breaking news
Disability Section
-
40% ఉంటే కొలువులు
సాక్షి, హైదరాబాద్: వికలాంగుల కోటా ఉద్యోగాల నియామక నిబంధనలను ప్రభుత్వం సవరించింది. వికలాంగ కోటాకు అర్హత కోసం కనీసం 40 శాతం వైకల్యాన్ని ప్రామాణికం (బెంచ్‌మార్క్ డిసెబిలిటీ)గా నిర్దేశించింది. వికలాంగ కోటాకు అర్హుల జాబితాలో కొత్తగా తక్కువ దృష్టి (లో విజన్), వినికిడి కష్టం (హార్డ్ హియరింగ్), కండరల వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రొఫి), నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ, మానసిక రోగాలతో బాధపడే వ్యక్తులను చేర్చింది. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లను వర్తింపజేసేందుకు అమలు చేసే రోస్టర్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే వికలాంగుల కోసం 6వ, 31వ, 56వ పాయింట్లు కేటాయించగా తాజాగా 82వ పాయింట్‌ను ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ, మానసిక రోగం, చెవిటి–అంధత్వంతో బాధపడే వారి కోసం కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996కు కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైకల్యం ఉన్నా అర్హులే... కొత్త నిబంధనల ప్రకారం 40 శాతానికి తగ్గకుండా నిర్దేశిత వైకల్యం కలిగి ఉంటే వికలాంగ కోటాలో ఉద్యోగార్హతకు ప్రామాణిక వైకల్యం (బెంచ్‌మార్క్ డిజేబిలిటీ)గా పరిగణిస్తారు. వైకల్యం లెక్కింపునకు నిబంధనలు ఉన్నా, లేకపోయినా అర్హులే కానున్నారు. అంటే లెక్కించదిగిన వైకల్యం గలవారితోపాటు లెక్కించలేని వైకల్యంగల వారూ అర్హులు కానున్నారు. ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిలో భర్తీ చేసే ప్రతి 50 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలను వికలాంగుల కోసం రిజర్వు చేయాలన్న పాత నిబందనను ప్రభుత్వం తొలగించింది. ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిలో భర్తీ చేసే ప్రతి 50 ఉద్యోగాల్లో 4 ఉద్యోగాలను ప్రామాణిక వైకల్యంగల వారికి రిజర్వు చేయాలనే కొత్త నిబంధనను దాని స్థానంలో పొందుపరిచింది. కేటగిరీల మార్పిడి ఇలా.. ఏదైనా నిర్దేశిత కేటగిరీ వికలాంగులకు రిజర్వ్ అయిన పోస్టుల భర్తీకి సంబంధిత కేటగిరీలో అర్హులైన వికలాంగులు లేకపోతే అనుసరించా ల్సిన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. - ఒక నియామక సంవత్సరంలో ప్రామాణిక వైకల్యంగల అర్హుడైన వ్యక్తి అందుబాటులో లేకపోవడం/ఇతర కారణాలతో ఏదైనా పోస్టు భర్తీకానప్పుడు, ఆ పోస్టును తదుపరి నియామక సంవత్సరంలో భర్తీ చేసేందుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తదుపరి నియామక సంవత్సరంలోనూ ప్రామాణిక వైకల్యంగల అర్హుడు లభించనిపక్షంలో, ఐదు వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పులు జరపడం ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలి. మూడో నియామక సంవత్సరం లో ఏ కేటగిరీ వికలాంగుడూ అందుబాటులో లేనిపక్షంలో ఆ ఏడాది సకలాంగుడితో పోస్టును భర్తీ చేయవచ్చు. - ఏదైనా శాఖలో పోస్టుల స్వభావ రీత్యా ఏదైనా కేటగిరీ వికలాంగుడికి ఉద్యోగం కల్పించే అవకాశం లేకపోతే స్త్రీ, శిశు సంక్షేమశాఖ జీవో నం.10 ప్రకారం ఐదు వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పులు జరపడం ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలి. - రోస్టర్ పాయింట్ ప్రకారం మహిళా వికలాంగులకు కేటాయించిన పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మరో నియామక సంవత్సరం వరకు వేచి చూడకుండా ఆ పోస్టును అదే