cumulonimbus
-
హైదరాబాద్ మరోసారి మునక
సాక్షి, హైదరాబాద్: వరుణుడు హైదరాబాద్‌పై కత్తిగట్టాడు. వీడకుండా వెంటాడుతున్నాడు. వం దేళ్లలో ఎన్నడూ చూడని వర్షం నాలుగైదు రోజుల కిందట మహానగరాన్ని నిండా ముంచగా... శని వారం సీన్ రిపీటైంది. వర్షం మళ్లీ హడలెత్తించింది. ఉరుములు, మెరుపులతో కూడిన క్యుములోనిం బస్ మేఘాల తీవ్రతతో శనివారం రాత్రి హైదరా బాద్ మళ్లీ వణికిపోయింది. మంగళ, బుధ వారాల్లో కురిసిన రికార్డు వర్షం తాలూకు వరదతో కాలనీలు ఇంకా తేరుకోకముందే వరుణుడు పగబట్టిన రీతిలో... మళ్లీ ఆ ప్రాంతాల్లోనే శనివారం సైతం కుండపోతగా వర్షం కురిసింది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి హయత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, మీర్‌పేట, పోచారం, ఘట్కేసర్లలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్ – విజయవాడ ప్రధాన రహ దారితో పాటు నగరంలోని రహదారులు పూర్తిగా జలమయమై ఈ రెండు రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చినుకుపడితేనే గజగజ వణుకుతు న్న నగరవాసులు ఇంటికి చేరేందుకు తొందరపడ టంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పాతబస్తీలోని ఛత్రినాకలో వరదనీటిలో పలు వాహæనాలు మళ్లీ కొట్టుకుపోయాయి. ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పైభాగంలో భారీ గొయ్యి పడటంతో బ్రిడ్జిని మొత్తం మూసేశారు. పాతబస్తీ బాబానగర్ పరిధిలో ని గుర్రంచెరువు గండి మరింత పెద్దది కావటంతో వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ఉప్పల్, ఎల్బీ నగర్, అంబర్‌పేట ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వరదనీటిలోనే మునిగిన కాలనీల్లో శనివారం నాటి వర్షం పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చింది. తేరుకునేలోపే... మళ్లీ వరద నాగోలు బండ్లగూడ, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్‌లో ఇటీవల మునిగి ఈ రోజే కాస్త ఉపశమనం పొందిన కాలనీలు, ఇళ్లలోకి శనివారం రాత్రి మళ్లీ వరద నీరు వచ్చి చేరింది. నాగోలు బండ్లగూడ పరిధిలోని సాయినగర్, ఆదర్శనగర్, ఎల్బీనగర్ పరిధిలోని హరిహరపురం, మిథులానగర్, మల్లికార్జుననగర్, బంజారాకాలనీ, రెడ్డికాలనీ, బైరామల్‌గూడ, హబ్సి గూడ రవీంద్రనగర్, లక్ష్మీనగర్, సాయిచిత్రనగర్, మధురానగర్‌లో వరద నీరు మరో అడుగు మీదకు చేరింది. బీఎన్‌రెడ్డి డివిజన్ కప్రాయి చెరువు పరిసరా ల్లోని హరిహరపురంకాలనీ, గాంధీనగర్‌కాలనీ సహా మీర్‌పేటలోని మంత్రాల చెరువు కింద ఉన్న మిథు లానగర్, సాయినగర్ కాలనీలతో పాటు హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారాకాలనీ, వనస్థ లిపురం కాలనీ పరిధిలోని మల్లికార్జున కాలనీలు గత నాలుగు రోజుల నుంచి నీటిలోనే ఉండిపో యాయి. మూడు రోజుల నుంచి వర్షం లేకపోవ డంతో వరద తగ్గుముఖం పడుతుందని భావించి ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరదనీరు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్ చైతన్యపురిలో భారీ వర్షానికి జలమయమైన ఓ కాలనీ బైరామల్గూడచెరువు పరిసరాల్లోని రెడ్డికాలనీ, వందనపురికాలనీ, కాకతీయనగర్ కాలనీ, బైరామల్‌గూడ కాలనీలు... సరూర్‌నగర్ చెరువుకు ఆనుకుని ఉన్న గ్రీన్‌పార్క్ కాలనీ, లింగోజిగూడ, ధర్మపురి కాలనీ, గౌతంనగర్, మన్సూరాబాద్‌లోని సరస్వతినగర్ కాలనీలకు మళ్లీ వరద పోటెత్తింది. బండ్లగూడ చెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో చెరువు కింది భాగంలో ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. నాలుగు రోజులుగా వరదలో చిక్కుకున్న కాలనీలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఆయా కాలనీల్లో