breaking news
DR. B.R. Ambedkar
-
అంబేడ్కర్ ఆశయం ‘ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం’
నాగపూర్: దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ఒక్కటే రాజ్యాంగం అమల్లో ఉండాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నిర్దేశించారని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజ్యాంగం అనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఆయన ఆశయం ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అని స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో శనివారం ‘రాజ్యాంగ ప్రవేశిక ఉద్యానవనాన్ని’ జస్టిస్ గవాయ్ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు ఏకైక రాజ్యాంగం అనే అంబేడ్కర్ దార్శనికత నుంచి సుప్రీంకోర్టు స్ఫూర్తి పొందిందని, అందుకే ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిందని తెలిపారు. ఈ ఆర్టీకల్ రద్దును సమర్థించిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ సైతం ఉన్న సంగతి తెలిసిందే. ఆర్టీకల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు తమ ముందుకు వచ్చినప్పుడు అంబేడ్కర్ మాటలు గుర్తుచేసుకున్నానని జస్టిస్ గవాయ్ చెప్పారు. దేశానికి ఒక్కటే రాజ్యాంగం ఉండాలన్న అంబేడ్కర్ బాటను అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఐక్య భారత్ రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నట్లు అంబేడ్కర్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయని జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. యుద్ధాలు జరిగితే దేశం ఐక్యంగా ఉండలేదని, ముక్కలవుతుందని చాలామంది అనుమానించారని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంతోపాటు అన్ని రకాల సవాళ్లు సమర్థంగా ఎదుర్కోగల సత్తా రాజ్యాంగానికి ఉందని అంబేడ్కర్ బదులిచ్చారని పేర్కొన్నారు. పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరుగుతోందో చూడాలని, ఎన్ని సవాళ్లు ఎదురైనా మన దేశం మాత్రం దృఢంగా, ఐక్యంగానే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రసంగించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప బహుమతులను రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్ మనకు అందించారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా రంగాల బాధ్యతలు, హక్కులను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని వెల్లడించారు. కొలీజియంపై పదవీ విరమణ తర్వాత మాట్లాడుతా.. ముంబై: న్యాయమూర్తులకు పదోన్నతులు, నియామకాలు, కొలీజియం తీసుకుంటున్న నిర్ణయాలపై పదవీ విరమణ (ఈ ఏడాది నవంబర్ 24) చేసిన తర్వాత వివరంగా మాట్లాడతానని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఇప్పుడు తనకున్న పరిమితుల దృష్ట్యా ఆయా అంశాలపై ఎక్కువగా స్పందించలేనని పేర్కొన్నారు. మనం కోరుకున్నట్లుగా ఏదీ జరగదని న్యాయమూర్తులు, న్యాయవాద వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆఫ్ బాంబే హైకోర్టు బెంచ్ ఆధ్వర్యంలో జస్టిస్ గవాయ్‌ని తాజాగా సన్మానించారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ సంజయ్ వి.గంగాపూర్వాలాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం దక్కలేదని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ వి.