breaking news
dividend distribution tax
-
హింద్ జింక్ డివిడెండ్ ఎంతంటే..
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. తాజాగా నిర్వహించిన వాటాదారుల సమావేశంలో డైరెక్టర్ల బోర్డు రూ. 2 ముఖవిలువగల షేరుకి 500 శాతం డివిడెండ్‌ను ఆమోదించినట్లు హిందుస్తాన్ జింక్ పేర్కొంది. దీంతో ప్రతీ షేరుకి రూ. 10 చొప్పున వాటాదారులకు చెల్లించనుంది. ఇందుకు వేదాంతా గ్రూప్ సంస్థ మొత్తం రూ. 4,225 కోట్లు వెచి్చంచనుంది. గతేడాది(2024–25) సైతం డివిడెండ్ల రూపేణా వాటాదారులకు మొత్తం రూ. 12,250 కోట్లు చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది షేరుకి రూ. 19, రూ. 10 చొప్పున రెండుసార్లు డివిడెండ్ ప్రకటించింది. అత్యధిక డివిడెండ్ ఈల్డ్ అందిస్తున్న మెటల్ రంగ దిగ్గజాలలో కంపెనీ ఒకటికాగా.. తాజా డివిడెండ్ ప్రకటనతో ప్రభుత్వానికి రూ. 1,180 కోట్లు చెల్లించనుంది. కాగా.. వెండి ఉత్పత్తిని రెట్టింపునకు(రూ. 1,500–2,000 మెట్రిక్ టన్నులు) పెంచుకోవడంతోపాటు.. రాజస్తాన్‌లో ఎరువుల ప్లాంటును ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. కంపెనీ ఇటీవల రాజస్తాన్, యూపీ, ఆంధ్రప్రదేశ్‌లలో కీలకమైన మినరల్ బ్లాకులను సాధించిన విషయం విదితమే. హిందుస్తాన్ జింక్ షేరు బీఎస్ఈలో 2.5 శాతం క్షీణించి రూ. 520 వద్ద ముగిసింది. -
ఎస్ఈజెడ్లకు మ్యాట్ మినహాయించాలి
కేంద్రానికి ఎగుమతిదారుల విజ్ఞప్తి న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లను(ఎస్ఈజెడ్) కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) నుంచి మినహాయించాలని ఎగుమతిదారుల మండలి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్య ఎగుమతుల వృద్ధితోపాటు, దేశీయ తయారీ రంగానికి సైతం సానుకూల ప్రయోజనం కల్పిస్తుందని ఈఓయూ అండ్ ఎస్ఈజెడ్ ఎగుమతి అభివృద్ధి మండలి(ఈపీసీఈఎస్) తన ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తెలియజేసింది. ఎస్ఈజెడ్లపై మ్యాట్‌ను తొలగించాలన్నది తమ ప్రథమ డిమాండ్ అని పేర్కొంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే కనీసం దీనిని 7.5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఎస్ఈజెడ్ డెవలపర్లను డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని కూడా సూచించింది. మ్యాట్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నులు ఎస్ఈజెడ్లకు సంబంధించి ‘పెట్టుబడుల సానుకూల ధోరణిని’ దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. సేవల పన్నుల నుంచి సైతం ఎస్ఈజెడ్లను మినహాయించాలని కోరింది. దేశ ఎగుమతుల్లో ఎస్ఈజెడ్లదే కీలకపాత్ర. దేశ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 33 శాతం ఎస్ఈజెడ్లదే. దాదాపు 15 లక్షల మందికి ఎస్ఈజెడ్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎస్ఈజెడ్ల నుంచి 2005-06లో ఎగుమతుల విలువ రూ.22,840 కోట్లు. 2013-14లో ఈ విలువ రూ.4.94 లక్షల కోట్లకు ఎగసింది.