అంధకారం నెలకొంది. కాగా మలక్‌పేట పోచమ్మ దేవాలయ సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ముట్టుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాములు(40) అక్కడికక్కడే మరణించాడు. ఉప్పల్ నుంచి నాగోల్ రహదారిలో భారీగా స్తంభించిన ట్రాఫిక్ ఉప్పల్, మేడ్చల్‌లో జోరువాన... ఘట్కేసర్, ఫిర్జాదిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఉప్పల్ నుంచి చిలుకానగర్ వైపు వెళ్లే రోడ్డులో కావేరీనగర్, న్యూభరత్‌నగర్, శ్రీనగర్ కాలనీ, తదితర ప్రాంతాల్లో వరదతో పాటు ఇళ్లల్లోకి చేరిన బురదతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఈ వర్షం మరింత ఆందోళనకు గురిచేసింది. ఉప్పల్ బస్‌స్టేషన్ నుంచి బోడుప్పల్ వెంకటేశ్వర టెంపుల్ వైపునకు వెళ్లే మార్గంలో సౌత్స్వరూప్నగర్ నాలాలోకి మరోసారి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీశ్రీనగర్, ద్వారకానగర్, పద్మావతికాలనీ, తదితర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మల్కాజిగిరిలోని ఎన్ఎండీసీనగర్, షిరిడీనగర్, అల్వాల్ శివానగర్, దినకర్‌నగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరింది. మంగళవారం 33 సెంటీమీటర్ల ఆల్‌టైం రికార్డ్ వర్షపాతం కురిసిన పోచారం, ఘట్కేసర్లలోనూ శనివారం మరోసారి కుండపోత స్థానికులను భయకంపితులను చేసింది. హైవేలపై మళ్లీ రాకపోకలు బంద్ హైదరాబాద్ –విజయవాడ రహదారిపై చైతన్యపురి, చింతలకుంట, అబ్దుల్లాపూర్‌మెట్ ఇనాంగూడ వద్ద భారీగా వరద నీరు చేరటంతో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. వరంగల్ – హైదరాబాద్ రూట్లో నారపల్లి – జోడిమెట్ల, ఉప్పల్ చెరువు వద్ద వరద నీరు చేరటంతో వాహనాలను అనుమతించలేదు. హిమాయత్‌సాగర్ 3 గేట్లు ఎత్తివేత ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వస్తుండటంతో శనివారం రాత్రి 9 – 10 గంటల మధ్యలో మూడు గేట్లు ఎత్తి వేశారు. ప్రస్తుతం నాలుగు గేట్ల ద్వారా నాలుగు అడుగుల వరద నీరు దిగువ ప్రాంతానికి వెళుతోంది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. క్యుములోనింబస్ వల్లే హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో శనివారం కురిసిన వర్షం క్యుములోనింబస్ మేఘాల వల్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి నాగరత్న తెలిపారు. తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం కాదని చెప్పారు. వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు పాతబస్తీ అతలాకుతలం.. వర్షం దంచికొట్టడంతో శనివారం మరోసారి పాతబస్తీ అతలాకుతలమైంది. గుర్రం చెరువు వరద నీరు పాతబస్తీని ముంచె త్తింది. మళ్లీ కాలనీలు నీటమునగడంతో మూలి గే నక్క మీద తాటిపండు పడ్డట్లు తయారైంది పరిస్థితి. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ♦లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ♦ఓపెన్ నాలాలు పొంగి పోతున్నాయి. ♦నాలాలకు పక్కనున్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. ♦వృక్షాలు కూలిపోయి విద్యుత్ వైర్లపై పడటంతో అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ♦చాంద్రాయణగుట్ట నియెజకవర్గంలోని అల్‌జుబేల్ కాలనీ, హషమాబాద్, క్రాంతినగర్, శివాజీనగర్, అరుంధతినగర్ కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ♦యాకుత్‌పురా నియోజకవర్గంలోని గంగానగర్, పటేల్‌నగర్, ముర్తుజానగర్, గౌలిపురాలోని నల్లపోచమ్మ బస్తీ, లలితాబాగ్ రైల్వే బ్రిడ్జి తదితర బస్తీలను వరదనీరు ముంచెత్తింది. ♦మీరాలంమండి కూరగాయల మార్కెట్ వరద నీటితో నిండిపోయింది. ♦డీఆర్డీఓ ప్రహరీగోడ కూలింది. -
వాన రాకడ, ప్రాణం పోకడే!
