ జాబితాలో చోటు సంపాదించుకోవటం కోసం కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అడిగిన ఆధారాలన్నిటినీ జత చేయాలి. తమ పూర్వీకులు ఈ దేశ పౌరులేనని చెప్పడానికి 1951 లేదా 1971నాటి గుర్తింపు పత్రాలను అందజేయాలి. ఎందుకంటే... ఆ రాష్ట్రంలో 1951లో తొలి ఎన్ఆర్సీ రూపొందగా 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి, అస్సాం ప్రభుత్వానికి, ఉద్యమ నాయకులకు మధ్య కుదిరిన ఒప్పందంలో రెండో ఎన్ఆర్సీకి 1971 మార్చి 24ను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణ యించారు. అయితే తాము అవసరమైన పత్రాలన్నీ జత చేసినా పేర్లు గల్లంతయ్యాయని చెబుతున్న వారున్నారు. తమ కుటుంబంలో కొందరి పేర్లు జాబితాలో ఉన్నా మరికొందరివి లేవని ఆందోళన పడుతున్నవారున్నారు. 40.07 లక్షలమందిలో అత్యధికులు ముస్లింలు అయి ఉండొచ్చుగానీ, కొందరు హిందువులకూ జాబితాలో అన్యాయం జరిగిందని ఆరోపణలొస్తున్నాయి. అంతర్జాతీయ ఒడంబడికలు ఏం చెబుతున్నా మన దేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత ప్రజానీకానిదే. తాతముత్తాతల నుంచి సాగుచేసుకుంటున్న పొలం నీది కాదంటే ఎవరికైనా కాళ్ల కింది భూమి కదిలిపోతుంది. కుటుంబం మొత్తం అల్లకల్లోలమవుతుంది. అలాంటిది దశాబ్దాలకిందట అస్సాం కొచ్చి స్థిరపడినా, తరాలు గడిచిపోయినా ‘మీరు విదేశీయుల’ంటూ ముద్ర వేస్తే వారు ఏమైపోతారో సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. పైగా ఆ రాష్ట్రం జాతి సమస్యతో అట్టుడికిన చరిత్రగల అత్యంత సున్నితమైన ప్రాంతం. 1979–85 మధ్య ఆ రాష్ట్రంలో మహోధృతంగా సాగిన ఉద్యమానికి ప్రధాన కారణం వలసలే. విదేశీయులను గుర్తించి వారిని తక్షణం పంపేయాలన్నది ఆ ఉద్యమం ప్రధాన డిమాండు. ఆ తర్వాతే అక్రమ వలసదారుల గుర్తింపు కోసం పౌరసత్వ గణన చేయాలన్న నిర్ణయం జరిగింది. అయితే ఉద్యమనాయకులే అనంతరకాలంలో అధికారంలోకొచ్చినా అస్సాంలో ఎన్ఆర్సీ పని మొదలుపెట్టలేకపోయారు. అటు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలదీ ఇదే వరస. 2010 వరకూ నత్తనడకన సాగిన పని కాస్తా ఆ తర్వాత ఆగిపోయింది. చివరకు 2014లో దాఖలైన పిటి షన్తో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని గడువు నిర్ణయించింది. ఇన్నాళ్లకు ఎన్ఆర్సీ తుది ముసాయిదా సిద్ధమైంది. ఈ ముసాయిదాలో పేర్లు లేని 40 లక్షలమందీ సెప్టెంబర్ ఆఖరుకల్లా విదేశీయులేనని నిర్ధారణ అయితే వారు ‘రాజ్యం లేని పౌరులు’గా మారతారు. అలా ముద్రపడినవారి విషయంలో ఏం చేస్తారన్న స్పష్టత ఇప్పటికైతే లేదు. వారిని స్వీకరించమని బంగ్లాదేశ్‌ను కోరతారా, ప్రత్యేక శిబి రాలు పెట్టి తరలిస్తారా అన్నది చూడాల్సి ఉంది. పౌరసత్వాన్ని నిరూపించుకోలేనివారు బంగ్లాదేశీ యులేనని ప్రభుత్వం భావిస్తున్నా, వారిని వెనక్కి తీసుకోవాలని ఇంతవరకూ కేంద్రం అధికారికంగా బంగ్లాదేశ్‌ను కోరలేదు. తమ పౌరులెవరూ భారత్‌లో లేరని ఇప్పటికే బంగ్లా ప్రకటించింది. నలభై లక్షలమంది జనాభా అంటే మాటలు కాదు. ఈ స్థాయి జనాభా కలిగిన