వికలాంగ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులతో భర్తీ చేయాలి. అదే కేటగిరీ పురుష అభ్యర్థులు సైతం అందుబాటులో లేకపోతే ఆ పోస్టును తదుపరి నియామక సంవత్సరంలో భర్తీ చేసేందుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తదుపరి నియామక సంవత్సరంలో తొలుత సంబంధిత కేటగిరీ మహిళ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈసారి కూడా మహిళా అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో అదే కేటగిరీ పురుష అభ్యర్థులతో భర్తీ చేయాలి. రెండో నియామక సంవత్సరంలోనూ సంబంధిత కేటగిరీ మహిళ, పురుష అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో పోస్టును రోస్టర్ పాయిం ట్లలోని తదుపరి వికలాంగ కేటగిరీ వారితో భర్తీ చేయాలి. అయినా అర్హులైన అభ్యర్థులు లేకుంటే రోస్టర్ పాయింట్‌లోని ఆ తర్వాతి వికలాంగ కేటగిరీ వారికి కేటాయించాలి. - ఏ వైకలాంగ కేటగిరీ అభ్యర్థులు కూడా అందుబాటులో పక్షంలో మాత్రమే సకాలంగులతో పోస్టులు భర్తీ చేసుకోవాలి. - ఏదైనా కేటగిరీ వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని, రిజర్వేషన్ల కోటా తగ్గించాలని, పని స్వభావం రీత్యా వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పిళ్లు జరపాల్సి ఉందని ప్రభుత్వశాఖలు భావిస్తే స్త్రీ, శిశు సంక్షేమశాఖ జీవో నం. 10 ప్రకారం వికలాంగ రిజర్వేషన్ల అమలు నుంచి సదరు శాఖకు పాక్షిక లేదా పూర్తిగా మినహాయింపు కల్పించాలని ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీని కోరవచ్చు. కొత్త రోస్టర్ పాయింట్లు ఇలా... - రోస్టర్ పాయింట్ల చక్రంలో 6వ, 31వ, 56వ స్థానాలను వరుసగా అంధత్వం/అథమ దృష్టి సామర్థ్యం (మహిళలు)... చెవిటి/వినికిడి కష్టం (ఓపెన్)... లోకోమోటార్ డిసెబిలిటీ, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత (ఓపెన్) గల వ్యక్తులకు కేటాయించాలి. - 100 రోస్టర్ పాయింట్ల తర్వాత రెండో, మూడో, నాలుగో చక్రంలో ఈ కింది పాయింట్లు చేరుతాయి.. - 106, 206, 306 – అంధత్వం, తక్కువ దృష్టి సామర్థ్యం (ఓపెన్) - 131, 231, 331 – చెవిటి, వినికిడి కష్టం (131–విమెన్, 231–ఓపెన్, 331–ఓపెన్) - 156, 256, 356 – లోకోమోటార్ డిసెబిలిటి, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత (156–ఓపెన్, 256–విమెన్, 356–ఓపెన్) - 182, 282, 382 – ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటి, మానసిక రోగులు, చెవిటి+అంధతోపాటు అంధులు, తక్కువ దృష్టి సామర్థ్యం, చెవిటి/వినికిడి కష్టం, లోకోమోటార్ డిసెబిలిటి, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత, ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటి, మానసిక రోగాల్లో ఒకటికి మించి రోగాలుగల వారు.(182–ఓపెన్, 282–ఓపెన్, 382–విమెన్) -
విరబూసిన ‘గిరి’ కుసుమాలు
పేదరికాన్ని జరుుంచారు.. ఒకరు డాక్టర్.. మరొకరు ‘జేఈఈ’ జాతీయ ర్యాంకర్ కష్టజీవుల ఇంట జన్మించారు.. ఇష్టపడి చదివారు.. ఉన్నత ర్యాంకులు సాధించారు.. తల్లిదండ్రులు లేకున్నా ఒకరు అనుకున్న లక్ష్యానికి చేరుకుని డాక్టర్ అయ్యూరు.. అమ్మానాన్న ఉన్న ఓ బిడ్డ ఆలిండియూ జేఈఈ మెరుున్స్‌లో మొదటి ర్యాంకు సాధించాడు.. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న ‘జేఈఈ’ ర్యాంకర్ దాతలు ముందుకొస్తేనే చదువు సాగుతుందంటున్నారు.. గురిచూసి చదివిన గిరిజన బిడ్డలకు పలువురు సాయం అందించాలని కోరుతున్నారు. నర్సంపేట : జఫర్‌గఢ్ మండలం ఓబులాపూర్తండాకు చెందిన బానోతు మంగ్తు, కమలి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కొడుకు వెంకన్న 2015 జేఈఈ ఎస్టీ కేటగిరీ వికలాంగ విభాగంలో ఆలిండియూ నంబర్-1 ర్యాంక్ సాధించాడు. 