రెండో మాట నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతున్న కాలంలోనే తుపాను మేఘాలు పింజలు పింజలుగా అలుముకోవచ్చుననీ, తరువాత అటు విలయం, ఇటు సమరం అన్న చందంగా అవి టార్పిడోలు, టోర్నడోలుగాను మారి ఉగ్రతాండవం చేయవచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు అతివృష్టి, అనావృష్టి బాధకు పసిఫిక్ తీరస్థ వైపరీత్యాలు ఎల్‌నినో, లానినోలకు కారణమవుతున్నాయన్న భావనలో ఉన్నాం. కానీ తాజాగా ముంచుకొచ్చినదే ‘క్యుములోనింబస్’ బెడద. ‘సౌర కుటుంబంలో జరిగే వింత పరిణామాలు భూగ్రహ వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు బృహస్పతి (జూపిటర్) గ్రహానికి తోబుట్టువుగా చెప్పదగిన వరుణ (నెప్ట్యూన్) గ్రహంలో భూమి అంత వైశాల్యంలో వీస్తున్న పెను తుపానును హవాయి దీవిలోని కెక్ ఖగోళ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలు ఇటీవలనే కనిపెట్టారు. ఈ తుపాను మేఘం చాలా కాంతివంతంగా ఉంది.’ (4–8–2017 నాటి సమాచారం) వెనుకటికి ఒక జ్యోతిష్కుడు ‘వానలు ముంచుతవోయ్! ముంచుతవోయ్!’ అనేవాడట. దీనికి ఓ అంతరార్థం ఉంది. వాన రాకపోయినా ముంచుడే. ఎక్కువైనా ముంచుడే అని ఆయన ఉద్దేశం. దశాబ్దకాలంగా ఈ రెండు రకాల వైపరీత్యాలను ప్రపంచం చూస్తున్నది. పాలకవర్గాలు ప్రకృతి విరుద్ధంగా అభివృద్ధి పేరుతో సాగిస్తున్న వనరుల విధ్వంసం వల్ల, అణ్వస్త్ర ప్రయోగాల కారణంగా ప్రకృతి పోకడలోనే పెనుమార్పులు సంభవిస్తున్నాయి. దీని ఫలితంగానే వనరుల వినియోగంలో సమతౌల్యం దెబ్బతిని అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. కడచిన ఏడేళ్లలో జూన్–సెప్టెంబర్ మధ్య కాలంలో రుతు పవనాలు సకాలంలో రాక దేశ వ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రాజ్యమేలాయి. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే. బంగాళాఖాతం కంటే, అరేబియా సముద్రం ఎక్కువ తేమకు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్యుములోనింబస్ బీభత్సం ఇప్పుడు ప్రకృతిలో సరికొత్త దృశ్యం– తుపాను మేఘాలు ఆకస్మికంగా ఆవరించడం, ఉరుముల గర్జనలతో, పిడుగులతో కుండపోతగా వాన ముంచెత్తడం. ఈ పరిణామానికే వాతావరణ శాస్త్రం క్యుములోనింబస్ అని పేరు పెట్టింది. ఈ మేఘాలు భూమికి 300–1500 మీటర్ల ఎత్తులోనే ఏర్పడతాయి. మరింత ఎత్తుకు కూడా ఎగబాకుతూ ఉంటాయి. హైదరాబాద్ వంటి నగరాలను, ఇతర పట్టణాలను ముంచెత్తుతాయి. రహదారులు మాయమై చెరువులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నీరే. భాస్కర రామాయణ కర్త తన కాలంలో ‘ఆకాశ గంగను తాకబోయిన’ పాతాళ జల దృశ్యాన్ని చూశాడో ఏమో కానీ, ‘వర్షాధార పూర్ణమీ నిఖిల జగము’ అని అనడం గుర్తుకు వస్తుంది. ఆకస్మికంగా కారుమేఘాలు ఆవరించడం, ఆపై అవి ఆవరించిన ప్రతి చోట, అంటే క్యుములోనింబస్ మేఘాలు అలుముకున్నచోట వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. పేద ప్రజలను అలవికాని కష్టాల పాల్జేస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలోను