‘వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక న్యాయం జరగాలంటే దేశంలో సంపద, అవకాశాలు, ఉద్యోగాలు జనాభా దామాషా ప్రకారం పంపిణీ జరగాలని, ఇది రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారానే సాధ్యపడుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సహకరించాలని కోరుతూ ఆదివారం ఆయన కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావాలేను కలిశారు.
కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తమకు అన్ని విధాలుగా అండగా ఉండాలని మంత్రిని కోరారు. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందినప్పుడే అంబేడ్కర్ ఆశయం సిద్ధిస్తుందని తెలిపారు.