breaking news
D. Venkateswara Rao
-
గ్రామస్థాయి నుంచే పునర్నిర్మాణం జరగాలి
కామారెడ్డి : తెలంగాణ పునర్నిర్మాణంలో అధికారులు, ప్రజలు ఉత్సాహంతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు అన్నారు. ఇందు కోసం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి కృషి జరగాలన్నారు. గురువారం కామారెడ్డి, బోధన్‌లలో ‘మన గ్రామం - మన ప్రణాళిక’ అనే అంశంపై అధికారులకు అవగాహన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రా మాల్లో నెలకొన్న ఉమ్మడి సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించవచ్చనే విషయంపై గ్రామస్థాయిలో చర్చించి ప్రణాళికలు రూపొందించాలని సూచిం చారు. ప్రతి గ్రామంలో గ్రామ, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిని ప్రణాళికలో పొం దుపర్చాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేసేదని, నవతెలంగాణ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామ స్థాయి నుంచే పథకాలు రూపొందించి వాటిని అ మలు చేయాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలో ఉ పాధ్యాయులు ఎక్కువగా ఉండి, విద్యార్థులు లేని పక్షంలో ఉపాధ్యాయులను రేషనలైజ్ ద్వారా అవసరమున్న చోటుకు పంపించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఇంటికి నీటి కుళాయి జిల్లాలో దెబ్బతిన్న చిన్ననీటి వనరులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు గ్రామాల్లో చెరువుల వివరాలను సేకరించి వాటిని మరమ్మతులు చే యాల్సి ఉంటుం దన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి నీటికుళాయి ఉండేలా చూడాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు నాణ్యతలోపంతో చేపట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజ ల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో 50 వేల మొక్కలు నాటించాలని సూచిం చారు. రైతులు పండించిన పంట చేతికిరాకముందే దళారులు ప్రవేశిస్తున్నారని, అవసరం ఉన్న ప్రతి గ్రామంలో గో దాములు నిర్మించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచడానికి వైద్యులు కృషి చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కఠినంగా ఉండాలి ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. చాలా మంది ఆర్థికంగా ఉన్నవారు ఆదాయ ధ్రువపత్రాలతో ఫీజు రీయింబర్ ్సమెంటు పొందుతున్నారని, గతంలో ఇచ్చిన ఆదాయ పత్రాలను రద్దు చేసి కొత్తగా ఇస్తామన్నారు. తప్పుడు సమాచారంతో సర్టిఫికెట్ పొందితే ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే 1956 తరువాత వచ్చిన వారు నాన్‌లోకల్ అవుతారని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. తాత, తండ్రుల చరిత్రను తెలుసుకుని సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. బోగస్ రేషన్‌కార్డులను ఏరివేయాలి జిల్లాలో 5.90 లక్షల కుటుంబాలుంటే ఏడు లక్షల రేషన్ కార్డులున్నాయని, ఇందులో లక్ష కార్డులు అదనంగా ఉన్నం దున, వాటిని అనర్హుల నుంచి వాపస్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రేషన్ డీలర్ల వద్ద బినామీ కార్డులుంటే వారిని డిస్మిస్ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐకేపీ పీడీ వెంకటేశం, డ్వామా పీడీ శివలింగయ్య పాల్గొన్నారు. -
మన ఐఏఎస్,ఐపీఎస్‌లు ఎటు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సహజంగా జిల్లా స్థాయి అధికారులలో కొందరికి స్థాన చలనం ఉంటుంది. నూతనంగా ఏ ర్పడే ప్రభుత్వం, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించే మంత్రులూ తాము కోరుకున్న వారిని ఉన్నతాధికారులుగా తెచ్చుకోవడం పరి పాటే. అయితే ఈసారి రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల బదిలీలు అనివార్యంగా మారాయి. ఉమ్మడి రాష్ర్టంలో పని చేసిన సివిల్ సర్వీసు అధికారుల ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియ ఊపందుకుంది. జూన్ రెండు తర్వాత తక్షణమే ఈ ప్రక్రియ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావు, బోధన్ సబ్ కలెక్టర్ ఎం.