breaking news
Cut-off
-
కటాఫ్టైమ్లో సెబీ మార్పులు
న్యూఢిల్లీ: ఓవర్‌నైట్ ఫండ్స్ (డెట్ మ్యూచువల్ ఫండ్స్)కు సంబంధించి కటాఫ్టైమ్లో సెబీ మార్పులు చేసింది. పనిదినంలో మధ్యాహ్నం 3 గంటల వరకు (కటాఫ్ టైమ్) వచ్చిన పెట్టుబడి అభ్యర్థనలకు అదే రోజు ముగింపు ఎన్ఏవీ (తదుపరి వ్యాపార దినం ముందు నాటి) వర్తిస్తుంది. 3 గంటల తర్వాత వచ్చిన దరఖాస్తులకు తదుపరి వ్యాపార దినం ఎన్ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు సాయంత్రం 7 గంటలను కటాఫ్ టైమ్‌గా సెబీ నిర్ణయించింది.అంటే ఆలోపు వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులకు అదే రోజు ఎన్ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఈ కొత్త వేళలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఓవర్‌నైట్ పథకాల యూనిట్లను తనఖా నుంచి విడిపించుకునేందుకు స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సబ్యులకు కొత్త మార్పులు అనుకూలించనున్నాయి. వీరు తమవద్దనున్న క్లయింట్ల నిధులను ఓవర్‌నైట్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. తద్వారా ఇన్వెస్టర్ల నిధులకు రిస్క్ ఉండకపోగా, స్టాక్ బ్రోకర్లకు కొంత ఆదాయం కూడా లభిస్తుంటుంది. -
కటాఫ్ జూలై 1
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు సోమవారం విడుదల చేశారు. బదిలీలకు జూలై 1వ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలని, ప్రతి పాఠశాలలో కనీసం ఒక టీచర్ ఉండేలా హేతుబద్ధీకరణ చేపట్టాలని అందులో పేర్కొన్నారు. బదిలీల కోసం టీచర్లు దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూలై 1 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవోలకు తెలియజేశారు. మార్గదర్శకాలు.. 1. హేతుబద్ధీకరణలో గుర్తించిన అదనపు ఎస్జీటీ పోస్టులను ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఆధారంగా అవరోహణ క్రమంలో కేటాయించాలి 2. ప్రాథమిక పాఠశాలల్లో సర్దుబాటు కాగా మిగిలిన ఎస్జీటీ పోస్టులను ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా పండిట్ల స్థానంలో కేటాయించాలి 3. ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయగా మిగిలిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇటీవల అప్‌గ్రేడై పోస్టులు మంజూరవని పాఠశాలలకు కేటాయించాలి. ఇంకా మిగిలితే ప్రాథమికోన్నత పాఠ శాలలకు, తర్వాత అధికంగా విద్యార్థులున్న పాఠశాలలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలి 4. స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్) లేకుంటే భాషా పండితుల పోస్టులనే కొనసాగించాలి 5. ఉన్నత పాఠశాలలకు సరిపడినంత మంది సబ్జెక్ట్ టీచర్లను ఇవ్వలేనపుడు అక్కడి ఎస్జీటీ పోస్టులను అక్కడే కొనసాగించాలి 6. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టును ప్రాథమిక పాఠశాలలకు తరలించాలి 7. హెచ్ఆర్ఏలో మార్పుల వల్ల స్కూళ్ల కేటగిరీలు మారితే ఆ దామాషాలోనే ఉపాధ్యాయులకు పాయింట్లను లెక్కించాలి 8. సక్సెస్ స్కూళ్లగా మారిన బాలికోన్నత పాఠశాలలు కో-ఎడ్యుకేషన్‌గానే మార్చాలి. 9. భాషలు మినహా మిగతా ఉపాధ్యాయులందరికీ బదిలీల కౌన్సెలింగ్‌ను మీడియంవారీగా నిర్వహించాలి 10. ఆన్లైన్లో నమోదు చేయని దరఖాస్తులను అంగీకరించరు 11. బదిలీలకు ఖాళీలు చూపి, టీచర్లు చేరే సమయంలో ఖాళీలు లేవని పేర్కొంటే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలుంటాయి 12. పాఠ్యపుస్తకాల రచయితలను రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్లుగా గుర్తించి పాయింట్లు కేటాయించాలి 13. సెప్టెంబర్ 5న జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారికే అవార్డు పాయింట్లివ్వాలి 14. గతేడాది డైస్లో విద్యార్థుల సంఖ్య పొరపాటుగా నమోదై ఉంటే హాజరు రిజిస్టర్లు, వార్షిక పరీక్షాపత్రాలను డీఈవోలు పరిశీలించి డీఎస్‌ఈకి నివేదించాలి 15. ఏజెన్సీ ప్రాంతంలో పదోన్నతులను జీవో నంబరు 3 ప్రకారం ఇవ్వాలి 16. ప్రతి స్కూల్లో కనీసం ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడుండేలా చూడాలి 17. 2011లో అదనంగా ఉన్న ఫిజికల్ సైన్స్ టీచర్లను గణితం బోధనకు తరలించారు. ప్రస్తుతం ఆ స్కూళ్లకు గణితం పోస్టు అవసరమైతే అక్కడ వారినే కొనసాగించాలి 18. అదనంగా ఉన్నట్లు తేలి ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను డీఈవో కార్యాలయంలో రిజర్వ్ చేయాలి. వాటిని తదుపరి పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి 19. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే సమీప స్కూలును కోరుకోవాలి. ఇద్దరూ టీచర్లై తప్పనిసరిగా బదిలీ అవుతుంటే ఒకరు ఎక్కడికైనా కోరుకోవచ్చు. రెండోవారు మాత్రం మొదట బదిలీ అయిన వారికి సమీపంలో కోరుకోవాలి 20. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపున్న ఆసుపత్రుల్లో చికిత్సకు సంబంధిత వైద్యులిచ్చిన ధ్రువపత్రాలను ప్రాధాన్యతా కేటగిరీ బదిలీలకు అనుమతించాలి 22. 610 జీవో ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ అయి రిలీవ్ కాకుండా కొనసాగుతున్న టీచర్లను ప్రస్తుత బదిలీల్లో అనుమతించాలి 23. బదిలీల కౌన్సెలింగ్ రోజు హాజరైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీగా పరిగణించాలి 24. తప్పనిసరి బదిలీల్లో ఉండి కౌన్సెలింగ్‌కు హాజరవని టీచర్లు, హెచ్ఎంలను కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన ఖాళీలకు బదిలీ చేయాలి 25. బదిలీ ఉత్తర్వులు పొందిన టీచర్లు వెంటనే రిలీవై మర్నాడే కొత్త స్కూళ్లలో చేరాలి. ఏవిధమైన వెయింటింగ్ పీరియడ్ ఇవ్వరు.