దేశాలు ప్రపంచంలో వంద వరకూ ఉన్నాయి. అస్సాంలో 60, 70 దశకాల్లో ‘బొంగాల్ ఖేదా’(బెంగాలీలను బహిష్కరించండి) నినాదంతో సాగిన ఉద్యమం పర్యవసానంగా ఏళ్ల తరబడి ఉంటున్న వేలాదిమంది బెంగాలీలు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు వదులుకుని ప్రాణభయంతో పశ్చిమబెంగాల్‌కి వెళ్లాల్సి వచ్చింది. అస్సాం ఉద్యమం సమయంలో 1983లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించి నప్పుడు నౌగాన్ జిల్లాలోని దాదాపు 14 గ్రామాలపై అల్లరి మూక విరుచుకుపడి వేలాదిమందిని ఊచకోత కోసింది. ఈ ఊచకోతలో ప్రాణాలు కోల్పోయినవారికి సంబంధించి నేటికి కూడా అధి కారిక లెక్కలు వెల్లడి కాలేదు. పదివేలమంది మరణించి ఉంటారని అనధికార అంచనా. ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు అన్న తేడా తప్ప వలసల ప్రమేయం లేకుండా ఏర్పడిన దేశాలు ఈ ఆధునిక ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అయితే ఎక్కడినుంచో కొత్తగా వచ్చి స్థిరపడిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోతుంటే, వనరులపై వారి ఆధిపత్యం పెరుగుతుంటే స్థానికుల్లో ఆందోళన రాజుకోవటం సహజం. ఈ వైరుధ్యాన్ని సకాలంలో గుర్తించి పరిష్కరించకపోతే అది క్రమేపీ ఉగ్రరూపం దాలుస్తుంది. ఉపేక్షిస్తే అది పరస్పర హననానికి, ఇతర వైపరీత్యాలకు దారి తీస్తుంది. అస్సాంలో టీ ప్లాంటేషన్లలో పనిచేయించడానికి 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు తెలుగునాట ఏజెన్సీ ప్రాంతాలతో మొదలుపెట్టి బిహార్, బెంగాల్ వగైరా రాష్ట్రాల నుంచి వేలా దిమందిని తరలించారు. అలా వెళ్లినవారిలో బెంగాలీ హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. అహోం, కలిత, చౌతియా తదితర జాతులవారు అస్సామీలుకాగా, కూలీలుగా వెళ్లి తరతరాలుగా స్థిరపడ్డవారు ఈనాటికీ అస్సామేతరులన్న ముద్రతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు అస్సాంతో అయిపోలేదు. తమ రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్సీ గణన ప్రారంభించాలని మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో డిమాండ్లు బయల్దేరాయి. కనుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత జాగురూకతతో వ్యవహ రించాలి. మయన్మార్‌లో రోహింగ్యాలు చవిచూస్తున్న దుర్భర పరిస్థితులు ఇక్కడ ‘విదేశీయులు’గా ముద్రపడినవారికి ఎదురుకాకుండా చూడాలి. మన దేశానికి అప్రదిష్ట కలగకుండా సామరస్యపూర్వ కంగా పరిష్కరించాలి. -
ఆమ్ ఆద్మీ బీమా యోజన ప్రారంభించిన తేది?
ఎకానమీ: ప్రణాళికలు: 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12): పదకొండో పంచవర్ష ప్రణాళిక 2007 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ప్రణాళిక సంఘం ఈ ప్రణాళిక ముసాయిదా పత్రాన్ని 2006 అక్టోబరు 19న ప్రతిపాదించింది. ఈ ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి 2007 డిసెంబరు 19న ఆమోదించింది. 11వ ప్రణాళిక పెట్టుబడి రూ. 