జరుగుతున్నది ఇదే. ఈ జల విధ్వంసాన్ని చూస్తే, అడవి బాపిరాజు ‘వరద గోదావరి’, విశ్వనాథ ‘కిన్నెరసాని పాటల’ లోని దృశ్యాలు గుర్తుకు రాకతప్పదు. చిత్రం ఏమిటంటే, ఈ జల విలయం వాతావరణ శాఖ అంచనాలను కూడా తారుమారు చేస్తున్నది. మరీ చీకట్లు అనలేం కానీ, ఆ మేఘాలు పగళ్లను దాదాపుగా సాయంసంధ్యగా మారుస్తున్నాయి. చంద్రుడు కూడా కనుమరుగై పోవలసి వస్తున్నది. క్యుములోనింబస్ కుండపోతకు మరో లక్షణం కూడా ఉంది. అప్పుడే కుండపోత, అంతలోనే ఉక్కపోత. ఈ కారణంగా కొందరు శ్వాస కోసం పెనుగులాడవలసిన పరిస్థితి. మధ్య భారత రాష్ట్రాలలో కూడా ఇలాంటి ‘వేసవి వర్షాలు’ 1950లలో మొదలైనా, 2015కు బలహీనపడినాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతున్న కాలంలోనే తుపాను మేఘాలు పింజలు పింజలుగా అలుముకోవచ్చుననీ, తరువాత అటు విలయం, ఇటు సమరం అన్న చందంగా అవి టార్పిడోలు, టోర్నడోలుగాను మారి ఉగ్రతాండవం చేయవచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు అతివృష్టి, అనావృష్టి బాధకు పసిఫిక్ తీరస్థ వైపరీత్యాలు ఎల్‌నినో, లానినోలకు కారణమవుతున్నాయన్న భావనలో ఉన్నాం. కానీ తాజాగా ముంచుకొచ్చినదే ‘క్యుములోనింబస్’ బెడద. ఈ మూడురకాల వైపరీత్యాల వల్ల వివిధ రకాల పంటలకు, వ్యవసాయానికి, జలరాశి ఆధారంగా ఉన్న జీవరాశి ఉనికికి ప్రమాదం ఉంది. ముందున్నవి పెనుమార్పులు రానున్న 40 ఏళ్లలో పెను వాతావారణ మార్పులు రాగలవనీ, ఇప్పటి ఈ విపరీత పరిస్థితికి 2025 దాకా తెరిపి ఉండక పోవచ్చునని సునిశిత వాతావరణ పరిశోధనల ఆధారంగా చెప్పారు. ఇప్పుడు కాదు 1994లోనే ‘వరల్డ్ వాచ్ ఇన్స్టిట్యూట్, 1999లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ సంగతిని ప్రకటించాయి (ఈ అంశాన్ని ‘సాక్షి’ వ్యాసంలో ఈ వ్యాసకర్త 26.4.2011న పేర్కొన్నాడు). ఉదర పోషణార్థం చెప్పే ‘చిట్కా’ జోస్యాలను నమ్మడానికి అలవాటుపడ టమూ ప్రమాదమే. అదే జరిగితే శాస్త్ర పరిశోధనల ఆధారంగా వెలువడిన హెచ్చరికలను నిర్లక్ష్యంచేసి ప్రభుత్వాలూ, ప్రజలూ సకల జాగ్రత్తలు పాటించ కుండా ఉండిపోయే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ కేంద్రీయ పరిశోధనా సంస్థ రాష్ట్రం లోని ఏఏ ప్రాంతాలు భూకంపాల తాకిడికి గురికాగల అవకాశం ఉందో అధికారికంగా ఇటీవలనే హెచ్చరించింది. ప్రపంచ బ్యాంకు కూడా 2010 అక్టోబర్‌లోనే రానున్న పెను వాతావరణ మార్పుల గురించి హెచ్చరికలు చేసింది. పలు ముఖాలుగా వెలువడిన ఈ ముందస్తు హెచ్చరికల ఫలితంగానే– ఇండియా, పాకిస్తాన్లలో భయంకరమైన ఎండల వల్ల, వడగాడ్పుల వల్ల రానున్న కొలది దశాబ్దాలలోనే 1 కోటీ 15 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్తలు అంచనా వేశారని (4.8.17) మరచిపోరాదు. అంతేగాదు, ప్రసిద్ధ ‘మిట్’ సాంకేతిక పరిశోధనా సంస్థ (అమెరికా) ఈ వాతావరణ మార్పుల ఫలితంగా విస్తృత స్థాయిలో 20వ శతాబ్దం చివరికల్లా పెను ఆహార సంక్షోభం ఏర్పడనున్నదని అంచనా వేసింది. ఈ మార్పుల ఫలితంగా వేసవి పెను వడగాడ్పులు దక్షిణాసియాలో వస్తాయనీ, ప్రపంచ జనాభాలో ఐదింట ఒక వంతు జనం నివసించే దక్షిణాసియా దేశాలు తీవ్రాతి తీవ్రమైన దారిద్య్రంలో దిగబడిపోతాయనీ కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అసాధారణ స్థాయిలో ఉడుకెత్తిపోతున్న ప్రాంతాలు సకాలంలో తగు జాగ్రత్తలు తీసుకొనకపోతే నష్టపోతాయని కూడా ముందస్తుగా గుర్తు చేశారు. లేకపోతే సారవంతమైన సుక్షేత్రాలు దెబ్బతినిపోవడం కూడా ఖాయమని హెచ్చరించారు. దక్షిణాసియాలోని సారవంతమైన సింధు–గంగానదీ పరీవాహక ప్రాంతం ఆ ప్రాంత ఆహార అవసరాలను తీర్చగల్గుతోంది. ఆ వాస్తవాన్ని బట్టే ఈ హెచ్చరిక చేయవలసి వచ్చిందని నిపుణులు వివరించారు. ఈ క్రమంలోనే పర్షియన్ అఖాతంలోని పలు ప్రాంతాలు కూడా అత్యంత అసాధారణ వడగాడ్పులకు గురవుతాయని కూడా చెప్పారు. ఈ ఊపులోనే ఉత్తర దక్షిణ భారతాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. వీటితోపాటు జనసాంద్రత ఎక్కువగా ఉన్న తూర్పు చైనా కూడా అత్యుగ్రమైన వడగాడ్పులకు లోనుకానున్నదని వెల్లడించారు. అంతేగాదు, అతి ఉష్ణోగ్రతలు–అత్యుగ్ర ఉక్కబోతలు (వెట్–బల్బ్ టెంపరేచర్) కలగలిసిపోయి గాలిలో ఉండే తేమను కాస్తా మింగేస్తాయని హెచ్చరించారు. ఎందుకంటే, మానవ శరీరానికి అవసరమైన కనీస ఉష్ణోగ్రతను కాపాడడానికి సమశీతోష్ణత అవసరం కాబట్టి. ఉష్ణోగ్రత పెరిగినకొద్దీ ఉక్కబోత (చెమట) పెరుగుతుంది. ఈ పరిస్థితి పంట రాలుబడినీ దెబ్బతీస్తుంది. ఇది ముఖ్యంగా జూన్–సెప్టెంబర్ల మధ్య జరుగుతుంది. పంటలు పొట్టపోసుకుని పెరుగుతున్న సీజన్లో రాలుబడిని దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. పెరగనున్న రైతుల బలవన్మరణాలు? 30 సంవత్సరాల నిరంతర పరిశోధనల తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ (బర్కిలీ) నిపుణులు ఇండియా విషయంలో పై అంశం మరింత వాస్తవమని నిర్ధారణకు వచ్చారు. విత్తనాలు, నాట్ల సీజన్లో ఒక్కరోజున 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటే సగటున 70మంది రైతుల బలవన్మరణాలకు దారి తీస్తుందని అంచనా వేశారు. ఎందుకంటే, ఉష్ణోగ్రత 1–1.5 డిగ్రీలు పెరిగితే పంట దిగుబడి 300–400 కేజీలకు పడిపోతుందట. ఈ శాస్త్రీయ అంచనాను సుప్రసిద్ధ భారత వ్యవసాయ శాస్త్ర నిపుణుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ ధ్రువీకరించారు. 1967–2003 మధ్య కాలంలో భారతదేశంలో సంభవించిన రైతుల ఆత్మహత్యలతో పోల్చి–వాతావరణ మార్పులకు, పంట దిగుబడికి, రైతుల ఆత్మహత్యలకు మధ్య సంబంధాన్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ అగ్రశ్రేణి పరిశోధకురాలు మేడం తమా కార్లెటన్ నిరూపించారు. పంట కాలంలో ఒక సెంటీమీటర్ మాత్రమే వర్షం పడితే లక్షమంది (0.8 శాతం) మరణిస్తారట. 1956–2000 మధ్యకాలంలో మన దేశంలో 13 రాష్ట్రాలలో పండిన పంటలను వాతావరణ మార్పులతో తైపారువేసి చూస్తే– పంటకాలంలో (పెరుగుదలలో ఉన్నప్పుడు) 