గంగాపూర్వాలాను ఉద్దేశిస్తూ.. ‘‘సంజయ్ భాయ్.. సుప్రీంకోర్టుకు రాకపోవడం వల్ల మీరు నష్టపోయింది ఏమీ లేదు. సుప్రీంకోర్టే నష్టపోయింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియంలో సభ్యుడిగా చేరినప్పటి నుంచి ప్రతిభకే పట్టం కట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ప్రతిభ ఆధారంగా న్యాయమూర్తులను నియమించడానికి తపన పడుతున్నానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న ఉత్తమమైన ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా రావాలన్నదే తన ఉద్దేశమని, అందుకోసం కొలీజియంలోని సహచర సభ్యులను ఒప్పిస్తుంటానని అన్నారు. జడ్జీల నియామకం కోసం పేర్లను ఒకసారి షార్ట్‌లిస్టు చేసే సమయంలో వారి కులం, మతం, ప్రాంతం చూసే అలవాటు లేదని చెప్పారు. వారికి అర్హత ఉందా? లేదా? వారికి చట్టాలు తెలుసా? లేదా? అనేది మాత్రమే చూస్తామని స్పష్టంచేశారు. జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ఇటీవల బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చారని, ఆయన తన పాత మిత్రుడేనని, గతంలో కలిసి పని చేశామని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. ఆయనకు పదోన్నతి కలి్పంచే విషయంలో ఆ స్నేహాన్ని పక్కనపెట్టి, అర్హతలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టంచేశారు. -
అంబేడ్కర్ కలలు సాకారం: జస్టిస్ గవాయ్
లండన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలు ఆచరణలోకి వస్తున్నాయని, భారత్‌లో నిమ్నవర్గాల ప్రజలు కూడా అత్యున్నత రాజ్యాంగ పదవులు అధిరోహిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్‌లోని చరిత్రాత్మక గ్రేస్ ఇన్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అంబేడ్కర్ బోధించారని గుర్తుచేశారు. బడుగు వర్గాల ప్రజలు కూడా ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన కలలుగన్నారని తెలిపారు. అంబేడ్కర్ కలలు సాకారం అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. అంబేడ్కర్ సూచించిన దారితో తాము నడుస్తున్నామని తెలిపారు. తాను దళిత వర్గం నుంచే వచ్చినట్లు జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి అయ్యారని పేర్కొన్నారు. ఇది నిజంగా గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇండియాలో అన్ని రంగాల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతోందన్నారు. -
అంబేడ్కర్ కృషిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
ఖజురహో: దేశంలో జల వనరుల అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో తగనన్ని జల వనరులతోపాటు వాటి నిర్వహణలో మెరుగ్గా ఉన్న దేశాలే ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో నీటి సంరక్షణే అతిపెద్ద సవాలు అని తేలి్చచెప్పారు. బుధవారం మధ్యప్రదేశ్‌లో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఖజురహోలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. మన దేశంలో జల వనరుల బలోపేతానికి, నిర్వహణకు, డ్యామ్‌ల నిర్మాణానికి అంబేడ్కర్ దార్శనికత, దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఏర్పాటు వెనుక అంబేడ్కర్ కృషి ఉందన్నారు. అతిపెద్ద నదీ లోయ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. జల సంరక్షకుడు అంబేడ్కర్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జల సంరక్షణ ప్రాధాన్యతను సైతం పక్కనపెట్టాయని విమర్శించారు. ఈ సందర్భంగా దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100 నాణాన్ని మోదీ విడుదల చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,153 అటల్ గ్రామ్ సేవా సదనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.437 కోట్లతో ఈ సదనాలు నిర్మిస్తారు. నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో ప్రాజెక్టులు ఆలస్యం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. నదుల అనుసంధానంలో భాగంగా దౌధన్ సాగునీటి ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కెన్–బెత్వా నదుల నీటిని నింపిన రెండు కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు. రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టు నమూనా(మోడల్)లో మోదీ ఈ నీటిని ధారగా పోశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని లాంఛనంగా ఆరంభించారు. కెన్–బెత్వా నదుల అనుసంధానంతో బుందేల్‌ఖండ్ ప్రాంతంలో సౌభాగ్యం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని మోదీ ఉద్ఘాటించారు. రూ.44,605 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్‌లో 21 లక్షల మందికి తాగునీరు లభించనుంది. 2,000 గ్రామాల్లో 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అలాగే 103 మెగావాట్ల హైడ్రోపవర్, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. -
సామాజిక రాజకీయ దార్శనికుడు
ఇది అంబేడ్కర్ యుగం. అంబేడ్కర్ జీవన గాథలో వ్యక్తిత్వ నిర్మాణ శిల్పం ఉంది. హేతువాద భావనా మూర్తిమత్వం వుంది. ఆయన్ని ఈనాడు ప్రపంచమంతా స్మరించుకోవడానికి కారణం ఆయన ప్రపంచ మానవునిగా, మేధావిగా విస్తరించటమే! ఆయన అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. భారతదేశంలో వచ్చిన రాజకీయ పరిణామాలన్నిటిపై ఆయన బలమైన ముద్ర ఉంది. భారత రాజ్యాంగ రూపకల్పనలో లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలను బౌద్ధ తాత్విక దృక్పథంతో మేళవించారు. అంబేడ్కర్ పోరాటమంతా బహు జనుల రాజ్యాధికార దిశగానే సాగింది. అందుకు సిద్ధాంతాలు, ప్రణాళికలు, పార్టీలు, కార్యాచరణ రూపొందించారు. రాజ్యాధికారమే వారికి సంపదను, సమతను ఇస్తాయని చెప్పారు.అంబేడ్కర్ గుణగణాలు ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి రూపొందించుకున్నవే. ఆయన తల్లిదండ్రులు నీతి, నిజాయితీ గలిగిన సంస్కరణ హృదయులు. ఆనాడే వారి వ్యక్తిత్వం నలుగురు నోళ్ళలో నానింది. మహర్లు సహజంగానే నీతిపరులు. అందునా ఇది సైనిక కుటుంబం. మహర్ సైనికులకు అంబేడ్కర్ తండ్రి టీచర్ కూడా! తండ్రి క్రమశిక్షణతో కూడిన జీవితమే అంబేడ్కర్లో ప్రతిఫలించింది. చాలామంది వ్యక్తిస్వార్థంతో జీవిస్తారు, సామాజికంగా జీవించలేరు. అంబేడ్కర్ కుటుంబం మొదటి నుండి సామాజిక స్పృహతో జీవించింది. అంబేడ్కర్ పూర్ణంగా తల్లి, తండ్రి రూపం. ఆయన చిన్నతనం నుండి కూడా తనకు ఎదురైన ప్రతి సంఘటననూ మొత్తం సమాజపరంగా చూసి దానిమీద పోరాటం చేసే తత్త్వాన్ని తండ్రి నుండే నేర్చుకున్నాడు.తల్లిదండ్రుల వారసత్వంఎక్కడా కూడా ఆయన జీవితంలో చిన్న తప్పు చేయలేదు. మచ్చలేని వ్యక్తిగా ఆయన జీవన క్రమం సాగింది. తల్లితో ఎక్కువ గడపకపోయినా, ఆయన బంధువులందరూ తల్లిని గురించే ప్రస్తావించేవారు. ఆమె సంతానాన్ని కనే సమయంలో ప్రసవ వేదనలకు గురై, శక్తి శూన్యమైనప్పుడు కూడ ‘ధైర్యాన్ని వదలని గొప్ప వ్యక్తి’. అంబేడ్కర్ కూడా జీవితంలో ఎన్నో దుఃఖ ఘట్టాలు వచ్చినా సహించాడు, ఎదురుతిరిగాడు, పోరాడాడు, విజయం పొందాడు. తల్లి రూపంలో ఉన్న సౌందర్యం, సౌకుమార్యం, శిల్పం అంబేడ్కర్‌కు వచ్చాయి. ఈనాడు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకశిల్పం జాతిని ఏకం చేస్తూ మనకు కన్పిస్తుంది– అదే అంబేడ్కర్ శిల్పం. ఈ రూపాన్ని ఈ దేశానికి, ప్రపంచానికి ఇచ్చిన భీమాబాయి అన్వర్థ నామధేయం గలది. ‘భీమా’ అంటే ‘శక్తి’ అని అర్థం. అంబేడ్కర్ ఒక జాతీయవాదిగా మహర్ రెజీవ్ు వారసునిగా ఎదిగాడు. అంబేడ్కర్ కుటుంబం, వంశం, దేశంకోసం పోరాడిన నేపథ్యం కలిగి వున్నాయి.