breaking news
Company founder
-
400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!
సాధారణంగా కంపెనీల అధినేతలు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఉద్యోగులను ప్రయోజనాలను పట్టించుకోరు. కానీ ఓ కంపెనీ ఫౌండర్ తీసుకున్న నిర్ణయం ఆ సంస్థలోని 400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది.భారతీయ సంతతికి చెందిన జ్యోతి బన్సల్ తన మొదటి సాఫ్ట్వేర్ స్టార్టప్ యాప్‌డైనమిక్స్‌ను 2017లో విక్రయించినప్పుడు తన కెరీర్లో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన స్టార్టప్‌ను 3.7 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత విలువ రూ. 31,090 కోట్లు) సిస్కోకు విక్రయించడం అప్పుడు సరైన నిర్ణయమేనని ఆయన భావించారు. కంపెనీలో 14 శాతానికి పైగా వాటా ఉన్న బన్సల్‌కు కూడా ఈ ఒప్పందం ఆర్థికంగా ముఖ్యమైనది. సిస్కో ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత 400 మంది యాప్‌డైనమిక్స్ ఉద్యోగుల షేర్స్ విలువ ఒక మిలియన్ డాలర్లకు ఎగబాకినట్లు బన్సల్ ప్రతినిధి తెలిపారు. దీంతో వీరందరూ కోటీశ్వరులయ్యారు.అప్లికేషన్స్ అండ్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన యాప్‌డైనమిక్స్‌ను జ్యోతి బన్సల్ 2008లో స్థాపించారు. ఈ స్టార్టప్ సరిగ్గా ఐపీఓకి వచ్చే ఒక రోజు ముందు విక్రయించారు. ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన బన్సాల్ ప్రస్తుతం ట్రేసబుల్, హార్నెస్ అనే మరో రెండు సాఫ్ట్వేర్ స్టార్టప్‌లకు సీఈవో, కో ఫౌండర్.ఎవరీ జ్యోతి బన్సల్?జ్యోతి బన్సల్ రాజస్థాన్‌లోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి నీటిపారుదల యంత్రాలను విక్రయించే వ్యాపారం చేసేవాడు. 1999లో ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ అభివృద్ధిలో మక్కువ ఉన్న జ్యోతి బన్సల్ 2017లో ఆయన బిగ్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. 2018లో జాన్ వ్రియోనిస్తో కలిసి అన్‌యూజవల్ వెంచర్స్‌ను సహ-స్థాపించారు. జ్యోతి బన్సల్ ప్రస్తుతం యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. -
రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి..
-
వీళ్లు జనం నాడి పట్టేస్తారు!
సర్వేలకు టెక్నాలజీని జోడించిన స్టడీ ఎన్ సర్వే, క్యూథియరీ స్టార్టప్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సర్వే అనగానే తెల్ల కాగితాలో, పుస్తకాలో చేత పట్టుకొని.. ఇంటింటికీ తిరిగి చెప్పిన వాటిని రాసుకోవడమేనని అనుకుంటాం. కానీ పరిస్థితులు మారుతున్నాయి. కొత్తగా కంపెనీ పెట్టాలన్నా.. కొత్త ఉత్పత్తుల్ని ప్రారంభించాలన్నా.. అంతెందుకు తమ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి జనాలేమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ సర్వేనే గతి. అందుకే దీన్ని తెల్లకాగితాలకే పరిమితం చేయకుండా టెక్నాలజీని జోడించాయి హైదరాబాదీ కంపెనీలు స్టడీ ఎన్ సర్వే, క్యూథియరీ బ్రోస్. ఆ వివరాలే ఇవి.... సర్వేతోనే సరిపెట్టం... కొత్త కంపెనీ పెట్టే ముందు అది ఎక్కడ పెడితే సక్సెస్ అవుతుంది? మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రొడక్ట్ ప్రజలకు చేరువ కావాలంటే ఏం చేయాలి? వంటి మార్కెట్ స్థితిగతుల్ని సర్వే చేయడమే ‘క్యూథియరీ బ్రోస్’ పని. అడ్వర్టయిజింగ్, పొలిటికల్, సోషియో ఎకనమిక్, ప్రొడక్ట్స్, మార్కెట్ విభాగాల్లో ఖఖీజిౌ్ఛటడఛటట.ఛిౌఝ సర్వే చేస్తుంది.. అని చెప్పారు కంపెనీ ఫౌండర్ రవిశంకర్ బొజ్జంకి. ‘సర్వేతోనే మా పని అయిపోదు. మా కస్టమర్ల వ్యాపారాలు మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి? వారి ఉత్పత్తుల్లో వినియోగదారులు కోరుతున్న మార్పులేంటి? పోటీదారులు ఎలాంటి ఆఫర్లు, ప్రొడక్ట్‌లను విడుదల చేస్తున్నారు? నకిలీల ప్రభావం? వంటి అన్ని కోణాల్లో సూచనలనూ ఇస్తాం. ప్రస్తుతం తయారీ రంగ కంపెనీలకు సంబంధించిన సర్వేలను.. అది కూడా ఇంటర్వ్యూ విధానంలో చేస్తున్నాం. త్వరలోనే ఇతర విభాగాలకూ విస్తరిస్తాం’ అని వివరించారాయన. సర్వే స్థాయిని బట్టి ధర రూ.25 వేల నుంచి లక్షన్నర వరకు ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలలో పలు ప్రాజెక్ట్‌లను సంస్థ పూర్తి చేసింది. 2014 ఎలక్షన్స్ ఫలితాలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్‌కు కూడా సర్వేలు చేసిచ్చామని రవిశంకర్ చెప్పారు. త్వరలోనే యాప్ ద్వారా సర్వే.. సర్వేల్లోనూ మార్పులు తేవటానికే రూ.5 లక్షల పెట్టుబడితో 2014 డిసెంబర్లో ‘స్టడీ ఎన్ సర్వే’ను స్థాపించామన్నారు సంస్థ సీఈఓ రాహుల్. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే.. ట్యాబ్లెట్స్ ద్వారా సర్వే చేస్తుంది. వాటి తాలుకా రిపోర్ట్లు విభాగాల వారీగా మేనేజ్మెంట్కు ఒక్క క్లిక్‌తో వెళ్లిపోతాయి. ‘‘ఇప్పటివరకు హైదరాబాద్‌లో ప్రసాద్ ఐమ్యాక్స్, రాయల్ రీఫ్ హోటల్, వీఎల్సీసీ సంస్థలకు సర్వే చేసిచ్చాం. సర్వే స్థాయిని బట్టి నెలకు రూ.3-10 వేల వరకూ ధరలుంటాయి. విద్యా సంస్థలకు ఉచితంగానే సేవలందిస్తున్నాం. ‘‘మణిపాల్‌లోని టాంపీ, చెన్నైలోని గ్రేట్లెగ్స్ వంటి సుమారు 15 విద్యా సంస్థలకు సర్వే చేసిచ్చాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ముంబైకి చెందిన ఓ టెక్నాలజీ కంపెనీ రూ.60 లక్షల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. వచ్చిన పెట్టుబడులతో త్వరలోనే యాప్ ద్వారానే సర్వే చేసే విధానాన్ని తీసుకొస్తాం. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో సేవలు అందుబాటులో ఉండగా.. ఫండింగ్ అనంతరం ఇతర నగరాలకూ విస్తరిస్తాం’’ అని వివరించారు రాహుల్.. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...