breaking news
child problems
-
మొగ్గ దశలో మగ్గుతూ ...
అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు కరువు భయపెడుతున్న వేసవి ఎండలు ఇప్పటికే జిల్లాలో 42 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత జిల్లాలోఅంగన్‌వాడీ కేంద్రాలు 5,546 ఫ్యాన్ సౌకర్యం ఉన్న కేంద్రాలు 2,541 అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఆటపాటలతో వికసించాలి్సన బాల్యం ఇరుకు గదుల్లో మగ్గిపోతోంది. కనీస వసతులు కరువై, గాలి, వెలుతురు లేని కేంద్రాల్లో ఇక్కట్ల పాలవ్వాల్సి వస్తోంది. ఒకే గదిలో ఆట వస్తువులు, సరుకులు నిల్వ చేయడం, అక్కడే విద్యాబుద్ధులు నేర్పాల్సి రావడం మధ్య దయనీయ స్థితిలో జిల్లాలోని అధికశాతం అంగ¯ŒSవాడీ కేంద్రాల నిర్వహణ సాగుతోంది. వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా కేంద్రాల్లో ఫ్యా¯ŒSలు లేకపోవడంతో చిన్నారులు కొద్ది సమయానికే నీరసించిపోతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : ఎండల దెబ్బకు పెద్దలు, యువకులు బయట తిరగాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది రెండు నుంచి నాలుగేళ్ల చిన్నారులు ఫ్యా¯ŒS గాలి లేకుండా అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఉంటుండడంతో ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 5,546 అంగ¯ŒSవాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,602 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా 3,446 కేంద్రాలు ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. మరో 498 కేంద్రాలు ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నా వాటికి భవన యజమానులు అద్దెను మినహాయించారు. మొత్తం కేంద్రాలు 5,546లో సొంత భవనం ఉన్నవి 755, అద్దె కేంద్రాలు 1549, అద్దె మినహాయింపు ఉన్న ప్రైవేటు భవనాలు 137 కలిపి మొత్తం 2,541 అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నాయి. ఇంకా 3,005 అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు లేవు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలో 905 కేంద్రాలు ఉండగా వీటిలో కనీసం ఒక్క కేంద్రంలోనూ ఫ్యాను సౌకర్యం లేదు. వేసవిలో మైదాన ప్రాంతాలే కాకుండా కొండలు అధికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో గిరిజన పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. భయపెడుతున్న మే నెల ఎండలు ప్రస్తుతం జిల్లాలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదవుతోంది. గత ఏడాది మే నెలలో జిల్లాలో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ వల్ల పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇచ్చారు. అయితే అంగ¯ŒSవాడీ కేంద్రాలు మాత్రం 365 రోజులు నిర్వహించాల్సి ఉంటుంది. టీచర్, ఆయాలకు ప్రభుత్వం ఈ ఏడాది సెలవులు మంజూరు చేసింది. మే నెల 1 నుంచి 15 వరకు టీచర్లకు, మే 16 నుంచి 31 వరకు ఆయాలకు పదిహేను రోజుల చొప్పున సెలవులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. మే నెల మొత్తం టీచర్, లేదా ఆయాతోనే కేంద్రం నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పిల్లలు కేంద్రాలలో ఉంటున్నారు. తర్వాత మధ్యాహ్నం మూడు గంటల వరకు పని ఉన్నా లేకపోయినా టీచరు, ఆయా కేంద్రంలో ఉండాలనే నిబంధన ప్రభుత్వం పెట్టింది. అత్యధిక ఎండలు ఆపై ఉక్కపోత, కేంద్రాలలో ఫ్యాను సౌకర్యం కూడా లేకపోవడంతో పిల్లలకు ఏమైనా అవుతుందేమోనన్న ఆందోళనలో టీచర్లు ఉన్నారు. చిన్నారులు వేసవిలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అంగ¯ŒSవాడీ కేంద్రాలలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్థానిక సంస్థల నిధుల ద్వారా ఏర్పాటుకు చర్యలు స్థానిక సంస్థల 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా వాటి పరిధిలోని అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఫ్యాను, విద్యుత్, లైటు సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని పంచాయతీలు, మండల పరిషత్‌లలో నిధులు లేవని చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు లేవని చెబుతున్న స్థానిక సంస్థలను వాటి జనరల్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వాలని అడుగుతున్నాం. వారు సహకరిస్తే త్వరలో అన్ని కేంద్రాలలో ఫ్యాను సౌకర్యం ఏర్పాటు చేస్తాం. సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 536 భవనాలు మంజూరయ్యాయి. ఈ ఏడాది నూతన భవనాలు మంజూరుకానున్నాయి. – టి. శారదాదేవి, ఇ¯ŒSచార్జి పీడీ, ఐసీడీఎస్ -
అమ్మ నుంచి ప్రాణహాని..!
‘‘అమ్మ నుంచి మాకు ప్రాణ హాని ఉంది.. కూలీ పని చేసి రోజు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తోంది. బడి కెళ్తానని మాట ఎత్తితే చెరువులో వేసేందుకు యత్నించింది..మేం ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నాం. అందరూ ఉన్నా అనాథల్లా బతుకుతున్నాం.’’ అంటూ వెలుగోడుకు చెందిన హుసేన్, షరీఫ్ కంటతడిపెడుతూ తమ దీనగాథను చెప్పారు. సమస్యల మధ్య ఉండలేక ఊరు వదిలి కర్నూలుకు వచ్చిన ఆ చిన్నారులు ఏడుస్తూ స్థానిక రాజ్‌విహార్ సెంటర్లో కనిపించారు. వీరిని ‘సాక్షి’ పలుకరించగా తమ కష్టాలను చెప్పుకున్నారు. కర్నూలు: వెలుగోడుకు చెందిన సాలెహాకు 2002 మార్చిలో నంద్యాల సమీపంలోని పోలూరుకు చెందిన షాహిన్‌తో వివాహం చేశారు. షాహిన్ తాగుబోతు కావడంతో పెళ్లయిన రెండేళ్లకే తన భర్తను వదిలేసి సాలెహా తల్లి వద్దే ఉంటోంది. ఆమెకు హుసేన్, షరీఫ్ ఇద్దరు కుమారులు. తాగుబోతుకు పుట్టిన పిల్లలు కూడా అలాగే అవుతారని వారిని వదిలించుకునేందుకు ఎన్నో యత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె చెల్లెలు జియావున్నిసా...చిన్నారులను చేరదీసింది. ప్రస్తుతం హుసేన్ 8వ తరగతి, షరీఫ్ 7వ తరగతి వెలుగోడులోని హైస్కూల్లో చదువుకున్నారు. మిషన్ కుట్టి వచ్చిన సొమ్ముతో వారిని పోషిస్తోంది. తన పిల్లలు చెల్లెలు వద్ద ఉండడంతో ఆమెపై కేసు పెట్టారు. ఆమె భర్తను జైలుకు పంపారు. పిల్లల్ని బడికి పంప వద్దని, పనికి వెళ్లి రోజుకు రూ.100 చొప్పున తీసుకురావాలని తల్లి సాలెహా వేధిస్తోంది. బడికి వెళ్లి బాగా చదువుకుంటామని చెప్పిన పాపానికి దుర్భాషలాడి పిల్లలను చెరువులో వేసి చంపబోయింది. చివరకు చెల్లెలుపై దాడులు చేసి ఇంట్లో ఉన్న సమాన్లు అంతా తీసుకెళ్లింది. కుట్టు మిషను కూడా తీసుకెళ్లడం, భర్తను జైలులో పెట్టించడంతో జియావున్నీసా ప్రస్తుతం జీవనోపాధి లేక భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది. పిన్ని ఇబ్బందులు చూడలేని చిన్నారులు ఎటైనా వెళ్దామని ఊరు వదిలి కర్నూలుకు వచ్చేశారు. వీళ్లను వెతుక్కుంటూ కర్నూలుకు వచ్చిన జియావున్నీసా..తమ దీనగాథన చెబుతూ కన్నీళ్లు పెట్టుకొంది. తన భర్తపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి హుసేన్, షరీఫ్‌లకు దారి చూపి న్యాయం చేయాలని ఆమె వేడుకుంది.