Central Secretariat Metro Station
-
పొగరాదు.. సెగరాదు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధాని ఢిల్లీలో పర్యావరణహిత హైడ్రోజన్ బస్సులు రంగప్రవేశం చేశాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కేంద్ర సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ వద్ద హైడ్రోజన్ ఆధారిత షటిల్ బస్సు సర్వీసులను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) లాంఛనంగా ప్రారంభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ, పెట్రోలియం, సహజ వాయువు శాఖల సమన్వయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం.. అత్యాధునిక భద్రత.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) అందించిన రెండు హైడ్రోజన్ బస్సులను డీఎంఆర్సీ నడుపుతోంది. ఒక్కో బస్సులో 35 మంది ప్రయాణించే వీలుంది. ఈ బస్సులు కేవలం రవాణా సౌకర్యాన్ని మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి భద్రతను కూడా కల్పిస్తున్నాయి. ప్రతి బస్సులో జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతతో పాటు బస్సు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుంది. కాలుష్య రహిత ఇంధనంతో నడిచే ఈ బస్సులు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయబోయే హైడ్రోజన్ రవాణా వ్యవస్థకు రోల్ మోడల్ కానున్నాయి. ప్రయాణ మార్గాలు ఇవే.... సెంట్రల్ సెక్రటేరియట్ (కేంద్ర సచివాలయం), సేవా తీర్థ మెట్రో స్టేషన్ల మధ్య ఈ బస్సులు నడుస్తాయి. సెంట్రల్ విస్టా పరిధిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలైన నిర్మాణ్ భవన్, విజ్ఞాన్ భవన్, అక్బర్ రోడ్, బరోడా హౌస్ వంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తాయి. వీటితో పాటు ఇండియా గేట్, నేషనల్ స్టేడియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికీ ఈ సేవలు ఉపయోగపడతాయి. వేళలు, టికెట్ ధరలు... ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు 30 నిమిషాలకోబస్సు అందుబాటులో ఉంటుంది. సామాన్యులకు భారం కాకుండా స్టేజీల వారీగా కేవలం రూ. 10, రూ. 15 చొప్పున టిక్కెట్ ధరలను నిర్ణయించారు. ప్రయాణికులు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, యూపీఐ లేదా నగదు రూపంలో టిక్కెట్ తీసుకునే వెసులుబాటును కల్పించారు. మెట్రో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి (లాస్ట్ మైల్ కనెక్టివిటీ) ఇబ్బంది పడకుండా ఈ బస్సులు సహాయపడతాయని, రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఇదొక కీలక ముందడుగు అని డీఎంఆర్సీ డైరెక్టర్ అమిత్ కుమార్ జైన్ తెలిపారు. -
మెట్రో స్పెల్లింగులు తప్పుల తడకలు
సవరిస్తామంటున్న డీఎంఆర్సీ న్యూఢిల్లీ: మెట్రోరైళ్లు ప్రయాణికులు చక్కటి సేవలు అందిస్తుండవచ్చు గాక. అయితే స్టేషన్లు, రూట్మ్యాపులపై ఉన్న పేర్లలో చాలా తప్పులు కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని పేర్ల స్పెల్లింగులు తప్పుగా ఉంటే, మరికొన్నింటినీ తప్పుగా రాస్తున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ మె ట్రో స్టేషన్ ఒకటో నంబరు గేటు దగ్గరున్న బోర్డుపై Chams Ford Club అని రాసి ఉంటుంది. నిజానికి దీనిని Chelms Ford Club అని రాయాలి. బ్రిటిష్‌పాలనలో భారత వైస్రాయ్ లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ పేరు మీద నగరంలోని రెడ్‌క్రాస్ రోడ్డు లో క్లబ్ ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి చెమ్స్‌ఫోర్డ్ వీధి అనే పేరొచ్చింది. మండీ హౌస్ స్టేషన్‌లోని సూచికల బోర్డులపై Lady Irvin College అని తప్పుగా రాశారు. దీనిని Lady Irwin College అని రాయాలి. ఇర్విన్ కూడా భారత వైస్రాయ్ సతీమణి కావడంతో ఈమె పేరుపై లేడీ ఇర్విన్ కాలేజీని 1930లో స్థాపించారు. ఇదే స్టేషన్లో మరో చోట Bhagwan Dass Road కు బదులు Bhagvan Dass Road అంటూ తప్పుగా రాశారు. అంతేగాక స్టేషన్లలో ఎల్ఈడీ తెర ల్లో కనిపించే రూటుమ్యాపుల్లోనూ చాలా తప్పులు ఉంటాయి. జంగ్‌పురా స్టేషన్‌లోని బోర్డులపై Jang pura అని సరిగ్గానే రాసి ఉంటుంది. కోచ్‌లలోని ఎల్ఈడీ తెరపై దీనిని Jang pura అంటూ రెం డు పదాలుగా విడగొట్టారు. మూల్‌చంద్ స్టేషన్ పేరులోనూ ఇదే పొరపాటు జరిగింది. స్టేషన్ బయట ఉక్కు అక్షరాల్లో Moolchand అని బాగా నే రాశారు. రూట్మ్యాపుల్లో మాత్రం Mool chand అని విడగొట్టారు. ఈ తప్పుల గురించి ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారు ల వద్ద ప్రస్తావించగా, త్వరలోనే స్పెల్లింగు తప్పులను సవరిస్తామని ప్రకటించారు. ఇలాంటి తప్పు లు సూచికల బోర్డులు, రూట్మ్యాపులకు మాత్రమే పరిమితం కాలేదు. రాజధాని విహారం పేరుతో రూపొందించిన నావిగేషన్ మ్యాపుల్లోనూ తప్పులకు కొదవలేదు. సెంట్రల్ సెక్రటేరియట్ నావిగేషన్ మ్యాపులో రాష్ట్రపతి భవన్ అని పేర్కొంటూ పార్లమెంటు భవ నం ఫొటో ముద్రించారు. జహంగీర్‌పురి స్టేషన్ పేరును ఎల్ఈడీ తెరపై సక్రమంగానే రాశారు. స్టేషన్ బయట కనిపించే సూచికల బోర్డులో మాత్రం ‘జహంగీర్ పురి’ అని విడిగా రాశారు. యెల్లోలైన్లో కింగ్స్‌వే క్యాంప్ స్టేషన్ పేరును ‘కింగ్స్ వే క్యాంప్’ అంటూ అనవసరంగా ఖాళీలతో రాశారు. రేస్‌కోర్సు మెట్రో స్టేషన్‌లోని సూచికల బోర్డులపై Tuglak Road అని తప్పుగా రాశా రు. దీనిని Tughlaq Road అని రాయాలి.