36,44,718 కోట్లు. దీంట్లో పదో ప్రణాళిక కంటే 120 శాతం ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. ఇందులో కేంద్రం వాటా రూ. 21,56,571 కోట్లు (59.2 శాతం), రాష్ట్రాల వాటా రూ. 14,88,147 కోట్లు (40.8 శాతం). దీంట్లో ఎక్కువ మొత్తంలో ప్రణాళిక పెట్టుబడి పొందిన రాష్ర్టం - ఉత్తరప్రదేశ్ (రూ. 1,81,094 కోట్లు). రూ. 1,47,395 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 11వ ప్రణాళిక - వనరుల కేటాయింపులు: 1. సామాజిక సేవలు: 30.3% 2. శక్తి/ విద్యుచ్ఛక్తి: 23.4% 3. వ్యవసాయం, నీటి పారుదల: 18.5% 4. రవాణా, సమాచారం: 18.3% 5. పరిశ్రమలు, ఖనిజాలు: 4.2% 6. సైన్స అండ్ టెక్నాలజీ, పర్యావరణం: 2.4% 7. సాధారణ ఆర్థిక సేవలు: 1.7% 8. ఇతర సేవలు: 1.2% సామాజిక సేవలు అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, మంచినీరు, పారిశుధ్యం, గృహ వసతి మొదలైనవి. ఈ సామాజిక సేవలో భాగమైన విద్యకు 9.5%, ఆరోగ్యానికి 5% కేటాయింపులు చేశారు. విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా పద కొండో ప్రణాళికను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘విద్యా ప్రణాళిక’గా పేర్కొన్నారు. పదకొండో ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చిన రంగాలు: 1. వ్యవసాయం 2. గ్రామీణాభివృద్ధి 3. సామాజిక రంగాలు ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం ‘సత్వర ప్రగతి, సమ్మిళిత వృద్ధి’ సాధించడం, జీడీపీ వృద్ధిరేటు పెరుగుదల 9% సాధించడం. నూతన దృష్టితో విశాల పరిధి ఉన్న పథకాల ద్వారా సత్వర వృద్ధి సాధించాలని ఈ ప్రణాళికలో నిర్ణయించారు. ఈ ప్రణాళికకు ఉపలబ్ధ్దిలను జాతీయస్థాయిలో 27గా, రాష్ర్టస్థాయిలో 13గా నిర్ణయించారు. జాతీయ స్థాయిలో 27 లక్ష్యాలను స్థూలంగా ఆరు అంశాలుగా పేర్కొన్నారు. అవి: 1. ఆదాయం, పేదరికం 2. ఆరోగ్యం 3. విద్య 4. మౌలిక సౌకర్యాలు 5. మహిళలు, పిల్లలు 6. పర్యావరణం పదకొండో ప్రణాళిక జాతీయ స్థాయి లక్ష్యాలు: -. ఆదాయం, పేదరికం: - జీడీపీ వృద్ధి రేటు 9 శాతం సాధించడం - వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు సాధించడం - పారిశ్రామిక రంగంలో 10.5% వృద్ధిరేటు సాధించడం - సేవా రంగంలో 9.9% వృద్ధిరేటు సాధించడం - 70 మిలియన్ల (7 కోట్లు) మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించడం - విద్యావంతుల్లో నిరుద్యోగం 5% కంటే తక్కువగా ఉండేట్లు చూడటం - నైపుణ్యాలు లేని శ్రామికుల నిజ వేతన రేటు 20 శాతానికి పెంచడం - జనాభా నిష్పత్తి ఆధారంగా లెక్కించిన వినియోగ పేదరికాన్ని 10 శాతానికి తగ్గించడం - 2012 నాటికి పేదరికాన్ని 15 శాతానికి తగ్గించడం, 2017 నాటికి 10 శాతానికి మించకుండా చూడటం - 10 సంవత్సరాల్లో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఆరోగ్యం: - శిశు మరణాల రేటును 28కి తగ్గించడం - {పసూతి మరణాల నిష్పత్తిని ప్రతి వేయి ప్రసూతులకు 1కి తగ్గించడం - మొత్తం సంతాన సాఫల్యత రేటును 2.1కి తగ్గించడం - 2009 నాటికి అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం - పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 3 సంవత్సరాల వయసులోపు పిల్లల శాతాన్ని సగానికి తగ్గించడం. - రక్త హీనతతో బాధపడుతున్న మహిళలు, బాలికల శాతాన్ని సగానికి తగ్గించడం ఐఐఐ. విద్య: 2003-04లో ప్రాథమిక విద్యను అభ్యసించే వారిలోని 52.2% డ్రాప్‌అవుట్స్ రేటును 2011-12 నాటికి 20 శాతానికి తగ్గించడం. - {స్తీ, పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసాన్ని 10% కంటే తక్కువకు తగ్గించడం. - ఉన్నత విద్యను అభ్యసించే వారిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచడం. - 2011-12 నాటికి 7 సంవత్సరాల పైన ఉన్న వారిలో అక్షరాస్యత రేటు 85 శాతానికి పెంచడం. {పాథమిక పాఠశాలలో కనీస అవసరాలతో కూడిన నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడం. - సర్వశిక్షా అభియాన్ పథకం కింద బాల - బాలికలను 100 శాతం నమోదు చేయడం. - మౌలిక సౌకర్యాలు: - 2009 నాటికి ప్రతి గ్రామంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అన్ని కుటుంబాలకు 24 గంటలు విద్యుత్ సౌకర్యాన్ని అందించడం. - 2009 నాటికి వేయి మంది, ఆపై జనాభా ఉన్న నివాస స్థలాలకు, 500 జనాభా ఉన్న గిరిజన, కొండ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం. - అన్ని గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యం, 2012 నాటికి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించడం. - 2012 నాటికి అందరికి ఇళ్ల స్థలాలు అందించడం, 2016-17 నాటికి గ్రామాల్లో పేదలందరికీ గృహ నిర్మాణానికి తోడ్పాటు అందించడం. గ. మహిళలు, పిల్లలు: - {స్తీ-పురుష నిష్పత్తి 2011-12 నాటికి 935కి, 2016-17 నాటికి 950కి పెంచడం. - {పభుత్వ పథకాల లబ్ధిదారుల్లో కనీసం 33% మహిళలు, బాలికలు ఉండేట్లు చూడటం. - ఎలాంటి నిర్బంధం లేకుండా సురక్షితమైన బాల్యాన్ని పిల్లలందరికీ అందించడం. గఐ. పర్యావరణం: - అదనంగా 5% అడవులు, చెట్లు పెంచడం. - 2011-12 నాటికి దాదాపుగా అన్ని పట్టణాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన రీతిలో వాయుకాలుష్య రహిత పరిస్థితులను కల్పించడం. - 2011-12 నాటికి అన్ని నదీ జలాల కాలుష్యం తొలగింపు, పట్టణ ప్రాంతాల్లో వృథా నీటి సక్రమ వినియోగం. - 2016-17 నాటికి ఇంధన సామర్థ్యాన్ని 20 శాతానికి పెంచడం. అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన (ఖఆ్గ): అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే బీపీఎల్ కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2007 అక్టోబరు 1న ప్రారంభించారు. ఈ పథకంలో రూ. 