1 నుంచి 5 వరకు దేవరుప్పులలోని సెరుుండీ జాండీ స్కూల్, 6 నుంచి 10 వరకు వరంగల్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ నర్సంపేటలోని కాకతీయు జూనియుర్ కళాశాలలో పూర్తి చేశాడు. జేఈఈ ఫలితాల్లో ఎస్టీ పీడబ్ల్యూడీ విభాగంలో ఆలిండియూ మొదటి ర్యాంక్ సాధించిన విషయుం విదితమే. వెంకన్న తన కుటుంబ ఆర్థిక నేపథ్యాన్ని గురువారం ‘సాక్షి’కి వివరించారు. తమకు నాలుగెకరాల వ్యవసాయు భూమి ఉంది. అమ్మానాన్నలు ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. అన్నయ్య శివకువూర్ ఏఐఈఈ ఈలో 150వ ర్యాంక్ వచ్చింది. ఎంటెక్‌లో తమిళనాడులోని తిరుచ్చిలో సీటు వచ్చినా ఆర్థిక స్తోవుత లేక ఈ ఏడాది ఏమి చేయూలో తెలియుని పరిస్థితి. ప్రస్తుతం నేను జాతీయు స్థారుులో మొదటి ర్యాంక్ సాధించినా నాలుగేళ్లకు రూ.4లక్షలు అవసరం కావాల్సి వస్తుండటంతో కుటుంబం ఆలోచనలో పడిందని వివరించాడు. కాగా, ఆర్థిక సాయం చేయదలచిన దాత లు సెల్ నం.8608571733కి ఫోన్ చేయూలని కోరాడు. కాగా, కాక తీయు కళాశాలకు చెందిన వెంకన్న ర్యాంక్ సాధించడంతో ఆర్డీఓ రావుకృష్ణారెడ్డి, డెరైక్టర్ గోగుల ప్రభాకర్‌రెడ్డి, సృజనారెడ్డి, వీరవుళ్ల వూధవరెడ్డి, వీరారెడ్డితోపాటు పలు వురు ఘనంగా సన్మానించారు. రుణం తీర్చుకుంటా.. తల్లిదండ్రుల కష్టాలను దగ్గరుండి చూశా. కష్టం చేసి అన్నను, నన్ను చదివించారు. వుంచి ర్యాంక్‌లు సాధించి వారికి కొంత సంతోషం కలిగించాం. భవిష్యత్‌లో వురెన్ని కష్టాలు ఎదురైనా వుంచి ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటా. - బానోతు వెంకన్న మరిపెడ : మరిపెడ మండలం వీరారం శివారు కేలోతుతండాకు చెందిన కేలోతు భీముడు, భద్రి దంపతులు. వారికి ముగ్గురు కొడుకులు వెంకన్న, హరినాయక్, సిరినాయక్, ముగ్గురు కుమార్తెలు సక్కు, కౌసల్య, మంగాదేవి ఉన్నారు. పెద్ద కొడుకు వెంకన్న పదకొండో ఏటనే తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో మృతిచెందారు. అప్పుడు హరి, సిరి చిన్నపిల్లలు. తండ్రి మృతిచెందిన తర్వాత వెంకన్న తీవ్రంగా కలత చెందాడు. పట్టుదలతో ఇద్దరు తమ్ముళ్లలో ఒకరిని డాక్టర్‌ను చేయాలనే పట్టుదలతో నాలుగెరాల భూమిలో పంట పండిస్తూ.. ఇద్దరు తమ్ముళ్లను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. పెద్ద తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు మూడెకరాల భూమి పోయి.. ఎకరం మాత్రమే మిగిలింది. అన్న కష్టాన్ని, తల్లిదండ్రుల మరణాన్ని గుర్తు చేసుకుంటూ నిరంతరం కష్టపడి చదివిన సిరినాయక్ ఇటీవలే ఆలిండియా ఎస్టీ కేటగిరీలో 25వ ర్యాంక్ సాధించాడు. ఆలిండియా వైద్య కళాశాల(ఏఐఐఎంఎస్) ఢిల్లీలో ఎండీ(ఓబీఎస్, గైనిక్)లో ప్రవేశం పొంది జిల్లాకే వన్నె తెచ్చాడు. 1 నుంచి 5వ తరగతి వరకు వీరారం ప్రభుత్వ పాఠశాల, 6 నుంచి 10 వరకు జనగామలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఇంటర్మిడియట్ ఏపీఆర్జేసీ కృష్టా జిల్లా నిమ్మకూరు, ఎంబీబీఎస్ హైదరాబాద్‌లోని కామినేనిలో పూర్తి చేశాడు. ఇదే ఏడాది ఏఐఐఎంఎస్‌కు ఎంట్రన్స్ రాసి ర్యాంక్ సాధించాడు. అయితే తన రెండో అన్న హరి ముందుగానే ఉద్యోగంలో చేరి.. సిరికి పెద్దన్న వెంకన్నతోపాటు చేదోడు వాదోడుగా నిలిచాడు. హరి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నతస్థాయికి ఎదగడంతో తండావాసులతోపాటు మండల ప్రజలు హర్షిస్తున్నారు.