breaking news
daughte Purnima r
-
‘సుప్రీం’కు తల్లీకూతుళ్ల వివాదం
- హైకోర్టు తీర్పు నిలుపుదలకు నిరాకరణ - ‘బీఈ’ వివాద పరిష్కార బాధ్యతలు పెద్ద మనుషులకు - ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోలాజికల్ ఈ (బీఈ) యాజమాన్యపు హక్కు విషయంలో తల్లీ, కూతుళ్ల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. కంపెనీ డెరైక్టర్లుగా ముగ్గురు కుమార్తెల నియామకం చెల్లదని, 81 శాతం వాటాల బదలాయింపు నిబంధనలకు అనుగుణంగా లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న ఈ వివాదాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవడం మేలని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతలను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.రెడ్డి, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్‌లకు అప్పగించింది. వీరు ఈ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఈ ఉత్తర్వుల ప్రతి అందుకున్న నాటి నుంచి ఆరు వారాల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ నాగప్పలతో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. బీఈ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ విజయకుమార్‌రాజు దాట్ల ఇటీవల మరణించడంతో, ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఇది హైకోర్టుకు చేరడంతో, సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. డెరైక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమల నియామకం, 81 శాతం వాటాల బదలాయింపు చెల్లదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మహిమ, పూర్ణిమలు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను గత వారం జస్టిస్ గోపాలగౌడ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇరుపక్షాల తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబాల్, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం, తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ వివాద పరిష్కార బాధ్యతలను మధ్యవర్తులకు అప్పగించింది. -
తల్లీ, కూతుళ్ల సెంటిమెంట్ కొట్టుకుపోయింది
81 శాతం వాటాల బదిలీ చెల్లదు బయోలాజికల్- ఈ కంపెనీ కుటుంబ వివాదంపై హైకోర్టు కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న బయోలాజికల్- ఈ (బీఈ) మార్గదర్శకుడి మరణంతో న్యాయ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తల్లీకూతుళ్లు హద్దులు గీసుకుని చేస్తున్న ఈ యుద్ధంలో సెంటిమెంట్ కొట్టుకుపోయింది. వారసులెవరనే విషయంపై కోర్టులో తల్లీ, కూతుళ్లు తమంతట తాముగా దోషులుగా నిలబడి, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ బయోలాజికల్- ఈ (బీఈ) కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చిం ది. కంపెనీ డెరెక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమ చట్టబద్ధంగా నియమితులు కాలేదని తేల్చి చెప్పింది. బీఈ చైర్మన్, ఎండీ విజయకుమార్ దాట్ల పేరుతో ఉన్న 81 శాతం వాటాల బదిలీ చెల్లదని ప్రకటించింది. కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తల్లి రేణుక దాట్ల, కుమార్తెలు పూర్ణిమ, ఇందిరా, మహిమ.. వివాదాలను పక్కనపెట్టాలని ఆదేశించింది. మూడో వ్యక్తికి జోక్యం చేసుకునే అవకాశమిస్తే, కంపెనీ పట్టాలు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిం చింది. తాత్కాలిక బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లుగా రేణుక, ఆమె ముగ్గురు కుమార్తెలను నియమించిన కోర్టు, వీరిలో రేణుక ఈడీగా, మిగిలినవారు డెరైక్టర్లుగా ఉంటారని తెలిపింది. వారసులెవరనే విషయంపై సివిల్ కోర్టులో ఉన్న వివాదం తేలేంత వరకు ఆయనకున్న 81శాతం వాటాలను బోర్డు ఎవరికీ బదలాయించరాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... బీఈ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న డాక్టర్ దాట్ల విజయకుమార్‌రాజు ఇటీవల మరణించారు. ఆయన మృతితో ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఇదే సమయంలో ముగ్గురు కుమార్తెలు డెరైక్టర్లుగా నియమితులయ్యారు. విజయకుమార్ రాజు పేరు మీద ఉన్న 81 శాతం వాటాను ముగ్గురు కుమార్తెల్లో ఒకరి పేరున బదలాయించుకున్నారు. వీటన్నింటిపై విజయకుమార్‌రాజు సతీమణి రేణుక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, ఇటీవల తీర్పు వెలువరిస్తూ, కంపెనీ ప్రయోజనాలనే సర్వోన్నతంగా భావిస్తూ తల్లీ, కూతుళ్లకే నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. రేణుక మేనేజింగ్ డెరైక్టర్‌గా, ఏకాభిప్రాయంతో ఈ బోర్డు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బోర్డు డెరైక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, కంపెనీ లా బోర్డును ఆశ్రయించి ఉత్తర్వులు పొందవచ్చునని తెలిపారు. కంపెనీ లా బోర్డులో ఉన్న పిటిషన్‌పై నిర్ణయం వెలువడేంత వరకు ఈ తాత్కాలిక బోర్డు కొనసాగుతుందని, సివిల్ కోర్టులో వివాదం తేలేంత వరకు తమ వద్ద ఉన్న పిటిషన్‌ను కంపెనీ లా బోర్డు అలానే పెండింగ్‌లో ఉంచాలని ఆదేశించారు.