breaking news
Citizen Forum
-
సిటిజన్ ఫోరం ఓ ఉద్యమం లాంటింది
► ప్రతి ఒక్కరూ మిషన్‌గా తీసుకొని పనిచేయండి ► ప్రస్తుత పనితీరు బాగాలేదు.. మెరుగుపరుచుకోవాలి ► జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజల మద్దతు కూడగట్టుకొని సిటిజన్ ఫోరంను ఒక ఉద్యమంలాగ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత సభ్యుల ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్రజైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. సిటిజన్ ఫోరంను ఒక మిషన్‌గా తీసుకొని సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. జిల్లా సిటిజన్ ఫోరం శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి సారిగా ఖమ్మం జిల్లాలో సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసి విజయవంతం అయ్యామని, అదే పద్ధతిలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఈ ఫోరం ఏర్పాటు చేశామన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత నాలుగు జిల్లాలో ఆశించిన స్థాయిలో పనితీరులేదని, దానిని మెరుగు పరుచుకోవాలని సిటిజన్ ఫోరం అంటే ఒక సంస్థ కాకుండా ఉద్యమంగా భావించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉందని, దీంట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎక్కువగా ఉందన్నారు. దీనిపై సభ్యులు స్పందించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక రూపం తీసుకురావడానికి ఈ సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జైళ్లను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అక్షరం రాకుండా జైలుకు వచ్చిన ఖైదీలకు తిరిగే వెళ్లే సమయానికి పుస్తకాలు చదివే స్థాయిలో విద్య నేర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం లేకుండా జరిగే పరిపాలనను సిటిజన్ ఫోరం నుంచి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలన్నారు. అంతకుముందు టీజేఏసీ ఛైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తిచూపడానికి సిటిజన్ ఫోరం అనే ఒక మొక్క నాటడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ దశరథరాంరెడ్డి, జైలర్ శ్రీనునాయక్, ఉపేందర్, డిప్యూటీ జైలర్ సుధాకర్‌రెడ్డి, టీఏఎన్జీవో అధ్యక్షుడు రామకృష్ణారావు, చంద్రనాయక్, సాజిదసికిందర్, రాజమల్లెష్, జగపతిరావు, రవీందర్‌రెడ్డి, నాలుగు జిల్లాల సభ్యులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. జైలును పరిశీలించిన డీజీ : జిల్లా జైలును సోమవారం రాత్రి జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ పరిశీలించారు. సుదర్శన్గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత జైలును పరిశీలించి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. డీజీ వెంట సూపరింటెండెంట్ దశరథరాంరెడ్డి ఇతర సిబ్బంది ఉన్నారు. -
చిరు బతుకులను కూల్చేశారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ఆమదాలవలస: టీడీపీ నేతలు పంతం నెగ్గించుకున్నారు. ఏళ్ల తడబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న కుటుంబాలపై ఉక్కుపాదం మోపారు. ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు, పోలీసుల సహాయంతో రాత్రి వేళ దమనకాండ కొనసాగించారు. ఆమదాలవసల రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న శ్రీపాలపోలమ్మతల్లి కూరగాయాల మార్కెట్ దుకాణాల తొలగింపు ప్రక్రియలో అధికారులు, పోలీసులు.. టీడీపీ నేతలు సూచించినట్టే నడుచుకోవడం నివ్వెరపోయేలా చేసింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చర్చల పేరిట తంతు కొనసాగించిన అధికారులు .. రాత్రి 9 గంటల తర్వాత విశ్వరూపం చూపారు. 