breaking news
Current crisis
-
సింగరేణి బకాయిలు చెల్లించి..విద్యుత్ సంక్షోభాన్ని నివారించాలి
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడం..థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా కాకపోవడమే కారణమని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పార్టీ పిలుపు మేరకు గురువారం మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తదితరులు లక్డీకాపూల్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎండీకి వినతిపత్రం అందజేశారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2023–24లో 700.2 లక్షల టన్నుల నుంచి 2025–26లో సుమారు 580 లక్షల టన్నులకు పడిపోయిందని, టీజీ జెన్కోకు కేటాయించిన దానికంటే తక్కువ బొగ్గు సరఫరా అవుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. సింగరేణి నిల్వల్లో కనిపించకుండా పోయినట్టు ఆరోపణలు వచి్చన 40 లక్షల టన్నుల బొగ్గుపై విచారణ నివేదికను బహిర్గతం చేయాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దాని విలువ సుమారు రూ.1,600 కోట్లుగా పేర్కొంటూ, జూలై 3న విజిలెన్స్ విచారణకు ఆదేశించినా నివేదిక ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం, దాని సంస్థల నుంచి రూ.51,500 కోట్లకుపైగా బకాయిలున్నాయని తెలిపారు. ఏడు రోజుల్లో రికార్డులు, వివరణలు ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు. కావాలనే విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకుంటున్నారు : జగదీశ్‌రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ సమస్య తీవ్రమైందని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కూడా కావాలనే బొగ్గు కొరత సృష్టించి కరెంటు ఉత్పత్తిని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను ఉమ్మడి జిల్లా పరి«ధిలోని మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించి అక్కడి అధికారులతో పవర్ ప్లాంట్ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్‌ప్లాంట్ ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రమైందని, పైర్లు ఎండిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. » గణపురంలోని కేటీపీపీని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు సందర్శించి బొగ్గు నిల్వలు, విద్యుదుత్పత్తిని పరిశీలించారు. విద్యుత్ కోతలు, బొగ్గు సరఫరాపై ప్రభుత్వాన్ని నిలదీశారు. » ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ కర్మాగారం సందర్శనకు ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, దిండిగాల రాజేందర్ తదితరులు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మణుగూరులోని బీటీపీఎస్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోగా, ప్లాంట్ సీఈతో మాట్లాడారు. ఇద్దరినే అనుమతిస్తామని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, నాయకులతో కలిసి ప్లాంట్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చాక రైతులకు నాణ్యమైన 8గంటల కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు » మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కోవ లక్షి్మ, అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోనేరు కొనప్ప, జాన్సన్ నాయక్, కౌశిక్‌హరి, రాజిరెడ్డి తదితరులు జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగరేణికి జెన్కో రూ.52వేల కోట్లు బకాయిలు ఇవ్వలేదనే కంపెనీ బొగ్గు సరఫరా చేయడం లేదన్నారు. -
జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని జార్ఖండ్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించింది. జార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభం ఇంతలా ఎందుకుందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్విటర్ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ''ఒక టాక్స్ పేయర్‌గా జార్ఖండ్ ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నా. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఇంతలా ఎందుకుందనేది తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మా తరపు నుంచి విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా సమస్య ఒక కొలిక్కి రావడం లేదు'' అని పేర్కొంది. కాగా గత కొన్నిరోజులుగా జార్ఖండ్‌లో రోజువారి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించిపోతున్నాయి. కరెంట్ వినియోగం పెరిగిపోవడం వల్ల లోడ్ మార్పు పేరుతో విద్యుత్ సిబ్బంది గంటల తరబడి కోత విధిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. చదవండి: Rishi Dhawan: ఫేస్‌గార్డ్‌తో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్.. అసలు కథ ఇదే! As a tax payer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years ? We are doing our part by consciously making sure we save energy ! — Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) April 25, 2022 -
గడ్డుకాలమే!
- కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు - పగులుతున్న రెతన్నల గుండెలు - పరిశ్రమలకు పవర్ హాలీడే ఇచ్చినా... సాగుపై శీతకన్నే సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో కరెంటు సంక్షోభం కమ్ముకోస్తోంది. మునుపెన్నడూ లేనంతగా రోజుకు 5 మిలియన్ యూనిట్ల కరెంటు లోటు ఏర్పడింది. పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పాటు పవర్ హాలీడే ప్రకటించి, గృహ విద్యుత్‌కు కోత పెట్టినా ... రోజుకు ఇంకా 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ అత్యవసరమవుతోంది. చేను పొట్టకొచ్చి గింజలు పాలుపోసుకునే సమయంలో కరెంటు కోతలు పెరిగిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. కానీ ఇప్పటికీ 2001 లెక్కల ఆధారంగానే రోజుకు 17.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో అధికారులు కేటాయించారు. ఇందు లో 6.50 మిలియన్ యూనిట్లువ్యవసాయానికి, 9.40 మిలియన్ యూనిట్లు పరిశ్రమలకు, మిగిలినది గృహ అవసరాల కోసం విని యోగిస్తున్నట్లు ట్రాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వట్టిపోతున్న పొట్టకొచ్చిన చేను జిల్లాలో 2.25 లక్షల ఉచిత విద్యుత్తు మోటారు కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 5.58 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇందులో 61.62 వేల హెక్టార్లలో వరి, 26 వేల హెక్టార్లలో చెరకు పం టలు సాగవుతున్నాయి. ఈ రెండు పంటలకు 24 గంటలు తడి అవసరం. మిగిలిన భూమిలో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలు వేశారు. 35 రోజుల నుంచి చినుకు కూడా రాలకపోవడంతో రైతులు విద్యుత్ మోటార్ల మీదనే ఆధారపడి కాలాన్ని నెట్టుకొచ్చారు. ప్రస్తుతం వరి చేసు పొట్టకురాగా, గింజ ఇప్పుడిప్పుడే పాలుబోసుకుంటున్నాయి. ఈ పంటలకు సరిగ్గా నీళ్లు పారాలంటూ రోజుకు కనీసం 10 గంటల పాటు నిరంతరాయ కరెంటు అవసరం. సరిగ్గా పంటకు నీళ్లు అవసరమైన సమయంలో కరెంటు కోతలు పెరగటం తో రైతుల గుండెలు పగులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 6 గంటల నిరంతరాయ కరెంటు అందిస్తామని ప్రకటించినప్పటికీ, వాస్తవంగా రైతులకు 4 గంటలకు మించి కరెంటు అందడం లేదు. టాన్స్‌కో అధికారుల అంచనాల ప్రకారం వ్యవసాయానికి ప్రస్తుతం కనీసం 7.50 మిలియన్ యూ నిట్లకు పైగా విద్యుత్ అవసరం, కానీ 4 మిలియన్ యూని ట్లకు మించి కరెంటును ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడో తిరకాసు రాష్ట్రం విడిపోవటం, విద్యుత్ డిస్కం పంపకాల్లో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోవడానికి తోడు, వర్షాలు కూడా కురవక పోవడంతో రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో జిల్లాకు రావాల్సిన రోజు వారీ వాటాలో 5 మిలియన్ యూనిట్లు కోత పెట్టారు. పరిశ్రమలకు పవర్ హాలీడే, గృహ వినియోగానికి కోత పెట్టడంతో 3 మిలియన్ యూనిట్ల కరెంటు కవర్ అవుతోంది. అయినా ఇంకా 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటుంది. ఈ లోటు పూడ్చటానికి అధికారులు వ్యవసాయానికి కోత పెడుతున్నారు. దీని కూడా ఓ కారణం ఉంది. వ్యవసాయానికి ఇచ్చేది ఉచిత విద్యుత్, వ్యవసాయానికి నెలకు 180 లక్షల మిలియన్ల విద్యుత్తు వినియోగిస్తున్నారు. ప్రతి విద్యుత్ మోటారు కనెక్షన్‌కు రూ.20 మాత్రమే సర్వీస్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.20 కోట్లకు మించి రావటంలేదు. అదే పరిశ్రమలకైతే... జిల్లాలో 9 వేల భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటికి రోజుకు 9.40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. పరిశ్రమలకు ఇస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌కు రూ. 6 చార్జీ వేస్తారు. ఈ లెక్కన పరిశ్రమల నుంచి నెలకు రూ.150 నుంచి రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది. దీంతో విద్యుత్ అధికారులు వ్యవసాయానికి ఇచ్చేది ఉచిత విద్యుత్తే కాబట్టి వ్యవసాయానికి ఇచ్చే కరెంటు మీద కోత పెట్టి అన్నదాతల ఉసురు తీస్తున్నారు.