30,000 వరకు ఆరోగ్య బీమా కల్పిస్తారు. ఈ పథకానికి కావాల్సిన నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. లబ్ధిదారులకు స్మార్టకార్డలను జారీ చేస్తారు. దీంతో వారు నగదు లేకుండానే ఆసుపత్రి నుంచి ఆరోగ్య సేవలు పొందవచ్చు. ఆమ్ ఆద్మీ బీమా యోజన (అఅఆ్గ): గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేద కుటుంబాలకు రూ.75,000 వరకు బీమా రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2007 అక్టోబరు 2న ప్రారంభించారు. దీని ద్వారా 1.5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో నిధులను భరిస్తాయి. దీనికి కావాల్సిన బీమా సంరక్షణను ఎల్ఐసీ నిర్వహిస్తోంది. బీమా పరిధిలో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం బారిన పడినా రూ.75,000 వరకు అందజేస్తారు. పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.37,500 వరకు, సహజ మరణం సంభవిస్తే రూ. 30,000 బీమా సంస్థ చెల్లిస్తుంది. ఈ పథకాన్ని ‘ఇందిర జీవిత బీమా పథకం’గా వ్యవహరిస్తారు. గ్రామీణ పేద కుటుంబంలో ఇంటి పెద్ద లేదా సంపాదించే వ్యక్తి పేరుతో బీమా చేయిస్తారు. బీమా చేయించే వ్యక్తికి 18-59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఈ పథకం అమల్లో రాష్ర్ట ప్రభుత్వం ‘నోడల్ ఏజెన్సీ’గా వ్యవహరిస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి బీమా ప్రీమియం రూ. 200. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 100, రాష్ర్ట ప్రభుత్వం రూ. 100 భరిస్తాయి. కేంద్ర ప్రభుత్వ ప్రీమియం చెల్లించడానికి వీలుగా రూ. 1000 కోట్ల నిధిని సర్కారు తరఫున ఎల్ఐసీ నిర్వహిస్తుంది. మరణించిన వ్యక్తి ఇద్దరు పిల్లలకు 9-12వ తరగతి వరకు ప్రతి నెలకు రూ. 300 ఉపకార వేతనంగా చెల్లిస్తారు. మాదిరి ప్రశ్నలు 1. జనతా ప్రభుత్వం 6వ పంచవర్ష ప్రణాళికను ఏ కాలానికి రూపొందించింది? 1) 1978-80 2) 1978-83 3) 1980-85 4) ఏదీకాదు 2. ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ధరలను నియంత్రణ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని సాధించడానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చారు? 1) 5 2) 4 3) 7 4) 6 3. ఏకకాలంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వ్యవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధి చేయడం ఎన్నో ప్రణాళికలో వ్యూహంగా తీసుకున్నారు? 1) 4 2) 5 3) 6 4) 7 4. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు దాదాపుగా సమాన కేటాయింపులు చేయడం వల్ల మూడో ప్రణాళికను ఏమని పిలుస్తారు? 1) వ్యవసాయ, పారిశ్రామిక ప్రణాళిక 2) అభివృద్ధి ప్రణాళిక 3) సహజ ప్రణాళిక 4) సంతులన ప్రణాళిక 5. పదో ప్రణాళిక (2002-07) లక్ష్యం ఏమిటి? 1) స్థిరత్వంతో కూడిన ఆర్థిక వృద్ధి 2) సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక వృద్ధి 3) సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడిన జననాణ్యత పెంచడం 4) సంపూర్ణ ఉద్యోగితతో కూడిన ఆర్థిక వృద్ధి 6. భారతదేశంలోని ప్రణాళికా పద్ధతికి అత్యున్నత సంస్థ (అ్కఉగీ ఆౌఛీడ) ఏది? 1) ప్రణాళిక సంస్థ 2) జాతీయ అభివృద్ధిమండలి 3) కేంద్ర ప్రభుత్వం 4) పార్లమెంటు 7. ఎన్నో ప్రణాళికలో భారీ మూలధన వస్తు పరిశ్రమలకు బదులుగా చిన్నతరహా పరిశ్ర మల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చారు? 