breaking news
coldwar
-
నాన్ లోకల్ అభ్యర్థిని మాపై రుద్దుతారా?
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఎంత కాలమైనా పల్లకీ మోసే బోయీలుగానే మిగిలిపోవాలా.. నాయకత్వ పగ్గాలు పుచ్చుకునే అర్హత మాలో ఎవరికీ లేదా.. నాన్ లోకల్ అభ్యర్థిని మాపై రుద్దుతారా’ అని కడప టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పని చేస్తామని, మాలో ఒకరికి టికెట్ కేటాయించాలని కోరుతూనే, నాన్‌లోకల్ అభ్యర్థికి సహకరించబోమని తెగేసి చెబుతున్నారు. వెరసి తెలుగుతమ్ముళ్ల మధ్య ఉన్న కోల్డ్‌వార్ తెరపైకి వచ్చింది. ఇన్చార్జితో ప్రమేయం లేకుండా ఆ ముగ్గురు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా చంద్రబాబు విడుదల కావాలని దేవునికడప శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. టీడీపీ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి తన కోడలు, కార్పొరేటర్ ఉమాదేవికి నియోజకవర్గ ఇన్చార్జి అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. ఆ స్థానంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవీరెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు. అప్పటికే పలుమార్లు అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై స్థానికులకు అవకాశం కల్పించాలని కడప నేతలు కోరారు. గతంలో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన దుర్గాప్రసాద్, అమీర్‌బాబుకు అవకాశం కల్పించాలని, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే కార్పొరేటర్ ఉమాదేవికి ఇన్చార్జి పదవి ఇవ్వాలని విన్నవించారు. మాలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు. వీరి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డికి కడప పట్టం కట్టడాన్ని.. ఆ ముగ్గురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుంటే సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. అభ్యర్థిగా స్థానికులనే నిర్ణయించాలని కడప గడపలో తెలుగు తమ్ముళ్లు పట్టుబట్టుతున్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రమేయం లేకుండా నాన్‌లోకల్ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికల్లో ఏమి చేయగరలని వాదిస్తున్నారు. అదే విషయాన్ని అధినేత చంద్రబాబుకే తేల్చి చెప్పామని టీడీపీ విజయం సాధించాలంటే లోకల్ వారిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్చార్జి మాధవీరెడ్డితో కలిసి పని చేసే పరిస్థితే లేదని తేల్చి చెబుతున్నారు. ఆ మేరకు ఆమెతో ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ చేపట్టారు. ఈ వ్యవహారం వినాయక ఉత్సవాల నుంచి కొనసాగుతోంది. టీడీపీ నేతలు లక్ష్మీరెడ్డి, దుర్గాప్రసాద్, అమీర్‌బాబు ముగ్గురు కలిసికట్టుగా వినాయక మండపాలను సందర్శిస్తూ పూజలు చేపట్టారు. మాధవీరెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండిపోయారు. తాజాగా ఆదివారం ఆ ముగ్గురు నేతలతోపాటు మరి కొందరు డివిజన్లు ఇన్చార్జిలతో కలిసి దేవునికడపలో 101 టెంకాయలు కొట్టారు. సోమవారం నుంచి పాతబస్టాండ్ సమీపంలో నిరసన టెంట్ ఏర్పాటు చేసి, వేరుగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. లోకల్ నాయకుల్ని అందర్నీ కలుపుకొని కార్యక్రమాలకు వెళ్లాలనే దిశగా ఆ ముగ్గురు అడుగులు వేస్తున్నారు. నాన్ లోకల్ అభ్యర్థికి ఇప్పటి నుంచే పోటీగా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. వాసు ఏకపక్ష వైఖరి సహించం ‘టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా అందర్నీ కలుపుగోలుగా వెళ్లలేదు. పొలిట్‌బ్యూరో సభ్యుడు జిల్లాలోని టీడీపీ నేతల మన్ననలు పొందలేదు. పైగా వర్గ విభేదాలకు ఆస్కారం ఇచ్చేలా చర్యలుండిపోయాయి. వాసు ఏకపక్ష వైఖరి నేపథ్యంలో అభ్యర్థిగా మాధవీరెడ్డి నియామకాన్ని అడ్డుకునే చర్యలకు దిగినట్లు’ ఆ ముగ్గురు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఆమెకే టీడీపీ టికెట్ కేటాయిస్తే ఓడగొట్టి తీరుతామని ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని కార్యకర్తలకు, ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. -
నేపాల్ అంతర్యుద్ధం!
రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్యం నెలకొన్న దేశాల్లో నేపాల్ ఒకటి. అయితే, ప్రజాస్వామ్య సాధన ఏమంత సులభంగా జరగలేదు. సుదీర్ఘ పోరాటం ద్వారానే సాధ్యమైంది. రాచరిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ పోరాడిన మావోయిస్టులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ క్రమంలోనే నేపాల్ అంతర్యుద్ధానికి తెరలేచింది. ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఈ పోరాటంలో పదివేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఆనాటి తిరుగుబాటు సంగతులు, నేపాల్ చరిత్ర ‘నేటి వన్స్ అపాన్ ఏ టైమ్’లో..! పద్దెనిమిదో శతాబ్దానికి ముందు కఠ్మాండు, పఠాన్, భక్తపుర్ అనే మూడు భాగాలుగా నేపాల్ మనుగడలో ఉండేది. గూర్ఖా రాజైన పృథ్వి నారాయణ్ షా అనేక యుద్ధాలు చేసిన తర్వాత 1769లో ప్రస్తుత నేపాల్ ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి 1815-16 కాలంలో బ్రిటిష్ వారితో తగాదా వచ్చింది. నేపాల్ గూర్ఖాలను తక్కువ అంచనా వేసిన బ్రిటిషర్లు యుద్ధంలో ఖంగుతిన్నారు. దీంతో సుగౌళీ ఒప్పందాన్ని చేసుకుని, యుద్ధం విరమించారు. భారత్‌లో సిపాయిల తిరుగుబాటు సమయంలో నేపాలీ వీరుల శౌర్యాన్ని మెచ్చి, వారికి సిక్కింలోని ప్రాంతాలతో పాటు టెరాయ్ భూభాగాన్ని కూడా బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బహుమతిగా ఇచ్చింది. దీనికి ప్రతిఫలంగా నేపాల్ సైనికులు ఈస్టిండియాకు మద్దతిచ్చేవారు. షా పాలన అంతం.. 846లో షా వంశాన్ని అంతమొందించిన జంగ్ బహదూర్ రాణా దేశ పాలనను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కోట్ ఊచకోతగా పేరొందిన కొన్ని వందల మంది రాకుమారుల హత్యలకు కారణమయ్యాడు. 1948 వరకూ రాణాలు ప్రధానులుగా సేవలందించేవారు. అయితే, భారత దేశానికి స్వాతంత్య్రం రావడంతో వీరి పాలనకు తెరపడింది. త్రిభువన్ అనే కొత్త రాజును భారత్ తెరపైకి తీసుకొచ్చింది. తిరుగుబాటుకు బీజం.. త్రిభువన్ కుమారుడైన మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి, పార్టీలు లేని పంచాయతీ వ్యవస్థను నెలకొల్పాడు. 1972 వరకూ పాలించిన అనంతరం రాజు మహేంద్ర స్థానంలో అతని వారసుడు బీరేంద్ర పగ్గాలు చేపట్టాడు. ఈయన కూడా ఇదే వ్యవస్థను కొనసాగించాడు. 1989 వరకూ అమలులో ఉన్న ఈ వ్యవస్థను ప్రజలు వ్యతిరేకించారు. దేశమంతా ఆందోళనలు చెలరేగడంతో బలవంతంగానే రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చాడు. ఎన్నికలు.. ఈ సవరణలతో దాదాపు యాభై ఏళ్ల తర్వాత నేపాల్‌లో ఎన్నికలు వచ్చాయి. 