అంబేడ్కర్ జీవన వర్తనలో కరుణ, ప్రేమ, సామాజిక విప్లవం స్ఫూర్తి, సాంస్కృతికత, తాత్విక అధ్యయనం, ఆచరణ బలంగా ఉన్నాయి. అంబేడ్కర్ తత్వవేత్త, దార్శనికుడుగా ఎదగడానికి కారణం ఆయనలోనే హేతువాద భావనాధ్యయనం ఉండటం. ఆయన వేదాలను, ఉపనిషత్తులను, దర్శనాలను, ఆరణ్యకాలను, ముఖ్యంగా పరాశర స్మృతిని, నారద స్మృతిని అధ్యయనం చేసి, వాటిని నిశితంగా శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషణ చేశారు. భారతదేశంలో వేద వాఙ్మయాన్ని క్షుణ్ణంగా చదివిన పది మందిలో ఆయన ఒకరు. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపించారు. ప్రపంచంలోనే రాజనీతిజ్ఞులుగా పేరొందిన జాన్ డ్యూయికి వారసుడు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తాత్వికుడు. ప్రజాస్వామ్యంలో దాగున్న నియంతృత్వాన్ని ప్రశ్నించిన పోరాటవీరుడు. భారత స్వాతంత్య్రోద్యమంలో దాగున్న వర్ణ, కులాధిపత్య భావాలను పసిగట్టిన, ప్రకటించగలిగిన రాజకీయ ప్రజా ధురంధరుడు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అంబేడ్కర్ హిందూ రాజకీయాల నిజ స్వరూపాన్ని గమనించారు. ‘మీరు స్వాతంత్య్రాన్ని కోరుతోంది కేవలం అధికార మార్పిడి కోసమే. కానీ ఈ కులాల ఆధిపత్యాన్ని ఎదిరించడానికి కాదు. కులం నుండి విముక్తి చేయడానికి జరిగే పోరాటమే నిజమైన స్వాతంత్య్ర పోరాటం’ అని అంబేడ్కర్ నొక్కి వక్కాణించారు. అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో భారత స్వాతంత్య్రోద్యమ నాయకత్వంలో దాగిన కుల భావాలను బయటకీడ్చారు. భారతదేశంలో కులం చట్రం నుండి బయటకు రాలేక చాలామంది దేశ నాయకులు, ప్రపంచ మేధావులు కాలేకపోయారు. ప్రత్యామ్నాయ తత్వంభారతదేశంలో వచ్చిన రాజకీయ పరిణామాలన్నిటిపై ఆయన బలమైన ముద్ర ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలను బౌద్ధ తాత్విక దృక్పథంతో మేళవించారు. రాజ్యాంగ నిర్మాణంలో వున్న పటిçష్ఠత వలన దాని మౌలిక రూపాన్ని మార్చాలనుకునే వారి ప్రయత్నాలు విఫలం అవుతూ వస్తున్నాయి. దానికి కారణం రాజ్యాంగం సత్యనిష్ఠగా రూపొందించబడటమే. కులం, అççస్పృశ్యత, లింగవివక్ష, మతమౌఢ్యాలన్నింటినీ ఆయన ఎదిరించగలిగారు. ప్రత్యామ్నాయ తత్వాన్ని రూపొందించగలిగారు.1913 లోనే ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్ళగలిగారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి తన ‘ది ఎవొల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా’ గ్రంథాన్ని సమర్పించారు. అంబేడ్కర్ వ్యక్తిత్వంలో ప్రధాన అంశం అవినీతి రహిత జీవనం. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న నిక్కచ్చితనం అనేది ఆయన్ని ప్రపంచ మానవుడిగా విస్తరింపజేసింది. అనేక దేశాలలో చదివినా ఒక చిన్న మచ్చ లేకుండా, ఏ విధమైన వ్యసనాలూ లేకుండా ఆదర్శంగా నిలిచిన వ్యక్తిత్వ నిర్మాణ దక్షుడు.రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ, బహిరంగ వేదికల మీదా అనర్గళంగా మాట్లాడారు. నిరంతరం రాయడం ద్వారా గొప్ప వాఙ్మయ సంపదను సృష్టించారు. బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్ (లండన్ పార్లమెంటు)లో ఆయన శతజయంతిని జరిపింది. ఆ దశకు అంబేడ్కర్ చేరడానికి కారణం ఏమిటి? ఆయనకు ఆ నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? అని పరిశీలిస్తే, కృషి ఉంటే అట్టడుగు లోయల నుండి కూడా పర్వత శిఖరాలను అధిరోహించవచ్చు అని అర్థం అవుతుంది. పాలకులు కండి!అంబేడ్కర్ నిర్మించిన ఇండియన్ లేబర్ పార్టీ 1937లో బొంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు పటిష్ఠమైన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ఇండియన్ లేబర్ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశంతో 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించారు. ఆ సందర్భంగా, దళితుల సాంఘిక, ఆర్థిక హక్కులను సాధించటానికి వారికి రాజకీయాధికారం కావాలని ప్రబోధించారు. తన ‘రణడే, గాంధీ అండ్ జిన్నా’ గ్రంథంలో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ ప్రతిపక్షపు ప్రాధాన్యాన్ని నొక్కి వక్కాణించారు. 