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించిన ఉష్ణోగ్రత ఉంటే, సగటు సంవత్సర పంట రాలుబడి కాస్తా తగ్గిపోయిందని తమా కార్లెటన్ అంచనా వేశారు. ఫలితంగా ఆ దామాషాలోనే రైతుల ఆత్మహత్యలూ పెరుగుతాయని ఆమె నిర్ధారించారు. ఈ దృష్ట్యా, తాజాగా మన అనుభవంలోకి వచ్చిన ‘నింబస్’ తుపాను మేఘాలు చేసిన పని ప్రజలపైన, ప్రజా జీవనంపైన తలపెట్టిన ‘మెరుపుదాడులే’. వాటిని తప్పించుకుని బయటపడటానికీ వీలులేని పరిస్థితి. ఈ ‘నింబస్’ తుపాను మేఘ పంక్తి 8 రకాల ‘మేఘమాల’– ఆ పేర్లు చూడండి: క్వాల్వస్/కాపిలాటస్/ఇంకాస్/పానస్/పీలస్/మమ్మా/ప్రాసిపిటాటియో/టూబా. పెడబొబ్బలతో గాండ్రించే తుపాను మేఘాలు మనకు కనిపించే ఎత్తులోనే తిరుగాడుతూ, అంత జల సంపదను పొట్టలో నింపుకుని మన నెత్తిపైన కుమ్మరించి పోతాయి. కాదా మరి, ఒక ప్రాచీన కవి చెప్పినట్టుగా ‘‘ఎవ్వరికి తరంబు/కాలకృత వంచనకున్/వెలిగా మెలంగగన్!!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
క్యుములోనింబస్ కుమ్మేసింది
గ్రేటర్ శివార్లలో కుండపోత ∙కీసరలో అత్యధికంగా 17.4 సెం.మీ. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివార్లను దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు కుమ్మేశాయి. జడివానతో దడ పుట్టిం చాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుఝాము వరకు కురిసిన కుండపోత వర్షానికి శివారు ప్రాంతాలు విలవిలలాడాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు పొంగి పొర్లాయి. ఇళ్లు, సెల్లార్లలోకి భారీగా చేరిన వరదనీటిని తోడేందుకు స్థానికులు, జీహెచ్ ఎంసీ అత్యవసర సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. పలు కాలనీలు, బస్తీల్లో రహదారు లపై మొకాలి లోతు వరదనీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు నరకయాతన అనుభవించారు. భారీ వర్షానికి నాచారం, కంటోన్మెంట్, శేరిలింగంపల్లి, ఉప్పల్, కీసర, మల్కాజ్గిరి, రాజేంద్రనగర్ తదితర ప్రాంత వాసులు బెంబేలెత్తారు. పురాతన భవనాల్లో నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తెల్లవార్లూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. లోతట్టుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జాగారం చేయాల్సి వచ్చిందని స్థానికులు వాపోయారు. సెల్లార్లలో నీటిని తోడిన తరవాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని సీపీడీసీఎల్ అధికారులు తెలిపారు. నీటమునిగిన ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. క్యుములోనింబస్ మేఘాలే కారణం.. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తన, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావం, కర్ణాటక మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా బుధవారం సాయం త్రం ఒక్కసారిగా ఉధృతమైన క్యుములోనిం బస్ మేఘాలు ఏర్పడి కుండపోత వర్షం కురిసినట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. రాగల 24 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. క్యుములోనిం బస్ మేఘాలు ఏర్పడిన ప్రాంతాల్లో ఒక్కసారిగా కారుచీకట్లు అలముకొని భారీ వర్షం కురిసిందని తెలిపారు. కీసరలో అత్యధికంగా 17.