42 కుటుంబాలు కూరగాయల షాపులు నడుపుకొంటున్న మార్కెట్ సముదాయ స్థలంలో రూ.80 లక్షలతో దుకాణ సముదాయం నిర్మించేందుకు మున్సిపాలిటీ ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియ ఎన్నికల ముందే మొదలైనా.. జనం అడ్డుతగలడంతో కొన్నాళ్లపాటు నిలిచిపోయింది. మూడు నెలల అనంతరం మళ్లీ తెరమీదకు వచ్చింది. కథ నడిపిన చైర్పర్సన్ భర్త కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్సులో 42 మందికి దుకాణాలు కేటాయిస్తామని నాయకులు అంగీకరించారు. అయితే లిఖితపూర్వక హామీ ఇవ్వాలని వర్తకులు పట్టుబట్టారు. ఇటీవల ఈ విషయపై సిటిజన్ ఫోరం, ప్రజా సంక్షేమ సంఘం, మరికొందరు పెద్దల సమక్షంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత, ఆమె భర్త విద్యాసాగర్ (తంబి), తహశీల్దార్ కె. శ్రీరాములు, కమిషనర్ ఎన్.నూకేశ్వరరావులు తీర్మానించారని చెబుతూ వర్తకుల్ని నమ్మిస్తూ వచ్చారు. అయితే ఆ కాపీని బయటపెట్టలేదు. సోమవారం ఉదయం నుంచి స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ టి.మోహనరావు, సీఐ విజయానంద్ సమక్షంలో చర్చలు జరిపినా మున్సిపల్ చైర్పర్సన్ హాజరుకాలేదు. ఆమె భర్త మాత్రం వచ్చి కథంతా నడిపించారు. తమకు నచ్చని వ్యక్తుల వద్దకు వ్యాపారులు వెళ్లి పంచాయితీ పెట్టారని, తాము ఎంత చెప్పినా వినకుండా కోర్టుకు వెళ్లారని, కొత్త కాంప్లెక్సులో దుకాణాలిస్తామని చెబుతున్నా వినకుండా ఆందోళనకు దిగుతున్నారనిఅధికారులు, పోలీసుల వద్దే ఆగ్ర హం వెళ్లగక్కారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాటను కాదని తానెలా లిఖితపూర్వక హామీ ఇస్తానని ప్రశ్నించారు. మీడియా, పోలీసులు, పెద్దల సమక్షంలో చెప్పినా చాలదా అంటూ ఊగిపోయారు. పోలీసుల హైడ్రామా తీర్మానం తెలియకుండానే, చట్టం చదవకుండానే పోలీసులు హైడ్రామా నడిపారు. తొలుత మున్సిపల్ అధికారులు, నాయకుల నుంచి లిఖితపూర్వక హామీ ఇప్పిస్తామని వ్యాపారులకు చెప్పి చివరికి చేతులెత్తేశారు. ఒకవైపు అదనపు బలగాలు రప్పించి.. మరోవైపు ఒప్పంద పత్రం తయారు చేశారు. అయితే దానిపై సంతకాలకు ఎవరూ ముందుకు రాలేదు. పెద్ద మనుషులు చెబుతున్నారు కదా వినండి అంటూ వ్యాపారులపై ఒత్తిడి పెంచారు. తరువాత మార్కెట్ వద్దకు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం రావడం, వైఎస్సార్ సీపీ నాయకుల సహాయంతో అక్కడ బైఠాయించడం, మున్సిపల్ కమిషనర్‌కు ఎన్ని వివరాలు అడిగినా స్పష్టమైన వివరణలు లభించపోవడాన్ని గమనించినా.. తాము విధులు నిర్వహించడానికే వచ్చామని, కమిషనర్ ఎలా చెబితే అలా వింటామని చెప్పడం, కమిషనర్‌గారూ మీరే చెప్పండి..మీరు ఏం చెబితే అది చేస్తాం అనగానే కమిషనర్ నూకేశ్వరరావు తొలగింపు ప్రక్రియకు పచ్చజెండా ఊపేయడంతో భారీ బందోబస్తు నడుమ, 144 సెక్షన్ విధించి, లాఠీలతో జనాలను చెదరగొట్టారు. అనంతరం జేసీబీ సాయంతో మున్సిపల్ సిబ్బంది అక్కడి దుకాణాల్ని పడగొట్టేశారు. ఈ సందర్భంగా తమ్మినేని, ఆయన తనయుడు చిరంజీవినాగ్, కౌన్సిలర్లు దుంపల శ్యామలరావు, జీవీ అప్పలనాయుడు, బొడ్డేపల్లి అజంతాకుమారి, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పొన్నాడ కృష్ణవేణి తదితరుల్ని అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు జె. వెంకటేశ్వరరావు, కిరణ్, వ్యాపారులకు మద్ధతు పలికారు. స్టే వస్తుందనుకుంటున్నంతలోనే.. వాస్తవానికి తమకు జరుగుతున్న అన్యాయంపై వ్యాపారులు గతంలోనే కోర్టుకు వెళ్లారు. రేపోమాపో స్టే కూడా వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అంతలోనే అధికారులు ఈ దమనకాండకు పాల్పడ్డారు. స్టే వస్తే తమ పాచిక పారదనే భయంతోనే అంతా కానిచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ కాంట్రాక్టర్‌తో టీడీపీ నాయకులు కుమ్మక్కై దుకాణాల్ని తొలగించారనే విమర్శలున్నాయి. రాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేసి భారీ బందోబస్తుతో