1952 ఎన్నికలకు సన్నద్ధమవుతూ, షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ మాత్రమే గెలవడం కష్టమని భావించి ఇతర వామపక్ష పార్టీలను పొత్తు కోసం పిలిచారు. అçస్పృశ్యతను నివారించే క్రమంలో సామాజిక అసమానతలను రూపుమాపే ముఖ్యసూత్రంపైన ఆయన పార్టీల పొత్తును కోరారు. ఆయన ఈ విషయంపై ప్రజా సోషలిస్టు పార్టీతో చర్చించారు. ‘సోషలిస్టులు కొన్ని విషయాల్లో నమ్మదగ్గవారు కాకపోయినా వారు మతశక్తులు కాదు. రాజకీయంగా వారి మార్గం సరైనదే. అందుకే వారితో నేను కలవడానికి వెనుకాడటం లేదు’ అని వ్యాఖ్యానించారు.అంబేడ్కర్ పోరాటమంతా బహుజనుల రాజ్యాధికార దిశగానే సాగింది. అందుకు సిద్ధాంతాలు, ప్రణాళికలు, పార్టీలు, కార్యాచరణ, రూపొందించారు. రాజ్యాధికారమే వారికి సంపదను, సమతను సమసమాజ నిర్మాణాన్ని కలిగిస్తుందని అంబేడ్కర్ ఆశయం. బానిసలుగా బతకవద్దు, పాలకులుగా బతకండి అని చెప్పారు. అందుకు త్యాగాలు అవసరం. అంబేడ్కర్ త్యాగ జీవితమే మనకు దిక్సూచి. ఆ దిశగా నడుద్దాం.- వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695(నేడు డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి)- డా‘‘ కత్తి పద్మారావు -
బీఆర్ అంబేద్కర్‌కు మరో అరుదైన గౌరవం
యునైటెడ్ నేషన్స్: రాజ్యాంగ నిర్మాత, 'భారతరత్న' డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఈ ఏడాది అంతా అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసింది. వాటికి కొనసాగింపుగా మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)లోనూ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ శనివారం వెల్లడించారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నింపడం, అసమానతలు రూపుమాపడంతోపాటు పేదరిక నిర్మూలనకూ అంబేద్కర్ విశేష కృషిచేశారని, ఆయన అందించిన స్పూర్తి నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని, అందుకే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ జయంతివేడుకలను నిర్వహిస్తున్నామని అక్బరుద్దీన్ వెల్లడించారు. భారత శాశ్వత రాయబారితోపాటు కల్పనా సరోజ్ ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ హారిజోన్ సంస్థలు సంయుక్తంగా యూఎన్ లో వేడుకలను నిర్వహించనుంది. అంబేద్కర్ జయంతికి ఒకరోజు ముందు, అంటే ఏప్రిల్ 13న న్యూయార్క్ లోని ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా 'అసమానతలపై పోరాటం: ఆమోదయోగ్య లక్ష్యాలు' అంశంపై పలువురు అధ్యయనకారులు ప్రసంగిస్తారు. భారత్ వెనుకబాటుకుగురైన కోట్లాది మందిని అంబేద్కర్ చైతన్యపరిచారని, సామాజిక న్యాయం, సమానత్వాల కోసం జీవితాంతం శ్రమించారని ఐక్యరాజ్య సమితి.. బాబా సాహెబ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 2030లోగా అసమానతలు లేని సమాజాన్ని స్థాపించేందుకు యూఎన్ జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కూడా ప్రకటనలో గుర్తుచేశారు. బీఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావాడేలో 1891 ఏప్రిల్ 14న జన్మించారు. న్యాయ కోవిదుడిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా, స్వాతంత్ర్యోద్యమంలో దళిత నాయకుడిగా నేకాక ఆంథ్రోపోలజిస్ట్ , హిస్టారియన్, బెస్ట్ స్పీకర్, రైటర్, ఎకానమిస్ట్, ఎడిటర్, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్తగా ఖ్యాతిపొందిన అంబేద్కర్ 1956లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం 1990లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' పొందారు.