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఎల్లుండి వరకు ఓ మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శని, ఆదివారాల్లో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్, సంగారెడ్డి, తాండూరులో గరిష్టంగా 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. -
క్యుములో నింబస్ మేఘాల వల్లే పిడుగుల వర్షం
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో అకాల పిడుగులకు క్యూములో నింబస్ మేఘాలే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏకకాలంలో అటు కోస్తాంధ్ర మీదుగా, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి... ఇటు వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వీటికితోడు నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటున్నాయని, ఉదయపు వేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండడంతో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నట్టు వివరించారు. ఈ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడానికి దోహదపడుతున్నాయని వివరించారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లకిందకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. -
రెండు రాష్ట్రాలపైనా ‘క్యుములోనింబస్’ ప్రభావం
విశాఖపట్నం: మరో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న అల్పపీడన, ఉపరితల ద్రోణుల ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఉష్ణోగ్రతలు ఊపందుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో నీటిలో ఆవిరి శాతం ఎక్కువై ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. వీటి ఫలితంగా అకాల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. వచ్చే రెండు రోజుల్లో ఉత్తరకోస్తా, కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ, తెలంగాణల్లో ఒకటీ రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. కోస్తాంధ్ర కంటే రాయలసీమ, తెలంగాణల్లో వర్షాల ప్రభావం ఒకింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండు రోజుల తర్వాత పరిస్థితిలో మార్పు రావచ్చని అంచనా వేస్తున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఉష్ణతాపం ఎక్కువగానే నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ, కర్నూలుల్లో అత్యధికంగా 42 డిగ్రీలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాయలసీమలో ఆరోగ్యవరం(37), కడప (39) మినహా మిగిలిన ప్రాంతాల్లోను, తెలంగాణలో మెదక్ (39), హకీంపేట(38)ల్లో తప్ప మిగతా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
క్యుములోనింబస్ మేఘాలే కారణం