వ్యాపారుల పొట్ట కొట్టారు. కౌన్సిల్ తీర్మానం లేకుండానే, ఎలాంటి నోటీసులూ జారీ చేయకుండానే, ఈనెల 30నాటి సమావేశంలో ఎజెండా చూపెట్టకుండానే మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగనున్నారు. సెక్షన్ 151, 192లు అమలవుతున్నాయని, గతంలోనే ప్రత్యేకాధికారి అంగీకరించేశారని దుకాణాల గూర్చి కమిషనర్ చెబుతున్నా వైఎస్సార్సీపీ నేత తమ్మినేడి అడిగిన కొన్ని ప్రశ్నలకు కమిషనర్ సమాధానాలు చెప్పలేకపోవడం గమనార్హం. దుకాణాల తొలగింపులో స్థానికుల గోడ కూలిపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఫోన్లోనే అంతా కమిషనర్, చైర్పర్సన్ భర్త విద్యాసాగర్ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన తంతును ఎప్పటికప్పుడు కూన రవికుమార్, ఇతర టీడీపీ నేతలకు ఫోనులో తెలియజేస్తూనే ఉన్నారు. పోలీసులతో చర్చలు జరుపుతున్నప్పుడూ ఇది స్పష్టమైంది. ఏం జరిగినా ఫరవాలేదు..మేం చెప్పిందే చేయండి అంటూ కూన ఫోన్లో స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోనూ గతంలో ఇదే మాదిరిగా దుకాణాలు తొలగించినా తరువాత వర్తకులకు అన్యాయమే జరిగిందని పలువురు ప్రస్తావించినా తాము చెప్పింది చేయడమే అధికారుల బాధ్యత అంటూ అట్నుంచి స్వరం వినిపించడంతో అధికారులు అనుకున్నది చేసేశారు. -
మరో రాష్ట్ర విభజనకు దారితీయకూడదు
రాజధాని ఎంపికపై సిటిజన్స్ ఫోరం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికలో ప్రభుత్వ నిర్ణయం మరో రాష్ట్ర విభజనకు దారితీసేలా ఉండకూడదని సిటిజన్స్ ఫోరం అభిప్రాయపడింది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాలు అమలు కాలేదని తెలంగాణ ప్రజల్లో అశాంతి మొదలై రాష్ట్ర విభజనకు కారణమైందని.. ఇప్పుడు రాజధాని ఏర్పాటు రాయలసీమ ప్రజల్లో అశాంతి కలిగించని రీతిలో ఉండాలని ఫోరం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఫోరం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జయభారత్‌రెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, ఎస్. వీరనారాయణరెడ్డి (ఐపీఎస్), ఏ గోపాలరావు, ఎస్.వీరనారాయణరెడ్డి, వీఎల్ఎన్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, డీ సుధాకరరెడ్డిలు మంగళవారం కాంగ్రెస్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖల కార్యాలయాలకు వెళ్లి నేతలకు వినతిపత్రాలు అందించారు. రాజధాని ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా జరిగేలా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరాభవన్‌లో ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడి, బీజేపీ ఏపీ కార్యాలయంలో యడ్లపాటి రఘునాథబాబు, సుధీష్ రాంబొట్లను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతమైతే కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు అన్ని రకాల అందుబాటులో ఉంటుందన్నారు. దొనకొండలో దాదాపు 54 వేల ఎకరాలు బంజరు భూములు ఉన్న కారణంగా పంట పండే వ్యవసాయ భూములను రాజధాని కోసం వృధా చేసే అవసరం ఉండదని చెప్పారు. -
దొనకొండను రాజధాని చేయాలి
-
కర్నూలు లేదా దొనకొండను రాజధాని చేయాలి
హైదరాబాద్ : సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు వినతిపత్రం అందచేశారు. భేటీ అనంతరం సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుని, లేకుంటే ప్రకాశం జిల్లా దొనకొండను రాజధాని చేయాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాయలసీమ, కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన రాజధాని ఉండాలని నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఇదే అంశంపై కలిసి చర్చించామన్నారు. వైఎస్ జగన్‌తో ఇదే అంశాన్ని ప్రస్తావించామన్నారు. తమ డిమాండ్స్‌పై జగన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)