హరినారాయణన్ల ఆప్షన్ ఏమిటో ఇంకా స్పష్టం కాలేదు. డీఐజీ ఎన్.సూర్యనారాయణ, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి ఇక్కడే కొనసాగుతారా? లేక ఇతర ప్రాంతాలకు వెళ్తారా? అన్న చ ర్చ జరుగుతుండగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో ఎవరు ఉం టారు.. ఎవరు బదిలీ అవుతారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అధికారం చేపట్టబోయే పార్టీ నేతలు మాత్రం జిల్లాకు కొత్త టీమ్ ఖాయమంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల మదిలో ఏముందో జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మదిలో ఏముందే ఇంకా బయట పడటం లేదు. ఈ అధికారులు ఎవరు ఎక్కడికి ఆప్షన్ ఇచ్చారన్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఇద్దరు మినహాయిస్తే మిగతావారు ఇతర రాష్ట్రాలకు చెందినవారే గనక, ఆంధ్రలో చేసిన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన ఒక్కటేనన్న భావనతో ఉన్న ట్లు చెప్తున్నారు. కొందరు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం. ఏం జరుగుతుందనేది రెండు రోజులలో తేలనుంది. లిఖిత పూర్వ కంగా ఆప్షన్ ఇస్తేనే దానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండగా, త్వరలోనే బదిలీలపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పోలిస్తే ఆరుగురు ఐఏఎస్ అధికారులు ‘తెలంగాణ’లో ఎక్కువగా ఉన్నారు. ఈ లెక్కన కూడ ఆరుగురిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు పంపాల్సి ఉంటుంది. మొదట స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎవరు వెళ్లాలన్నది నిర్ధారించి, ఆ తర్వాత వారి ఆప్షన్లను తీసుకొని ఆ మేరకు కూడా అధికారులను ఉభయ రాష్ట్రాల మధ్య కేటాయిస్తే బాగుంటుం దన్న అభిప్రాయం కూడ అధికారుల్లో ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల బాటలో ఐఎఫ్ఎస్లు రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్రం ఏర్పాటులో భాగంగా వారు ఏ రాష్ట్రానికి వెళ్లదలచుకున్నారో ప్రాధాన్యాలను తెలపాలని సివిల్ సర్వీసు అధికారులను ప్రభుత్వం కోరిన నే పథ్యంలో జిల్లాలో ఉన్న ఐఎఫ్ఎస్ అధికారుల తీరుపైన చర్చ జరుగుతోంది. అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్లుగా ఉన్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు వై.బాబూరావు, ఆర్ పీఎన్ చౌదరి సైతం ఆప్షన్లు ఇచ్చినట్లు చెప్తున్నారు. పోస్టల్ శాఖ సీనియర్ సూపరింటెండెంట్‌గా ఐపీఎస్ అధికారి ధర్మజ్యోతి ఉన్నారు. మరోవైపు కలెక్టర్ పీఎస్ ప్రద్యు మ్న కర్ణాటకకు చెందినవారు కాగా, ఎక్కువ కాలం ఆంధ్ర ప్రాంతంలోనే పని చేశారు. విజయవాడ కార్పొరేషన్ కమిషనర్‌గా, చిత్తూరు జాయింట్ కలెక్టర్, గూడూరు స బ్కలెక్టర్గా పనిచేసిన ఈయన కలెక్టర్‌గా జిల్లాలో తెలంగాణలో ఇక్కడే మొదటి పోస్టింగ్. జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావు నల్గొండ జిల్లా డా. కేఎల్ రావు సాగ ర్ స్పెషల్ కలెక్టర్‌గా ఉండి పదోన్నతిపై నుంచి జిల్లాకు వచ్చారు. తమిళనాడుకు చెందిన 2010-11 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎం.హరినారాయణన్ బోధన్ సబ్‌కలెక్టర్‌గా ఉన్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ట్రైనీ సబ్‌కలెక్టర్‌గా వ్యవహరించిన ఆయన మొదటి పోస్టింగ్ బోధన్. తమిళనాడు సరిహద్దులో ఉండే ఆంధ్రప్రదేశ్‌లో పోస్టింగ్ కో సం ఆయన సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి మొదటి పోస్టింగ్ ఏఎస్పీ కరీంనగర్ జిల్లా గోదావరిఖని అ యినా, సీమాంధ్ర ప్రాంతంలోనే ఎక్కువ కాలం పనిచేశారు. విశాఖపట్నం డీసీపీగా, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా, వైజాగ్ గ్రేహౌండ్స్ కమాండర్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశారు. 2013 అక్టోబర్ 31న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. వీరందరి ఆప్షన్లు ఏమిటన్నది ఇంకా అధికారికంగా తేలలేదు.