1) 3 2) 4 3) 5 4) 6 8. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు లేకుండానే ఆర్థికాభివృద్ధిని ముందుకు నడిపించడం అనే లక్ష్యానికి సంబంధించిన పథకం ఏది? 1) భారత్ నిర్మాణ్ యోజన 2) పురా 3) ఎ్గ 4) ఒఖ్గ 9. కిందివాటిలో భారత ప్రణాళిక లక్ష్యం కానిదేది? 1) జాతీయ, తలసరి ఆదాయం వృద్ధి 2) అవస్థాపన సౌకర్యాల వృద్ధి 3) ఆర్థిక కేంద్రీకరణ వృద్ధి 4) ఏదీకాదు 10. దేశంలో అతి తక్కువ వృద్ధిరేటు (2.8%) మూడో ప్రణాళికలో నమోదైంది. ఆ తర్వాత స్థానంలోని ప్రణాళిక ఏది? 1) 1వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక 3) 5వ ప్రణాళిక 4) 9వ ప్రణాళిక సమాధానాలు: 1) 2; 2) 1; 3) 3; 4) 4; 5) 3; 6) 2; 7) 2; 8) 2; 9) 3; 10) 2. -
పేదలెవరు.. ధనికులెందరు
సాక్షి, ఏలూరు : సామాజిక, ఆర్థిక, కులగణన(ఎస్ఈసీసీ) ముసాయిదా జాబితాను గురువారం ప్రచురించనున్నారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ఉద్దేశించిన పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతో 2011లో కుటుంబాలు, వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం పరిశీలన 2013లో పూర్తయ్యింది. అన్ని గ్రామ పంచాయతీల్లో ఆయూ కుటుం బాల ముసాయిదా జాబితా రూపంలో తాజాగా ప్రచురణ జరుగుతుంది. గ్రామ సమాఖ్యల వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, రెవెన్యూ కార్యాలయం జాబితాలను ప్రజల పరిశీలనార్థం ఉంచుతారు. ‘హెచ్‌టీటీపీ/ఎస్ఈసీసీ/జిఓవీ.ఇన్’ వెబ్సైట్లోనూ ముసాయిదా జాబితా అందుబాటులో ఉంటుంది. జాబితా ప్రచురణకు సంబంధించిన ఫారాలు, స్టేషనరీ, ప్రచారానికి అవసరమైన కరపత్రాలను తహసిల్దార్, మునిసిపల్ కమిషనర్లకు అందజేశారు. జాబితా ప్రచురితమైన 10రోజుల లోపు గ్రామసభ జరుగుతుంది. 30 రోజులపాటు ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఆక్షేపణలు స్వీకరిస్తారు. ప్రజలు తమ అభ్యంతరాలను ఏ, బీ, సీ, డీ, ఈ ఫారాల్లో అందజేయాలి. స్వదస్తూరితో రాసిచ్చినా తీసుకుంటారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి మునిసిపల్ కమిషనర్ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏలూరు నగరపాలక సంస్థలో మాత్రం పట్టణ ప్రణాళికాధికారిని చార్జ్ ఆఫీసర్‌గా నియమించారు. ముసాయిదా జాబితా ప్రచురించిన 82వ రోజు అంటే అక్టోబర్ 20న తుది జాబితా ప్రచురిస్తారు. ఏ వ్యక్తి అయినా నిర్ధేశిత అధికారులు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ డివిజి నల్ అధికారికి, పట్టణ ప్రాంతం వారు జాయింట్ కలెక్టర్‌కు 7 రోజుల లోపు అప్పీల్ చేయవచ్చు. క్లెయిములు/ఆక్షేపణల షెడ్యూల్ ఇలా గ్రామ సభల నిర్వహణ ఆగస్టు 9 క్లెయిములు/ఆక్షేపణలను నిర్ణీత నమూనాలో స్వీకరించుట ఆగస్టు 29 క్లెయిములు/ఆక్షేపణలను పరిష్కరించుట సెప్టెంబర్ 20 అప్పీలేట్ అధికారికి దరఖాస్తుల సమర్పణ సెప్టెంబర్ 28 అప్పీల్స్ పరిష్కరించుట అక్టోబర్ 18 తుది జాబితా ప్రచురణ అక్టోబర్ 20