1991 మేలో జరిగిన ఈ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెసు పార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు ఎక్కువ స్థానాలు దక్కాయి. అయితే, ఏ పార్టీ కూడా రెండేళ్లకు మించి పాలించలేకపోయింది. దీనికి కారణం అవినీతి పాలన, ప్రజోపయోగ కార్యక్రమాల్లో మార్పు లేకపోవడమే. అంతర్యుద్ధం మొదలు.. బ్రిటిష్ వారి తరహా రాచరిక పార్లమెంట్ విధానాన్ని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకించింది. ప్రజాస్వామ్య వ్యవస్థకే ఆ పార్టీ మొగ్గు చూపింది. దీంతో ప్రజాస్వామ్య స్థాపనకై 1996లో అతివాద విధానాలు అవలంబించింది. ఇదే నేపాల్ అంతర్యుద్ధంగా రూపాంతరం చెందింది. విప్లవాత్మక ధోరణిలో కొనసాగిన ఈ యుద్ధంలో 12 వేల మందికిపైగా మరణించారు. రాచ కుటుంబ హత్యలు.. నేపాల్ చరిత్రలోనే విషాదకర సంఘటన 2001, జూన్ 1న జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదనే కారణంతో యువరాజు దీపేంద్ర తన తండ్రి, రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య సహా ఏడుగురు కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. అయితే, ఈ విషయాన్ని నేటికీ చాలామంది నేపాలీలు అంగీకరించరు. ఈ మరణాల వెనక కుట్ర దాగున్నదని భావిస్తారు. అంతర్యుద్ధం ముగింపు.. రాజు మరణించడంతో అతని సోదరుడైన జ్ఞానేంద్రను రాజుగా ప్రకటించారు. ఇతని పాలన అస్తవ్యస్తంగా సాగింది. ఈ కాలంలో మావోలు మరింత విరుచుకుపడ్డారు. దీంతో 2005 ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని రద్దు చేసి, మావోలపై యుద్ధం కోసం అత్యవసర పరిస్థితి ప్రకటించాడు. ఉద్యమకారులను, జర్నలిస్టులను అరెస్టు చేశాడు. రాచరికానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయరాదంటూ ఆంక్షలు విధించాడు. తిరుగుబాటు దారుల పక్షాన నిలుస్తున్నాయంటూ పత్రికా కార్యాలయాలను మూసివేయించాడు. అయితే, జ్ఞానేంద్ర ఎత్తుగడ విఫలమైంది. పట్టణాలు, నగరాలకే ప్రభుత్వ సైన్యం పరిమితమైంది. గ్రామాల్లో మావోలు పూర్తి పట్టుసాధించారు. దీంతో సైనికచర్య సాధ్యం కాని స్థితిలో ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య 2005 సెప్టెంబరులో 3 నెలలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 2006 ప్రజాస్వామ్య ఉద్యమం కారణంగా రాజు జ్ఞానేంద్ర ప్రజలకే పాలన అప్పగించేందుకు అంగీకరించాడు. గతంలో నిర్వీర్యమైన ప్రతినిధుల సభను 2006 ఏప్రిల్ 24న తిరిగి ఏర్పాటుచేశాడు. తర్వాతి నెలలో ఈ సభ రాజు అధికారాలకు కోత పెడుతూ, ప్రపంచంలో ఏకైక హిందూరాజ్యంగా ఉన్న నేపాల్‌ను లౌకిక రాజ్యంగా మార్చింది. 2008 మే 28న అమలులోకి వచ్చిన 159వ అధికరణ ప్రకారం రాచరికం అంతమై సమాఖ్య రాజ్యంగా నేపాల్ ఏర్పడింది.